యేసుని కోరు రాజ్యాంబు జేరు ఆయనను నమ్మువారు నరకంబు ఎవ్వరు బోరు...||రచన, గానం, స్వరకల్పన:పి.అభిషిక్త్

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • యేసుని కోరు - రాజ్యంబు చేరు
    ఆయనను నమ్మువారు - నరకంబు ఎవ్వరు బోరు
    నమ్మి నీ మనసున మారు-
    స్వర్గస్తుడవ్వగోరు (2)
    మరణించినప్పుడు ఎవ్వరు - ఏమైన తీసుకపోరు (2)
    || యేసుని ||
    1) విశ్వసించువారు - ఎన్నటికి కలవరపడరు
    ఆయనను నమ్మనివారు - పరలోకమెవ్వరు బోరు (2)
    నేనే మార్గమన్నారు - సత్యము జీవమునన్నారు (2)
    యేసు ద్వారానే అందరు - పరలోక వారసులౌదురు (2)
    || యేసుని ||
    2) మారుమనస్సు పొందువారు- రక్షింపబడుదురు
    మార్పు లేనివారు- ఉగ్రత పాలవుదురు (2)
    అగ్నిగుండములో వారు - నిత్యము కాలుచువుందురు(2)
    క్రీస్తు మాట విన్నవారు - నిత్యజీవము పొందెదరు (2)
    || యేసుని ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్.
    సెల్ : 9346695906
    Dt: 17-06-2024
    Time : 04:04 PM

КОМЕНТАРІ • 4