శబరిమల అయ్యప్పస్వామి

Поділитися
Вставка
  • Опубліковано 29 лип 2024
  • అయ్యప్పస్వామి నివాసం కేరళరాష్ట్రంలో ప్రస్దిద్ధిచెందిన శబరిమల అనబడు శరిమలైక్షేత్రం. మనదేశమందు ఏకైక అయ్యప్ప దివ్యక్షేత్రం శబరిమల. శబరిమలనందు అయ్యప్పస్వామిని దర్శించు విధానం తెలియని వారుండరు.
    ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి నలభైరోజుల మండలదీక్ష తీసుకొని బృందాలుగా, విడిగా దీక్షావస్త్రములతో మరియు ఇరుముడులతో అయ్యప్పస్వామిని దర్శిస్తారు.. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపినభక్తులు స్వామి సన్నిధాన సందర్శనంతో దీక్ష విరమిస్తారు. జనవరి 14 వ తేదీ అనగా సాధారణంగా మకరసంక్రాంతిరోజూ కొండపై మకరజ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్నిరోజులు గుడిని మూసేఉంచి ప్రతీ మలయాళ నెలలో ఐదురోజులు తెరచియుంచుతారు.
    అయ్యప్పను అందరు మగవారు మరియు 10 సంల నుండి 40 సం లోపు ఆడవారు తప్ప మిగిలినవారు అయ్యప్పను దర్శించుటకు అర్హులు. శివకేశవుల ప్రతిరూపం అయ్యప్ప శైవులకు మరియు వైష్ణవులకు ఇరువురకు ఆరాధ్యదైవం. మహిషి అనురాక్షసి బ్రహ్మగురించి ఘోరతపస్సు చేసి మహిషి శివుడికి, విష్ణువుకు పుట్టిన సంతానంతప్ప తననెవరూ జయించరాదని, హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలో రాజువద్ద సేవాధర్మం నిర్వర్తించాలని, అట్లు రాజును సేవించకపోతే అతడుకూడా తనాచేతిలో ఓడిపోవాలిఅని వరంకోరింది. మహిషి కొరిన వరాన్ని బ్రహ్మ ప్రసాదించాడు. బ్రహ్మనుండి పొందిన వరంతో మహిషి జనులను, ఋషులను బాధించసాగింది.
    పిమ్మట దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మధించినప్పుడు హాలాహలం, లక్షీదేవి, ఐరావతం క్షీరసాగరంనుండి వెలువడ్డాయి. చివరిగా అమృతం ఉద్భవించింది. అమృతంకోసం దేవదానవులు కలహించినప్పుడు శ్రేహరి అమృతం పంచుటకు ధరించిన మోహినిని చూసి విష్ణువని మరచి, శివుడు ఆమెను మోహించి ఆమెవెనుక పరుగెత్తాడు. జగన్మోహిని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ర్యాలి గ్రామంచెరి విగ్రహం రూపు దాల్చిందని కధనం. ఆవిగ్రహం శ్రీజగన్మోహినీ కేశవస్వామిగా రూపుదాల్చింది. ఆకధనం వివరంగా శ్రీజగన్మోహినీ కేశవస్వామి ఆలయ వీడియోనందు వివరించబడింది.
    మహావిష్ణువు మొహినిరూపం చూసి శివుడు ఆకర్షింప బడటంవల్ల శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసమందు శనివారం, పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చికలగ్నంలో అయ్యప్ప పంబా నదీతీరంలో మణిమాలతో శిశువుగా అవతరించి సంతానంలేని శివభక్తుడైన పందళరాజు,రాజశేఖరునిచే రాజభనంలో రాణివద్దకు చేర్చాడు. మణిహారం మెడలో వేసుకొని అవతరించిన మణికంఠుని జనులు ‘అయ్యా’ అని ‘అప్పా’ అని పిలువసాగారు. అయ్యప్ప రాజభవనం చేరినపిమ్మట రాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. విధ్యాభ్యాసం పిమ్మట అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు భావించాడు. రాణి తనతలనొప్పికి పులిపాలు కావాలని వైద్యులద్వారా చెప్పించింది. అయ్యప్పతాను తెస్తానని అడవికివెళ్ళాడు అయ్యప్ప గేదెరూపంలోని మహిషితోయుద్ధంలో మహిషిని పైకెత్తి నేలపై విసిరికొట్టాగా గేదె రూపంలోని మహిషి మరణించింది. అయ్యప్ప ఇంద్రుడు మరియు ఇతర దేవతలకు తాను పులిపాలకోసం అడవికి వచ్చానని. చెప్పగాదేవతలు పులిరూపాలు ధరించాడు..ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు,
    పులుల దండుతో అయ్యప్ప రాజ్యం చేరిన అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనిరాజు అనుకొంటే మణికంఠ రాజ్యాన్ని త్యజించి. తన విల్లునుండి బాణం వదలి బాణంపడిన ప్రదేశంలో తనకు ఆలయాన్ని నిర్మించమని కోరాడు. ఆవిధంగా తెలిపి అయ్యప్ప మకర సంక్రాంతిరోజు జ్యోతిరూపంలో అంతర్ధానం ఆయ్యాడు. శబరిమల కొండలపై జ్యోతి రూపంలో దర్శనమిస్తున్న అయ్యప్ప దర్శనానికి మకర సంక్రాంతి రోజు దేశవిదేశాలనుండి భక్తులు శబరిమల చేరుకుంటారు. శబరిమలలో ఉన్నది అప్పుడు నిర్మించిన ఆలయమందే పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
    అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో చిన్నగుడిలో మలిక్కిపురమ్మ కొలువై ఉంది. అయ్యప్ప పందళం రాజభవనంలో పెరిగి 12 సంవత్సరాల వయస్సులో మాలికాపురతమ్మను పందళం రాజాకుటుంబానికి దేవతగా ఆరాధించాడు. మాలికాపురతమ్మ మదురై మీనాక్షిదేవి రూపం.. ఆమె ముందుపేరు లీల. ఆమె అయ్యప్పను ప్రేమించింది. కన్యస్వామితనఆలయాన్ని సందర్శించడంలో విఫలమైనప్పుడు తాను వివాహం చేసుకుంటానని అయ్యప్ప చెప్పేడు. తొలిసారి దీక్షతీసుకొన్న కన్నెస్వాములు అనబడువారు తెచ్చిన బాణంవంటి పుల్లని దారిలో "శరమ్ గుత్తి" అనేచోట ఉంచుతారు ఏటా వేలాదిగా కన్నెస్వాములు వస్తున్నా అమ్మవారి కోరిక నెరవేరడం లేదు.
    దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. భక్తులు 41 రోజులు దీక్షలుచేసి గురుస్వామి నేతృత్వంలో బృందంగా తలపై ఇరుముడి కిట్టు ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది.. దృఢమైన నియమాలతో మధ్య మాంస ధూమపానం వ్యసనాలకు దూరంగా ఉండాలి. శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలివద్ద "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప ధనుర్బాణ ధారియై ఉంటాడు.ఇక్కడ గణపతి కూడా ఉంటాడు. ఈయననే "కన్నెమూల గణపతి" అంటారు.
    భక్తులు పంబానదిలో స్నానంచేసి, తలపై "ఇరుముడి" పెట్టుకుని, శరణుఘోష చేస్తూ "నీలిమలై" అనే కొండమార్గం ద్వారా ఏడు కిలోమీటర్లు నడిచి అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు. తొలిసారి దీక్షతీసుకొన్న కన్నెస్వాములు అనబడువారు తెచ్చిన బాణంవంటి పుల్లని దారిలో "శరమ్ గుత్తి" అనేచోట ఉంచుతారు. దీక్షను స్వీకరించిన భక్తులు, తలపై ఇరుముడి ధరించి పాడు నెట్టంబడి" అని పిలువబడే 18 మెట్లను అధిరోహించి అయ్యప్ప సన్నిదానం చేరతారు.. సన్నిధానంలో "పానవట్టం"పై అయ్యప్ప కూర్చున్న భంగిమలో దర్శనమిస్తాడు. నైవేద్యాలను తలపై మోయడానికి నేతగుడ్డతో రెండుమూటల ఇరుముడిలో కొబ్బరికాయలతో పాటు భక్తులు తాముతెచ్చిన నేతితో అయ్యప్ప విగ్రహంపైపోసి అయ్యప్పకు నేయ్యాభిషేకం చేసి అర్చిస్తారు అయ్యప్ప స్వామి కూర్చున్న భంగిమ శివలింగ రూపంలో కనిపిస్తుంది మరియు వంగిఉన్న ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుంది. శివుడు మరియు విష్ణువుల కుమారుడైన అయ్యప్పదర్శనం పరమశివుని మరియు మహావిష్ణువులను ఏకకాలంలో దర్శించగలగమే.
    స్వామియే శరణం అయ్యప్ప

КОМЕНТАРІ •