ఎవరూ ప్రవేశించలేని శాపగ్రస్త దేవాలయం! గర్భగుడిలో దాగిన రహస్యం! చండీ కలసన్ ఆలయం - Part 1

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలోని, చండీ కలసన్ అనే చాలా రహస్యమైన ఒక ఆలయంలోకి వెళ్తున్నాము. ఈ గుడిలోని గదుల్లోకి ఎవరూ వెళ్లడంలేదు, నేను ఈరోజు ఈ ప్రయత్నం చేసి లోపల ఏముందో మీకు చూపిస్తాను. And ఈ లోపల ఉన్నది నిజంగా చాలా shockingగా ఉంది. చాలా ఇండోనేషియా దేవాలయాలు, మారుమూల ప్రాంతాలలో ఉంటాయి, ఈ ఆలయం యోగ్యకర్త అని పిలువబడే, ఈ పెద్ద నగరం మధ్యలో ఉంది. కానీ మీరు ఆలయ సముదాయంలోకి ప్రవేశించినప్పుడు, ఈ ఆలయాన్ని ఎవరూ visit చేయరని మీకు తెలుస్తుంది. ఎందుకు? శాపం కారణంగా, ఈ ఆలయంతో సంబంధం ఉందా? నేను ఈ ఆలయం గురించి youtube videoలను check చేసినప్పుడు, ఈ గదుల్లోకి ఎవరూ వెళ్లడంలేదని నేను గ్రహించాను. ఇది చాలా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ఎవరూ ఎందుకు లోపలికి వెళ్లడంలేదు? ఇంత అద్భుతమైన ఆలయం శపించబడదని నాకు తెలుసు, అందుకే నేను ఈ గది లోపలికి వెళ్తున్నాను. అలానే ఈ ఆలయం ఎంత పాతదో ఊహించండి?
    ఈ నిర్మాణం 778 ADలో ప్రారంభమైందని, అంటే దాదాపు 1250 ఏళ్లనాటిదని archeologistలు confirm చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో ఇది ఒకటి, అయితే ఇక్కడే ఒక twist ఉంది. అది ఏంటంటే, ఇది హిందూ ఆలయం కాదు, ఇది బౌద్ధ ఆలయం. కానీ దీనికంటే పెద్ద twist ఏంటంటే, ఈ ఆలయాన్ని బుద్ధుని కోసం నిర్మించలేదు, దీన్ని తారా అనే ఆడ బౌద్ధ దేవుడి కోసం నిర్మించారు. తార విగ్రహం, ఈ ఛాంబర్‌లో ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం! ఈ తలుపును లాక్ చేయలేదు, కాబట్టి నేను ఈ twisted wireను open చేసి లోపలికి వెళ్తున్నాను. ఇది ఒక వింత శక్తితో చాలా odd chamberగా ఉంది. ఇక్కడ ప్రధాన విగ్రహం లేదు. నిజానికి, ఇక్కడ ఏ విగ్రహం జాడ కూడా లేదు. ఈ chamberలో విగ్రహాలు ఉన్నాయా? లేక మరేదైనా ప్రయోజనం కోసం వీటిని ఉపయోగించారా? ఈ chambers అన్ని చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది ఏంటో మీరు నాకు చెప్పగలరా? ఇది ceiling, and దీన్ని చాలా odd shapeతో రూపొందించారు, దీన్ని భారీ బోలు గోపురంతో concentric octagonsతో తయారు చేశారు.
    ఎందుకు ఇది బోలుగా ఉంది? ఈ గోపురం లోపల కొన్ని రహస్య గదులు దాగి ఉన్నాయా? కానీ, రెండు వైపులా, గోడల పైభాగంలో మరింత విచిత్రం ఉంది. ఈ 2 నిర్మాణాలను చూడండి, అవి ఏంటీ? So, మీరు ఆ 2 రహస్య ప్రవేశాలను చూస్తున్నారు కదా. మీరు ఆ square shapeలో ఉన్న ప్రవేశ మార్గాలను చూడవచ్చు. దీన్ని access చేయడం కూడా అసాధ్యం అని మీరు చూడవచ్చు. నేను దానిలోకి ఎక్కలేను. So, అది దేనికోసం ఉందని మనకు తెలియదు. మరొక వైపు, మీరు మళ్ళీ square windowను చూడవచ్చు, సరేనా?అక్కడ ఏదో ఉంది. ఇది ఆ chamberకి and ఈ chamberకి మధ్య ఉన్న connection, సరేనా? So, ఆ chambersలో ఏదో రహస్యం ఉంది. కానీ అది ఏంటని మనకు తెలియదు. ఈ chamber యొక్క నేల స్థాయి నుండి, ఈ 2 కిటికీలను 15 అడుగుల ఎత్తులో ఉంచారు మరియు ఈ గోడలు smoothగా ఉన్నాయి, so దానిని access చేయడం అసాధ్యం. ఒక closup విశ్లేషణ, కొన్ని odd detailsను చూపుతుంది. మొదట దీనికి ఎలాంటి అలంకారాలు లేవని, అసలు ఏవి లేవని గమనించండి.
    So, దీన్ని పూర్తిగా ఫంక్షనల్ కారణాల కోసం నిర్మించారు, అలంకరణ ప్రయోజనాల కోసం కాదు. ఆ తర్వాత, వెంటనే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ విండో లోపల ఉంచిన, నిలువు వరుసల వంటి ఈ 2 స్తంభాలే. మీరు ఇలాంటిది ఎప్పుడూ చూసుండరని, నేను మీతో bet కడుతున్నాను, ఈ 2 నిర్మాణాలకు కారణం ఏంటీ అసలు? మూడవది ఏంటంటే, ఈ గోడ యొక్క లోతును గమనించండి, ఇది సహజ నిర్మాణం కాదు. ఒక normal roomలో, మీరు లోపల లేదా బయట నుండి చూస్తే, ఒక కిటికీ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈ గోడ కొన్ని అంగుళాల మందం మాత్రమే ఉంటుంది. ఇక్కడ, ఈ గోడను చూడండి, ఇది కనీసం కొన్ని అడుగుల, మందంతో ఉంది, And ఈ విండో ఈ sideకి ముఖధ్వారంగా ఉండగా, వారు మరొక వైపు మరొక విండోను నిర్మించారు. And మరొక వైపు నుండి వేరే విండో ద్వారా light ఎలా వస్తుందో గమనించండి. Finally, ఇవి అసలు కిటికీలే కావు, అంటే వాటిని వెంటిలేషన్ ప్రయోజనాల కోసం ఉపయోగించరు.
    ఇది గదులలో ఒకటి, and ఈ ఆలయంలో చాలా గదులు ఉన్నాయి, సరేనా? మనం ఇంటి లోపల వేర్వేరు గదుల మధ్య కిటికీలు పెట్టము కదా. మీ బెడ్ రూమ్ మరియు మీ living రూమ్ కి మధ్య మీకు విండో ఉండదు, దాని గురించి ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడూ అలా చేయము. మనం fresh airను పొందడానికి, బయటి గోడలపై మాత్రమే కిటికీలను నిర్మిస్తాము. కానీ ఈ కిటికీ అదే ఆలయం లోపల ఉన్న మరొక గదికి connect అయ్యి ఉంది. అది చాలా విచిత్రంగా ఉంది. మళ్ళీ, ఎవరూ పైకి ఎక్కలేరు మరియు ఆ ఎత్తును చేరుకోలేరు, so, ఇది దేనికి ఉపయోగించబడింది? దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, నేను ఈ గది నుండి బయటకు వెళ్లి, అవతలి వైపు ఉన్న next గదికి వెళ్ళాలి. కానీ, నేను ఈ ప్రాంతానికి చేరుకోగానే, ఏదో విచిత్రమైన ఒక విషయం నాకు అర్థమైంది. ఈ 2వ చాంబర్‌కి వెళ్లే మెట్లు లేవు, కానీ మరీ ముఖ్యంగా, ఛాంబర్‌కు ఎదురుగా ప్రవేశించవద్దు అని స్పష్టంగా చెప్పే బోర్డు ఇక్కడ ఉంది. So, నేను ఛాంబర్‌లోకి ప్రవేశించగలనా అని security guardని అడిగాను, అతను నవ్వుతూ మెట్లు లేవని, ఎవరూ ఎక్కలేరని చెప్పారు. కానీ ఒకవేళా మీరు ఎక్కగలిగితే ముందుకు వెళ్లండి అని అతను చెప్పాడు. So, నేను ఈ గోడలను ఎక్కుతున్నాను, ఎందుకంటే, ఈ గది లోపల ఉన్న, విచిత్రమైన కిటికీ లోపల ఏముందో నేను నిజంగా చూడాలి. నేను మీ కోసం ఇలా చేస్తున్నానని నమ్మలేకపోతున్నాను guys! ఇది చాలా risky.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #ancienttemple
    #hinduism #indonesia

КОМЕНТАРІ • 69