#women

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • తెలంగాణ పోరాట స్ఫూర్తి చిట్యాల ఐలమ్మ
    డా. అలైఖ్యపుంజాల
    తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల గారు. నాట్యరంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆమె పౌరాణిక, చారిత్రక పాత్రలు ఎన్నింటినో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై ప్రదర్శించారు. తెలంగాణ మహిళ పౌరుషానికి ఐకాన్ గా భావించే చిట్యాల (చాకలి) ఐలమ్మ నృత్యరూపకాన్ని ప్రదర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఐలమ్మ వర్థంతి సందర్భంగా రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించిన నృత్యరూపకం ఐలమ్మ జీవితాన్ని దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందు ఉంచిన తీరు ప్రశంసనీయం. ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ పాత్రను పోషించిన ప్రముఖ నాట్య గురువు అలేఖ్య పుంజాల గారు "చిట్యాల ఐలమ్మ గారి పాత్రను పోషించడం, ఆవిడ మనోభావాలను వ్యక్తం చేయడం నా నాట్యం ద్వారా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను" అంటూ ఉమెన్ టూడే ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పడం ఐలమ్మ గారి స్ఫూర్తిగా మరింతగా పెంచడమే.. పూర్తి ఇంటర్య్యూ చూసి మీ అభిప్రాయాలను రాయండి

КОМЕНТАРІ •