శ్రీ మద్ది ఆంజనేయస్వామి

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • శ్రీరాముడు పట్టాభిషేకం పిమ్మట పాదాలవద్ద ఆంజనేయతో మాత్రమే ఆలయాల్లో దర్శన మిస్తాడు.ఆంజనేయుడు శ్రీరాముని ప్రధమ భక్తుడు. ఆంజనేయుని అనుగ్రహం ఉన్నట్లయిన దుష్టగ్రహాల భాధలనుండి విముక్తి పొందవచ్చని, నవగ్రహ బాధల నుండి రక్షణపొంది జీవితం ఆనందదాయకం అవుతుందని నమ్మకం. అరుదైన స్వయంభూః ఆలయాల్లో ప్రముఖమైనది పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామలో ఎర్రకాలువఒడ్డున అర్జునవృక్షం అనబడు తెల్లమద్దిచెట్టులో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం. ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం రహదారిలో 48 కిలోమీటర్లు దూరంలో, జంగారెడ్డిగూడెం పట్టణానికి కేవలం 4 కి.మీటర్ల ముందు ఈక్షేత్రం ఉంది. ఏలూరునుండి గాని రాజమండ్రినుండి జంగారెడ్డిగూడెం బస్సులో గురువాయిగూడెం చెరవచ్చు. సమీపంలో జంగారెడ్డిగూడెంనందు వసతి భోజన సౌకర్యాలు లభ్యం. ఆలయంలో సంప్రదాయదుస్తుల నిబంధనలేదు. ఆలయంలో ఫోటోలు వీడియోలకు అనుమతిస్తారు.
    పురాణాలన్నిటిలో ఆంజనేయుని రామభక్తునిగా దివ్యకధకు రూపంగా భక్తవరదునిగా ప్రస్తావించబడింది. ఆంజనేయునికి హనుమంతుడు, అంజనీపుత్రుడు, పవనపుత్రుడు మొదలైన పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామపట్టాభిషేకం పిమ్మట వానరులు అందరూ ఒకరొకరుగా అయోధ్యవదలి వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా హనుమంతుని వద్దకు వచ్చుసరికి రావణునివల్ల అపహరించబడ్డ సీతను వెదకు ప్రయత్నంలో సీతాజాడ కనుగొని తెలుపటంలో ఆంజనేయుడు చేసినసేవకు సంతోషించి శ్రీరాముడు వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు హనుమంతుడు జనులు ఈభూమిపై శ్రీరామచరిత పారాయణ జరుపుతున్నంతకాలం శ్రీరామునితోపాటు జనుల మనస్సులో నిలచిఉండేటట్లు అనుగ్రహించమని కోరాడు. శ్రీరాముడు అనుగ్రహించి సృష్టి నిలచిఉన్నంత కాలం చిరంజీవిగా వర్ధిల్లమని దీవించాడు.ఆవిధంగా ఆంజనేయుడు చిరంజీవిగా వరం పొందాడు. ద్వాపరయుగంలో అటుపిమ్మట కలియుగంలో ఆంజనేయుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ జనులకు ధైర్యం సుఖసంపదలు కలుగజేస్తున్న ప్రత్యక్ష భగవంతుడు.
    పురాణాల ప్రకారం యుగాలనుండి నిలచిఉన్న చిరంజీవి ఆంజనేయస్వామి. యుగాలనుండి స్వామిసేవలో లీనమైన ఆంజనేయునితోపాటు మద్వాసురుడను రాక్షసుని చరిత్ర స్వామివలె చిరస్మరణీయం. త్రేతాయుగంలో మధ్వాసురుడు రావణసైన్యంలో ఒకరాక్షసుడు.తాను కత్తిపట్టనని, జీవహింస చేయను ఆనేవాడు. అందువల్ల రావణుడు మధ్వాసురునిపై తీవ్రఅగ్రహం వ్యక్తంచేసేవాడు. మద్వాసురుడు ఆధ్యాత్మిక చింతనతో శివుడిని చేరుకుంటామని బోధించేవాడు. ఆంజనేయుడు సీతాదేవిని అన్వేషిస్తూ లంకకువచ్చి లంకాదహనం చేసినప్పుడు ఆయన బుద్ధికుశలత శక్తిసామర్ధ్యాలు తెలిసి పరోక్షంగానే ఆంజనేయుని భక్తుడయ్యాడు. నిరంతరం హనుమంతుని నామాన్ని జపించీనా ఆంజనేయుని ప్రత్యక్షముగా చూడలేక పోయాడు. రామరావణ యుద్ధంలో రావణుని ఆజ్ఞప్రకారం మధ్వాసురుడు ఆంజనేయస్వామితో యుద్ధం చేయవలసివచ్చి స్వామితో యుద్ధానికి ఇష్టపడక మధ్వాసురుడు అస్త్రసన్యాసం చేసి, హనుమనామం జపిస్తూ ఆత్మత్యాగం చేశాడు
    మద్వాసురుడు ద్వాపరయుగంలో మద్వకుడు అనుపేరుతో జన్మించి కౌరవ పాండవుల యుద్ధంలో కౌరవుల తరపున పోరాడవలసి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపైఉన్న విజయపతాకంపై ఆంజనేయుని చిత్రంచూసి పూర్వజన్మ జ్ఞప్తికివచ్చి యుద్ధం చేయడానికి ఇష్టపడక ప్రాణత్యాగం చేశాడు. పిమ్మట కలియుగంలో ఆటవీప్రాంతంలో గురువాయి గూడెంవద్ద మద్యుడనుపేరుతో జన్మించి మధ్వాసురుడు సమీపంలోని ఎర్రకాలువలో స్నానంచేసి కాలువగట్టుపై ఆశ్రమంలో నివసిస్తూ నిత్యం ఆంజనేయ జపం చేసేవాడు. స్థానికులు ఆతనిని మధ్వమహర్షి అనేవారు. వయస్సుమీరి వృద్ధుడైన మధ్వుడు నడవలేక పోయేవాడు. మధ్వుడు ఒకరోజు స్నానం చేయడానికి కాలువకువెళ్ళి కాలువలో పడిపోయాడు. అప్పుడు ఒకవానరం ఆతనిచేయి పట్టుకొని ఆశ్రమం తీసుకువచ్చి సపర్యలుచేసి పళ్ళుపెట్టింది. అప్పటినుండి ప్రతిరోజూ వానరం స్నానసమయంలో అతని చేయిపట్టుకుని సపర్యలుచేసి, ఆహారంగా పండ్లుపెట్టేది. ఈవిషయం గమనించకనే మధ్వుడు తనజపం కొనసాగించేవాడు.
    పిమ్మట మధ్వుడు దివ్యశక్తితో ఆవానరం హనుమంతుడని గ్రహించి తనఅజ్ఞానానికి మన్నించమని వేడుకున్నాడు. వానర రూపంలోఉన్న ఆంజనేయుడు మధ్వునికి నిజరూపంలో ధర్శనంఇచ్చి మధ్వునికి సేవచేయడంతో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఆంజనేయుడు మధ్వుని వరం కోరుకోమన్నాడు. మధ్వుడు స్వామితో తాను విడచి ఉండలేనని, ఆయనతో ఉండేటట్లు వరం ప్రసాదించమని కోరాడు. ఆంజనేయుడు సరేఅని అంగీకరించి మధ్వుడు అర్జున (మద్ది) వృక్షంగా రూపుదాల్చితే వృక్షంకింద శిలారూపంలో వెలుస్తానని చెప్పాడు. ఆప్రకారం మధ్వుడు అర్జునవృక్షంగా (తెల్ల మద్దిచెట్టు) మారాడు. ఆంజనేయుడు ఓచేతిలో పండు, మరోచేతిలో గదతో అడుగుముందుకు వేస్తున్నట్లు నిలబడిన భంగిమలో స్వయంభూఃగా వెలిశాడు. మోకాల్లవరకే ఈవిధంగా దర్శనమిచ్చు స్వామిరూపం ఎక్కడా కనపడదు.
    సుమారు వేయి సంవత్సరాలకు పూర్వం మద్ధిచెట్టు తొర్రనందు వెలసిన స్వామికి ఈప్రదేశంలో మద్దిచేట్టే గోపురంగా ఉంది. ప్రత్యేకంగా ఆలయ గోపురం నిర్మించడం, మద్దిచెట్టు తొలగించడం చేయకుండా సుమారు ఏభై సంవత్సరాలకు పూర్వం గర్భగుడి నిర్మాణం చేశారు. హైదారాబాద్ ప్రధాన రహదారిపై జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరువలో ఉండటంవల్ల భక్తుల తాకిడిఎక్కువ. నిత్యం ఆలయం దర్శించే భక్తులు అధికమై దేవాదాయ దర్మాదయశాఖవారు ఆధీనంలోకి తీసుకొన్నారు.
    శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు శివునివలెనే భక్త సులభుడు భక్తవరదుడు. సింధూర ప్రియుడు. స్వామిని దర్శించి అర్చించిన శని, రాహు, కేతు గ్రహబాధలు, నవగ్రహ దోషాలు సమసిపోయి కోరిన కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. భక్తులు మంగళవారం మరియు శనివారం రోజులలో ప్రధాన మండపం చుట్టూ 21 ప్రదక్షణలు చేస్తారు. స్వామికి న తమలపాకుల అర్చన ప్రీతికరం. కోరికలు నెరవరిన పిమ్మట మరల స్వామినిదర్శించి మ్రొక్కులు తీర్చుకొంటారు. ఆలయం ఉ6:00 నుండి మ 1:00 వరకు మరల సా 3:00 నుండి రాత్రి 8:30 వరకు,తెరచి ఉంటుంది. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన మంగళవారం ఉ 5:00 గం నుండి రాత్రి 8-30 వరకు స్వామి దర్శనం లభిస్తుంది.
    శ్రీరామరామ రామేతి రమేరామ మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
  • Ігри

КОМЕНТАРІ •