Md. Rafi and Shankar-Jaikishan Songs | Dr AV Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #drguravareddy
    సంగీతం అమృతాన్ని మించిన సంజీవిని,
    ఈ సంజీవినిని మోయడానికి గాత్ర శ్రామికులు, గాయకులు లేక మానరు!
    ఆ ఆంజనేయుల్లో, మొట్ట మొదటి వరుసలో
    రఫీ ఉండక మానడు!
    ఇంతకముందు చేసిన O P నయ్యర్, నౌషాద్ అలీ మరియు రఫీ జుగల్బందీలకు
    మీరందించిన ప్రేమాభిమానాలు, నన్ను ఇంకో మారు ఆ పుస్తకాన్ని పట్టడానికి ప్రేరేపించాయి!
    ఇకపోతే ఈసారి 'శంకర్-జై కిషన్'ల వంతు!
    ఇది పరిచయం అవసరం లేని ద్వయం..
    అయితే ఇందులో, ఎంతో మందికి తెలియని ఓ చిన్న గమ్మత్తు,
    శంకర్-జయకిషన్ ల లో శంకర్ గారికి హైదరాబాద్ మూలాలు ఉండటం!
    బాలీవుడ్ లో కీర్తి పతాకాలని ఎగేరేసిన ఈ సంగీత పుష్పం,
    మన తెలుగు తోటకి చెందిన పరిమళం!
    అందుకే, ఈసారి ఈ సంగీత ద్వయానికి-రఫీకి వున్న పాటల గురించి ముచ్చటిద్దామని తలపెట్టాను!
    మధ్య మధ్యలో కొంత ఆవేశం పెరిగి, అక్కడక్కడా ఆలాపన చేసినా,
    అది రఫీ మీద, ఆ పాట మీద నాకున్న అభిమానమే కానీ,
    నేనో గాయకుడని, పాడగలనని చెప్పడం దాని ఉద్దేశం కాదు!
    అయినా, ఒక ఆలాపనకి మనస్సు కరిగి,
    మన పెదాలు కదిలితే..
    అది గాత్రం కాదు..
    రమించిన మనస్సు, ఆ గాయకుడికిచ్చే
    ఓ స్వచ్ఛమైన ఆనందపు ఆభరణం. అలంకరణం!
    ఎన్నో గొప్ప పాటలని మనకిచ్చిన ఈ సంగీత మేధావులకు,
    పాడి చెవులని తరిమ్పచేసిన రఫీ గారికి,
    ఎన్ని ఆభరణాలందించిన, మనలో ఎదో అసంతృప్తి మిగిలిపోతుంది!
    సంగీతం మనకిచ్చినది,
    తిరిగి దానికి ఇవ్వగలమా?
    అందుకే రఫీ, ఓ సంగీత కామధేనువు,
    మనకి తీసుకునే స్వేచ్ఛ వుందే కానీ,
    తిరిగి ఇవ్వగలిగే స్తోమత-అర్హత లేవు..

КОМЕНТАРІ • 11