వృద్ధాచలం

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • జ్యోతిర్లింగ ఆవిర్భావానికి పూర్వం సృస్టి సమయంలో వృద్ధగిరీశ్వరుడు పర్వతరూపంలో వెలసిన ప్రదేశాన్ని విరుధాచలం, విరుధకాశీ, వృద్ధాచలం అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఉంది.. వృద్ధాచలానికి రైల్వే సదుపాయం ఉంది.. చిదంబరానికి 50 కి.మీ. దూరంలో ఉన్న వృద్ధాచలం రామేశ్వరం యాత్రలో చూడవచ్చు. గోకర్ణ మహాబలేశ్వరాలయం, పిఠాపురంలో కుక్కుటేశ్వరాలయం, తమిళనాడులో అరుణాచలం ఆలయాలతోపాటు కాశీకంటే పురాతనమైన వృద్ధగిరీశ్వర ఆలయాన్ని దక్షణకాశీ, వృద్ధకాశీ అంటారు. శివుడు నటరాజ రూపంలో చిదంబరంనందు నాట్యంచేసిన పిమ్మట సంతోషం తెలియచేయడానికి ఆనంద తాండవం చేసింది వృద్దాచలం అంటారు. వృద్ధగిరీశ్వరుని పూజిస్తే కాశీవిశ్వనాధుడిని పూజించిన దానికన్న ఎక్కువ పుణ్యంవస్తుంది, కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు. అలాగే వృద్ధాచలంలో పుట్టినా, మరణించినా చేసిన పాపాలుపోయి కైలాసప్రాప్తి కలుగుతుంది కాశీలో వృద్ధాప్యం గడుపడానికి ఆర్ధికపుష్టి లేనివారు వృద్ధాచలంలో గడుపుతారు. ఆడవాళ్ళు సుమంగళి జీవితంకోసం వృధ్ధాంబికను పూజిస్తారు. వృద్ధాచలంలో మరణించువారి తల వృధ్ధాంబిక ఒడిలోఉండగా పరమేశ్వరుడు జీవిచెవిలో తారకమంత్రంచెప్పి మోక్షం ఇస్తాడు అంటారు. వుద్ధాచలంలో పుట్టినా, నివసించినా, ప్రార్థించినా లేదా మరణించినా మోక్షం లభిస్తుంది మరణించినవారి చితాభస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనంచేస్తారు.
    బ్రహ్మ సృష్టిలో ముందుగా నీటిని సృష్టించాడని మహావిష్ణువు మధుకైటభులను సంహరించినప్పుడు వారి శరీరభాగాలు నీటిలో తేలియాడాయని కధనం. బ్రహ్మ భూమిని సృష్టించమని శివుడిని ప్రార్ధించాడు.. శివుడు ఒక పర్వతంవలె వెలిశాడు ఆదితెలియక బ్రహ్మ పర్వతాలు సృష్టించి వాటికి చోటులేక విచారించాడు. శివుడు బ్రహ్మకు సత్యాన్ని చెప్పగా బ్రహ్మ పర్వతరూపంలోని శివుని పూజించాడు. శివుడు నీటిలోని మధుకైటభుల శరీరభాగాలు నీళ్ళతో కలిపి భూమిని సృష్టించి తన పర్వతరూపంతో పాటుగా బ్రహ్మ సృష్టించిన పర్వతాలకు స్థానం కల్పించాడు. అరుణాచలంలో వలెనే ప్రతిపౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారి కోరికలుతీరి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
    స్థలపురాణం ప్రకారం విభాసిత మహర్షి వృద్ధగిరీశ్వరునికి సేవిస్తే ఫలితం ఉంటుందని తెలుపగా జనులందరూకలిసి వృద్ధగిరీశ్వరునికి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ప్రజలు ఆలయ నిర్మాణం ప్రారంభించారు. పనిచేసినవార్కి విభాసిత మహర్షి అచ్చటకల మేడిచెట్టు నుంచి కొన్నిఆకులు తుంచి ఇచ్చేవాడు. ఆశ్చర్యకరంగా వారికి ఇచ్చిన ఆకులు నాణేలుగా మారేవి. సుమారు 1700 సంవత్సరముల వయస్సుకలిగిన ఈవృక్షం ఈపుణ్యక్షేత్రంలో ఉన్నది.
    సుందరర్ అనే శివభక్తుడు ఈక్షేత్రంద్వారా వెడుతూ ఈప్రదేశంలో స్వామివారిని స్తుతించాడు. అందుకు సంతోషించిన స్వామివారు స్వయంగా 12 వేల బంగారు నాణేలను ప్రసాదించారు. ఆభక్తుడు తిరువారూర్ వెళ్లాల్సిఉందని మార్గంలో దొంగలభయం ఉన్నదని భయపడ్డాడు. శివుడు నాణేలను మణిముత్తానదిలో వేస్తానని తిరువారూర్ వెళ్లినపిమ్మట అక్కడికొలనులో తీసుకోమ్మని భక్తునికి చెప్పాడు. ఆప్రకారమే సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనునుండి 12వేల బంగారు నాణెములు తీసుకొన్నాడు. విరుదాచలంలోని మణిముత్తా నదిలో నాణాలువేస్తే అవి తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు.
    ఈక్షేత్రమునందు వృద్ధాంబిక ఆవిర్భావముపై కధనమున్నది. వృద్ధాంబిక అనగా పెద్దవయస్సు ఉన్నదేవత. స్వామిభక్తుడైన గురు నమశ్శివార్ అనువారు చిదంబరంవెళ్ళు సమయంలో మార్గమధ్యమునందు ఒకరాత్రి ఇక్కడ విశ్రమించారు. వారు క్షుద్భాదతో యువతి రూపంతో దర్శనంకోరి అంబికాదేవిని ప్రార్ధించాడు దేవి బాలాంబిక రూపంలో దర్శనమిచ్చి ఆతని ఆకలితీర్చినది. ఆలయంలో దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటికోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు.
    ఆలయ సముదాయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవ మూర్తుల ఆలయాలు అయిదుఉన్నవి. స్వయంభూః స్వామి విరుధగిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు అను అయిదు పేర్లతో పిలువ బడుతున్నాడు. ఆలయానికి అయిదు ప్రాకారాలు, అయిదు రధాలు మరియు అయిదు మండపాలు ఉన్నాయి. ఆలయంలో అయిదు నందివిగ్రహాలు ఉన్నాయి. స్వామికి ప్రతిరోజూ అయిదుసార్లు సేవలు చేస్తారు. స్థల పురాణాల ప్రకారం, ఈ ఆలయంలో శివుని భక్తులు అన్ని రకాల శారీరక రుగ్మతల నుండి బయటపడి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆదివారం భైరవుని రాహుకాలంలో వడమాలవెసి పూజించినట్లయిన వారికి జీవితంలో కలుగు కష్టములు తోలుగుతాయని నమ్మకం. ఆలయం లోపల అయిదుమండపములు బయట ఇరవై స్తంభముల మండపం, దీపారాధన మండపం, నూరుస్తంభములతో మండపం, విపచిట్టు మరియు చిత్ర పేర్లతో మండపములు ఉన్నవి. ఈ రకంగా ఆలయానికి మరియు అయిదు అంకెకు సంభంధం ఉన్నట్లు కనపడుతుంది.. ఆలయ సముదాయమునందున్న ఆలయమందు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగమసిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ప్రతిష్టించి పూజించాడని నమ్మకం. శివలింగములకు ఉత్తరంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ప్రముఖమైనది. ఆలయంలో వల్లీ దేవసేన సమేతుడైన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆలయమునందు పైభాగంలో శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారిచక్రం దర్శనమిస్తాయి. ఈరీతిగా అతితక్కువ శివాలయాల్లో చక్రములు కనపడతాయి. సుబ్రహ్మణ్యస్వామివారిని కోరినకోరికలు త్వరగా నెరవేరుతాయని కధనం. శివలింగములకు దక్షణభాగమున వినాయకుడు భూమట్టమునకు క్రిందఉన్న ఆలయంలో కొలువైఉన్నాడు. వినాయకుని సందర్శించడానికి 18 మెట్లుదిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈవిఘ్నేశ్వర ఆలయం దర్శించిన కాళహస్తీలో వినాయకఆలయం జ్ఞప్తికివస్తుంది.
    ఫిబ్రవరి మార్చినెలలో వచ్చు మాఘమాసంలో పదిరోజుల బ్రహ్మోత్సవం పదవరోజున అంబికాదేవిని ఊరేగింపుగా తీసుకు వచ్చి స్వామితో కళ్యాణంచేస్తారు. ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ మరల సాయంత్రం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ తెరచి ఉంటుంది. వృద్ధాచలక్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, అనేకరైళ్లు అందుబాటులో ఉన్నాయి. బసకు హోటల్స్ అందుబాటులో ఉన్నవి.ఉచిత భోజనసదుపాయం లేదు.
    వృద్ధగిరీశ్వర దర్శనం కాశీవిశ్వేశ్వర దర్శనఫలం

КОМЕНТАРІ •