రంతి దేవుడు ఎవరు? | ఎందుకు గొప్పవాడు ..| Moral Stories | నీతి కధలు | Stories in Telugu | రంతి దేవుడు

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • రంతి దేవుడు ఎవరు? | ఎందుకు గొప్పవాడు ..| Moral Stories | నీతి కధలు | Stories in Telugu | రంతి దేవుడు | Storie in telugu |
    రంతి దేవుడు ‘సంకృతి’ అనే మహారాజు కొడుకు. అత్యంత ప్రతిభావంతుడు, ధైర్యవంతుడు, దానగుణం కలవాడు. కడుపేదవారికి తనకున్నది దానం చెయ్యడం రంతి దేవుడికి మహదానందం. తనకున్నదంతయు దానధర్మములు చెయ్యటం వల్ల తన కుటుంబం కడు పేదరికంలో బతకసాగెను. అయిననూ దానధర్మములు మరువలేదు రంతి దేవుడు. దీనితో కుటుంబ సభ్యులు చాలా ఇక్కట్లు పడాల్సి వచ్చేది. చివరకు తనతో పాటు తన కుటుంబానికి 48 గంటల పాటు ఆహారంతో పాటు నీరు కూడా లేని పరిస్తితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ చిక్కి శల్యమై పోయేవారు. రంతి దేవుడు కుటుంబానికి 49 వ రోజు తెల్లవారు జామున నెయ్యి, పాయసం, హల్వా, నీరు లాంటివి లభించాయి. దొరికిన పలహారాలతో భోజనమునకు ఉపక్రమించుబోతుండగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చెను. తమ దగ్గర ఉన్న సంపదను దానం చేయటం సులభం. కాని ఆకలితో నక నక లాడుతున్న సమయంలో తన ముందున్న ఆహారాన్ని వచ్చిన అతిథికి దానం చెయ్యడం చాలా కష్టమైన కార్యక్రమం.నిత్యం శ్రీ హరిని ధ్యానించు రంతిదేవునికి వచ్చిన అతిధి లో కూడా నారాయణుడే కనిపించి తన ముందు ఉన్న ఆహారాన్ని సమర్పించెను. ఆ ఆహారంతో సంతృప్తి చెందిన బ్రాహ్ముణులు వెళ్ళిపోయెను. మిగిలిన ఆహరాన్ని కుటుంబ సబ్యులతో తినడానికి సన్నద్దమవుతుండగా ఆకలి అంటూ మరో వ్యక్తీ వచ్చెను. ఉన్న ఆహరం లో సగబాగం ఆకలితో అలమటించి వచ్చిన ఆ వ్యక్తీకి రంతి దేవుడు దానం చేసెను. ఇంతలో మరో వ్యక్తీ తన కుక్కలను వెంటబెట్టుకుని వచ్చి, రాజా నా కుక్కలు, నేను ఆకలితో అలమటిస్తున్నాం, మా ఆకలి తీర్చండి ప్రభు అనగానే తనదగ్గర ఉన్న మిగిలిన ఆహారాన్ని ఆ వ్యక్తిని, అతని దగ్గర ఉన్న కుక్కలను దైవంగా భావించి సమర్పించెను. తన దగ్గర ఉన్న ఆహారం దానం చెయ్యడంతో కేవలం ఒకరికి సరిపోవు నీరు మాత్రమే తనదగ్గర ఉంది. ఆ నీటితో కడుపు నింపుకోవచ్చు అని ఆశ పడ్డ రంతి దేవుడికి ఒక చండాలుడు వచ్చి, మహారాజా నేను చాలా అలసిపోయాను ...తాగుటకు నీరు ఇయ్యండి అని అడుగగా ...అయ్యో ఈ చండాలుడు ప్రాణం నిలుపుకోవడానికి నీరు అడుగుతున్నాడు అని తలచి, తన నాలుక నీరు లేక పిడచకట్టుకుపోయిననూ తన వద్ద ఉన్న నీటిని ఆ చండాలునికి అందించెను.
    రంతి దేవుని దానగుణం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ రూపం లో వచ్చి పరీక్షించారు. రాజు యొక్క దయార్ద్ర హృదయం గమనించి రంతి దేవుని ముందు ప్రత్యక్షమైనారు. రంతి దేవుడు వారి ముందు ప్రణమిల్లాడు. నీ దయార్ద హృదయం మెచ్చితిమి, ఏమి కావలెనో కోరుకోమని అడుగగా...వారిని ఏమియు కోరలేదు రంతిదేవుడు. నాకు దేనిమీద ఆశ గాని, ఆశక్తి గాని లేదని, చిత్తమును మొత్తంగా ఆ నారాయునికే ఇచ్చెదనని, తన మనసుని అరమోడ్పు కన్నులతో భగవంతునికై లగ్నం చేసి ఆత్మార్పణం చేసెను. అంతటి దానగుణం గల రంతిదేవుని గురుంచి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    *************************************************************************************
    #moralstories
    #childrenstorieswithamoral
    #moralstory
    #telugukadhalu
    #stories
    #telugu
    #story
    #storyintelugu
    #rantidevudu
    #sanskrti

КОМЕНТАРІ • 4