సాక్షి వ్యాసములు | స్వభాష | పానుగంటి | Sakshi Vyasamulu | Rajan PTSK
Вставка
- Опубліковано 15 гру 2024
- మానవ స్వభావం మీద, సంఘంలోని అనేక ఆచారాల మీద పానుగంటి లక్ష్మీనరసింహారావు వారు నవ్వుతూ పెట్టిన వాతలే ఈ సాక్షి వ్యాసాలు. ఈ వ్యాసాలు మొదటిసారిగా 1913లో సువర్ణలేఖ అనే పత్రికలో ఓ సంవత్సరం పాటూ ప్రచురించబడ్డాయి. ఆ తరువాత కాలంలో అంటే 1920 నుండి సుమారు రెండేళ్ళ పాటూ ప్రతీవారం ఒక వ్యాసం చొప్పున ఆంధ్రపత్రికలో ఈ సాక్షి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కూడా 1927లోను, 1933లోను మరికొన్ని వ్యాసాలు ఆంధ్రపత్రికలోనే ప్రచురితమయ్యాయి. మొత్తం మీద పానుగంటివారు రచించిన సాక్షి వ్యాసాల సంఖ్య 140కి పైమాటే. ఈ సాక్షి వ్యాసాలను చదవడం కోసం అప్పట్లో పాఠకులు ఉర్రూతలూగిపోయేవారట. సాక్షి వ్యాసాలు చదివితే మనకు భాష మీద పట్టు చిక్కుతుంది. ఆనాటి సమాజం తీరుతెన్నుల మీద అవగాహన ఏర్పడుతుంది. మెత్తగా, చమత్కారభరితంగా మాట్లాడుతూనే చురకలు ఎలా వెయ్యాలో తెలుస్తుంది. అటువంటి వ్యాసాలలో ఒకటైన స్వభాష అనే వ్యాసాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఆ వ్యాసాన్ని యధాతథంగా చదువుతాను. వందేళ్ళ క్రితంనాటి భాష కనుక, అప్పటి తెలుగును అర్థం చేసుకోవడానికి కాస్తంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ అదీ మనభాషే కదా. మనభాష ఏనాటి రూపాన్నైనా మనం చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆనాటి రచనల్లోని అందాలను ఆస్వాదించగలం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలం. ఈ సాక్షి వ్యాసాలను పానుగంటివారు చిత్రమైన రీతిలో రచించారు. సాక్షి అన్నది ఒక వ్యక్తి పేరుగా, అతని ఆధ్వర్యంలో సాక్షి అనే సంఘం స్థాపించబడినట్లుగా, ఆ సంఘంలో జంఘాలశాస్త్రి, వాణీదాసు, కాలాచార్యుడు, బొఱ్ఱయ్యసెట్టి అనేవాళ్ళు సభ్యులుగా ఉన్నట్లుగా కల్పన చేశారు. వారిలో జంఘాలశాస్త్రి వాక్చాతుర్యం కలవాడు. చాలా ఆవేశపరుడు. ఏ విషయం గురించైనా లోతుగా, వ్యగ్యంగా మాట్లాడగల దిట్ట. సాక్షి ఇచ్చిన శిక్షణలో ఈ జంఘాలశాస్త్రి మరింతగా రాటుదేలాడు. సాక్షి వ్యాసాల నిండా తన ఉపన్యాసాలతో ఉదరగొట్టే మనిషి మన జంఘాలశాస్త్రే. ఇక తెలుగువారిలో తక్కువైపోయిన స్వభాషాభిమానం గురించి పానుగంటి వారు విసిరిన చమక్కే ఈరోజు మనం చెప్పుకోబోయే స్వభాష అనే ఈ వ్యాసం. పాఠశాల బాలకులు ఏర్పాటు చేసుకున్న ఓ సభకు తెలుగువాడైన ఓ ప్రఖ్యాత న్యాయవాదిని అధ్యక్షుడిగా ఉండమని ఆహ్వానిస్తారు. అతగాడు ఆ సభకు వచ్చి, తాను తెలుగులో మాట్లాడలేనని చెప్పి ఇంగ్నీషులో ఒక పావుగంట సేపు మాట్లాడి.. ఇంకెవరైనా మాట్లాడుతారా అని అడుగుతాడు. అప్పుడా సభికులలో ఉన్న జంఘాలశాస్త్రి పైకి లేస్తాడు. సభాధ్యక్షుడు తెలుగువాడై ఉండి తెలుగు మాట్లాడటం నామోషీగా భావించడం జంఘాలశాస్త్రికి చెప్పలేనంత కోపం తెప్పిస్తుంది. దానితో ఆ సభాద్యక్షుడికి సభాముఖంగానే తన మాటలతో వాతలు పెడతాడు. మన తెలుగువారికి ఉన్న పరభాషా వ్యామోహాన్ని నిరసిస్తూ పానుగంటివారు పెట్టిన చురక ఇది. ఇంగ్లీషు చదువుకోవడం ఏమాత్రం తప్పుకాదనీ, కానీ మన మాతృభాషైన తెలుగును పట్టించుకోకపోవడమే తప్పనీ అంటారు పానుగంటివారు. ఇక ఆ వ్యాసంలోనికి ప్రవేశిద్దాం.
Relevant even now, after almost a century. ఒక శతాబ్దం పూర్వము వ్రాసినప్పటానికి నీ ఇది ఇప్పటికీ ఔచిత్యము.
Excellent 👍🙏
చాలా బాగా చెప్పారు
మరిన్ని వ్యాసాలు కూడా వివరించండి
అయ్యా,
మన అమ్మ భాష అయిన, తెలుగు లోనే వ్యాఖ్యలు చేసుకుంటే, బాగుంటుందేమో, ఆలోచన చేయగలరు.