How and Why I Learned Telugu | Part 1

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2023
  • నేను తెలుగు ఎలా నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకున్నాను? ఎక్కువమంది అడుగుతూ ఉంటారు. కొన్ని వీడియోలతో ఆ విషయాన్ని వివరించాలని అనుకుంటున్నాను... ఆ క్రమంలో ఈ వీడియొ మొదటిది.
    People often ask me how and why I learned Telugu, so I hope to make several videos to share that journey with you all. This is the first!

КОМЕНТАРІ • 472

  • @user-pn9py9bz2u
    @user-pn9py9bz2u 11 днів тому +46

    నా తెలుగు తల్లికి మంగళారతులు ఈ తెలుగుమాటాలాడు పరదేశి చెల్లికి పాదాభివందనం

  • @ravikishorepemmaraju1657
    @ravikishorepemmaraju1657 5 днів тому +5

    ఏదో చెత్త కాకుండా మంచి సంభాషణ
    చూశాను. అద్భుతం. రామనరసింహం గారికి, విదేశీ బంగారానికీ శుభాకాంక్షలు 🙏🥰💐💐💐

  • @quickeasyrelaxmusic9350
    @quickeasyrelaxmusic9350 16 днів тому +76

    ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా దేశం వచ్చి..
    " దేశభాషలందు తెలుగు లెస్స " దేశం గర్వించదగ్గ మా భాష నేర్చుకుంటూ
    మాతో ఉంటూ తెలుగు నేర్చుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు. 🙏@yenaayenaa

  • @venkatpoduguconnects
    @venkatpoduguconnects 14 днів тому +20

    You speak more fluent and accurate Telugu than native telugu speakers.

  • @nagendravarma81
    @nagendravarma81 6 днів тому +4

    పాడనా తెనుగు పాట
    పరవశమై
    పాడనా తెనుగు పాట
    చాలా బాగా మాట్లాడుతున్నారు సంతోషంగా వుంది ఎందుకంటే మన భాషని ఇంకొకరు మాట్లాడుతున్నారు & ప్రేమిస్తున్నారు అంటే. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు మా సంస్కృతిలో బాగా కలిసిపోయినట్లున్నారు మీరు ఇలాగే మా సంస్కృతి, భాష & దేశం తరఫున ఒక రాయబారిలాగ, ఒక వంతెనలాగ వుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం స్వస్తి . శుభం భూయాత్. జై హింద్.

  • @vishwanathgoud1913
    @vishwanathgoud1913 23 дні тому +115

    తను అమెరికన్ అయినా ఆంగ్ల పదాలు లేకుండా చక్కటి తెలుగు ఎంత బాగా మాట్లాడింది అంటే .... మనం తెలుగు మాట్లాడుతున్నాము అని అంతా ఆంగ్లం లోనే మాట్లాడేటంతగా ...
    తన తెలుగు వింటుంటే మనం తెలుగే మాట్లాడుతున్నామా ? అనిపిస్తుంది.
    ఒక మంచి అనుభూతి తో ఈ రోజు మొదలైంది. 🥺🥺

    • @umamaheswararaomannepalli4641
      @umamaheswararaomannepalli4641 22 дні тому +4

      YOU ARE SO GREAT

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  17 днів тому +37

      నా మీద అభిమానం తో అంటున్నారు కానీ నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నా వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @dravidaraja
    @dravidaraja 24 дні тому +76

    మీ ఇద్దరి సంభాషణ చూస్తే, చిన్నప్పుడు నేను మా తాతయ్య తో ఇలానే మాట్లాడేవాడిని. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.. చాలా బాగుంది మీ ఇరువురి సంభాషణ, మీ తెలుగు ❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  17 днів тому +21

      మీకూ, మీ తాతయ్యకి మధ్య జరిగిన సంభాషణల తో ఈ నా సంభాషణ పోల్చడం చూసినప్పుడు, నాకు కలిగిన సంతోషాన్ని చెప్పడానికి నాకు అస్సలు పదాలు దొరకడంలేదు.... ఇంత పెద్ద మెప్పుకోలుకి నేను సరిపోగలనా? అని అనిపించింది. ధన్యవాదాలు.

  • @Gopinathk17
    @Gopinathk17 23 дні тому +25

    Oh wow..Your telugu is better than so many Telugu people.

    • @karthiksai6736
      @karthiksai6736 11 днів тому +3

      no inter nibbis were hurt in this comment

  • @PuLi2024
    @PuLi2024 День тому

    తెలంగాణ లో వున్న తెలుగు వాళ్ళ కంటే బాగా మాట్లాడుతున్నారు.
    ఇక్కడే పుట్టి పెరిగిన వుత్తరాది, గుజరాతి , మరాఠీ, కర్ణాటక , తమిళనాడు, తురక ముస్లిం ల కంటే యింకా బాగా మాట్లాడుతున్నారు. మీకు చాలా పట్టుదల , తెలివితేటలు, వోపిక, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస వుంది. వీటితో పాటు మీ మనస్సు చాలా స్వచ్ఛం. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ, మీరు అమెరికన్సుకు తెలుగు వారికి మధ్య వారధిగా వుండాలని వాంఛిస్తూ , మీకు ఆంధ్రులందరి తరపున నా శుభాకాంక్షలు.
    🎉🎉🎉🎉🎉

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 21 день тому +20

    హిందీ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీ కి ఎంగిలిపీసుతో వచ్చే లేడీ ఆర్టిస్ట్స్ ఈవిడను చూసి సిగ్గు తెచ్చుకోండి.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 21 день тому +34

    తెలుగు మాట్లాడటం వలన మన శరీరంలో 72000 నాడులు వూత్తేజితమవుతాయట. Good డిసిషన్ 👏👏👏

  • @jaiandhra7437
    @jaiandhra7437 24 дні тому +25

    అమ్మా .. వందనాలు .. మా తెలుగు పిల్లలు కూడా మీ అంత స్పష్టంగా మా "సుందర తెలుగు" మాట్లాడలేక పోతున్నారు.
    చాలా సంతోషం గా ఉంది

  • @dr.k.vijayabhanu6829
    @dr.k.vijayabhanu6829 Рік тому +52

    చాలా బాగా మాట్లాడారు మీరు. ఆచార్య పరిమి రామనరసింహం గారు మంచి గురువులు. వారి వద్ద పాఠాలు నేర్చుకోవడం మీకు ఒక అదృష్టం. మీ అనుభవాలను ఇలా మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Рік тому +25

      అవును, నిజమే అండి. పరిమి రామనారసింహం గారు చాలా మంచి టీచర్. నేను తెలుగు నేర్చుకోవడం అనే ప్రయాణం ఆయనతో మొదలయింది. ప్రస్తుతం American Institute of Indian Studies ద్వార ఇంకా బాగా తెలుగు నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ వివరాలన్ని నా రాబోయే వీడియోల్లో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వీడియో చూసి మీరు స్పందించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.

    • @suryamogali78
      @suryamogali78 25 днів тому +3

      Mee telugu maku chala santhoshannichindi 👌🥰​@@yenaa_yenaa

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 21 день тому +33

    నా సంతోషమెంటంటే మీరు చక్కగా ళ, ణ అనే అక్షరాలను ఉచ్చరిస్తున్నారు. 👏👏👏👌👌

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  21 день тому +1

      @@padmapriyarajavarapu514 🙏🏻

  • @sundarayerrapragada
    @sundarayerrapragada 12 днів тому +3

    సుందర ఎర్రాప్రగడ నుండి శుభాకాంక్షలు మరియు భారత దేశానికి స్వాగతం.
    మీరు దయచేసి అల్ ఇండియా రేడియో వైజాగ్ లేదా విజయవాడ స్టేషన్స్ వింటూ ఉండండి.
    నేను తెలుగు వాడిని. కానీ సరిఅయిన భాష నేను రేడియో ద్వారానే నేర్చుకున్నాను,

  • @CultReddy
    @CultReddy 24 дні тому +23

    Wow, you're like a rare gem! A white American girl living in Andhra and speaking flawless Telugu? That's next-level impressive. You've got Andhra locals scratching their heads and wondering if they've forgotten how to speak their own language. Your Telugu is so impeccable that even the purists are giving you standing ovations. Keep rocking that linguistic prowess …you're practically a Telugu superstar!👍🏼

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 20 днів тому +7

    మీరు 3 సంవత్సరాల లో చక్కటి తెలుగు భాష నేర్చుకున్నారు. మీ భావ వ్యక్తీకరణ కూడా చాలా బాగుంది. పుస్తక పఠనం కూడా చేయగలిగితే భాష మీద మంచి పట్టు దొరుకుతుంది. నా సలహా ఎమిటంటే, చిన్న కథల పుస్తకాలను చదివి గలిగితే మంచిది.

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 23 дні тому +30

    మీరు తెలుగు భాష మాట్లాడుతునందుకు గర్వంగా వుంది సోదరి
    మీరు మరిన్ని విషియలు పై అధ్యాయం చేసి తెలుగు లో phd చేసి మా అందరికి ఆదర్శప్రాయాయంగా ఉంటారని ఆశిస్తూ మీ తెలుగు తమ్ముడు ❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  17 днів тому +5

      తెలుగు లో PhD చేయడం కంటే మీ అందరితో సంభాషించడమే నాకు ఇష్టం. -మీ అక్క​ :)

    • @mukundakrishna2300
      @mukundakrishna2300 17 днів тому

      @@yenaa_yenaa ధన్యవాదములు అక్క మీరు మాట్లాడుతునందుకు చాలా ఆనందం గా ఉన్నది ❤️😘

  • @sreekanthb3855
    @sreekanthb3855 7 днів тому +1

    ఆహా అద్భుతమైన తెలుగులో మాట్లాడుతున్న మీరు చాలా గొప్పవారు. మీకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ద కి చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక అభినందనలు (heartful appreciations) తెలుగు భాష వర్ధిల్లాలి long live telugu జై తెలుగు తల్లీ జై జై తెలుగు తల్లి జై సనాతన ధర్మం జై భారత్.

  • @likithmahindra7564
    @likithmahindra7564 22 дні тому +6

    నా మాతృభాష తెలుగు అయినప్పటికీ అక్క మీ తెలుగు భాష నా కంటే చాలా బాగుంది 🥰

  • @kukloobunny
    @kukloobunny 22 дні тому +14

    సంబ్రహ్మాశ్చర్యం నాకు స్ఫురించె పదం మీ సంభాషనవింటే .. భాషే మీకు ఆభూషణం ... మనసుతో పలికే ఈ తెనుగు పదం వింటే మీరు మరో జన్మ ఎత్తరేమో తెనుగును మీ మాతృభాషగా చేస్తే అనిపిస్తుంది. సాహో మిత్రమా మీ ప్రయత్నం అమోఘం ... తెనుగును మీ మాతృభాష అంత గొప్పగా పలకడం ఈభాషకు మీరు పట్టంకట్టిన చందం

  • @LavenderValley777
    @LavenderValley777 24 дні тому +176

    మంచి తెలుగు నేర్చుకున్నారు.. ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన యాస కాకుండా స్టాండర్డ్ గా ఉండే స్వచ్ఛమైన అచ్చ తెలుగు నేర్చుకోగలగటం అదృష్టం 🎉

    • @harishreddy4574
      @harishreddy4574 23 дні тому +31

      Manchi telugu chedda telugu ani undadhu..adhi mandalikham..

    • @LavenderValley777
      @LavenderValley777 23 дні тому +6

      @@harishreddy4574 pranthaanni batti Telugu lo vere padaalu kalustay.. adi Konni states lo ekkuva.

    • @jathinkarthik143
      @jathinkarthik143 23 дні тому +3

      @@harishreddy4574untadi andi… ante annan antaru kaani… telugu vachindi paala script nundi nd aa paala script devanagiri lipi nundi.. ippudu manam antha entho kontha english matludutunnam but telugu ni english cheyyatla as they do in Telangana… padalu baashalu add avvachu .. but unna Telugu maarakudadu

    • @prudvireddyvatte8711
      @prudvireddyvatte8711 23 дні тому +7

      @@jathinkarthik143ante annaru antaru kani telugu vachindi dravidian script nundi devanagiri script nundi vachindi hindi, telangana lo english kalaparu urdu/hindi kalustundi andhra lo british palana valla engish words kalustay kasta chaduvukuni upanysam ivvandi 😂

    • @msquare2462
      @msquare2462 22 дні тому +12

      అరేయ్ ❤డేందర్ .. తెలంగాణా యాస గురించి మాట్లాడితే నాలుక కోస్తాం .

  • @stephenking9305
    @stephenking9305 20 днів тому +8

    Your Telugu is so much better than what our Telugu actors and actresses speak on stage and in interviews.

  • @sukumarjonnalagadda6649
    @sukumarjonnalagadda6649 18 днів тому +24

    Maa maji CM jagan ki telugu nerpinchandi

  • @maheeinvest
    @maheeinvest 11 днів тому +2

    ఎవరమ్మా నువ్వు.., నీ తెలుగు మాట వాచకం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. నీకు ఆ భగవంతుడు ఉజ్వలమైన భవిష్యత్తు ని ఇవ్వాలని ఇలాగే తెలుగు భాష కి నువ్వు సేవ చేస్తూనే ఉండాలని ప్రార్ధిస్తున్నాను. తెలుగు అమ్మాయిలు ఈ అమ్మాయిని చూసి సిగ్గుతెచ్చుకోండి.., మీకు అటు ఇంగ్లీష్ వచించావడు తెలుగు మాట్లాడారు.. ,ఏదేనుకీ బడాయి వేషాలు.

  • @VijayaAvadhanula
    @VijayaAvadhanula 2 дні тому

    ఇంత చక్కగా చక్కని తెలుగు లో మాట్లాడినందుకు నా అభినందనలు. నేను మా శ్రీమతి కలసి కలగూర గంప అనే కేవలం తెలుగు పదాలనే ఉపయోగిస్తూ అనేకమంది రచయిత్రులు రచయితలు రాసిన కథలను ఒక సంపుటిగా ప్రచురించాము. మీకు చదివే సమయం ఉంటే ఆ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ పంపించండి. మరోసారి మీరు మాట్లాడిన పద్ధతికి మిమ్మల్ని అభినందిస్తున్నా

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 дні тому

      మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి. నేను ఎక్కువ ప్రయాణాల్లో ఉండడం వల్ల మీ పుస్తకం soft copy లో నా email (yenaa.yenaa907@gmail.com) కి పంపగలిగితే నేను తప్పకుండా చదువగలను. 🙏

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 19 днів тому +4

    భారతదేశంలో మాట్లాడే మూడవ అతిపెద్ద భారతీయ భాష, ఇది తీపి మాత్రమే కాదు, బహుముఖ చరిత్రను కలిగి ఉంది. మీరు దానిని నేర్చుకోవాలని కోరుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. తెలుగు అవధానానికి హాజరవ్వండి, మీరు భాష యొక్క ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు

  • @sathishkumar-st9nk
    @sathishkumar-st9nk 6 днів тому

    ప్రపంచ భాషలు అనేకం. భావవ్యక్తీకరణలో అత్యంత స్పష్టమైనది , అత్యంత ఉన్నత పదాలు కలిగిన భాష తెలుగు భాష🙏🙏🙏
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు వినండి తెలుగు మాధుర్యం ఇంకాస్త తెలుస్తోంది.

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 Рік тому +45

    మీ ఉచ్చారణ కూడా చాలా బాగుంది ❤❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Рік тому +20

      ఇప్పుడిప్పుడే మెరుగు పెట్టుకుంటున్నాను. మీ సహ్రుదయతకి ధన్యవాదాలు. 😄

    • @jaggarao2312
      @jaggarao2312 20 днів тому +1

      @@yenaa_yenaa.. 👌👌🤗🤗👍👍

  • @sujaireddy4311
    @sujaireddy4311 9 днів тому +1

    నేను USA లో పుట్టి పెరిగాను. నాకు హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి అక్కడే ఉండి పోవాలని అనిపిస్తుంది. మీ వీడియో చూడడం నాకు చాలా సరదాగా ఉంది.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  9 днів тому

      మీరు USA లో పుట్టి పెరిగినా తెలుగు భాష రాయడమూ, చదవడం అనే విషయం అద్భుతం! మీకు హైదరబాద్ ఎందుకు అంతగా నచ్చుతుందో నేను అర్ధం చేసుకోగలను.

    • @sujaireddy4311
      @sujaireddy4311 9 днів тому

      @@yenaa_yenaa నేను ఇప్పుడు Chicago లో పనిచేస్తున్నాను. మిడ్ వెస్ట్ జనాలు గురించి నువ్వు చెప్పినప్పుడు నాకు నవ్వొచ్చింది.

  • @pokemonitishere202
    @pokemonitishere202 5 місяців тому +30

    నేను మీ తెలుగులో గమనించింది ఏంటంటే... ప్రతి భాషకు ఒక ఇంటోనేషన్ అనేది ఉంటుంది. అది నేర్చుకోవడం చాలా కష్టం. ఆ ఇంటొనేషన్ వచ్చిందంటే వారు స్థానికుల్లో కలిసిపోగలరు.
    ఆ ఇంటోనేషణ్ ను తెలుగు లో మీరు చాలా బాగా పట్టుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు. మీరు చాలా గొప్పండీ!
    మీరు తెలుగు quora లో join అవ్వండి. చాలా చాలా విషయాలు తెలుగు చరిత్ర గురించి తెలుస్తాయి! చాలా పెద్ద పెద్ద భాష నిపుణులు కూడా ఉంటారు అక్కడ!

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  4 місяці тому +30

      ఆలస్యానికి క్షమించండి... ఈ పోయిన మూడు వారాల్లో అమెరికాకి వెళ్ళి రావాల్సి వచ్చింది.
      మీ అభినందలకి చాలా ధన్యవాదాలండి. నా తెలుగు భాష నైపుణ్యం గురించి ఉన్నదాని కంటే ఎక్కువే మెచ్చుకున్నారు. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది! అందుకు మీ లాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు ఎంతో అవసరం.
      ఇక, ఇంటొనేషన్ విషయానికి వస్తే, నా అభిప్రాయం లో కొంతమందైనా ఒక కొత్త భాష నేర్చుకున్నప్పుడు ఆ భాష ఇంటొనేషన్ని చాలా వరకు పట్టుకోగలరు. కాని, మామూలుగా వాళ్ళ మాతృభాష యాసను ఎప్పటికీ పూర్తిగా పొగొట్టుకోలేరు... మన మాతృభాష మన అస్తత్వంలో ఒక భాగం కదా? మరి అది ఎప్పుడూ పొగొట్టుకోకూడదు. మీరేమంటారు? :)

    • @KrishGirl143
      @KrishGirl143 2 дні тому

      ​​@@yenaa_yenaaనాకు కూడా తెలుగు రాని నా స్నేహితులకు తెలుగు నేర్పించాలని వుంది.వాళ్ళకి కూడా నేర్చుకోవాలని వుంది. ఎలా నేర్పితే సులభం గా నేర్చుకుంటారో మీ అనుభవం ప్రకారం సలహా ఇవ్వండి.

  • @Vijjiprsn
    @Vijjiprsn 9 днів тому

    మీరు ఎంతో బాగా సాధారణమైన తెలుగు మాట్లాడుతున్నారు.
    నేను కించపరుస్తున్నాను అని కాదు గాని, మా తెలుగు వారు మీలా తెలుగు మాట్లాడమంటే గ్రాంథికంలో మాట్లాడతారు. ఎందుకంటే, అనే కారణం కన్నా తెలుగు భాషా పరిపూర్ణంగా వాడుకలో లేకపోవడం, ఆంగ్ల భాషతో కూడుకున్న తెలుగుని మాట్లాడడంతో మీలాగా స్వచ్ఛమైన తెలుగు ని సరళంగా మాట్లాడడానికి కూడా ఆపసోపాలు పడుతుంటారు. నాకు చాలా గర్వంగా ఉంది మీరు తెలుగు మాట్లాడుతుంటే నేను ఇతరులతో మాట్లాడుతున్నట్టు ఉంది.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  8 днів тому +1

      "మీలాగా స్వచ్ఛమైన తెలుగు ని సరళంగా మాట్లాడడం" అనే మీ కామెంట్ నా హృదయానికి తాకింది. మీకు నా వీడియో అంతగా నచ్చినందుకు నాకు కూడా గర్వంగా ఉంది.

  • @see_green
    @see_green 25 днів тому +10

    proud moment when yenaa garu speak in telugu

  • @SaiKrishna-xc6kj
    @SaiKrishna-xc6kj 8 днів тому

    సామాజిక మాధయమాల్లో చాలా కాలం తర్వాత మళ్ళీ ఓక మంచి వీడియో చూసాం.. ముచ్చటగా అనిపించింది...ధన్యవాదాలు..

  • @charan8083
    @charan8083 14 днів тому +1

    ఈ వీడియో చూస్తున్నంత సేపూ మొహం మీద చిరునవ్వు అలా ఉంటూనే వచ్చింది. సొంత వాళ్ళే తెలుగు నుడిని విస్మరిస్తున్న ఈ రోజుల్లో మీ బోటి వాళ్ళు చొరవ తీసుకుని మరీ భాష నేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తాతగారు స్థానంలో ప్రొఫెసర్ గారు ఉంటూ మనవరాలిగా మీకు తెలుగు పాఠాలు బోధిస్తూ ఉండటం చూడ ముచ్చటగా ఉంది. తెలుగు మీద మీ మమకారానికి శతకోటి వందనాలు 🙏🏽 అలాగే ఇంత చక్కటి వీడియో మాకు అందించినందుకు కూడా మా ఈ నెనర్లు 🙏🏽

  • @ramadityak6138
    @ramadityak6138 23 дні тому +16

    దేశ భాషలందు తెలుగు లెస్స🙏🙏

  • @maniyadav6190
    @maniyadav6190 22 дні тому +2

    I am glad, she chose to learn neutral Telugu rather than any specific slang. My slang used to have dominant Godavari style, but in Hyderabad after I mixed up with people from different parts of Andhra and Telangana, I started practicing neutral Telugu. Even my Telangana friends used to make an effort and speak neutrally so that I can clearly understand them. Great memories.

  • @kittu529
    @kittu529 23 дні тому +6

    Your utterance of the Telugu words sounds so good like honey. I hadn't believed that the Telugu language was so sweet until I heard it from you. the words you choose to speak are the actual Telugu words to be used while communicating. Well done. Many Telugu people are still to finish learning the Telugu language.😂

  • @rameshsarma9755
    @rameshsarma9755 Рік тому +11

    నమస్కారం ఏనా🙏 ముందుగా మీకు తెలుగు భాష ,సంస్కృతి, సంప్రదాయం నేర్చుకోవాలని ఉన్న ఆసక్తికి హృదయపూర్వక శుభాభినందనలు💐మీ పూర్తి ముఖాముఖి చూసాను. అత్యంత అద్భుతంగా ఉంది మీ తెలుగు భాష నేర్చుకునే విధానం. గురువుగారికి పాదాభివందనం🙏ఒక్క విషయం ఏనా భాష,సంస్కృతి, సాంప్రదాయం అనేవి మన ఇంటి నుండే తల్లిదండ్రుల నుండే మొదలవ్వాలి. మీ కుటుంబం మీకు ఆ వాతావరణం కలిపించినందుకు వారికి నా నమస్సులు. ఇంత చక్కటి వీడియోలో ఎన్నో అమూల్యమైన విషయాలు అనుభవాల పరిమళాలు వెదజల్లుతున్నాయి. మీతో నాకున్న సంస్కృతి, సాంప్రదాయపు అలవాట్లు పంచుకోవాలని కుతూహలంగా ఉంది.మీకు అభినందనలతో.లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై🌹💐🎻❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Рік тому +8

      మీ ఆలోచనలను నాతో మనస్పూర్తిగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. నిజానికి మంచి టీచర్లు దొరకడం నా అద్రుష్టం. మీ సంస్క్రతీ, సంప్రదాయల గురించి మీనుంచి నేర్చుకోవడానికి నాకు కూడా ఆసక్తిగా ఉంది. సమయం దొరికిన్నప్పుడల్లా దయచేసి మీ ఆలోచనలు పంచుకోండి.

  • @amaravathikathalu5639
    @amaravathikathalu5639 13 днів тому +1

    నాకు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆనంద బాష్పప్లు వొచ్చాయి. మీరు తెలుగు ని ఇంత మధురంగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనంద మేసింది. 🥺🥺

  • @tailwindcraftmanship
    @tailwindcraftmanship 12 днів тому +3

    your sitting style make you so much indian and especially a telugu girl 😆

  • @rajeshbajjuri8515
    @rajeshbajjuri8515 6 днів тому

    మీరు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @chosenone7279
    @chosenone7279 24 дні тому +1

    నేను తెలుగు వాడినే కానీ నాకు జనాలతో కలవడం రాదు నాకు ఏమీ అర్ధం అయ్యేది కాదు నేను అర్థం చేసుకోలేను మీ డాక్యుమెంటరీ వల్ల మా సంస్కృతిని అర్థం చేస్కోగాలుగుతునను ఇంకా మా ప్రజల గురించి కూడా,పెరుగుతున్న జనాభా వల్ల ఏమో తెలీదు గానీ చాలా మంది తెలుగు ప్రజలు వల్ల కల్చర్ కి దూరం అవుతున్నారు ప్రస్తుతం ఉన్న చదువుల వ్యవస్థ వల్ల అనుకుంట పక్కన వారి గురించి మేము అర్థం చేసుకోలేక పోతునాం

  • @josephrayapati6110
    @josephrayapati6110 9 днів тому

    ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ఆంగ్లం టీచర్ గా పని చేస్తున్న కానీ చాలా మంది పిల్లలలో తెలుగు నేర్చుకునే ఆశ తగ్గిపోతుంది.. నేను ఇంగ్లీష్ టీచర్ అయన మ స్కూల్ లో ఉన్న తెలుగు టీచర్ గారు పిల్లలలో పడే కష్టం అంతా ఇంతా కాదు. కానీ మీరు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే.... మిమల్ని చూపించి మా పిల్లలకి తెలుగు లో మాట్లాడటం లో ఉన్న గొప్పతనం చెప్పాలని భావిస్తున్న..
    చాలా చాలా ధన్యవదాలు .. ఎన్నో భాషలు ఉన్నాయి ఈ భారత దేశం లో మా లెస్సా అయన భాషని ఏంచుకునదుకు .

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  8 днів тому

      నా చిన్ని ప్రయత్నం ముందు తరానికి తెలుగు భాష పట్ల అసక్తిని పెంచగలిగితే, అదే నాకు గొప్ప బహుమతి, కానీ నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నా తరపు నుంచి మీ బడి లో తెలుగు టీచర్ కి నా నమస్కారాలు చెప్పండి. 🙏

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 13 днів тому +1

    స్వచ్ఛమైన తెలుగు స్ఫుటంగా మాట్లాడుతున్నార తల్లీ. అద్భుతం మధురాతిమధరంఅమ్మా!! దీర్ఘసుమంగళీభవ. సదాసుఖీభవ!!!

  • @VijayaAvadhanula
    @VijayaAvadhanula 2 дні тому

    చాలా బాగుంది తల్లీ మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడిన తీరు.

  • @nehapappu5059
    @nehapappu5059 9 днів тому +1

    Your telugu is better than many so called Telugu language Tollywood movie stars both native and imported. Meeku satakoti vandanam.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  9 днів тому +1

      I'm not sure how I compare to others, but I'm certainly working on it! Thank you for your thoughtful words of encouragement.

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 26 днів тому +4

    Meeru mariyu mee sambhashanalu...maaku oka drusya kaavyam laa anipisthavundi. Mee madhuramaina gonthu lopali nunchi vache...mrudu madhura maina sabdam kalisina maatau ... mammalni vivasulni chesthu vunnai. Eee anubhuthi... Varnanathitha mainadi maiyu maatalaku andanidi. Meeru entha samayam maatladina... maaku inka.. inka vinalani anipistoo vuntundi.
    Itlu...prematho
    mee abhimani. 🙏❤🇮🇳❤💐💐💐

  • @revanth84
    @revanth84 8 днів тому

    Your Telugu is better than many Telugu speakers. 🙌

  • @NagarajuChukkala-jl6yo
    @NagarajuChukkala-jl6yo 14 днів тому +3

    🙂I loved the video. I am from a village that's 140km away from Hyderabad, in Telangana, and I speak Telugu natively. Your Telugu is excellent!
    I recently spent a month in Hyderabad, which is unusual for me. The culture there is a little different to my own - people don't talk to strangers much and they mean business. In that respect, my village culture is closer to that of yours in the US. Thanks for the video!

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  14 днів тому +1

      @@NagarajuChukkala-jl6yo Your village sounds very special. I am so curious about the different elements that structure village life generally, but it’s difficult for me to visit villages without first knowing someone in them. But when I get an opportunity, I take it, and I never regret it. Thank you so much for watching and for sharing your reflections. Your kind words have touched my heart.

  • @sreekarmadabushi8902
    @sreekarmadabushi8902 8 днів тому +1

    మీరు తెలుగు మాట్లాడే విధానం నన్ను ఆకట్టుకుంది. నేను తెలుగు భాషను ఎలా మాట్లాడతానో అది నన్ను ఆత్మపరిశీలన చేసుకునేలా చేసింది. ధన్యవాదాలు.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  8 днів тому +1

      మీ కామెంట్ చదివి నిజంగా నాకు మాటలు కరువయ్యాయి! మీ అభిమానానికి ధన్యవాదాలు.

    • @ELEPHANt-GAMER_6969
      @ELEPHANt-GAMER_6969 8 днів тому

      ❤❤❤

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 2 дні тому +1

    Vammo balematladutunaru telugu meeru chala ascharyanga santhoshamga vundi

  • @itschinnam
    @itschinnam 7 днів тому

    అద్భుతం ... అంతే .. ఇంకా చెప్పటానికి ఏమిలేదు

  • @explorelonelyplanet3696
    @explorelonelyplanet3696 9 днів тому

    Dear telugu girls, we like type of speaking just pure and simple language. No overacting no over pronounciation of half baked English language

    • @your9to5job82
      @your9to5job82 8 днів тому

      అన్నయ్య ముందు మనం మొదలెట్టి, తర్వాత అమ్మాయల మీద పడి ఏడుద్దాం..

  • @kokkeramulu35
    @kokkeramulu35 Рік тому +3

    Meeru chaala chakkati hava bhavaalatho maatladaaru bagundhi.
    మీరు చాలా చక్కటి హావభావాలతో మాట్లాడారు బాగుంది

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Рік тому +3

      మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ!

  • @srini9653
    @srini9653 9 днів тому

    Impressive! It is very uncommon for an American to embrace such a diagonally opposite culture (forget about language). Not only your Telugu is fluent but it is pure.
    Sometimes we need folks like you to inspire the local crowd.
    All the best!

  • @badabagni
    @badabagni 18 днів тому

    అద్భుతం

  • @venkateswarraovemuganti3980
    @venkateswarraovemuganti3980 17 днів тому +1

    ఆమె తెలుగు మాట్లాడటం మనం ఆనందిస్తాం. కానీ ఆమె మాట్లొడే తెలుగు లో కూడా యాస ఉంది. మనం ఆంధ్ర ప్రదేశ్ వారమైనా, తెలంగాణ వారమైనా , మనందరం మాట్లాడే తెలుగు భాష లో స్వఛ్ఛత లేదు. ఒక భాషపై ఇతర భాషల ప్రభావం పడినపుడు , పదాలు ఉచ్చారణలో కొంత తేడా వస్తుంది. ఆ తేడానే యాస అంటున్నాం. . మనం ఇంగ్లీష్ మాట్లాడినా స్వభాష ప్రభావం వల్ల ఇంగ్లీష్ పదాల ఉచ్చారణలో తేడా వచ్చి సహజత్వాన్ని కోల్పోతుంది. దానినే యాస అంటాం. ఇది అన్ని భాషలలో ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అమెరికన్ ఇంగ్లీష్ కు, బ్రిటిష్ ఇంగ్లీష్ కు ఉచ్చారణలో తేడా ఉంటుంది. బ్రిటన్లో కూడా ఇంగ్లీష్ ఉచ్చారణలో కూడా అందరిది ఒకే రకముగా ఉండదు. అందువలన భాష యాస ల గురించి విమర్శించు కోవడం సరిఅయినది కాదు. ఎవరి భాష వారికి గొప్ప గానే ఉంటుంది. అసలు తెలుగు భాష లో 70% సంస్కృతం ఉంది. మిగతా 30% లో కనీసం 10% ఇతర భాషా పదాలు ఉంటాయి. ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో వాడే పదాలో చాలా వాటికి తెలుగులో పదాలు దొరకవు.

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 Рік тому +8

    చాలా బాగా మాట్లాడుతున్నారు మేడమ్ సూపర్

  • @ivk198
    @ivk198 14 днів тому

    U are great … awesome.

  • @lotus4276
    @lotus4276 12 днів тому

    Really fabulous

  • @happylife...843
    @happylife...843 21 день тому

    wow.. superb

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 21 день тому

    Wow.........such a beautiful words

  • @vendra007
    @vendra007 10 днів тому

    ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో ఈవిడ... భాష పట్ల మీకున్న అభిమానానికి, నేర్చుకోవాలన్న మీ తపనకి నా హృదయపూర్వక అభినందనలు. ఆ సరస్వతి సదా మీ తోడుండాలని కోరుకుంటున్నాను. సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు 🙏🙏

  • @Chilipipanulu
    @Chilipipanulu 22 дні тому +1

    Superb akka nuvvu ❤

  • @for461
    @for461 23 дні тому

    Meeru baagha matladutunnaru bagundhi

  • @5eMedia
    @5eMedia 26 днів тому +5

    చాలా బాగా మాట్లాడుతున్నావు తల్లీ... శుభాభినందనలు 🎉

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  26 днів тому +1

      🙏 ధన్యవాదాలు!

  • @ritantareprises7967
    @ritantareprises7967 22 дні тому

    అమ్మా మీరు తెలుగు భాష లో ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు.

  • @veerabbm
    @veerabbm 20 днів тому

    Awesome

  • @naveenreddy7867
    @naveenreddy7867 21 день тому

    Keep doing what you do.Greatly impressed 🔥🙌

  • @impermenance
    @impermenance 10 днів тому

    Brahmaandam! Adbhutam!

  • @rshastry
    @rshastry 14 днів тому

    Wonderful video. Very nicely put together. Enjoyed watching it.

  • @samathasanneboina1797
    @samathasanneboina1797 24 дні тому

    Meeru chala great medam. I can't believe .

  • @kallipalliadinarayana5915
    @kallipalliadinarayana5915 14 днів тому

    so nice keep learning and spread in your country

  • @arminphulkar2442
    @arminphulkar2442 10 днів тому

    wow, adbhutham!

  • @srichinnari5031
    @srichinnari5031 22 дні тому +1

    Super 👌 your great 👍, All the Best

  • @Pradeep_Chowdary55
    @Pradeep_Chowdary55 23 дні тому

    Superb conversation ❤🙏🤗🤗

  • @jithendratvl8922
    @jithendratvl8922 20 днів тому

    Super madam, good video, keep posting

  • @srinivaskanthkamasamudram564
    @srinivaskanthkamasamudram564 11 днів тому

    చాలా బావుంది

  • @vijayamphysicsclassesbycee4790
    @vijayamphysicsclassesbycee4790 5 днів тому

    Great video. Keep it up.

  • @vijaykumar-pc5uq
    @vijaykumar-pc5uq 23 дні тому +1

    Wow..I am impressed with telugu speaking skill...మీరు మా తెలుగు భాషనీ నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడుతున్నందుకు చాల కృతఙ్ఞతలు 🙏....తెలుగువాళ్ళమైనా మేమె తెలుగు ని రోజురోజుకి మర్చిపోతున్నాం, అలాంటిది మీరు మా కంటే స్పంష్ట్టం గ మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా వుంది...నా కొడుకుకి మీ ఈ వీడియో ని చూపించి మాతృ భాష గొప్పదనం గురించి మరింత వివరంగా చెప్తాను...!!!

  • @sudhakararaobio
    @sudhakararaobio 13 днів тому

    Vow excellent telugu
    Great

  • @siberianhusky4477
    @siberianhusky4477 23 дні тому +2

    Chala gharvamga undi mee Telugu vintunte., kallalo neellu tiruguthunnai mee matalu vintunte gundevalku thagulthunnai mee padhalu., nenu Telugu vadini iyyina intha spashtam ga mee la mataladaleka pothunanduku siggu paduthunna., chala Santhosham ga undi mee video choosi anduku., naadi vizag ye meeru vizag ani palukuthunte kallalo neellu tirugai., Mari vishayam yenti ante Alaska naaku chala istam iyyina pradesham yenno documentaries choosthunta chala prayathisthunna velladanki yedo oka roju kachitham veltha Alaska., anyway eroju chala anandhanni pancharu meeru

  • @verakum2341
    @verakum2341 20 днів тому

    great to see your commitment to speak in telugu.. awesome

  • @Anilyamarthi
    @Anilyamarthi 17 днів тому

    So sweet of you ❣️

  • @AnilReddy328
    @AnilReddy328 12 днів тому

    Wow....

  • @nitiKT
    @nitiKT 11 днів тому

    అక్కా.. మీకు ఒక దాండం..

  • @Idkmyname77
    @Idkmyname77 24 дні тому +2

    I fall in love with your Telugu 😅😅

  • @jessijeevan1011
    @jessijeevan1011 14 днів тому

    you are simply superb,yenaa.🥰

  • @ZeroDegree99
    @ZeroDegree99 20 днів тому

    Hey , yenna, great video , great journey , great job , Thank you for making amzing videos, neee telugu chala bugundi, nee smile la ento beautiful ga undi ..Thank you ...keep rocking with your beautiful videos .

  • @SivaJava
    @SivaJava 13 днів тому

    You are awesome madam... 🙏🙏🙏

  • @kameswararaos7458
    @kameswararaos7458 21 день тому

    Really so great mam 😮😮

  • @susmita262
    @susmita262 22 дні тому

    చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు❤

  • @naveensrichand6898
    @naveensrichand6898 13 днів тому

    Very nice that foreigners speaking Telugu language, whereas we are trying to get our kids to speak only English even if it is not required. English is only a professional language not our mother tongue.

  • @jagadeepmoka91
    @jagadeepmoka91 14 днів тому

    Meku abhinandanalu....meku Telugu nerpi thana intlo athidi ichina guruvu gaiki na padabhivandanalu

  • @rajendraprasad9832
    @rajendraprasad9832 19 днів тому

    Excellently speaking in telugu.

  • @justryin5353
    @justryin5353 8 днів тому

    You’re a role model for us,

  • @WC2FAR
    @WC2FAR 23 дні тому

    ఎంతో చక్కగా మాట్లాడారు🎉

  • @vvsprsad
    @vvsprsad 13 днів тому

    Felt very happy ... listeningTelegu from you🙏

  • @SIVAKUMAR-wh5oy
    @SIVAKUMAR-wh5oy 20 днів тому

    చాలా మంచిగా ఉంది భాష❤