Це відео не доступне.
Перепрошуємо.

Bisibelebath Masala

Поділитися
Вставка
  • Опубліковано 1 чер 2024
  • 3 టేబుల్ స్పూన్లు ధనియాలు
    పావు కప్పు శనగపప్పు
    2 టేబుల్ స్పూన్లు మినపప్పు
    2 టేబుల్ స్పూన్లు జీలకర్ర
    అర స్పూన్ మెంతి
    2 టేబుల్ స్పూన్లు నువ్వులు
    2 టేబుల్ స్పూన్లు గసగసాలు
    అర స్పూన్ మిరియాలు
    6 -7 ఏలకులు
    రెండు అంగుళాల దాల్చిన చెక్క
    5-6 లవంగాలు
    1 స్పూన్ నూనె
    20 ఎండు మిరపకాయలు
    గుప్పెడు కరివేపాకు
    పావు కప్పు ఎండు కొబ్బరి
    అర స్పూన్ పసుపు
    పావు స్పూన్ ఇంగువ
    స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి మూకుడు పెట్టుకుని ముందుగా శనగపప్పు వేసి వేయించాలి. పప్పు సగం వేగాక మినపప్పు వేయాలి.ఇవి వేగుతునుండగానే మిరియాలు ,మెంతులు వేసి వేయించుకోవాలి .(ఒక్కకటి వేరువేరుగా వేయించుకుంటే దినుసులు మాడిపోయే అవకాశం ఉండదు.శనగపప్పు వేగటానికి పట్టే టైం గసాలకి,నువ్వులకి అవసరం లేదు కదా అందుకే ఒక్కొక్కటిగా వేయిస్తే అన్ని మసాలా దినుసుల సువాసనలు తింటూ ఉండగా నోటికి బాగా తెలుస్తాయి) ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు.ఇప్పుడు ఆ వేడి మీద జీలకర్ర ,నువ్వులు, గసగసాలు , ఏలకులు,దాల్చిన చెక్క వేసి వేయించి ఓ గిన్నెలోకి తీసి పెట్టుకుని అదే మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ,కరివేపాకు వేసి వేయించి పైన తయారు చేసుకున్న మిశ్రమం లో కలిపేసి చల్లారాక పొడి చేసుకోవటమే.

КОМЕНТАРІ • 3

  • @raghavendravarma-ww1im
    @raghavendravarma-ww1im 2 місяці тому +1

    😋😋

  • @k.s.s8764
    @k.s.s8764 2 місяці тому +1

    what you wrote , you should be narrating; otherwise it becomes a write up in weekly. And there may be tricks/tips/precautions. Where are they?

    • @KalyaniSharma
      @KalyaniSharma  Місяць тому

      Sure. thank you for the suggestion 🙏