Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పల్లవి:మనసా ఎటులోర్తునే నామనవిని చేకొనవే ఓ ॥మ॥చరణము(లు):దినకరకుల భూషణునిదీనుఁడవై భజనఁజేసిదినముఁ గడుపమనిన నీవువినవదేల గుణవిహీన ॥మ॥కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమికలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనేసులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయుఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥
పల్లవి:
మనసా ఎటులోర్తునే నా
మనవిని చేకొనవే ఓ ॥మ॥
చరణము(లు):
దినకరకుల భూషణుని
దీనుఁడవై భజనఁజేసి
దినముఁ గడుపమనిన నీవు
వినవదేల గుణవిహీన ॥మ॥
కలిలో రాజస తామస గుణములు - గలవారి చెలిమి
కలిసిమెలసి తిఱుగుచు మఱి - కాలము గడపకనే
సులభముగాఁ గడతేరను - సూచనలను దెలియఁజేయు
ఇలను త్యాగరాజుమాట - వినవదేల గుణవిహీన ॥మ॥