Yellipothavura Manishi Lyrical Video Song - Swathi Reddy || Bheems Ceciroleo || Latest Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 3 тис.

  • @BheemsCeciroleo9999
    @BheemsCeciroleo9999 4 роки тому +301

    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది
    ఎంతో విలువ ఐనది
    శాశ్వతం కాదు లేరా దేహం మరణమున్నది
    శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    రాళ్ళను రాజేసి నిప్పు పుట్టించావు
    నేలను సరిచేసి పంట పండిచావు
    సంద్రాలనే ఈది ఖండాలనేదాటి
    అరచేతిలోభూ మండలం పట్టావు
    అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు
    అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు
    చెమటపట్టని ఒంటికి చెదలు పట్టినట్టు
    రోగాల రొంపిలో తగలబడుతున్నావు
    ఎన్నో సృష్టించావు కదరా
    సృష్టి ధర్మమెట్ట మరిచావురా
    అద్భుతాలే చేశావురా
    అందులో బ్రతకడమే నీకు రాదురా
    అంటిముట్టనట్టు ఏందిరా
    భూమి అంటరానిదేమి కాదురా
    పంచభూతాలు పనివాళ్ళు కాదురా
    నిన్ను నడిపించే పంచేంద్రియాలురా
    అంతట నాదన్నావు
    అందరికి దూరమయ్యావు
    ఒంటరిగ మిగిలిపోయావు కదరా
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి
    కష్టాల్లో కలిసొచ్చే ప్రాణస్నేహితులేరి
    తలకొరివి పెట్టేటి కొడుకులేరి
    నువ్వు తలనీలాలిచ్చిన దేవుళ్లేరి
    మనసిప్పి మాట్లాడే మనవాళ్ళంటు ఏరి
    మనవాళ్ళలో మరి నీవాళ్ళంటు ఏరి
    గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి
    పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి
    నీ గుణము గొడ్డలైంది కదరా
    భూమి గుండె బద్ధలైంది చూడరా
    నీ ధనము దయలేనిది కదరా
    ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా
    మట్టిలొపుట్టావు కదరా
    మట్టి వాసనెట్ట మరిచావురా
    నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా
    నీకు మనసన్నదే లేదు కదరా
    నమ్మకాన్ని అమ్ముకున్నావు
    పద్ధతుల్ని పాతరేశావు
    విలువలకు శిలువలేశావు తప్పు కదరా
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఇంటిమీద వాలే బురకపిట్టలు ఏవి
    సేలల్లో వాలేటి రామచిలుకలు ఏవి
    కొండల్లో పచ్చని అడవితల్లి ఏది
    అడవుల్లో నివసించే జీవులేవి
    చెరువుల్లో మొలిచిన మట్టిపెల్లలు ఏవి
    నదులల్లోఎదిగిన ఇసుక రేణువులేవి
    గుట్టల్లో ఒదిగిన రాళ్ళగుంపులు ఏవి
    వాగుల్లో ఒర్రెల్లో ఊట సెలిమెలు ఏవి
    అంతరించిపోలేదురా
    నువ్వే అంతమొందించావు గదరా
    దాని ఉసురు ఊరికే పోదురా
    మనిషి ఉనికినే ప్రశ్నిస్తు ఉందిరా
    వెక్కి వెక్కి ఏడుస్తుందిరా
    భూమి గొంతునొక్కి చంపబోకురా
    నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా
    కళ్ళకత్తుకొని దీవించిందిరా
    గాలిలో తేమలా పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవేందిరా
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
    ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి om

    • @sridhu4u
      @sridhu4u 4 роки тому +9

      It really touches my heart... Superb.

    • @dindisai3537
      @dindisai3537 3 роки тому +5

      entha goppaga rasaraiah
      eppudu vinaledaiah
      enthati pataneneppudu
      emi echhi thirchukovali annaiah
      jivithaanni varninchina devudu nivaiah
      okkoka padamlo vadella brathukunu kallaku kattinattu chepavu
      sommutho viravegeti vadi kanula poralanu therichav
      adhbuthame rasav unnaninallu vinalanipistundhi
      avaru srustinchaleru bandarayi lanti vadi manasukuda karige la nv matrame srustinchav sakkani sangithamtho ni hastalo dagunna anthuleni shakthitho chethakanodukuda chethulethi dandam pettela
      bheems barosanichavu marpu nilone undani marstanani ni patatho marchesav prathi gundello nichesav
      e thalli kannado ninnu kaliyuganike kanna kodukuvuinav kattina manasunu kuda kdhilinchav
      undali annaiah vandellu sallanga sagipovali ni payanam srustininneppudu marupurakunda ni pata vinte maripothadu brahmakuda
      undali annaiah nuvvepudu santhoshanga kannulo thadavali mavi nepata anandamtho ardanni thelusukoni mari manishiga
      devudu pampadu ninnu maeu rupomlooo ooo hrudayani marche shakthigaa...
      ni pataku padabhivandanam
      patavinnapude manasuku iyenu ponduga dinam
      ni sangithaniki vandanam
      karigipiyindi maloni chedudanam
      e patarasina miku shathakoti vandanalu
      patallo paramardam mallo vellasille hariviilula
      cisireleo annaiah.my name srija sunkari miku bigggggg fan mi prathi song vintabu chaa bagunnay annaiah hats off itluu mi abhimani srija

    • @dindisai3537
      @dindisai3537 3 роки тому +4

      vinnakodi vinalanipistundhi bheems annaiah really daily vintanu song sorry annaiah entha manchi song nenu latega vinnanu sorryyyyy annaiah enth manchi song ni latega vinnanduku chla badag undhiannaiah...m anna rasara Annaiah🙏🙏🙏🙏matallo varninchalenu annaiah mi goppathanani

    • @kkk99234
      @kkk99234 3 роки тому +5

      Thank you 🙏

    • @yellark1
      @yellark1 3 роки тому +6

      🙏🙏🙏

  • @Krishna10909
    @Krishna10909 Рік тому +12

    E okka pata tho jivitham ante emo telusthundi.super hatsuf

  • @kalyankumarkumar928
    @kalyankumarkumar928 Рік тому +15

    జీవితం గురించి చాలా బాగా వివరించారు అండీ మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @thelittlegirl3768
    @thelittlegirl3768 Рік тому +6

    ఉండాలి రా ,కలిసి మెలిసి
    ఉన్నన్ని నాళ్లు. కొంత తెలిసి👌

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 Рік тому +6

    Adbhutam... Amma... Chaala baga cheppavu... I'm 60 now. Really an emotional for me. Thank you amma.

  • @landaadinarayana1842
    @landaadinarayana1842 Рік тому +23

    చాలా బాగా రాసారు సాంగ్, ఇలాంటి వీడియోస్ చూసి కూడా మనిషిలు మారడం లేదు, ఎప్పుడు మారుతారు అర్ధవడం లేదు. నైస్ మెసేజ్ థాంక్స్.

  • @nalinikuchipudi2678
    @nalinikuchipudi2678 2 роки тому +5

    Enni sarlu vinna vinalanipinche pata . 👌👌👌Singing. Real facts Baga chepparu lyric writer ki kuda 👏👏👏👏

  • @sanjaypalaparthi7347
    @sanjaypalaparthi7347 Рік тому +11

    చాలా చక్కగా రాశారు
    చాలా అర్ధాలు ఉన్నాయి పాట లో

  • @kumpatlaannapurna7051
    @kumpatlaannapurna7051 Рік тому +7

    Manishi jeevitham ee okka song lo chupinchaaru nenu Swathi gaarini sridevi drama company program lo chusaanu e song vinnanu ventane UA-cam lo e song vinnanu appati nundi daily vintaanu Thank you etha manchi paata raasina vaariki paadina Swathi gariki 🙏🙏🙏

  • @kallimatasamsthanam7604
    @kallimatasamsthanam7604 Рік тому +4

    Iam jagadguru peetadhipathi meeru elanti songs marenno theeskoni ravalani a bhagavanthunni vedukuntunna god bless u maa supperb lyrics nd so beautiful life ni chupichavu ❤

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 4 роки тому +147

    ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు,పాడిన వారికి,సంగీతం అందించిన వారికి అభినందనలు.
    Superb.

  • @kiran9698-y2z
    @kiran9698-y2z 4 роки тому +222

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేలా పాడిన "స్వాతిరెడ్డి" గారికి, అంతే అందంగా పదాలను కూర్చి, మనసుకు హత్తుకునేలా సంగీతాన్ని అందించిన మా "భీమ్స్" అన్నకి హృదయపూర్వక అభినందనలు....💐💐💐💐💐
    మీరు ఇలాగే ఇంకా గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....👍👍👍👍💐💐💐
    "ఎల్లిపోతావురా మనిషీ...
    ఏదో ఓనాడూ... ఈ భూమి వదిలేసి...
    ఉండాలిరా కలిసి మెలిసి.. అరే ఉన్నన్నాళ్లు కొంత తెలిసీ...."
    ఆహా....👌👌👌👌💐💐💐💐💐

  • @ChinthalaShailender
    @ChinthalaShailender Рік тому +2

    Hi madam How r u, i am india from Telanga , మీరు తెలంగాణకు ఎప్పుడైనా వస్తారా మేడం,
    Thank you for motivational song

  • @Sathishsamala1988
    @Sathishsamala1988 2 роки тому +39

    ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు,పాడిన వారికి,సంగీతం అందించిన వారికి అభినందనలు.
    Superb.....👌👌👌

  • @lavvimahi5136
    @lavvimahi5136 4 роки тому +76

    జీవితం విలువ తెలిపే ఇలాంటి పాటలు అరుదుగా వస్తాయి మీనింగ్ చాలా బాగుంది

  • @vaddepallysrinivasvaddepal8929

    కొన్ని వందల సార్లు విన్నాను.
    కానీ ఇంకా వర్ణించటానికి మాటలు రావట్లేదు

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 4 роки тому +62

    ఇది పాట కాదు జీవితం. మనిషి తెలుసుకోవాల్సిన జీవిత సత్యం

  • @saraswathioruganti5889
    @saraswathioruganti5889 Рік тому +13

    జరుగుతున్న పరిణామాలు, మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందాన్ని, ప్రకృతినీ కాపాడుకోవాల్సిన బాధ్యత, మనుషుల విలువలూ అన్నీ ఈ పాటలో కళ్ళు తెరిపించెలా, ప్రశ్నిస్తున్న గొప్ప పాట, పాడిన వారు, పాట రాసిన భీమ్స్ గారికి అభినందనలు....... సరస్వతి

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 2 роки тому +3

    Yennisarlu vinna vinalanipinche song thanku sir madam chala chala nijalu unnai great song

  • @nettempadnareshmaharaj621
    @nettempadnareshmaharaj621 4 роки тому +52

    నాకు నచ్చిన పాటల్లో ఇదో బెస్ట్ పాట...మనిషి జీవితం గురించి చాల చక్కగా వివరించారు .

  • @muraligoud3684
    @muraligoud3684 3 роки тому +90

    నేను వంద సార్లు విన్నా. !!
    నుటోక్కసార్లు వినాలనిపిస్తుంది..!!!
    అందమైన స్యచ్చ తెలుగు పదాల పల్లవి వేసుక్కోండీ ఒక లైక్......

  • @kishanrenuguntuwar8621
    @kishanrenuguntuwar8621 2 роки тому +3

    Happy vinyakachavithi Swathi Reddy Yellipothavura Manish Super So song happy Vinayaka chaturthi Swati Reddy gari ki elante patalu mareno padalini man Ko Rika

  • @PramBapayyagari
    @PramBapayyagari Рік тому +7

    చెల్లమ్మ నీ ప్రతిభ సూపర్ అమ్మ దేవుడు నీకు తోడు ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి గీతాలు వ్రాయలని కోరు కుట్టు న్నాం అమ్మ

  • @konasemapillagadu9475
    @konasemapillagadu9475 3 роки тому +2

    Ee songlo anni words most valuable,great creativity great rachayithagaru

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 роки тому +29

    ఎన్ని సార్లు ఈ పాటని like చేయాలి .... వందల్లోనా, లక్షల్లోనా ..... సాహిత్యం, సంగీతం మరియు గానం కలిసి కంటి మీద నీటి పొర
    తెప్పి స్తోంది.

  • @Mallesh-301
    @Mallesh-301 4 роки тому +256

    ఈ పాట లో ఉన్న ప్రతి అక్షరం.... నూటికి నూరు శాతం నిజం... ధన్యవాదములు... రాసినవారికి... పాడినవారికి....

    • @venkateswararaovaka6578
      @venkateswararaovaka6578 3 роки тому +3

      చాలా విలువైన పాట.ర చయిత ఎవరో తెలియదు. వెంకటప్పయ్య గారు క్రుతజ్ఞతలు.

    • @padmayallapu6691
      @padmayallapu6691 3 роки тому +4

      @@venkateswararaovaka6578 ¹¹11111¹¹111111111¹qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq0⁰⁰q⁰000000⁰⁰qq0q¹¹¹11¹¹¹11¹111111111¹111¹1¹¹1¹¹11¹1¹¹1¹1111¹¹

    • @prabhakararao1913
      @prabhakararao1913 3 роки тому +5

      ఎంత మంచి పాట. ఎంత సేపు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

    • @motheganesh7323
      @motheganesh7323 3 роки тому +2

      @@padmayallapu6691 ❤️😂

    • @tejarajyalakshmi6319
      @tejarajyalakshmi6319 3 роки тому +2

      What u said is absolutely right

  • @malisettykullayappa3803
    @malisettykullayappa3803 Рік тому +4

    అలా అని వృధా గా జీవితాన్ని వదిలేయలేం ఎందుకు ఏమో కానీ కష్టాలు అర్థం కావడం లేదు

  • @yeginenilakshmisrinivasulu4541
    @yeginenilakshmisrinivasulu4541 4 роки тому +57

    అద్భుతమైన పాటను మాకు అందించారు... మీ స్వరంతో మధుర గానం వింటిమి...

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 Рік тому +16

    Superb song 👌👌👌
    చావు,పుట్టుకల మధ్య ఒక చిన్న ప్రయాణమే ఈ జీవితం. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు సుఖాలు.
    మనకు ఉన్న జీవితం మరపులేని జీవితం.
    జీవితం ఎంతో గొప్ప విలువైనది.
    మళ్లీ రాదేమో మిత్రమా ఇలాంటి జీవిత అవకాశం.
    గడచిన రోజు తిరిగి రాదు, రేపన్నది ఉందో లేదో తెలియదు. కనిపించేవన్నీ ఏది శాశ్వతం కాదు.
    ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే పోతాము...
    మంచితనంతో ఇకపై జీవిద్దాం మచ్చలేని జీవితంగా మార్చుకుందాం. మనసులో చెడు తత్వం దరిచేర్చకుండా ముందుకు సాగుదాం.
    బ్రతికి ఉన్నన్నాళ్ళు అందరితో కలసి మెలసి ఆనందంగా జీవిద్దాం....

  • @maheshmudhiraj2014
    @maheshmudhiraj2014 3 роки тому +2

    Fantastic Excellent Mind-blowing Superb Kirrrrrrrrak Undi And Sristi Sathyam Cheppaaru

  • @saibabushaik9740
    @saibabushaik9740 2 роки тому +21

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే చక్కని పాట ను అందించిన అందరికీ ధన్యవాదాలు

  • @veereshvr8845
    @veereshvr8845 4 роки тому +85

    ఏడు నిమిషాల్లో జీవితమంటే ఏమిటో వివరించారు. Really superb song and your voice also super.

  • @sivakumarinala3579
    @sivakumarinala3579 2 роки тому +3

    Chala manchi veluvalu unna song
    thankyou 🙏

  • @ashok1992777
    @ashok1992777 4 роки тому +553

    సూపర్ సాంగ్ భావం తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @amoebasuresh2512
    @amoebasuresh2512 4 роки тому +54

    మీ కష్టానికి....మీ లోతైన మనసుకు........ఈ అద్భుతమైన పాటకు శిరస్సు వంచడానికి మించి ఇవ్వలేని పేదవాడిని

  • @LakshmiSasi-p3z
    @LakshmiSasi-p3z 2 місяці тому +1

    😢 super akka e pata rasinavaariki padhabivandhanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Crrsl
    @Crrsl Рік тому +7

    ఎంతో ఆలోచించి చక్కగా రచించి కరెక్ట్ గా మ్యూజిక్ పాట పాడే ఆ తల్లి నా గుండె పిండింది ఎన్ని సార్లు విన్నా తీరటం లేదు నా బాధ గా అర్థం చేసుకొని రచించిన వారిని చాలా తలచుకున్నా ఎవరు ఇలాంటి ఆలోచన తో పాట రాయలేదు పాడలేదు నాకు అయితే అలాగే అనిపించింది చాలా ఏడిచాను మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraoravada3194
    @srinivasaraoravada3194 3 роки тому +39

    పాట చాలా చాలా బాగుందండి,భీమ్ గారికి, స్వాతి గారికి అభినందనలు. నేటి జీవితం ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

  • @umaghantoji9795
    @umaghantoji9795 Рік тому +3

    పాట అద్భుతంగా...మనిషి ని మేల్ కలుపుతూ...పాడారు

  • @rakshakrakshak1041
    @rakshakrakshak1041 Рік тому +7

    ఙివితం ఆస్వాదించడానికి అని మరచి జీవిస్తున్న మనిషికి మంచి మేలుకొలుపు పాట రాసిన వారికి పడిన వారికి శతకోటి వందనాలు

  • @SrinivasuluM-r8n
    @SrinivasuluM-r8n Рік тому +39

    Anni సార్లు విన్నా మళ్ళీ ఒకసరివినలనిపించే ఆణిముత్యం ఈ పాట

  • @tanyadas4002
    @tanyadas4002 2 роки тому +1

    Yeni saarlu vinna chalatam ledu 👌👌👌👌super lyrics with a beautiful voice

  • @vasanthaayyagari9810
    @vasanthaayyagari9810 Рік тому +7

    అద్భుతం గా రాసిన రచయిత కు , ఎంతో భావయుక్తంగా పాడిన singer కి అభినదనలు

  • @madipellimallesh714
    @madipellimallesh714 4 роки тому +12

    ఈరోజు మీ సాంగ్ నా వాట్సప్ స్టేటేజ్ లో.మరియు FB లో పెట్టాను..
    ఈ పాటకు కామెంట్స్ పెట్టడానికి పదాలు లేవ్వు ....సిస్టర్. God Bless You.
    బాగా పాడారు

  • @rakshakrakshak1041
    @rakshakrakshak1041 Рік тому +3

    స్వార్థ జీవితం లో మనిషి అతి తెలివితో ఎన్నో సృష్టించి సంబరపడి పోయాడు కానీ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అల్హధకరమైన వాతావరణంలో జీవించలేకపోతున్నాడు

  • @sanjeevkumarvasi1363
    @sanjeevkumarvasi1363 4 роки тому +53

    ఒక్క పాటలో జీవితం అంటే ఏంటో చూపించారు
    మీ కలానికి, సంగీతానికి&గాననికీ వందనాలు,,🎵💌✍️🍃

  • @ravib186
    @ravib186 4 роки тому +16

    మీ వాయిస్ లో సమాజం మేలు కొనే విధిగా వుంది. good వాయిస్ n lyrics superb madam

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 11 днів тому +1

    Mimmalni andharini chudalani anipisthundi sir superb song

  • @kottakotaashish2844
    @kottakotaashish2844 4 роки тому +17

    Lyrics మరీ బావున్నాయి.. చాలా బలంగా ఉన్నాయి👏 అన్నీ lyricals లా కాకుండా తెలుగులో పెట్టటం ఇంకో 👌

  • @kalavalapraveen2302
    @kalavalapraveen2302 4 роки тому +41

    చాలా చాలా బాగుంది... రెడ్డి గారు... వింటుంటే చాలా ఎమోషనల్ గా ఉంది... Good job ... Music director gaaru
    ...

    • @korrasunitha5439
      @korrasunitha5439 4 роки тому +2

      Wow nice song antha vina vinalani pistune vundhi

    • @srinivasutaraka9435
      @srinivasutaraka9435 3 роки тому

      అమ్మ మీకు పాదాభివందనం యూ కె ఎక్కడ ఉంటారు మేడం వీలుంటే వచ్చినప్పుడు కలుస్తాం మేడం💐👌👍

    • @ramamohanrao5152
      @ramamohanrao5152 3 роки тому

      Good song❤👃🙏

  • @appalarju
    @appalarju 3 роки тому +2

    Very beautiful song, very beautiful expression and grt voice and u are also so beautiful..rojuki okka saraina chudali anipinche song

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 4 роки тому +18

    మనిసిప్పి మాట్లాడే మనవాళ్లంటూ ఏరి
    మన వాళ్ళలో మరి ని వాళ్ళు ఏరి
    గెలిచి వస్తే బుజము తట్టే వాళ్ళు ఏరి
    పడిపోతే చెయ్యేసి లేపి వాళ్లేరి...👌👌👌
    Keep it up Swathi reddy garu
    Super lyric 📝Bhim Bro

  • @satyamynaiduyenduva2954
    @satyamynaiduyenduva2954 3 роки тому +30

    అద్భుతంగా ఉంది... ఇంత అద్భుతంగా వ్రాసిన రచయిత గారికి అద్భుతంగా పాడిన మీకు అభినందనలు.. Excellent

  • @kallimatasamsthanam7604
    @kallimatasamsthanam7604 Рік тому +1

    Supperb lyrics elanti songs marenno theeskoni ravali ❤

  • @dokkaajaybabu6732
    @dokkaajaybabu6732 3 роки тому +77

    పాటలో నిజం వినిపించడం మే కాదు నిజం చూపించారు అనిపిస్తుంది 👍ధన్యవాదములు 👏రచించినవారికి 👏పాడినవారికి 👍

  • @sushwithyebushi3494
    @sushwithyebushi3494 4 роки тому +25

    అంతట నాది అన్నవ్ అందరికీ దూరం అయ్యవ్ కదరా చివరికి ఒంటరిగా మిగిలావు కథ...wahh 🙏

  • @kvbcreations0509
    @kvbcreations0509 2 роки тому +2

    E madya UA-cam chusthu okkasariga aipoya e song vintu chusthu meku chala chala thanks ilanti song alochana ki prathi word kadilinchindi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 роки тому +10

    ఒక్క మాట...
    మనిషి జీవన బాట...
    ఎలా ఉండాలో...
    ఎలా ఉండకూడదో..
    తెలియజేస్తుంది....ఈ పాట..

  • @VidyanandaChary
    @VidyanandaChary 4 роки тому +30

    జీవితం గురించి చాలా గొప్పగా చెప్పినారు....చాలా బాగుంది

  • @pinkydosarapu8892
    @pinkydosarapu8892 Місяць тому +2

    Konni vandala sarlu vinna song super mind blowing e song rasina sir ki hytsaf super super

  • @srichandkittu3226
    @srichandkittu3226 4 роки тому +25

    ఈ పాట లో చాలా అర్ధం వుంది, అలాగే స్వాతి అక్క స్వీట్ voice Superb..విన్నంత సేపు ఎమోషనల్ అయ్యాను, కంటిలో నుంచి రెండు drops రాలాయి....వెరీ great Song.

  • @devulapally2231
    @devulapally2231 4 роки тому +40

    మనిషి నిజంగా ఈ పాటలో ఉన్న బావాన్ని అర్దం చేసుకొని....మనిషిలాగ అందరు కలసి మెలిసి జీవిస్తే ...విశ్వమంతా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది..... స్వాతి సూపర్ గా పాడావు......

  • @vittalkandagatla8607
    @vittalkandagatla8607 2 роки тому +5

    జీవితంలో జరుగుతుంది ప్రతివాక్కరికి

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 роки тому +25

    ఉన్నా వాస్తవాలను గ్రహించి పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటున్నాను

  • @bapunaidu
    @bapunaidu 3 роки тому +25

    మనిషి తక్షణ కర్తవ్యాన్ని తెలిపే , సరళమైన భాషలో రాసిన పాట. రచయిత, గాయనికి నమస్సులు.

  • @praveenjorige2938
    @praveenjorige2938 2 роки тому +2

    Swathi garu mee album lo inni Ronulu ee song miss ayyanu madam... Thathvam telisina vaadiki deni gurinchi thapana undadhu ani mee paatalu chala goppa ga vivaristunnayi... Thanks for wonderful songs madam

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 роки тому +19

    జీవితం గురించి ఎంత అద్భుతంగా వర్ణించి వ్రాసారు...పాట వ్రాసిన వారికి ధన్యవాదములు...

  • @batukammanews9414
    @batukammanews9414 4 роки тому +25

    మనిషి జీవితానికి అద్దం పట్టే ఈ పాటను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.. పాట రాసిన రచయితకి పాడిన గాయనికి ధన్యవాదాలు..

  • @prasaddkandaggiri8849
    @prasaddkandaggiri8849 2 роки тому +4

    Paata raasina athanu chala goppavadu 🙏
    Paata paadina bhumata Swetha reddy chala chala goppavaru 🙏👍

  • @krishnakanth3878
    @krishnakanth3878 4 роки тому +292

    ఓక్కసారి విన్ని మల్లి విన్నాలి అనుపిన్చిన వాల్ ok like veskonde

  • @maheshallu7392
    @maheshallu7392 4 роки тому +24

    మనిషి జీవితం అంటే ఏమిటో చక్కాగా తెలియచేసారు మేడం 👌👌👌

  • @venkat20416
    @venkat20416 11 місяців тому +2

    I am repeatedly watched this more than four times.Excellent song for entire our human beings life

  • @uk6182
    @uk6182 4 роки тому +24

    Super nice 👌 song 🥰💓💓💓💓 మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట,

  • @balamanikantareddythontla9864
    @balamanikantareddythontla9864 4 роки тому +23

    మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @subhashinigrandhi3876
    @subhashinigrandhi3876 3 роки тому +1

    Heart' touching..ee song raasina writer entha badha paduthunnaru mana bhumi kosam mana culture kosam maanavasambandhala kosam telusthundi..Telusukovalsina vallu kuda telusukuni komchem ina marithe ee pataki sarina kruthagnatha..kani em chestham entha edchina baguchesukolenthaga paduchesam ee bhumini..ipudina sare bagu chesthe apudu oppukovali manishi nijamga chala goppavadani..evariki veelinantha vallu cheddam vadili vellelopu 👍

  • @ktvdilep7271
    @ktvdilep7271 4 роки тому +101

    ఈ పాట లో మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో .. స్వార్థం తో కూరుకుపోయిన ఈ మానవుల జీవనం సాగిస్తున్న తీరు తెన్నులు కళ్ళ కు కట్టినట్లు స్పష్టంగా వివరణాత్మక విశ్లేషణాత్మకంగా పాట రూపంలో ప్రజల కు సవివరంగా అందించిన మీకు 🙏🙏🙏 .. మనుషులు స్వేచ్ఛ గా స్వార్థం గా ఉండాలి కానీ ఆ స్వేచ్ఛ స్వార్థం అనేది ఇతరుల కు నష్టపోయేలా బాధ పడేలా ఉండకూడదు .. .. అలా ఉంటే అది ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో తిరిగి వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా వచ్చి చేరును.. ..

  • @gangadharasake1824
    @gangadharasake1824 3 роки тому +37

    చాలా అద్భుతంగా పాడినారు అక్క. రాయినవారికి నిజంగానే హృదయపూర్వక ధన్యవాదములు... ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాము...👍👍👍🙏🙏🙏

  • @jalajarachanalu7959
    @jalajarachanalu7959 3 місяці тому +2

    పాటలో జీవితం ఉంది. ప్రాణం పోసే పంచభూతాలను మనిషి చేసే విధ్వంసాన్ని చక్కగా రాశారు.
    మేడం చాలా బాగా పాడారు❤

  • @anjanreddynarra3883
    @anjanreddynarra3883 4 роки тому +27

    అద్భుతమైన రచన, గానం, సంగీతం. చాలా చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట. Congratulations to all Team members

  • @mounikamohanraj1266
    @mounikamohanraj1266 4 роки тому +46

    ఈ song ఎప్పటికి 8 టైమ్స్ విన్న కానీ ఎక్కడ బోర్ అనిపించలేదు.. ఇంకా వినాలని ఉంది. Good voice, excllent లిరిక్స్

  • @marak.maheshm.sudhasri3817
    @marak.maheshm.sudhasri3817 5 місяців тому

    అద్భుతంగా ఉంది ఈ పాట మన జీవితం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి మనిషికైనా హాని చేయకూడదు...

  • @Nayab0228
    @Nayab0228 4 роки тому +23

    సూపర్ సాంగ్.....ఈ సాంగ్ కొంతలో కొంత అయిన చాలా మందికి మారాలనే అలోచక కలుగుతుంది...👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @maruthinakka3086
    @maruthinakka3086 4 роки тому +28

    చాలా చాలా బాగుంది పాట, మనసుకి తాకింది🧡👌👌👌 మరియు మి గొంతు,గానం,రచన, అన్ని సూపర్ సూపర్ సూపర్ లవ్ యు 🧡🧡👌👍👍👍

  • @consciousness64
    @consciousness64 Рік тому +1

    చాలా లేటుగా విన్నాను ఈ పాట. అద్బుతమైన లిరిక్స్.

  • @kanugulasatyam556
    @kanugulasatyam556 4 роки тому +22

    స్వాతి గారు అద్భుతంగా పాడారు హృదయం పూర్వక అభినందనలు

  • @satyanarayanacharyulu200
    @satyanarayanacharyulu200 4 роки тому +10

    Bheem గారూ మనిషి జన్మే ఒక అద్భుతం.
    ఏ మనిషికి ఏది అవసరమో దానిని
    దైవిక చిత్తము గల ఆ మనిషి లో జొప్పించి
    సమయానుకూలంగా సర్వకాల సర్వావస్థలలో తానై చేస్తూ,చేయిస్తూ, అనుభవిస్తూ నిరంతరం మనతోనే ఉండే
    ఆ పరమాత్మ ను సాక్షాత్కరింపజేసిన మహామనీషికి అభివందనం. 🙏

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 4 місяці тому +1

    Excellent ga undi song rachaitha ku paadinavariki vandanalu

  • @bagudugunavathi9848
    @bagudugunavathi9848 4 роки тому +13

    Hello madam, I am very happy for your meaning and wonderful song
    Really I like it so very much
    My husband shared this song more then 1000 people
    WE LISTENING THIS SONG 10 TIMES PER DAY.

    • @swathireddyuk
      @swathireddyuk  4 роки тому +2

      Thanks andi..plz convey my Thanks to your husband..And Thanks for spreading song.

    • @BheemsCeciroleo9999
      @BheemsCeciroleo9999 4 роки тому +2

      Thank u somuch gunavathi garu

    • @lnvsap4115
      @lnvsap4115 2 роки тому

      Really telugu lyrical words master piece. Difficult to find one, now a days. Irrespective of caste , religion region etc . 👌👌👌🙏🙏🙏. Meeku dhanyavadalu, bheems, Swathi garlaku, etuvanti song ni create chesinandhuku.

  • @jayalakshmi1702
    @jayalakshmi1702 Рік тому +10

    🎉 అధ్బుతమైన పాట... సత్యాలన్నీ అక్షరాలై జీవిత సత్యాన్ని భోధిస్తున్నాయి🎉

  • @drsway8832
    @drsway8832 3 роки тому +1

    👍 andhariki telisina vishyayaale .... vaatini oka paatagaa alli paadi vinipinchdam great.
    India lo unna vaalla bhaadhalu ( × 1) ayithe ... NRI la bhadhalu ( × 2) ... only people lived abroad can understand. Looking forward for more such meaning songs in your channel. 🎵🎵🎵

  • @upendharvanam4247
    @upendharvanam4247 4 роки тому +71

    ఇలాంటి పాపాలు చేస్తున్నాం కాబట్టి కరోనా లాంటి మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది....
    కానీ పాటలో ఒక్కో మాట మన అందరినీ కదిలించింది....
    It's better not to disturb the Nature...
    If we disturb the Nature it will decide our future....

    • @mschannel1550
      @mschannel1550 3 роки тому +1

      Super gaa chepparu bro👌👌🙏🙏

  • @maheswark3569
    @maheswark3569 4 роки тому +22

    జీవిత సత్యము తెలిపారు.
    మానవుడు తెలిషికోవాలి, లేకపోతే కర్మ అనుభ వించక తప్పదు

  • @suvarnap-fy5vp
    @suvarnap-fy5vp Рік тому +2

    Very nice song chala talent undhi god bless you bro

  • @nrv7.lingala904
    @nrv7.lingala904 4 роки тому +32

    భీమ్స్ సార్,, మీ మేధాస్సుకి
    నా మనసు పూర్వక నమస్కారాలు....

  • @pujariharish7134
    @pujariharish7134 4 роки тому +11

    అక్క నిజంగా ఈ పాటకి ప్రాణం పోసి పాడారు. ఈ పాటలో ప్రతి లిరిక్ హారట్ టచింగ్ . ఇప్పుడు ఉన్న జనాలు ఈ పాట విని అయిన మారితే బాగుంటది . ఒక్క లిరిక్ ఉంది అక్క మట్టిలో పుట్టావు కదరా మట్టి వాసన మరిచి పోతివి రా సూపర్ అక్క

  • @kuvbbrkuvbbr3216
    @kuvbbrkuvbbr3216 3 роки тому +2

    E pata rachayithaki,padinavariki na hrudayapurvaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nanajidakinedi9897
    @nanajidakinedi9897 4 роки тому +12

    Good song ఈ పాట విన్న కొందరిలోనైనా మార్పు వస్తే ఈ సమాజం బాగుపడినట్టే

  • @vaddevataravikumar6528
    @vaddevataravikumar6528 2 роки тому +11

    ఈ పాటలో వాస్తవం ఉంది..... super song...........

  • @rajashekarreddy7065
    @rajashekarreddy7065 3 роки тому +2

    Wow wonderful song Swathi reddy Garu miku mi team. member's ki 🙏🙏🙏🙏 thank you for this making 🙏👍

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Рік тому +7

    శ్రీదేవి డ్రామా కంపనీ చూసి సాంగ్స్ డౌన్లోడ్ చేసి,వాచింగ్ చేస్తున్నాను అక్క