అడవిలో అన్నలు... ఎవరు అటువపు వెళ్ళకండి
Вставка
- Опубліковано 8 лют 2025
- అంతర్గాం మండల BRS పత్రిక ప్రకటన
అంతర్గాం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ మరియు అటవీ భూముల్లో మట్టి దందా సుమారు రెండు నుండి మూడు కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టు అనుకుంటున్న సమీప ప్రాంత ప్రజలు పట్టించుకోని రెవిన్యూ ఇరిగేషన్ అటవీ శాఖ శివారు గ్రామ పాలకులు మరియు అధికారులు
అంతర్గాం మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఇసుక మట్టి అక్రమ రవాణా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు కొందరైతే ఏకంగా బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో గల భూముల్లో సుమారు 20 నుండి 30 ఎకరాల భూమిని ప్రోకలైన్లు మిషన్లు పెట్టి చదును చేసుకుని మట్టి రవాణా కోసం సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు ఈ రవాణా కోసం ప్రత్యేకంగా సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్ట్ నుండి రెండు లైన్ల రహదారిని అంతర్గాం బసంత్ నగర్ రహదారికి చేరుకునే విధంగా దారిని నిర్మించుకున్నారు రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టపగలు వేలాది చెట్లను నరికి భూములు చదును చేసుకుంటు ఉంటే చోద్యం చూస్తున్న ఫారెస్టు అధికారులు లక్షలాది రూపాయలు ఉపాధి హామీ పథకాల ద్వారా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందించుట కొరకు స్ట్రెంచెస్ కందకాలను తవ్వించిన గ్రామ పంచాయితీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లు అట్టి కందకాలను కూడిపివేయడం తో పాటు ఇక్కడ చెట్లను తొలగించి చదును చేసిన సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన చౌకీదార్ సర్దార్లు కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం పట్ల గ్రామాల్లోని ప్రజలు విస్తుపోతున్నారు ఈ ప్రాంతంలో రైతులు ఒక చిన్న గొడ్డలి కామను కొట్టినా కూడా కేసులు పెట్టే ఫారెస్ట్ అధికారుల మౌనం వెనుక మతలబు ఏమిటో అర్థం కాని పరిస్థితి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదే కాకుండా అక్రమ మట్టిని సదరు సంస్థలోని ఒక ఉద్యోగికి కూడా సుమారు 40 శాతం వాటా ఉండడం అటు ఉద్యోగం ఇటు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల లాగా వందలాది లారీలతో సుమారు 15 అడుగుల లోతులో మట్టిని తవ్వి రవాణా చేస్తూ ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఎస్ఆర్ఎస్ పి కెనాల్ గుండా వందలాది ఓవర్ లోడ్ లారీలను నడుపుతూ ఎస్ ఆర్ ఎస్ పి 27 ఎల్ కెనాల్ పూర్తిగా పాడవడానికి సిద్ధంగా ఉన్నది అయినా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఈ డిఈ ఏఈ లు ఏమి ఏరగనట్టు వ్యవహరించడం పట్ల రైతులు ఈ ప్రాంత ప్రజల విస్తుపోతున్నారు రామగుండం నియోజకవర్గంలో నిజాయితీగా నిబద్దతో పని చేస్తామని అవినీతిని అక్రమాలను సహించేది లేదని పదేపదే అధికారుల మీద అజమాయిసి చూపిస్తూ ప్రకటనలు చేస్తున్న పాలకులకు వారి అనుచరులు చేస్తున్న అక్రమ దందాలు వ్యాపారాలకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎవరు మాట్లాడిన ఎదురు తిరిగిన భౌతికంగా మానసికంగా దాడులు చేయడానికి తెగబడి సిద్ధపడి ఉన్నారు అవినీతి రహితంగా ఈ ప్రాంతాన్ని పాలించాలనుకుంటున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజన్న ఈ అవినీతి మీద విచారణ జరిపించి ఈ దందా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారి నిజాయితీని నిబద్ధతను రామగుండం నియోజకవర్గ ప్రజల ముందు చాటుకోవాలని తద్వారా ఎంతటి వారైనా అవినీతి అక్రమాలు చేస్తే సహించేది లేదనే సంకేతాన్ని నియోజకవర్గ ప్రజలకు పంపించాలని అంతర్గా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా రామగుండం ఎమ్మెల్యే గారికి విన్నపం చేస్తున్నా
Nijam anna
Super anna
State loni vividha political Party's la lo Challa Mandhi Dongalu Vunnaru
BRS lo chala Mandi dongalu unaru.avi kuda chupinchu bro
Govt emi chestundi
Nuvvenduku vellinavu
Police complaint ichedivunde
అసలు నీవు అడవిలో అన్నలు అని టైటిల్ పెట్టినప్పుడే ఇది అబద్దం ఎందుకంటే నీవు చెప్పే సామాజిక వర్గం వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే ఇలా దందాలు చేసి అమ్ముకున్నారు వాళ్ళది కానీ భూమి అమ్మే దమ్ము అప్పుడు brs చేసింది అలవాటు పడ్డ వాళ్ళు ఆగం ఆగం అయితన్నారు కావచు నీవు వారిపై ఫారెస్ట్ వారికి కలెక్టరుకు కంప్లయింట్ ఇవ్వండి న్యాయం వుంటే నేవిపే ప్రజలు వుంటారు