Це відео не доступне.
Перепрошуємо.

నరసింహ శతకం,20వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • శతకకర్త:శేషప్పగారు.వారి రచనలో గూండ్ల నారాయణగారి స్వరంలో.20వ పద్యం.
    సీ. పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి
    దెప్పుడో విడుచుట - యెఱుకలేదు
    శతవర్షములదాక - మితము జెప్పిరి గాని
    నమ్మరా దామాట - నెమ్మనమున
    బాల్యమందో మంచి - ప్రాయమందో లేక
    ముదిమియందో లేక - ముసలియందొ
    యూరనో యడవినో - యుదకమధ్యముననో
    యెప్పుడో విడుచుట - యేక్షణంబొ
    తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన
    దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు.
    భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
    దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
    భావం:-
    ఓ నరసింహా! పంచభూతములతో
    కూడుకున్న ఈ శరీరము విడిచి పెట్టేదెప్పుడో తెలియదు. ఇది నూరేళ్ళు ఉండునందురు గానీ,నమ్మ లేము.బాల్య,యౌవన, కౌమార, వార్థక్యములందేప్పుడో ఒకప్పుడు - ఊరి యందో, ఆడవి యందో, నీటి మధ్యనో ఈ శరీరమును ఏ క్షణములోనైన విడుచుట నిశ్చయము. కనుక ఈ దేహమున్న
    కాలమందే నిన్ను తెలుసు కొనవలెను.
    ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion

КОМЕНТАРІ • 3

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Місяць тому +1

    🙏 ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 Місяць тому

    🙏🙏🙏ఓం లక్ష్మీ నరసింహాయై నమః

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому

    ఓంనమో నారాయణ మః