న్యాసం లేకుండా జపం చేస్తే ?....
Вставка
- Опубліковано 26 гру 2024
- న్యాసాలు లేకుండా మంత్రం జపం చేస్తే ఫలితం చాలా తక్కువ . న్యాసం మంత్రం జపానికి శరీరాన్ని మనసుని ఉపక్రమించేలా చేస్తుంది
అలంటి న్యాసాలు లేకుండా జపం చేయడం అనేది యాంత్రిక చర్య కింద అభివర్ణించారు . మీరు ఏ సంప్రదాయం లో మంత్రాన్ని గ్రహించినా వెంటనే ఆ గురువులను లేదా అదే కుల ధర్మంలో జ్యేష్ఠులను సంప్రదించి ముందు మంత్రానికి సంబంధించిన న్యాసాలు అభ్యసించి న్యాస యుక్తంగా మంత్రం సాధన చేసే ప్రయత్నం చేసి సత్ఫలితాలు పొందగలరు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం అహం కమలానందనాధ
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ . శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు .
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA