శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రూపంలో మహావిష్ణువు శివునితో కలసి ఒకే సింహాసనంపైన శివునిచే పూజకు అనర్హునిగా శాపానికి గురైన బ్రహ్మ క్రింది అంతస్తు గర్భగుడిలో పై తాంతస్తు దర్శనమిచ్చే క్షేత్రం అన్నవరం. శ్రీరాముడు క్షేత్రరక్షకునిగా నిలవడం విశేషం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి మీసకట్టుతో దర్శనం ఇవ్వడం మరో ప్రధాన విశేషం.
    శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయం అన్నవరం పట్టణంలో పంపానది ఒడ్డున రత్నగిరి కొండపై ఉంది. కొండదిగువనుండి 380 మెట్లమార్గం ద్వారా లేదా సుమారు 2 కి.మీ రోడ్డు మార్గంద్వారా నడచి ఆలయం చేరుకోవచ్చు దేవస్థానంవారి ఉచిత బస్సు సర్వీసు రైల్వే స్టేషన్ నుండి ఆలయంవద్దకు నడుపబడుచున్నది. బసనిమిత్తం దేవస్థానం వారి సత్రములు, కాటేజీలు ఉన్నవి. దేవస్థానంవారిచే భక్తులకు అన్నప్రాసాద వితరణ ఉన్నది. మధ్యతరహానుండి ఉన్నతశ్రేణి హోటల్స్ కలవు.స్వామిప్రసాదం ఎర్ర గోధుమనూకతో తయారు చేస్తారు. ప్రసాదం ఆకులలో మాత్రమే ప్యాక్ చేయబడుతుంది.
    హిందువులు తాముతలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తిఆగుటకు పని ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుని పూజిస్తారు. అలాగే ప్రతి శుభకార్యం పూర్తిఆయిన పిమ్మట సత్యన్నారాయణ వ్రతం చేయడంద్వారా శ్రీ సత్యనారాయణస్వామిని పూజించాలని అట్లు పూజించిన స్వామి సిరిసంపదలు ఆయురారోగ్యములు ప్రసాదిస్తాడని పురాణాల్లో చెప్పబడింది. ఆలయం నాలుగుమూలల చక్రాలుకలిగిన రథాన్ని పోలిఉంటుంది. రెండు అంతస్తుల గర్భగుడిలో ప్రధానద్వారానికి బంగారుపూత పూయబడింది. ఈప్రాంతం నిరంతర ఆహారఉత్పత్తికి ప్రసిద్ధి చెందిందని అందువల్ల అన్నం (ఆహారం) వరంగా పొంధి ఉండుటవల్ల అన్నవరంగా పిలుస్తారని నానుడి. మరొవివరణ ప్రకారం స్వామి భక్తులు అనుకొన్నకోరిక వరంగా ఇస్తాడని నమ్మకంవల్ల అన్నవరం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా భక్తులు సందర్శిచుట ద్వారా ఆధిక ఆదాయంకల ఆలయాల్లో తిరుమల శ్రీనివాసుని ఆలయం మొదటిది అన్నవరం శ్రీ సత్యన్నారాయణస్వామి ఆలయం రెండవది.
    పురాణ కధనంప్రకారం అన్నవరం గ్రామం పక్కఉన్న కొండ మేరు పర్వతమని, మేరువు అతని భార్య మేనక తపస్సుచేసి మహావిష్ణువు నుండి వరంగా ఇద్దరు కుమారులను పొందారు. ఒకరు భద్రుడు రెండోవాడు రత్నాకరుడు. బధ్రుడు తన తపస్సుతో మహావిష్ణువు అనుగ్రహంతో శ్రీరాముని శాశ్వత నివాసమైన భధ్రాచలం కొండగా స్థిరపడ్డాడు. రత్నాకరుడు సోదరుడిని అనుసరించి తపస్సుద్వారా విష్ణువు అనుగ్రహంపొంది వీరవెంకట సత్యనారాయణస్వామి నివాసస్థానం రత్నగిరిగా స్థిరపడ్డాడు. రత్నగిరి కొండలలో శ్రీకృష్ణదేవరాయలు కళింగరాజులపై దండయాత్ర చేసిన సమయంలో శత్రువులపై దాడిచేయడానికి కొండలలోని రహస్య మార్గాలను ఉపయోగించారని అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు నందు ఈకొండ గుహాలలో అనుచరులతో పాటు రహస్యనివాసాలు ఏర్పాటు చేసుకొన్నాడు. రత్నగిరి కొండపై సత్యన్నారాయణస్వామి ప్రధాన ఆలయంతో పాటుగా సమీపంలో క్షేత్రపాలకుడు శ్రీరాముడు, వనదుర్గ, కనకదుర్గ ఆలయాలున్నాయి. కొండ దిగువన గ్రామదేవత "నేరెల్లమ్మ" ఆలయం ఉంది.
    సుమారు నూట ఏభై సంవత్సరాలకు పూర్వం ఈరంకి ప్రకాశంఅనే బ్రాహ్మణునికలలో సత్యన్నారాయణస్వామి కనిపించి, తన విగ్రహాన్ని పూజ చేయకుండానే కొండపై వదిలేశారని, దానిని కనుగొని ప్రతిష్ఠించమని చెప్పారని బ్రాహ్మణుడు ఆ విషయం జమీందార్ శ్రీ రాజా I.V. రామరాయణంకి తెలియజేసి పిమ్మట గ్రామస్తులతో వెదకి కొండపైఉన్న విగ్రహంకనుగొని శ్రావణ శుద్ధ విదియనాడు పూజించి, ప్రతిష్టించారు సుమారు 130 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఆలయం సుమారు తొంభై సంవత్సరములకు పూర్వం పునర్నిర్మించబడి తరువాత కాలంలో శిధిలావస్థకు చేరుకొన్నప్పుడు సుమారు పది సంవత్సరములకు పూర్వం మరలా పునర్నిర్మాణం జరిగింది.
    ఆలయం రెండుఅంతస్తుల గర్భగుడిలో దిగువ గర్భగుడిలో పాదభాగం బ్రహ్మదేవుడు పైఅంతస్తు గర్భగుడిలో విష్ణువును సూచిస్తు 13 అ సత్యన్నారాయణస్వామి సహచరిణి అనంతలక్ష్మీ సత్యవతి మరియు శివుడుతో దర్శనమిస్తారు. చాలా క్షేత్రాలలో శివకేశవుల ఐక్యతను సూచించే ఆలయాలు ఉన్నాయి. సత్యన్నారాయణస్వామి ఆలయంలో శివుడు పూజార్హత నిషేధించిన బ్రహ్మనుకూడా శివకేశవులతో రెండు గర్భగుదులలో పూజిస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కలసిఉండు ఒకేఆలయంలో ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ఆలయం మొదటి అంతస్తు మధ్యలో సత్యనారాయణస్వామి మూలవిరాట్ ఎడమవైపు అనంతలక్ష్మీ సత్యవతి, కుడివైపున శివుడు ఉంటారు. విగ్రహాలు అందంగా బంగారు రేకుతో తాపడం చేయబడి ఉంటాయి.
    మూలతో బ్రహ్మ రూపాయ మధాయథాశ్చ మహేశ్వరం
    అగ్రతః విష్ణురూపాయ త్రైక రూపయతేనమః"
    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామి గర్భగుడిలో భక్తులను అనుగ్రహించు రూపం వివరిస్తూ చక్కటి అనుగ్రహ భాషణం తెల్పినారు. సత్యన్నారాయణ స్వామి ఎడమవైపు త్రిశక్తులు అయిన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి తల్లి పరమభట్టారిక అయిన శక్తిస్వరూపిణి అనంతలక్ష్మీ సత్యవతి నిలబడి ఉంటుంది. స్వామి భక్తులను రక్షిస్తానని ఎడమచేత్తో ధనస్సు కుడిచేత్తో బాణంపట్టుకొని అభయముద్ర కలిగి ఉంటాడు. స్వామి కుడిప్రక్క పరమశివుడు దర్శనమిస్తాడు. రెండు అంతస్తులలో క్రింది అంతస్తులో యంత్రం మరియు భగవంతుని పీఠం ఉన్నాయి. యంత్రానికి నమస్కరిస్తూ ప్రదక్షణం చేస్తూ యంత్రానికి నాలుగువైపులా పంచాయతన దేవతలైన గణపతి, సూర్యుడు,, బాలా త్రిపుర సుందరి, మహేశ్వరులను దర్శించవచ్చు.
    ఆలయంలో చైత్ర శుద్ధ పాడ్యమి, నవమినాడు సీతారామ కల్యాణం, శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీ కృష్ణ జయంతి. శ్రావణ శుద్ధ విదియనాడు సత్యన్నారాయణస్వామి జయంతి. భాద్రపదంలో గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, వైశాఖ శుద్ధ పంచమినాడు కనకదుర్గ జాతర. కార్తీక శుద్ధ పూర్ణిమనాడు గిరిప్రదక్షిణం, కార్తీకమాసంలో జ్వాలాతోరణం జరుపుతారు.
    శ్రీ సత్యనారాయణస్వామి స్వయంభూః విగ్రహం భక్తులచే కనుగొనబడిన పవిత్ర ప్రదేశం సమీపంలోఉన్న క్షేత్రపాలకుడు శ్రీరాముని మందిరం. ఉన్నది. సత్యదేవుని అన్నిరోజులలో ఉదయం 5-00 నుండి మధ్యాహ్నం 12-00 వరకు తిరిగి సాయంత్రం 5-00 నుండి రాత్రి 9-00 వరకు దర్శనం లభిస్తుంది.
    సత్యదేవ దర్శనం సర్వాభీష్టప్రదం
  • Ігри

КОМЕНТАРІ •