ప్రతిమా నాటకం | భాస మహాకవి | Pratima Natakam in Telugu | Bhasa Mahakavi | Rajan PTSK

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • Pratima Natakam story
    మహాకవి కాళిదాసు అంతటివాడు ఎంతగానో కీర్తించిన మరో ప్రాచీన మహాకవి భాసుడు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితంవాడైన భాసమహాకవి అనేక రూపకాలను రచించాడు. వాటిలో కేవలం పదమూడు రూపకాలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి. భాసుడు వ్రాసినన్ని నాటకాలు ఆయన తరువాత తరం వారైన కాళిదాస, భవభూతులు కూడా వ్రాయలేదు. భాసుడి నాటకాలన్నింటినీ కలిపి భాస నాటకచక్రం అని కూడా పిలుస్తుంటారు. వాటిలో ఒకటైన స్వప్నవాసవదత్త నాటకం గురించి కొంతకాలం క్రితం మనం మన అజగవలో చెప్పుకున్నాం. ఈరోజు మనం ఆ భాసమహాకవి మరో అత్యుత్తమ రచన ప్రతిమా నాటకం గురించి చెప్పుకుందాం.
    ఈ ప్రతిమా నాటకంలో భాసుడు రామాయణ కథనే తీసుకుని అందులో చిన్నపాటి మార్పులు చేసి రమణీయమైన రూపకంగా మలిచాడు. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో దుష్టంగా కనబడే కైకేయి పాత్రను ఎంతో ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో కూడా కైకేయి పాత్ర ముందు మంచిగానే ఉంటుంది. రాముడంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ. శ్రీరామపట్టాభిషేకం గురించి తెలియగానే ఆ కైకేయి ఎంతగానో పొంగిపోతుంది కూడా. కానీ ఆ తరువాత మంథర చేసిన దుర్బోధకు వశురాలైపోయి కౄరమైన మనస్తత్వం గల స్త్రీగా మారిపోతుంది. రాముడి వనవాసానికి, దశరథుడి మరణానికి కారణభూతురాలవుతుంది.
    అయితే భాసమహాకవి ఇక్కడే ఒక చమత్కారమైన ఊహ చేశాడు. రాముణ్ణి వనవాసానికి పంపడం వెనుక కైక యొక్క ఉద్దేశ్యాన్ని వివరించే ఆ ఊహ కూడా తర్కానికి నిలబడేలానే ఉంటుంది తప్ప, ఏదో అతికించినట్టు మాత్రం ఉండదు. ఆ ఊహ ఏమిటో మనం కథా గమనంలో తెలుసుకుందాం. ఇక సీతారామలక్ష్మణులు నారచీరలు కట్టుకోవడానికి ఒక కారణాన్ని సృష్టించి, మూలకథలో లేని ఆ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడు భాసుడు.
    అలానే ఈ ప్రతిమా నాటకంలో భాసుడు చేసిన మరో మనోహరమైన మార్పు వాల్మీకి రామాయణంలో లేనటువంటి ప్రతిమాగృహ సన్నివేశాన్ని కల్పించడం. ఆ సన్నివేశాన్ని అత్యంత రమణీయంగా, కరుణరస భరితంగా నడిపించాడు భాసుడు. అంతేకాకుండా ఎంతో ఉదాత్తమైన భరతుని పాత్రను ఈ నాటకం ఆద్యంతం మరింత ఉదాత్తంగా తీర్చిదిద్దాడు.
    ఇక ఈ నాటకంలో భాసుడు చేసిన మరో ప్రధానమైన మార్పు.. బంగారు జింక ఉదంతం. ఈ నాటకంలో రావణాసురుడు రాముడు ఉండగానే పరివ్రాజక వేషంలో వస్తాడు. తెలివిగా రాముణ్ణి బంగారు జింక కోసం పంపించి సీతాపహరణం చేస్తాడు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ ఉండడు. వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి లక్ష్మణుడిని బంగారు జింక ఘట్టంలో అనరాని మాటలంటుంది. మహా సౌశీల్యవతి, లోకపావని అయిన సీతాదేవి అలా కుమారుడి వంటి లక్ష్మణుడిని అనుమానిస్తూ దూషించడం భాసుడి మనసుకి కష్టంగా అనిపించి ఉంటుంది. అందుకే ఆ ఘట్టంలో కొంత మార్పు చేసి సీతాదేవి మాటలకు ఉన్న ఆ చిన్నపాటి దోషాన్ని కూడా తొలగించేశాడు.
    ఇలా ప్రసిద్ధమైన రామాయణ కథలో చిన్నపాటి మార్పులు చేసి, ఔచిత్యభంగం కలుగకుండా, అనేక అందమైన ఊహలతో, వర్ణనలతో ఈ ప్రతిమా నాటకాన్ని రచించాడు భాస మహాకవి. రచనలో అంతటి నేర్పరి కనుకనే భాసో హాసః అంటూ కవితా కన్యక చిరుమందహాసమే భాసుడని జయదేవుడనే పండితకవి కీర్తించాడు. ఇక మనం ప్రతిమా నాటకం కథలోకి ప్రవేశిద్దాం.

КОМЕНТАРІ • 20

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 19 годин тому +2

    అపూర్వమైన ప్రతిమానాటకాన్ని కథా రూపంలో చక్కగా వివరించారు.ధన్యవాదాలు.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 години тому +1

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలుగు తల్లికి జేజేలు జై హింద్ ❤❤❤

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 День тому +1

    చాలా బాగా చెప్పారు. మీరు చేస్తున్న సేవ ఎనలేనిది.

  • @dineshreddykaveti6289
    @dineshreddykaveti6289 День тому

    JAI SRIRAMA

  • @gaminigwithns6064
    @gaminigwithns6064 День тому

    🙏🙏

  • @palliprahaladrao3728
    @palliprahaladrao3728 2 дні тому +1

    EXCELLENT.

  • @sairamexcellent825
    @sairamexcellent825 2 дні тому +1

    Jai sri ram

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 години тому

    అయ్యా, నా టకాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు భరతు దుఃఖిస్తూ ఉంటే నేను దుఃఖించాను.ధన్యవాదములుమీకు.జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై భారత మాతకు జయము జయము జై హింద్

  • @dattuavm5392
    @dattuavm5392 2 дні тому +1

    Namasta Rajangaru

  • @balametta1621
    @balametta1621 2 дні тому +1

    Naaku chaala istamaina naatakam

  • @parasaramlakshmi5434
    @parasaramlakshmi5434 День тому

    కావ్యములను చదవని నాకూ అమృతం పోశారు. ఇంకా ఇలాంటి vi,vinipinchaalani,కోరుతున్నా.

  • @lavanyaambati2136
    @lavanyaambati2136 2 дні тому +6

    గురువు గారు.. బంగారు జింక ఊహ బాగుంది... మరి దీని ప్రకారం లక్ష్మణ రేఖ గీసే వృత్తాంతం వుండదా...

    • @Ajagava
      @Ajagava  День тому +3

      లక్ష్మణరేఖ అన్నది వాల్మీకి రామాయణంలో కూడా లేదండి.

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 2 дні тому +1

    🎉🎉🎉🎉

  • @rajeshboddula2638
    @rajeshboddula2638 3 години тому

    Ayya నా కొక సందేహం... వాల్మీకి రామాయణం నే భాసుడు రాశాడేమో .... ఆ ఆధునిక కాలం లో వాల్మీకి రామాయణం ను కల్తీ చేసారేమో

  • @gsrilakshmi4054
    @gsrilakshmi4054 2 дні тому +1

    Namyestey sir.title name
    Basa mahakvi name appearing as
    Bana mahakavi.
    Please check it. Dhanyawad

    • @Ajagava
      @Ajagava  День тому +1

      నమస్కారం శ్రీలక్ష్మి గారు,
      ఫాంట్ మార్చానండి.

  • @hemandhrachelikani2208
    @hemandhrachelikani2208 День тому

    Kasi majilee kathalu anduku pettadam ledu sir

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 2 дні тому +1

    VALMEEKI RAMAYANAM JARIGINA KATHA KADA. JARIGINA KATHA AITE ELA MARUSTARU. VALMEEKI RAMAYANAM PRAMANIKAM ANNAPPUDU AYANAKI AVAMANAM AVUTUNDI KADA.. VYASUDI VISHAYAM LO TIKKANA KUDA IDE TAPPU CHESADU.

    • @Ajagava
      @Ajagava  День тому +4

      ప్రాచీనకాలంలో ఎక్కువ శాతం నాటకాలను పురాణేతిహాసాలలోని కథల ఆధారంగానే రచించేవారండి. పాత్రల ఔచిత్యానికి ఏమాత్రం భంగం కలిగించకుండా, మూలకథలో మార్పులు చేయకుండా, సన్నివేశ కల్పన చేయడం అలంకారికులు కూడా అంగీకరించిన విషయమే. మహాకవి కాళిదాసు "అభిజ్ఞాన శాకుంతలం" కూడా అలా రచింపబడిందే. భారతంలోని శకుంతల కథకు, కాళిదాసు శాకుంతలంలోని కథకు భేదం ఉంటుంది. అలానే భవభూతి "ఉత్తర రామచరితం" ఉత్తరకాండలోని మూలకథకు విరుద్ధంగా సుఖాంతంగా ముగుస్తుంది. అయితే ఉత్తరకాండ ప్రక్షిప్తమనీ, వాల్మీకి మహర్షి రచన కాదనీ మహాపండితులందరూ ముక్తకంఠంతో చెప్పే మాట కనుక, భవభూతి వాల్మీకి మహర్షిని అవమానించినట్లుగా భావించనక్కరలేదు. నిజానికి మీరు కూడా అన్నట్లే రామాయణ భారతాలు కథలు కావు, అవి జరిగిన చరిత్రలు. ఆ చరిత్రలను రసపోషణ చేస్తూ, సామాజికుల హృదయాలలో నాటుకుపోయేలా అద్భుతమైన కావ్యాలుగా మలిచారు వ్యాసవాల్మీకులు. ఆ చరిత్రలలో చిన్నపాటి మార్పులు చేసి జనరంజకంగా నాటకాలు రచించారు కాళిదాసాది మహాకవులు.