టంగుటూరు డిస్కవరీ Tanguturu discovery

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • టంగుటూరు గ్రామ చరిత్ర
    తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు ఒక చారిత్రక గ్రామం.
    నవీన చిలాజికల్ నాటి రాతి పనిముట్లు లింగాలుగా బీరప్ప గుడిలో పూజించబడుతున్నాయి అదే కాలం నాటి మరియు బృహ శిలాయుగం నాటి అరుదైన రాతి పనిముట్టు హనుమాన్ దేవాలయం లో కనిపిస్తున్నది. గ్రామం మొదట్లో ఒడికిల్ల బండ ఉంది. ఒడికిలి అంటే ఇప్పటి ఎదుర్కోల్లు అన్నమాట . పెళ్ళికొడుకు ముందుగా ఈ ఒడికిలి బండ మీదకి వచ్చేవాడు . ఎదుర్కొల్లు జరిగేవి. రైతులు తమ పంటను ఇక్కడే కుప్పబోసి కావలి కాసేవారు. పంటలను ఎండబోసేవారు .ఈ బండ పైన ఒక చిన్న బద్ది కూడా ఉండేది. ఒడికిల్ల బండను గృహోపయోగాలకు ఉపయోగించడం వల్ల కనుమరుగు అవుతున్నది.
    మూడు నాలుగు దశాబ్దాల కిందట గ్రామంలో ఎక్కువగా జొన్నలు, సజ్జలు ,అనుములు, ఆముదాలు ,అలసందలు ,పెసల్లు బొబ్బర్లు, నువ్వులు, ఉలువలు ,జనుము ఎక్కువగా పండించేవారు. ఈ పంటలను ఒడికిళ్ల బండ పైన ఎండపోసి కావలి పండేవారు.
    కెనాల్ సమీపంలో ముస్లిం దొరలకు చెందిన "తమ్మలోని మేల్లు ( తమ్మలోని మేళం)కాటికాల(కాట్నం)కుంటలో భూమి దున్నుతుండగా జోగు మల్లయ్య నాగలికి చాలా పెద్దదైన లోహపు గంట తగిలింది . ముస్లిం దొర ఆ లోహపు గంటను త్రవించిండు . గంటతో పాటు విష్ణుకుండినుల కాలంనాటి 787 రాగి నాణాలు బయటపడినాయి , నాణాలను పురావస్తు శాఖకు అప్పగించారు.
    టంగుటూరుకు సుమారుగా 70 కి.మీ. ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం ( ఇంద్రపాల నగరం) విష్ణుకుండినుల రాజధాని. విష్ణుకుండినులు క్రీ.శ.358 నుండి 569 వరకు ఈ మధ్య కాలంలో 12 మంది రాజులు పాలించారు. బి. ఎన్ శాస్త్రి ఆధారాలతో నిరూపించారు.
    గతంలో ఎల్లంల గ్రామం గుట్ట దిగువన భూ గర్భంలో విష్ణు కుండినుల కాలం నాటి ఇటుకలతో కట్టిన నిర్మాణాలను డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి వెలుగులోకి తెచ్చారు.
    కీసర భువనగిరి జనగామ వరకు విష్ణు కుండినుల చారిత్రక ఆధారాలు బయటపడినాయి
    అడ్లూరు చెరువు
    శారాజీపేట్ వైపుకు అడ్లూరు చెరువు ఉంది. ఇక్కడి చిన్న పరుపు బండపై ఒక రోలు ఉంది.
    గ్రామంలోని హరిజనవాడలో నిలువెత్తు శాసనస్తంభం ఉన్నది. ఈ శాసనాన్ని అడ్లూరు చెరువు నుండి చెరువు దగ్గర నుండి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టారు
    4 వైపుల లిపి కనిపిస్తున్నది తెలుగన్నడ భాషలో లిపి రాయబడింది .క్రీస్తు శకం 992 నాటి రెండవ తైలపుని పాలనా కాలానికి చెందింది .
    రెండవ తైలప్పుడు మొదట్లో రాష్ట్ర కూటులకు సామంతుడిగా ఉన్నాడు. క్రీస్తు శకం 973లో స్వతంత్రుడై కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపన చేశాడు. ఆ తర్వాత అనేక యుద్ధాలు చేసి పశ్చిమ సముద్రం వరకు రాజ్య విస్తరణ గావించాడు. తైలపుడు జైన మతాన్ని అవలంబించాడు. ఈ తైలప్పుడు వేయించిన శాసనమే టంగుటూరు గ్రామం అడ్లూరు చెరువుపైఉన్నది. ఈ శాసనంలో అడ్డలూరు కామరాజు రేచయ సేద్య ధర్మ కీర్తన కొరకు రెండు మడతరుల నీర్నేల సర్వపరిహారంగా ఆ చంద్రార్కంగా నాలుగు మర్తరుల నేలను కార్తీక ఫలం కొరకు పసల కేసునికి మరికొన్ని మర్తరుల భూమి ఏడు డ్రమ్మాలు సిద్ధాయంగా మానికేశ్వర ప్రభునికి దానమిచ్చినట్లు తెలియపరచబడ్డది . మాణికేశ్వర ప్రభువు అంటే ఋషభనాథుడు . తీర్థంకరులలో మొదటివాడు.
    సమీపంలో మాణిక్యపురం గ్రామంలో ఈ మానికేశ్వర దేవాలయం ఉంది . ప్రస్తుతం అచట సప్తమాతృకల శిల్పం కనిపిస్తుంది.
    సారుగమ్మ : గ్రామం మధ్యలో ఉంది .
    మైలారు మల్లన్న : పూర్వమెప్పుడో ఇక్కడ గుడి ఉండేది. ఇప్పుడున్న వారెవరూ గుడి ఉన్నట్లు చూడలేదు. గుడి మీదుగానే దారి ఏర్పడ్డది. దారికి రెండోవైపు మల్లన్న ఎదురుగ .కొప్పు ముడిచి బాణం సంధించిన వీరగల్లు , భైరవ శిల్పం ఉన్నాయి.
    పెంబర్తి శివారు దాటి టంగుటూరుకు వెళ్లే తవ్వలో ఒక కాలువ వస్తుంది. ఈ కాలువ సమీపంలో రాంరెడ్డి బాయి దగ్గర మరొక వీరగల్లు (వీరుని విగ్రహం) కనిపిస్తుంది.
    చెఱువు కట్టపై కంట మహేశ్వరుడు(కాటమయ్య) వనమైసమ్మ కొలువై ఉన్నారు.
    మల్లన్న చెరువు పైభాగంలో పెరుమాండ్ల బోడు ఉంది. చెరువు కట్టపై ఒక హనుమాన్ విగ్రహం ఉంది. జిల్ల పరిషత్ ఉన్నత పాఠశాల ముందు మంచినీళ్ళ బాయి దగ్గర పొలాల ఒడ్డుపై భక్తాంజనేయుడు ఉన్నాడు.
    చెరువులు : మల్లన్న చెరువు
    కుంటలు : గుడికుంట రాయకుంట గుండ్లకుంట , జువ్వాయి కుంట ఒర్రె మర్రి కుంట ( ఒర్రె)
    గుడి కుంట ఒక చారిత్రిక నేపథ్యం ఉన్న ప్రాంతం. ఈ కుంఠకు రెండు వైపుల నుండి నీళ్ళు వస్తాయి.తమ్మలోని మేళ్ల నుంచి వచ్చే పర్రె కాలువ గుడికుంటలో కలుస్తుంది. గుడికుంట కట్ట కిందున్న కింద పోతులింగని గడ్డ మీదుగ రాయకుంట్లకు నీళ్లు పోయేది. గడ్డ మీద పోతులుంగని విగ్రహం ఉంది.
    మరొక వంక మల్లన్న చెరువుకున్న బుర్ర తోము నుండి కొత్త బాయి చెలుక మీదుగా గోసులంబాయి నుంచి గుడికుంటకు నీళ్లు వచ్చేది.
    గుడికుంట మీద చాళుక్యుల కాలంనాటి ఒక శివాలయం ఉన్నట్లు తెలుస్తోంది . అప్పటి రాతి స్థంభాలు, పానమట్టం ఉన్నాయి.ఇక్కడ రెండు శాసనాలు ఉండాలి .శాసనం యొక్క పైభాగాలు మాత్రమే ఉన్నాయి .లిపి ఉన్న కింది భాగాలు కనుమరుగైపోయాయి.
    ముస్లింలు పాలక వర్గంగా ఏర్పడేసరికి ఊరు
    మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
    మూడు వంతుల ముస్లిం జనాభా ఒక వంతు హిందూ జనాభ అయ్యింది. అది కూడా వారికి సేవలు చేయడానికే హిందువులను తెచ్చుకున్నారని చెబుతారు. వందల ఎకరాలు వారి ఆధీనంలో ఉన్నాయి. అందుకే ముస్లిం సమాధులు ఎక్కువగ కనిపిస్తాయి. గుడి కుంట మీద ఉన్న చాళుక్యుల నాటి శివాలయాన్ని , ఇతర ఆలయాలను ధ్వంసం చేశారు. గుడికి చెందిన రాతి స్తంభాలను సమాధులకు ఉపయోగించారు.గుడి వద్ద ఉన్న రెండు శాసనాలు ధ్వంసం అయ్యాయి.కేవలం శాసనాల పై భాగం మాత్రమే ఉన్నాయి. లిపి ఉన్న కింది బాగాలు మాయం చేసారు. సమాధిపై ఉన్న ఒక కప్పు బండపై ఆనేక కప్ మార్క్స్ ఉండడం విశేషం.రజాకర్ల ఆధిపత్యం తొలగిపోగానే ముస్లింలు ఊరిని పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక కుటుంబం మాత్రమే ఉంది.
    పీర్ల పండుగను ఊరివాళ్లే పెద్ద ఎత్తున చేస్తారు. గ్రామంలో ఉన్న అన్ని కులస్తుల వాళ్లే ఘనంగా పండుగ జరుపుకుంటారు గ్రామపంచాయతీ వద్ద పీరిల కొట్టం ఉంది.

КОМЕНТАРІ • 24

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 Місяць тому +2

    గుడ్ జబ్ సర్ వీలువైన వి భద్ర పరచాలి మ్యూజియం ఉండాలి🙏🙏

    • @discovermanreddyratnakarreddy
      @discovermanreddyratnakarreddy  Місяць тому

      కదా! గ్రామీణ మ్యూజియంలు (చిన్న గది)ఎక్కడి కక్కడ నిర్మించుకోవాలి.

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Місяць тому +1

    మీ అన్వేషణ చాల బాగుంది sir 💐💐👍👆 మరింత చరిత్ర లోతులోకి తీసుకు వెళ్లుతె బాగుండు🎉🎉

    • @discovermanreddyratnakarreddy
      @discovermanreddyratnakarreddy  Місяць тому

      నిజమే కానీ సమయం తక్కువ ఉండే.ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే.మీవద్ద ఎదైనా సమాచారం ఉంటే ఇవ్వండి

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 Місяць тому +1

      @@prabhakarperumandla9188 antha lothiki velthe oopiri adakapothe ela mari.??

    • @prabhakarperumandla9188
      @prabhakarperumandla9188 Місяць тому +1

      టంగుటుర్ పేరు....విష్ణుకుండి మహా రాజు తైలపుడి పేరున వచ్చి ఉంటుంది... 💐💐తైలవుడి ఊరు .... కాల క్రమేనా టంగూటురు గా రూపాంతరం చెందినది అని ఊహా 🌷👆💐

    • @discovermanreddyratnakarreddy
      @discovermanreddyratnakarreddy  Місяць тому

      @@prabhakarperumandla9188 ఊహ మాత్రమే.. టంగుటూరు పేరుతో చాలా ప్రాంతాలు ఉన్నాయి మరి

    • @discovermanreddyratnakarreddy
      @discovermanreddyratnakarreddy  Місяць тому

      @@prathapecotraveller1992వర్తమానంలో "ఆగి "గతంలోకి "పోతే "... వీలుంటే పోతే బాగుండు

  • @JUKANTIBABU
    @JUKANTIBABU Місяць тому +1

    Super

  • @NarendraSingh-yx5hk
    @NarendraSingh-yx5hk Місяць тому +1

    Nice video ancient historical knowledgeable information for us, thanks for this video sir g

  • @swethaswetha4973
    @swethaswetha4973 Місяць тому +1

    Great job sir

  • @tapentadol549
    @tapentadol549 Місяць тому +1

    Thanks for sharing..

  • @NarendraSingh-yx5hk
    @NarendraSingh-yx5hk Місяць тому +1

    Hello sir i request you for your videos you make video in your state language but you translate in English on your mobile screen for other states in indian people's understand this, sir my english is so poor you understand my feelings , Sir I love your videos but language problem is very much

  • @gouthamrishi7224
    @gouthamrishi7224 Місяць тому

    Ma Village gurinchi anveshana cheyadam chala bagundi thanks you sir

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 Місяць тому +1

    Gramasthula names kuda cheppadam bagundi...

  • @rajuballa3
    @rajuballa3 Місяць тому +1

    సూపర్ వీడియోస్ చేస్తుంటారు మీరు , మీ ఊరు ఎక్కడ

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 Місяць тому +1

    Communist stupam bagundi...nenu kuda veltha ekkadiki