నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ || NADIPINCHU || Telugu Old Christian Song || Arun Mylapilli
Вставка
- Опубліковано 13 жов 2024
- #Arun #mylapilli #Neelifechurch
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //