అడుగు కలిపెను గౌరి హరుని యడుగులలో Adugu kalipenu Gowri Haruni adugulalo
Вставка
- Опубліковано 20 січ 2025
- అడుగు కలిపెను గౌరి హరుని యడుగులలో
జడల వేలుపు నటనమాడు సమయములో
లాస్యసుందర కళా లలితరీతుల జూపి…
ఆస్యమున లేలేత నగవు సిరులొలికించి……శశ్యాననము నూత్న చంద్రికల జిగినింప…
దృశ్యమై శివతత్వ దీప్తి యెదుటను నిలువ||
పసపు చాయల చాన పలు భంగిమలను జూపె
విసపుగొంతుక వాని మేన పులకలు బూసె
అసదృశ రసాకృతిగ సామిలో సగమౌచు……..
లసదరుణ చరణాల నాడె షణ్ముఖ జనని||
వ్యాఖ్య -
స్వామివారి ఉద్ధత నాట్యం - తాండవం.
అమ్మవారి లాలిత్య కైశికీ నృత్తం - లాస్యం.
ఈ లాస్య, తాండవాల సమ్మేళనమే జ్ఞానానంద సుధాసారం.
రచన: బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు 🙏💐
✅pa ni sa ga - ga ma pa ni
pa ni sa ga - ga ma pa ni
Sa ni pa ma ga ma gaa
Ni ni Saa - ma ma paa -- ni ni sa
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
✅నీసగస - నిస నిపమ - గమగా
నీస గస - నిస నిపమ - గమపనీ
✅గామ గమ గామ గమ
పసనిపమ గమగా
దృశ్యమై శివ తత్త్వ దీప్తి యెదుటను నిలువ
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Thilang Ragam
S G3M1P N3 S - SN2PM1G3S
Suddha Dhanyasi Ragam
SG2M1 PN2S -SN2PM1 G2S