దృవ చరిత్ర 8 | Solid history 8 | Dhruva Story | EducationalContent | MoralValues | DhruvaNakshatra
Вставка
- Опубліковано 4 лис 2024
- దృవ చరిత్ర - 8 | Solid history - 8 | Dhruva Story | | Educational Content | DhruvaNakshatra | Dhruva Story | Inspiring Tales | Mythology For Kids | Educational Content | Moral Values | Dhruva Nakshatra | Indian Mythology | Kids Entertainment |
దేవేంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దృవుడు అచంచలమైన దీక్షతో తపస్సు చేస్తున్నాడు.ఎండాకాలంలో తీవ్రమైన వేడిగాలులకు భాధపడలేదు. వర్షాకాలంలో వచ్చే పిడుగుల కుంబ వృష్టికి చలించలేదు. విపరీతంగా మంచు కురుస్తున్నా, ఎముకులను కోరికేస్తున్నా తపస్సు చేసే ప్రాంతం నుంచి దృవుడు కదలలేదు. ఇలా తపస్సు చేయగా చేయగా గదాధరుడు, శంకుచక్ర గదాఖడ్గదారి, పీతాంబరుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి గరుడ వాహన రూడుడై ద్రువుని ముందు ప్రత్యక్షమౌతాడు. దృవుని ఆనందానికి హద్దుల్లేవు. ఉబ్బి తబ్బిబై సాష్టాంగ ప్రణామం చేసి తన రెండు చేతులను జోడించి అరమోడ్పుకన్నులతో నమస్కారం చేసాడు. భగవంతుని దివ్యమంగళ రూపాన్ని తాకుతున్నట్టు, కౌగాలించుకున్నట్టు, ముద్దు పెట్టుకున్నట్టు భావించాడు దృవుడు. భవంతుని ముందు నిలబడి అలా చూస్తూ తన్మయం పొందాడు. తను ఎంతగానో తపించే భగవంతుని స్తుతించాలని దృవునిమనస్సు ఉవ్విళ్ళు ఊరుతోంది. కాని అయిదేళ్ళ ఆ పసివాడికి భగవంతుని ఎలా స్తుతించాలో అర్ధం కావటం లేదు.
విష్ట్నుదేవుడు కరుణించి తన పాంచజన్యశంఖాన్ని ఆ పసివాడి చెక్కుళ్ళకు తాకించాడు. దృవుడి లో దైవ వాణి పెల్లుబికింది. ప్రభూ! సమస్త శక్తులకు అధారుడివైన నీవు నా అవయువాలకు ప్రాణం పోసి చైతన్యం కలింగించిన నీకు నమస్కారాలు. ఈ ప్రపంచం నీ వల్లనే పుట్టి నీలోనే లీనమైపోతోంది.సృష్టి, స్తితి, లయాలు లేని నేవే సమస్త బ్రహ్మాండానికి మూల కారకుడివి. నాట్యాచారుని వలే అనేక రూపాలతో, వివిధ రకాల పేర్లతో నీవు ప్రకాశిస్తున్నావు. ధనికుదని, దరిదృడివని , తేడా లేకుండా భక్తుడైన వాడికి సహాయపడతావు. నీకు ఆది మద్యంతాలు లేనే లేవు. నీ శక్తి అనంతం అంటూ భగవంతుని స్తుతించాడు దృవుడు.
దృవుడి శ్రద్దాశక్తులకు, పట్టుదలకు మెచ్చుకుని సంతోషిస్తూ! వత్సా! నీ తపస్సు నాకు ఎంతో సంతృప్తి ని ఇచ్చింది. నీ మనస్సులో ఏమి సంకల్పించుకున్నావో నాకు తెలుసు. ఏమి కావాలనుకుని ఈ తపస్సు చేసావో నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను అడగను . నీవు కోరిన సర్వోన్నతమైన స్తానం చాలా దుర్లభమైనది. అయినప్పటికీ దానిని నీకు అనుగ్రహిస్తాను. ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వని, లభించని దృవపదం నీకు ఇస్తాను . దాని చుట్టూ గ్రహాలూ, నక్షత్రాలు సదా తిరుగుతుంటాయి. ప్రయకాలంలో ఇతర లోకాలన్నీ నశించిపోయినా దృవ లోకం మాత్రం స్తిరంగా ఉంటుంది.నక్షత్రాలతో పాటు యముడు, కశ్యపుడు, ఇంద్రుడు, సప్తర్షులు దానికి ప్రదక్షిణం చేస్తారు. కాని ఆ స్తానం నీకు లభించడానికి తగిన సమయం రావాలి.నీవు మీ తండ్రి వద్దకు వెళ్ళు నాయనా!మీ తండ్రి అనంతరం రాజ్య సుఖాలను అనుభవించు.వార్ధక్యం వచ్చాక నీ కుమారుడికి రాజ్యం అప్పగించి నన్ను ప్రార్ధించు సప్తర్షి మండలం మీద ఉన్న నా దివ్య స్తానాన్ని చేరుకుంటావు. అని చెప్పి బగవంతుడు మాయమైపోతాడు.
శ్రీ మహావిష్ణువు ద్రువుడికి ప్రత్యక్షమైన సంగతి మధువనంలో ఉన్నవాళ్ళందరికీ తెలిసిపోతుంది.వారంతా అతడిని ఎన్నో విధాలా అభినందించారు.దృవుడు ఆచూకి తెలుసుకోవడానికి దేశమంతా తిరుగుతూ ఆ ప్రాంతానికి వచ్చిన ఉత్తానపాదుని అనుచరులకు కూడా ఈ సమాచారం తెలిసింది.వారు వెంటనే ఉత్తానపాద మహారాజుకి ఈ విషయం తెలియజేస్తారు. దృవుడు తిరిగి రాజ్యానికి వస్తున్నాడనే వార్త ఆరిపోతున్న దీపానికి నూనెలా ఉత్తానపాద విషయంలో పనిచేస్తుంది. దృవుడు వెళ్ళిన నాటి నుంచి దుఃఖసముద్రంలో మునిగి ఉన్న రాజు అనుచరుల మాటను నమ్మలేదు. ఎప్పుడో ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయిన పసిబాలుడు ఇంతకాలం జీవించి ఉంటాడని ఆయన అనుకోలేదు.కాని ఇంతలో అతనికి నారదమహర్షి చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చినది.మహారుషుల మాట ఎన్నడూ అబద్దం కాదు కదా! వెంటనే లేచి మంచి గుర్రాలు కట్టిన బంగారు రధం ఎక్కి దృవుడికి ఎదురుగా బయలుదేరాడు. మంత్రులు, సామంతులు, పురోహితులు మొదలైన వారంతా రాజు వెంట నడిచారు.సునీత సురచి ఉత్తముడు కూడా రాజు ని అనుసరించారు.
రాజ్యం నుంచి బయలుదేరిన తల్లి తండ్రులు, సామంతులు ద్రువుడిని కలిసారా! కలిసినతరువాత ఏమి జరిగిందో వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం! రండి మన చిన్ని ఆశ చానల్ లో వినేద్దాం రండి.
****************************************************************************
#ధృవచరిత్ర
#మాతృపుత్రసంబంధం
#పట్టుదల
#సునీతధృవ
#ఆధ్యాత్మికప్రయాణం
#భక్తిఆత్మవిశ్వాసం
#ధృవునిపట్టుదల
#ఇతిహాసకథలు
#తల్లిప్రేమ
#తపస్సు
#dhruvastory
#kidsstories
#mythologyforkids
#indianmythology
#moralstories
#inspirationalstories
#determination
#kinguttanapada
#SuruchiAndSuniti
#SanskritiStories
#hindumythology
#ChildrenAnimation
#dhruvanakshatraserial
#storyofdhruva
#educationalvideos
#అరణ్యవాసం
Super