ద్వాదశాదిత్య ఆలయాలు

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • పరమశివునికి కైలాస పర్వతం తదుపరి ప్రీతికరమైన నివాసం వారణాశి లేదా కాశీ. కాశీ నందు విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం, అనపూర్ణాదేవి, విశాలాక్షి శక్తిపీఠం, కాలభైరవ, వ్యాససాశీ , నవదుర్గ ఆలయాలు, విఘ్నాధిపతి అయిన వినాయకునికి వివిధ ప్రాంతాల్లో 56 ఆలయాలు తదితర ఆలయాలు సుమారు 3000 పైబడి ఆలయాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశాదిత్యుల ఆలయాలు ప్రత్యేకం.
    వారణాశిలో గ్రహములకు అధిపతి మరియు ప్రత్యక్షదైవమైన ఆదిత్యుని (సూర్యుని) ఆలయాలు పన్నెండు ఉన్నాయి. లోలార్కాదిత్య (తులసీ ఘాట్), విమలాదిత్య (గోడోలియా), సాంబాదిత్య (సూర్యకుండ్), ఉత్తరార్కాదిత్య (ఆలియాపూర్), కేశవాదిత్య(ఆదికేశవ ఆలయం), ఖక్కోల్కాదిత్య (కామేశ్వర ఆలయం వద్ద), అరుణాదిత్య(త్రిలోచన్ ఘాట్), మయూఖాదిత్య (పంచగంగా ఘాట్), యమాదిత్య (సంకట ఘాట్), వృద్ధాదిత్య(మీర్ ఘాట్), గంగాదిత్య (లలితా ఘాట్), ద్రౌపదాదిత్య(విశ్వేశ్వరాలయం వద్ద) అనుపేర్లతో వారణాశిలో ఉన్న పన్నెండు సూర్య దేవాలయాలు దర్శించి పూజిస్తే శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని తెలుపబడింది
    ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
    దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
    సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
    శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

КОМЕНТАРІ •