Aadarana Integrated Organic Agriculture and Dairy Farm ఆదరణ పాడి పంట సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • రసాయన సాగుతో నిర్జీవమైన నేలకి... జీవం పోయగలిగేది సేంద్రియ సేద్యమే.
    కాలుష్యకారక అనారోగ్యాలకు విరుగుడు... సేంద్రియ ఉత్పత్తులే.
    సహజ, సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలే... భావి తరాలకి ఆశా రేఖలు.
    పంచభూతాల పరిరక్షణకి సేంద్రియ వ్యవసాయమే శరణ్యం అని మనసా వాచా కర్మణా నమ్మిన మేము... ఆదరణ పాడి పంట క్షేత్రాన్ని సమగ్ర ప్రకృతి సాగుకి చిరునామాగా మలిచాం.
    కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేస్తూ... సేంద్రియ సాగులో నాణ్యమైన అధిక దిగుబడుల సాధన సాధ్యమేనని నిరూపించాం.
    సహజ, ప్రకృతి సేద్యం, అనుబంధ రంగాలతో కూడిన సమీకృత వ్యవసాయ పద్ధతుల ఆచరణకి... ప్రత్యక్ష నమూనా క్షేత్రంగా తీర్చిదిద్దాం.
    ఆత్మ, కేవీకేలు, నాబార్డు, మేనేజ్‌, ఐఐఎంఆర్ వంటి రాష్ట్ర, జాతీయ వ్యవసాయ సంస్థల శాస్త్రవేత్తలు, అధికారుల... క్షేత్ర సందర్శన, శిక్షణ కార్యక్రమాలకి అనువైన వేదికగా గుర్తింపు పొందినందుకు గర్వపడుతున్నాం.
    సేంద్రియ సాగులో నిరంతరం ప్రయోగాలకి కట్టుబడి... సామాన్య రైతులు సైతం సేంద్రియ సేద్యం గురించి ఆలోచించేలా... స్ఫూర్తివంతమైన విధానాలు ఆవిష్కరించి, ఆచరించి... వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా సదా మా కృషిని కొనసాగిస్తామని వినమ్రంగా తెలియ చేస్తున్నాం. జై జవాన్‌- జైకిసాన్‌.

КОМЕНТАРІ • 10

  • @harieedigapalli7251
    @harieedigapalli7251 Рік тому

    చాలా చాలా ధన్యవాదాలు సర్... అందరూ మీ లాగే ఆలోచిస్తే... ఆరోగ్యకరమైన భారత దేశాన్ని చూడొచ్చు 🙏🙏🙏❤️🙏🙏🙏

  • @gangireddyreddy1870
    @gangireddyreddy1870 2 роки тому +2

    Excellent understanding of natural farming

  • @rameshbabu2167
    @rameshbabu2167 Рік тому +2

    మీకూ అందరూ ఎంతో ఋణపడి ఉంటారు.
    ప్రకృతి వ్యవసాయాన్ని లాభసాటిగా అభివృద్ధి చేయడం కోసం మీ శక్తి దారపోసారు. ధన్య వాదములు

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 роки тому +2

    మీ మనసు గొప్పది
    మీ అందరికీ ధన్యవాదాలు.
    ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అని ఆశిస్తూ మీ
    సుబ్బా రెడ్డి. SSD Bio sciences.

  • @arunshetty4144
    @arunshetty4144 Рік тому +1

    Excellent job Sir, keep up the good work. All the best

  • @bukkebalajinaik7155
    @bukkebalajinaik7155 Рік тому

    ఇన్ని ఆవులు ఉన్నా కూడా west Decomposer వాడడం సరికాదు సార్🙏. మీ ప్రకృతి వ్యవసాయం చాలా బాగుంది. మీ వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికై వస్తాము. 🌹🇮🇳🙏

  • @sudharaaji3334
    @sudharaaji3334 2 роки тому +1

    మానవుల కోసం దేవుడిచ్చిన వరం సార్ మీరు

  • @srinivassri4181
    @srinivassri4181 Рік тому

    Yekkada sir adrees

  • @krishnareddypalaparthy7040
    @krishnareddypalaparthy7040 Рік тому

    Desi Cow with buffalo, hsf , is not good

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 роки тому

    Congratulations 👏👏👏👏