Gaayam movie songs | Niggadisi Adugu song | Jagapathi Babu | Revathi | RGV | Mango Music

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Niggadisi Adugu video song from Gaayam telugu movie on Mango Music, featuring Jagapathi Babu, Revathi, Urmila Matondkar.
    Song : Niggadisi Adugu
    Singers : SP Balu
    Lyrics : Sirivennela Sitaramasastry
    Cast : Jagapathi Babu, Revathi
    Director : Ram Gopal Varma
    Producer : Yarllagada Surendra
    Music : Sri
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel. .
    My Mango App Links:
    App Store: apps.apple.com....
    For any copyright queries, please reach out to claims@whackedout.in

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +518

    "సిరివెన్నెల సీతారమశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి..
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ😢😢💐

  • @creativepositiveenergy5886
    @creativepositiveenergy5886 5 років тому +350

    వేటూరి గారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.మన తెలుగు సాహిత్యం నికి దక్కిన ఆణిముత్యాలు.......

  • @ShivaKumar-oc2hk
    @ShivaKumar-oc2hk 3 роки тому +131

    😔🙏miss you guruji🙏💛💞
    నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ...
    ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....

    • @srinivassathi0369
      @srinivassathi0369 10 місяців тому

      మీ భావాల్ని ఇంత బాగా చెప్పగలగడం చాలా అద్భుతంగాను, ఆశ్చర్యం గాను ఉంది. మీరు కూడా మంచి సాహితీప్రియులా. Superb ....

    • @lakshminarayana3737
      @lakshminarayana3737 10 місяців тому +1

      మీరెంత అభిమానిస్తున్నారో మన 'సిరి' వెన్నెల గారిని ఇట్టే తెలిసిపోతుంది. ఆయన ప్రభావం మనలాంటి ఎంత
      మందీ నర నరానా నింపివెళ్లాడో చెప్పనక్కర్లేదు...
      నీతి , నిజాయితి సమాది కాకూడని సమాజం కోసం అన్వేషిస్తూ ఎప్పుడు మీ అక్షర మాలలో వోధిగుండాలనీ..

    • @mknaresh-m1l
      @mknaresh-m1l 9 місяців тому

      Superb ❤

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 9 місяців тому

      ORNEE... MAAREEE VYAKTI POOJA EEKKUVAYINDI... IF YOU REALLY FOLLOW GURUJI.. YOU WILL DO SOME THING BETTER RATHER THAN THIS KIND OF BHAJANA SONG!! MARADU LOKAM....

    • @chandukuraganti8642
      @chandukuraganti8642 5 місяців тому

      Excellent bro.... 👏 👏

  • @sampathreddy6159
    @sampathreddy6159 5 років тому +308

    శాస్త్రి గారి రచన ✍️👌
    ఈ సాంగ్ లో ఉన్న ఎమోషన్స్ ను కెమరా వర్క్ లో చాలా అద్బుతం గా పిచరైజేశన్ చేశారు RGV గారు 🙏🙏👏👏

  • @rajkumarkanaka2967
    @rajkumarkanaka2967 2 роки тому +137

    2024 జరగపోయే ఎన్నికలో మన తెలంగాణ ప్రజలకు అంకితం ఇ పాట ఇప్పటికైనా మరుధం

  • @raviyarlapalli8943
    @raviyarlapalli8943 6 років тому +1501

    ఈ పాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలియదు కాని ఇప్పటికీ సమాజం అలాగే ఉంది, ఏం మరాలేదు

  • @khadarpasha1134
    @khadarpasha1134 4 роки тому +203

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు.ఈ పాట అసలు మీనింగ్ అర్థం కావడమే కష్టం. అర్థమయితే ఈ పాటను వదులుకోవడం కష్టం.

    • @sidhukakarla6319
      @sidhukakarla6319 4 роки тому +2

      Good comment on this song I like your comments
      KAKARLA SIDHU PULIVENDULA YSR KADAPA

    • @enukurthianilkumar2746
      @enukurthianilkumar2746 5 місяців тому

      you message me brother. i will tell you the meaning.

  • @palakodetiramakrishna5560
    @palakodetiramakrishna5560 Місяць тому +7

    మంచి పాటలు ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు

  • @marybharathi8533
    @marybharathi8533 2 роки тому +37

    నేను ముందు మారాలి అని ప్రతీ ఒక్కరు అనుకుంటే ఆ క్షణమే ఈ ప్రపంచం మారుతుంది. 🙏🙏🙏
    Nice lyrics shastri gaaru.
    Thank you so much 🙏.
    RIP 🙏

  • @ChidVanhi
    @ChidVanhi Рік тому +9

    మనల్ని తట్టి లేపే పాటలు ఉంటాయి
    మనల్ని కొట్టి లేపే పాటలు కొన్ని ఉంటాయి
    ఈ పాట మాత్రం మనల్ని చంపేసి మళ్లీ సద్భావాలతో కొత్త జన్మనిస్తుంది
    ఈ పాట కోసం RGV సినిమా తీసాడు

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 5 років тому +529

    ఎంత మందికి తెలుసు RGV గారు ఈ పాట కోసమే ఈ సినిమా తీశారు అని

  • @sudheerkumarmotukuduri5075
    @sudheerkumarmotukuduri5075 6 років тому +446

    "జీవితసత్యాన్ని తెలిపే మంచి ఆణిముత్యం లాంటి పాట" ఎప్పటికీ మర్చిపోలేనిది✍️

    • @mangomusic
      @mangomusic  6 років тому +4

      keep listening....Watch&Enjoy
      Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe

    • @gpurna3951
      @gpurna3951 6 років тому +2

      సూపర్ సాంగ్

    • @vippavan9940
      @vippavan9940 6 років тому +1

      coccolino deep super hit Telangana songs

    • @dhasariganesh7427
      @dhasariganesh7427 5 років тому +1

      Supar

  • @akrcreations8376
    @akrcreations8376 3 роки тому +73

    సిరివెన్నెల గారు... నాకిష్టమైన గేయ రచయిత.... ఆయన రాసిన పాటలంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆయన పాట వినందే నాకు తోచదు... నేను రాసిన పాట ఆయనకి వినిపించాలని, ఆయన్ని కలవాలనే నా కల కలగానే మిగిలిపోయింది.
    The great Lyric writter...
    😭😭😭

  • @ymadhusudana25
    @ymadhusudana25 3 роки тому +46

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతిచేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏💐

  • @subbu1613
    @subbu1613 3 роки тому +86

    సిరివెన్నెల సీతారామశాస్త్రి 🙏🙏🙏....... మీ పాటలకి మాటలు లేవు భావాలు తప్ప....

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Рік тому +4

    నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ.. ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి.. గొర్రెదాటు మందకీ నీ జ్ఞానబోధ దేనికీ.. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం.. ఏ క్షణాన మార్చుకుంది జిత్తులమార్గం.. రామబాణమార్పిందా రావణకాష్టం.. కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం.. నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా.. వేట అదే.. వేటు అదే.. నాటి కథే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత.. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుంద.. శతాబ్దాలు చదవలేద.. ఈ అరణ్యకాండ.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం మారదు కాలం..
    సిరివెన్నెల/గాయం
    🎉😢🎉😢🎉😢🎉😢🎉😢🎉😢
    సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు..
    😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔
    శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా..
    😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭
    సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ..
    😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏
    నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని..
    😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏
    -రాంమోహన్ కస్తూరి

  • @arunapolsani2628
    @arunapolsani2628 11 місяців тому +2

    పాట రాసిన సిరి వెన్నెల నే నటించిన చిత్రం ఇది.నాకు ఎప్పటి కి మరిచి పోలేని పాట & అభిమాన కవి ❤

  • @sulamsuresh
    @sulamsuresh 8 років тому +671

    నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
    మారదు లోకం మారదు కాలం
    గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
    గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
    యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    యే క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
    రామబాణమార్పిందా రావణ కాష్ఠం
    కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
    నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
    అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
    వేట అదే వేటు అదే నాటి కధే అంతా
    నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
    బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
    శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ
    నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
    మారదు లోకం మారదు కాలం||
    ||రచన: సిరివెన్నల సీతారామశాస్త్రి
    సంగీతం: శ్రీ

  • @marripudivenkateswararao2091
    @marripudivenkateswararao2091 Місяць тому +2

    Good 👍 great super message song andi 🎉💯

  • @pabbayugandharbhargavigoud
    @pabbayugandharbhargavigoud 11 місяців тому +3

    2024జరగపోయె ఎన్నికల్లో మన తెలంగాణా ప్రజల కు అంకితం ఈ పాట ఇప్పటికెన మరుదం

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 роки тому +17

    Miss you sir, సమాజానికి అవసరం ఐనా పాటలు అందించారు.

  • @agnidharachannel3767
    @agnidharachannel3767 Рік тому +3

    ❤అన్న గారు...super song & meanig.
    From..
    అగ్నిధార తెలుగు దిన పత్రిక CMD.

  • @Radhakannayya108
    @Radhakannayya108 Рік тому +2

    మా గురువుగారు సిరివెన్నెల కలం నుండి వచ్చిన సాహిత్య పరిమళాళ్ళో ఈ సాహిత్యం
    సమాజాన్ని అనే కంటే ప్రతి మనిషి తనకు తాను మారి ఈ సమాజానికి కృతజ్ఞత పూర్వుడై ఎదో ఒక మేలు చేసి పోవాలి అని నేర్పుతుంది...
    ఈ సమాజానికి నీ వల్ల ఎలాంటి హాని జరుపకుండా ఎదో ఒక మేలు చేసి పోవాలి....
    లోక సమస్త సుఖినోభవంతు🙏

  • @cinemachopisthamama..3207
    @cinemachopisthamama..3207 5 років тому +234

    2020 lo kuda best oka like vesukondi

    • @ksr19742001
      @ksr19742001 3 роки тому

      Soooooooper lyrics 👍👍

  • @venkatsai4578
    @venkatsai4578 2 роки тому +2

    Ippudu unna directors evaru inta daring ga ilanti lyrics rayincharu .. hats off rgv and sirivennala

  • @OOLANKANAGADURGAJAGADEESH
    @OOLANKANAGADURGAJAGADEESH 3 роки тому +4

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు Return If possible💔 ...

  • @hemshere3711
    @hemshere3711 2 дні тому

    ఎన్ని తరాలు మారినా, ఎప్పటికీ సమకాలీనం గా వుండే జీవిత సత్యాలు.

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 роки тому +9

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీరు జీవించి ఉన్నంత కాలం ఈ పాట నీకే అంకితం,,,,,,, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఈరోజు మాకు చీకటి రోజు,,,,2021_11_30. Rip day😖😖

  • @ShanShankr-fr9ve
    @ShanShankr-fr9ve Рік тому +2

    E song movie lo pettina RGV Sir ki and sirivennela gaariki naa paadhabhi vandhanam.......

  • @SS-vr
    @SS-vr 8 місяців тому +112

    2024 లో ఈ సినిమా సాంగ్ చూస్తున్న వారు ఒక like చెయ్యండి🙏

  • @meenamuktheswar
    @meenamuktheswar 6 місяців тому +2

    ఆల్ టైం మై ఫేవరెట్ హిట్ సాంగ్ 🙏👌👌👌

  • @vempatisudhanapelly7574
    @vempatisudhanapelly7574 5 років тому +7

    ఇప్పటికి అలాగే ఉంది సమాజం
    ఏప్పటికి మార్పు వస్తోందో చుడలి
    ఇ పాట రాసిన మీకు ఈతరం సమాజ యువత తరపున నా హృదయ పూర్వక నమస్కారలు

  • @Uday_Kiran_m
    @Uday_Kiran_m 10 днів тому +1

    Asalu sirivennalla garu lyrics, thutalu kanna danger

  • @ykotireddy2975
    @ykotireddy2975 Рік тому +4

    మంచి సాహత్యాన్ని పంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నమస్కారములు

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 6 місяців тому +3

    నిగ్గదీసి జనాల నైనా ఎవరినైనా ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఒక్క కవికే

  • @kurayellappa3053
    @kurayellappa3053 5 місяців тому +9

    మహానుభావుడు అప్పుడే సమాజం గురించి వంట పట్టించుకున్నాడు ఇప్పుడు ఇంకా చెడిపోయింది

  • @shivaprasadgullapelli4268
    @shivaprasadgullapelli4268 6 місяців тому +1

    It's incorporated in the Telugu film "Akalirajyam".
    I used call it "Abhyudaya Prashnopanishad"

  • @ramananaik8406
    @ramananaik8406 Рік тому +8

    " మన వాళ్ళు ఓట్టి వేధవలోయి" అన్న మాటల్ని చాలా క్లాసిక్ గా చెప్పిన సీతారామ శాస్త్రి గారు

    • @ven41618
      @ven41618 Рік тому +1

      brilliantly said!

  • @cilpakanarender7953
    @cilpakanarender7953 Рік тому +2

    మరోజన్మ అంటూ వుంటే మీరు పుట్టాలని కోరుకొంటున్నాను మీ అభిమాని

  • @kshetradhar3125
    @kshetradhar3125 5 років тому +4

    ఎంత మందికి తెలుసు RGV గారు ఈ పాట కోసమే ఈ సినిమా తీశారు అని and Hats off Sir , What a Great Lyrics. I am One Of The Your Fan. Your The Living Legend.Thank you So much , Sirivennela garu meeku hatsup & శాస్త్రి గారి రచన ✍️👌
    ఈ సాంగ్ లో ఉన్న ఎమోషన్స్ ను కెమరా వర్క్ లో చాలా అద్బుతం గా పిచరైజేశన్ చేశారు RGV గారు 🙏🙏👏👏

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 2 роки тому +1

    Kavi goppatanam aayana kavitvam timeless kaabatti telustundi. sri sri gari “ ee desa charitea choosinaa emunnadi garva karanam?” anna padalu ippatiki vartistayi, ee paata kooda ante. “ balavantude bratakalani” eppatiki ade nijam

  • @AnandMandala
    @AnandMandala 3 роки тому +18

    Thanks to RGV for making Sirivennela garu to act in this movie......Probably only movie we can see him as actor....RIP

  • @pavvaan1
    @pavvaan1 3 роки тому +2

    RIP sir, nenu samajam gurinchi alochinchadaniki me e paata naaku chala nerpindi

  • @HR-Roy
    @HR-Roy Місяць тому +3

    We must all accept the writter of this song

  • @polinaidu1905
    @polinaidu1905 Рік тому +9

    ఇదే జీవిత సత్యం......

  • @sureshkukkala5726
    @sureshkukkala5726 2 роки тому +1

    Ee song chala chala bauntundi.meeru correct ga set iyyaru 100%.ee song ki

  • @venkateshshanigarapu9584
    @venkateshshanigarapu9584 7 місяців тому +4

    మనం మారకపోవచ్చు కానీ ఇవే స్కూల్ లో ఒక గంట ఎడ్యుకేషనుఁ ఐతే గారెంటీగ సమాజం మారుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారికి కూడా కొంత బ్రెయిన్ వాష్ అవుతుంది అని నా అభిప్రాయం...

  • @k.m.chopra910
    @k.m.chopra910 3 роки тому +8

    శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏

  • @12vanchi
    @12vanchi 2 роки тому +3

    Shiva Rajaka..Great song always appreciated by Telugu people..yup.i am Tamil..i love and like to watch when I have a time..

  • @tirumalraorao6265
    @tirumalraorao6265 8 місяців тому +2

    It's real it's fact no one care never change this society we change ourself finally god is great human values are gone no one change humans but god will change everything 🙏

  • @jkasi7499
    @jkasi7499 4 роки тому +6

    ఈ పాట వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఇప్పటికీ సమాజంలో ఎటువంటి మార్పు లేదు

  • @yavfoBfoxb
    @yavfoBfoxb 3 роки тому +1

    Nice person Sasthry garu

  • @rajuyadav-ub6kh
    @rajuyadav-ub6kh 3 роки тому +5

    ఎన్ని సం.. గడిచిన మన సమాజం కి సూట్ అవుతుంది పాట

  • @krishnarao9090
    @krishnarao9090 4 роки тому +2

    గురువు గారు...... మీ పాదాలకు నా నమస్కారాలు

  • @mvg7551
    @mvg7551 5 років тому +18

    2019 ఎన్నికల్లో నిరూపించిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పాట అంకితం.

  • @venugnaidu9633
    @venugnaidu9633 3 роки тому +2

    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని,
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని,
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
    మారదు లోకం మారదు కాలం....
    గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
    గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
    ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
    రామబాణమార్పిందా రావణ కాష్టం
    కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం...
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
    పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
    అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
    వేట అదే వేటు అదే నాటి కథే అంతా
    నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
    బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
    శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ.....
    సాహితీ పురుషోత్తమా...
    నీకివే మా వందనాలు........
    జోహార్ జోహార్ జోహార్...🙏🙏🙏🙏🙏

  • @ramakishangoud1000
    @ramakishangoud1000 7 років тому +39

    Sirivennala sir miru MA Kavi ani chepokodanki proud GA feel ithunam, mi e song ki emani cheyali comment..... Hatsup sir miku, prathi aksharam oka bullet LA unnay

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 3 роки тому +24

    పల్లవి:
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమైపోని
    మారదు లోకం మారదు కాలం
    చరణం:1
    గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
    గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి
    ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
    ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
    రామబాణమార్పిందా రావణకాష్టం
    కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    చరణం:2
    పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా
    అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
    వేట అదే వేటు అదే నాటి కథే అంతా
    నట్టడవులు నడివీధికి నడిచొస్తేం వింత
    బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
    శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
    మారదు లోకం మారదు కాలం
    దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమైపోని
    మారదు లోకం మారదు కాలం
    చిత్రం:గాయం(1992)
    నటీనటులు:జగపతి బాబు,రేవతి.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
    నా సెల్ నంబర్ 9603008800.
    15/08/2021.
    (స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు)

    • @ramalaxmi1160
      @ramalaxmi1160 2 роки тому +1

      Super sir

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 2 роки тому +2

      @@ramalaxmi1160 గారు థాంక్యూ వెరీ మచ్ అండి.

    • @ramalaxmi1160
      @ramalaxmi1160 2 роки тому +1

      Naku old songs ante chala estam sir

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 2 роки тому +2

      @@ramalaxmi1160 గారు నేను కూడా మీలాగే పాత పాటలనే ఇష్టపడుతాను.

    • @radhikalingam5130
      @radhikalingam5130 Рік тому +1

      Nattadavulu nadivedhiki nadichosthe ante enti?

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 4 роки тому +1043

    ఈ "పాట"కు సలాం చేదాం 🙏
    అనే వాళ్లు ఒక లైక్ వేయండి
    "👍"

    • @rohiniputabanthi9074
      @rohiniputabanthi9074 3 роки тому +2

      O
      Lm
      .m

    • @menthiniramdevmaharshi9296
      @menthiniramdevmaharshi9296 3 роки тому

      @@rohiniputabanthi9074 kkìii9òñè

    • @aquans1751
      @aquans1751 3 роки тому +1

      @@rohiniputabanthi9074 hiii Rohini gud mrng my name satish reddy ur from plZ reply

    • @rajuraparthi7190
      @rajuraparthi7190 3 роки тому +2

      అన్న ఈ పాట లో ఉన్నది అంతా నిజమే అన్నా

    • @saiduluuppala202
      @saiduluuppala202 3 роки тому +1

      తెలుగు భాష బ్రతికి ఉన్నంతకాలం మీ సాహిత్యం బ్రతికి ఉంటుంది🙏🙏🙏🙏.

  • @gunnamdevi5789
    @gunnamdevi5789 3 роки тому +3

    ఏ చరిత్ర నేర్చుకుంది ఈ సమాజం సూపర్ సాంగ్స్

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 3 роки тому +45

    Srivennala srirama saatry garu penned this song nearly 25 years ago, but it is so suitable to our society even today.
    Such lyricsist are rare and the pen with which he penned thousands of songs are still so evident and lively..
    Proud to be a telugu person.
    Sir, may your soul rest in peace.
    Pls dont forget to take a rebirth again in a telugu family, as there are millions of people like me waiting eagerly for a beautiful songs to be written and and question the siciety. And give his best contribution to telugu literature

  • @REDDIPALLIKANUKARAJKARUNAKAR
    @REDDIPALLIKANUKARAJKARUNAKAR 11 місяців тому +2

    👌👌❤️❤️💯💯🔥🔥

  • @princevenkat6583
    @princevenkat6583 5 років тому +354

    మనం మారాము కాని సమాజం మారిపోవాలి ,నీతులు చెప్పెవాళ్లు కాదు
    ఆచరించే వారు కావాలి

    • @VenkateshVenkatesh-hs1ei
      @VenkateshVenkatesh-hs1ei 4 роки тому

      Super song

    • @lakshmimanojkr9621
      @lakshmimanojkr9621 4 роки тому +3

      Aacharenchali ante; teleyale ga

    • @m.nareshkumar808
      @m.nareshkumar808 4 роки тому +2

      Nv super bro

    • @raambabu7111
      @raambabu7111 2 роки тому +4

      మనమే సమాజం...సమాజమే ప్రజలు...ఆ ప్రజలే అవినీతి పరులు...ఆ అవినీతి పరుల్లో ఒక్కడు నాయకుడు అవుతాడు...వాడికి సపోర్ట్ చేసేది అదే అవినీతి పరులు...నీతి పరులు నీతి చెప్పుకుంటూ వుంటారు..కొంత మంది నీతిపరులు సమాజం కోసం పోరాడుతుంటారు..కానీ కొంతమంది వెదవలు అవినీతి పరులకు సపోర్టు చేస్తూ సమాజాన్ని ,వ్యవస్థలు ను ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు

    • @publicvoicenewstv
      @publicvoicenewstv 2 роки тому

      అవును

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 2 роки тому

    Super sir great song. Chalasarlu chusanu brathikinapudu. Theliyadhu chanipoyaka viluva thulusthudhi.

  • @ragkvrags
    @ragkvrags 3 роки тому +11

    IN MY OPINION THIS IS THE BEST SONG FROM SIRIVENNELA PEN, AS ITS GOING TO BE ALIVE FOR NEXT 1000 YEARS AS OUR TELUGU PEOPLE NOT GOING TO CHANGE EVEN AN INCH

  • @nvenugopal3243
    @nvenugopal3243 3 роки тому +2

    మహానుభావుడా వందనం💐💐💐👍👍👍నేవులేని లోటు తీరచ్చలేనిది😢😢😢😢😢

  • @Pkvlogs460
    @Pkvlogs460 3 роки тому +13

    సిగ్గు లేని జనం సూపర్

  • @saigowlikar
    @saigowlikar Рік тому +2

    Can not control my tears.... such an intense human being. Pranaamalu Guruvugaaru!!

  • @kadatikrishna2776
    @kadatikrishna2776 Рік тому +4

    🙏సీరివెన్నల గారు ఈ పాటను ఎన్నిసార్లు విన్న వినాలి. నిజంగా సమాజం ని అడగాలి అన్నా ఫీలింగ్ 🙏

  • @HR-Roy
    @HR-Roy 10 місяців тому

    The true writer and excellent music direction and excellent actors made this scenery as greatest in TS and TS intellectuals praise this

  • @paramnetra9754
    @paramnetra9754 4 роки тому +8

    Present world lo correct ga apt ayye song....getting Goosebumps

  • @satishkolla2734
    @satishkolla2734 3 роки тому +1

    Rgv padinantha varakoo ee pata undhani naku teledhu but it's fact & wonderful song

  • @srinivasmahanti381
    @srinivasmahanti381 3 роки тому +6

    Hats off to sri srivennala seetaramsastri , he written excellent songs , indians owe to him

  • @raghupathibramhanapalli6884
    @raghupathibramhanapalli6884 2 роки тому +2

    ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఈ సమాజ ఏమాత్రం మార్ల అలాగే

  • @sravaniandri6134
    @sravaniandri6134 9 років тому +7

    meru chala chla grate sir. me sngsloni lyrics prathiokkarini alochinchayla chesthundhi......meru ilanti songsni ma e ganeration ki inka enno andhinchali sir.....sirivennela seetharama saathri garu meku Hatts off

  • @chandrareddy4392
    @chandrareddy4392 3 роки тому +12

    amazing lirics and breathless singing by balu sir.

    • @ANILKUMAR-zz4we
      @ANILKUMAR-zz4we 3 роки тому +1

      Brother aa song raasindi... Ee video song lo unnadi... Inddaru okhare... SIRIVENNELA SITARAMA SASTRY gaaru

  • @shivarajaka7445
    @shivarajaka7445 4 роки тому +2081

    2025 anyone else watching❤❤👌👌 🔥🔥

  • @bharadwazamirapu3544
    @bharadwazamirapu3544 2 роки тому +26

    ఇలాంటి పాట రాయగలిగే ధైర్యం సీతా రామ శాస్త్రి గారికి ఉంటే దానిని ఒక సినిమా లో తెరకెక్కించడానికి అంతటి సాహసం చేయగలిగే మనిషి rgv

  • @sanjukumar580
    @sanjukumar580 3 роки тому +29

    మీ పాటలలో సాహిత్యం వర్ణించడానికి మేము అర్హులం కాదు కానీ మీరు వ్రాసిన✍️
    పాటలు మా చెవులకు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి మీరు
    ఎక్కడున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి
    Miss you Sir🙏😌😢

  • @rameshbabu9892
    @rameshbabu9892 3 роки тому +18

    రామబాణం ఆర్పిందా రావణకాష్టం...
    కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం....
    వహవా... మీకే సాధ్యం సర్...

    • @jaganmohan613
      @jaganmohan613 6 місяців тому

      Krishnudu Geeta cheppindi yuddam cheyyamane...

  • @pullurimahender606
    @pullurimahender606 7 років тому +39

    This song every word correct and fact sir emotional and inspiration song really hatts off sir

  • @rajithakathi8803
    @rajithakathi8803 5 років тому +7

    Hatts off to you sir...
    You are a great poet sir...
    Wonderful song it is.....
    And ultimate it is....

  • @muralikrishna1377
    @muralikrishna1377 4 роки тому +25

    Rgv questioning the society, master piece of legendary director

  • @pandurangaraoguntupalli5616
    @pandurangaraoguntupalli5616 3 роки тому +1

    Wow! Salute to you r service for telugufilms which enrich with profundity

  • @ramakote4738
    @ramakote4738 3 роки тому +5

    రామబాణ ఆపిందా రావణ యుద్ధం కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్రం సూపర్ రచన హాట్స్ ఆఫ్ పాడిన వాళ్లకి రాసిన వాళ్లకు మారదు ఈ లోకం

  • @janakiramasarma3718
    @janakiramasarma3718 7 місяців тому

    SUPERB SONG, WHICH IS IMMORTAL... HAS NO TIME LIMITS

  • @RaviKumar-nt7jx
    @RaviKumar-nt7jx 3 роки тому +3

    ❤️❤️anyone listening this legendary song in 2022 . nothing as been changed among the people 😏😏

  • @madhusamineni1289
    @madhusamineni1289 11 місяців тому +1

    Master piece from legend Siri vennela

  • @sudharshanrao9122
    @sudharshanrao9122 6 років тому +24

    Telugu bratikinanta kalam meeku runapadi untam sir.... Hats up

    • @mangomusic
      @mangomusic  6 років тому

      Thanks Sudharshan Rao for your love & support.

  • @oudh-al-hindh1763
    @oudh-al-hindh1763 Рік тому +1

    Inko 50 years varaku kuda ilanti song radu

  • @studythreads
    @studythreads 4 роки тому +22

    Credit goes to Sitarama Sastry and Ram Gopal Verma..for the song. It's useful for centuries in India.

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 3 роки тому +6

    అభినవ శ్రీ శ్రీ మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. సిరివెన్నెల రాసిన పాటలు ఎంత ప్రభావితము చేసాయంట.. ఇప్పుడు తరానికి అతను ఓ భగవత్ గీత ఎవరు పాటలు రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భావాలు దాటి వెళ్ళలేక పోతున్నారు

  • @CompetateUsa
    @CompetateUsa 7 днів тому +1

    బీజేపీ బడ్జెట్ song for తెలంగాణ కు ఈరోజు1 feb 2025 కి వర్తిస్తుంది

  • @AQUARIUMWORLDTELUGU
    @AQUARIUMWORLDTELUGU 3 роки тому +3

    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
    అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని

  • @venkateshpedagandham4773
    @venkateshpedagandham4773 Рік тому

    One of the animutyam of Sirivennela garu ❤❤❤

  • @eswarikandhukuri7879
    @eswarikandhukuri7879 6 років тому +14

    Words can't explain what a wonderful song it is

  • @nareshravula7635
    @nareshravula7635 3 роки тому

    Rgv the grate elanti songs కానీ సినిమా కానీ మళ్ళీ ఎవరు teyaleru

  • @sandeepkatukuri945
    @sandeepkatukuri945 3 роки тому +7

    The lyrics which made me think every time. you will be alive as long as the your literature will inspire the people. You will be remembered for the ages sir. Rest in peace Shastri garu.

  • @harishreddy4921
    @harishreddy4921 4 роки тому +1

    'veta adhe vetu adhe ' e okka word tho "adhi" manavuniki ..."adhima" manavuniki em link kaliparu great sir

  • @ravitejapasupuleti
    @ravitejapasupuleti 4 роки тому +32

    అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా....!