ద్వాదశ జ్యోతిర్లింగాలు

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
    ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమమలేశ్వరమ్ ॥
    పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
    సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
    వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
    హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః । సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
    ఉదయం, సాయంత్రం ఈశ్లోకం పఠించినవారి పాపాలు నశిస్తాయి.. శివుని లింగరూప ఆవిర్భావం తమిళనాడురాష్ట్రం తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరునిగా జరిగినట్లు మా పంచభూతలింగ క్షేత్రకధనంలో వివరించబడింది. అరుణాచల శివలింగం అగ్నిలింగం పేరుతో ప్రసిద్ధి చెందింది. అరుణాచలేశ్వరుని తలచినంతనే సర్వపాపాలు తొలగుతాయని, అరుణాచల దర్శనంతో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచల పర్వతప్రదక్షణతో శారీర, మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివపురాణం నందు తెలుపబడ్డ శివలింగ ఆవిర్భావకధనం తెలుపు శిల్పం మహారాష్ట్రలో పూణేవద్ద త్రిషూండ్ గణపతిఆలయంలో అద్భుతంగా మలచబడింది. శివుని శివలింగ స్వరూపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోరాఘర్ జిల్లానందు గంగోలిహట్ నుండి 14 కి.మీ దూరంలో భువనేశ్వర్ గ్రామంలోఉన్న గుహదేవాలయంలోని పాతాళభువనేశ్వర్ శివలింగం ప్రాచీనమైనదన, ఈ శివలింగం భూమితోపాటుగా ఉద్భవించిందని కదనం.
    పురాణాల్లో శివలింగ ఆవిర్భావ కధనంప్రకారం, బ్రహ్మ, మహావిష్ణువు మధ్య దేవతలపై ఆదిపత్యంకోసం జరిగిన సంవాదంలో శివుడు కాంతిస్తంభంగా ఉద్భవించి వారి ఆధిపత్యం నిర్ణయించడానికి తనమూలం కనుగొనమని చెప్పాడు. ఇరువురిలో విష్ణువు శివుని మూలం తెలుసుకొడానికి వరాహరూపంలో; బ్రహ్మ శివుని అగ్రభాగం తెలుసుకోడానికి హంసరూపంలో వెల్లారు. విష్ణువు తన అన్వేషణలలో విఫలమైనానని శివుని పాదాలను కనుగొనలేక పోయానని తెలిపి చింతించాడు. బ్రహ్మ పయనంలో పైనుండి బ్రహ్మచేతుల్లో కేతకీ (మొగలి) పుష్పం పడింది. బ్రహ్మవచ్చి శివునితో తాను అగ్రభాగం చూశానని, దానికి ఋజువుగా కేతకి (మొగలి) పుష్పం లభించినట్లు తెలిపాడు. జ్వాలనుండి శివుడు నిజరూపం ధరించి తాను ఆధ్యంతాలులేని అనంతుడనని తనఉనికికి మూలం, అగ్రం రెలుసుకోవడం అసాధ్యమని అగ్రభాగాన్ని చూశానని అసత్యం చెప్పిన బ్రహ్మ ఆదిపత్యానికి అనర్హుదని పూజార్హతనుండి తొలగించి బ్రహ్మకి సహకరించిన కేతకి (మొగలి) పువ్వుకు పూజార్హతలేదని తనపూజలో ఉపయోగించరాదని శపించాడు. శివారాధనకు మొగలి పుష్పాల వినియోగం శివరాత్రి రోజునతప్ప నిషిద్ధం. మహావిష్ణువుకు అన్ని పూజలు, క్రతువుల్లో పాల్గొను ఆదిపత్యం అనుగ్రహించాడు.
    దేశంలోని ప్రముఖ శివక్షేత్రాలలో 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలని ఖ్యాతిపొందాయి. జ్యోతిర్లింగాలు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు, తూర్పున వైధ్యనాధ్ నుండి పశ్చిమాన సోమనాధ్ వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 1.కేదార్నాధ్ (ఉత్తరాఖండ్) 2. భైధ్యనాధ్ (జార్ఖండ్), 3.రామేశ్వరం (తమిళనాడు), 4.సోమనాధ్ (గుజరాత్), 5.విశ్వేశ్వర్ (ఉత్తరప్రదేశ్) 6.మల్లిఖార్జున (ఆంధ్ర ప్రదేశ్), 7. నాగేశ్వర్ (గుజరాత్), 8. మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్), 9.భీమశంకర్ (మహారాష్ట్ర), 10. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), 11. త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర), 12. ఘృష్నేశ్వర్ (మహారాష్ట్ర) క్రమంలో శంఖు ఆకారంలో ఉన్నవి. కేదార్నాధ్ తప్ప పరమశివుని ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రాలో శివుడు లింగాకారంలో దర్శన మిస్తాడు. కేదార్నాధ్ నందు శివుడు నంది (వృషభం) మూపురం ఆకారంలో దర్శనమిస్తాడు. ప్రతి జ్యోతిర్లింగం భిన్నమైన రూపంతో స్థానిక ఆవిర్భావ కధనానికి ప్రసిద్ధి చెందింది. ఇందు నాగేశ్వర్ మరియు వైధ్యనాధ్ జ్యోతిర్లింగముల విషయమై మీమాంస ఉంది. జార్కండ్ నండు విధ్యానాధ్ తో పాటుగా మహారాష్ట్రలోఉన్న పర్లీ వైధ్యనాధ్ జ్యోతిర్లింగమని, గుజరాత్ నందున్న నాగేశ్వర్ తోపాటుగా మహారాష్ట్రలోని ఔండా నాగనాధ్ మరియు ఉత్తరాఖండ్ లోని జగేశ్వర్ (నాగేశ్వర్) జ్యోతిర్లింగమని వాదనలు ఉన్నవి. జగద్గురు శ్రీఆది శంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్త్రోత్రం సంబంధిత జ్యోతిర్లింగ కధనంలో పొందుపర్చ బడింది.
    ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ - మేషం,, మల్లిఖార్జున - కన్య, మహాకాలేశ్వర్ - తుల, ఓంకారేశ్వర్ - కర్కాటకం, వైధ్యనాధ్ - సింహం, భీమశంకర్ - మకరం, రామనాధేశ్వర్ - మేషం, నాగనాధ్ - మిధునం, కాశీవిశ్వేశ్వర్ - ధనస్సు, త్రయంబకేశ్వర్ - మీనం, కేదారేశ్వర్ - కుంభం, ఘృష్నేశ్వర్ - వృశ్చికం. పూజించిన సంబంధిత రాశులవారి జాతకదోషాలు పరిహారమవుతాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు వేర్వేరు రాష్ట్రాలలో విభిన్న శీతోష్ణస్థితులలో ఉండుటవలన ఒకేపర్యాయం దర్శించుట ప్రయాసతో కూడినది. కావున రెండు లేదా మూడు జ్యోతిర్లింగాలు ఒకపర్యాయం దర్శించుటకు వీలుగా యాత్రికుల సౌకర్యార్ధం వివిధయాత్రలందు పొందుపర్చబడినవి. ద్వాదశ జ్యోతిర్లింగాలవలే అష్టాదశశ శక్తిపీఠాలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండటంవల్ల జ్యోతిర్లింగాలతోపాటు దగ్గరలోని శక్తిపీపీఠాలు దర్శించవచ్చు.
    జ్యోతిర్లింగ దర్శనం సర్వ పాపహరం పుణ్యప్రదం
  • Ігри

КОМЕНТАРІ •