శ్రీ స్తవం🌺లక్ష్మీ స్తవము🌺ఇళ్ళల్లో ఒకరికి ఒకరు పడకపోతే అలక్ష్మి మొలకెత్తుతుందట!!!

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025
  • 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
    1.లక్ష్మీ అష్టోత్తరం
    • Lakshmi Ashtothram
    2.కనకధార పద్మ
    • Kanakadhara stotramకనక...
    కనకధార MS
    • Kanakadharastavam
    3.మహాలక్ష్మీ అష్టకం
    • Mahalakshmi Ashtakam
    4.అష్టలక్ష్మీ స్తోత్రమ్ సౌమ్య
    • Ashtalakshmi Stotram
    శ్రీ స్తవం - లక్ష్మీ స్తవము - ఇంద్రకృత మహాలక్ష్మీ స్తోత్రం.
    శ్రీ మహాలక్ష్మ్యై నమః(3)
    1.నమామి సర్వలోకానాం-
    జననీం అబ్ధి సంభవామ్|
    శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం-
    విష్ణు వక్షస్థల స్థితామ్||
    2.పద్మాలయాం పద్మకరాం
    పద్మపత్ర నిభేక్షణామ్|
    వందే పద్మముఖీం దేవీమ్
    పద్మనాభప్రియామ్ అహం||
    3.త్వం సిద్ధిః త్వం స్వధా స్వాహా
    త్వం సుధా లోకపావని|
    సంధ్యా రాత్రిః ప్రభా,భూతిః
    మేధా శ్రద్ధా సరస్వతీ||
    4.యజ్ఞవిద్యా మహావిద్యా
    గుహ్యవిద్యా చ శోభనే|
    ఆత్మవిద్యా చ దేవి త్వం
    విముక్తి ఫలదాయినీ||
    5.అన్వీక్షకీ త్రయీ వార్తా
    దండనీతిస్త్వమేవచ|
    సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః
    త్వయై తద్దేవి పూరితమ్||
    6.కాత్వన్యా త్వామ్ ఋతే దేవి
    సర్వ యజ్ఞమయం వపుః|
    అధ్యాస్తే దేవ దేవస్య
    యోగిచింత్యం గదాభృతః||
    7.త్వయాదేవి పరిత్యక్తం
    సకలం భువనత్రయం|
    వినష్టప్రాయ మభవత్ -
    త్వయేదానీం సమేధితమ్||
    8.దారాఃపుత్రాః తథాగార -
    సుహృత్ ధాన్య ధనాధికమ్|
    భవత్ ఏతన్ మహాభాగే
    నిత్యం త్వద్ వీక్షణా నృణామ్||
    9. శరీరారోగ్యమైశ్వర్యం
    అరిపక్ష క్షయః సుఖమ్|
    దేవి త్వద్ దృష్టి దృష్టానాం
    పురుషాణాం న దుర్లభం||
    10.త్వం మాతా సర్వలోకానాం
    దేవదేవో హరిఃపితా|
    త్వయై తద్విష్ణునాచాంబ-
    జగద్ వ్యాప్తం చరాచరం||
    11. మానః కోశం-తథా గోష్ఠం,
    మా గృహం,మా పరిచ్ఛదమ్|
    మా శరీరం,కళత్రం చ త్యజేథాః
    సర్వపావనీ||
    12.మా పుత్రాన్,మా సుహృద్ వర్గాన్,
    మా పశూన్, మా విభూషణం|
    త్యజేథా మమ దేవస్య విష్ణోర్వక్షఃస్థలాలయే||
    13.సత్త్వేన శౌచ సత్యాభ్యాం
    తథా శీలాదిభిర్గుణైః|
    త్యజ్యంతే తే నరాః సద్యః
    సంత్యక్తా యేత్వయామలే||
    14.త్వయావలోకితాః సద్యః
    శీలాద్యైః సకలైర్గుణైః|
    ధనైశ్వర్యైశ్చ యుజ్యన్తే
    పురుషా నిర్గుణా అపి||
    15.సశ్లాఘ్యహ సగుణీ ధన్యః
    స కులీనః స బుద్ధిమాన్ స శూరః
    సచ విక్రాంతో యం త్వం దేవి నిరీక్షసే||
    16.సద్యో వైగుణ్య మాయాన్తి
    శీలాద్యాః సకలా గుణాః|
    పరాన్ముఖీ జగద్ధాత్రీ యస్యత్వం
    విష్ణు వల్లభే||
    17.నతే వర్ణయితుమ్
    శక్తాః గుణాన్ జిహ్వాపి వేధసః(బ్రహ్మ దేవుడు)
    ప్రసీద దేవి పద్మాక్షీ మాస్మాంస్
    త్యాక్షీః కదాచన||
    ఇతి ఇంద్రకృత మహాలక్ష్మీ స్తోత్రమ్
    🙏 • త్రిశక్తి స్తోత్ర పారా...
    timing 14.33 minutes దగ్గర గురువు గారు చదువుతారు.
    www.facebook.c...
    • విష్ణుపురాణాంతర్గత - ఇ...
    గురువు గారి వివరణ must listen 🙏💐
    ఫలశృతి:---
    మైత్రేయునితో పరాశర మహర్షి ఈ విధంగా అంటున్నాడు.
    లక్ష్మీ దేవి క్షీరసాగరం నుండి ఉద్భవించటం, విష్ణువు ని చేపట్టటం, అభిషేకం, లక్ష్మీ నారాయణ కల్యాణం ఇవన్నీ ఎవరైతే వింటారో వారికి వారి గృహంలో
    సంపదలు మూడు తరాల వరకు తరక్కుండా వుంటాయి.అందుకనే తరచూ ఈ ఘట్టాలను వినడం జరగాలి.
    ఈ శ్రీ స్తవము ఎవరి ఇంట్లో చదవబడుతుందో,ఇంట్లో ఒక్కరు చదివినా ఆ ఇంట్లో అలక్ష్మి వుండదు.
    ఇళ్ళల్లో ఒకరికి ఒకరు పడకపోతే అలక్ష్మి మొలకెత్తుతుందట.
    ఒకొక్క సారి ఏమీ కారాణాలు వుండవు, హఠాత్తుగా చిలికి చిలికి గాలివాన ఏర్పడుతుంది.ఎందుకో తెలీదు.అప్పుడు ఏదో కూడనిది ఏదో పాపపు ఫలం వలన అకారణమైన కలహం ఏర్పడి,దాని
    వల్ల ఇంట్లో చికాకులు ఏర్పడుతాయి.
    అన్ని వస్తువులు విసిరేయటం చేస్తుంటారు.అలక్ష్మి ప్రవేశిస్తే ఆ కుటుంబం ఎదగదు.భౌతికంగా ఎదగదు,ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పనే అక్కర్లేదు.
    అలాంటి కలహాలు,అశాంతి ఉన్నట్లైతే ఈ స్తోత్రాన్ని రెండు పూటలా చదివితే ఆ ఇంట్లో ఆ కలహాలతో ఆధారమైన అలక్ష్మి వుండదు.
    వారి ఇళ్ళల్లో,ఒళ్ళల్లో, మనస్సు ల్లో కూడా అలక్ష్మి ఇంక వుండదు.
    • శ్రీ స్తవం🌺లక్ష్మీ స్త...
    www.facebook.c...

КОМЕНТАРІ •