వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొంగూరు నారాయణ,కొండపల్లి శ్రీనివాస్*

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొంగూరు నారాయణ,కొండపల్లి శ్రీనివాస్*
    ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపు లో ఉన్న ప్రాంతాలు పరిశీలించిన మంత్రులు
    ఆహారం పంపిణీ,తాగు నీటి సరఫరా పై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
    ....పొంగూరు నారాయణ,మున్సిపల్ శాఖ మంత్రి కామెంట్స్...
    సింగ్ నగర్ చుట్టుపక్కల బుడమేరు వరద క్రమంగా తగ్గుతుంది..
    బుడ మేరు వరద కు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నాం
    భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాం
    ఇరిగేషన్ కాలువలు ఆక్రమణల వల్ల ఇంత పెద్ద వరద వచ్చింది
    కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ఎక్కువగా ఉంది
    ఇందిరా నగర్,పాత ఆర్.ఆర్.పేట,కొత్త ఆర్.ఆర్.పేట, పాయకాపురం,సింగ్ నగర్ లో బాధితుల కంటే 5 రెట్లు ఎక్కువ ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు
    వరద తగ్గుతుందా లేదా అనే భయంతో కొంతమంది అవసరం లేకున్నా ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు
    బుడ మేరు గండ్లు పూడ్చడంతో మళ్ళీ వరద నగరంలోకి వచ్చే అవకాశం లేదు
    ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు
    నీరు తగ్గగానే పారిశుధ్య పనులు వేగవంతం చేస్తాం
    వర్షంలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి
    ఈరోజు ఉదయానికి అడుగున్నర మేర తగ్గింది
    రేపు ఉదయానికి పూర్తిగా వరద నీరు వెళ్లిపోతుంది
    ఫైరింజన్లతో బురద ను తొలగించి, శానిటేషన్,‌ క్లోరినేషన్ చేస్తాం
    వరద నీరు బయటకి వెళ్లిన 12 గంటల్లో ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తాం
    12‌లక్షల ఆహారం ప్యాకెట్ లు మొదల్లో పంపాం
    ఇప్పుడు నాలుగు లక్షల ప్యాకెట్ లు పంపుతున్నాం
    లోపల ఉన్న వరద బాధితులకు కూడా అన్నీ అందేలా చూశాం
    బుడమేరు కు పడిన గండ్లు పూర్తిగా గా పూడ్చివేశారు
    ఇంకా కట్ట ఎత్తు పెంచాలని నిర్ణయించి పనులు చేపట్టారు
    బుడమేరు వరద నుంచి శాశ్వతంగా ప్రజలకు రక్షణ ఇచ్చే విధంగా కట్ట ఉండాలని చంద్రబాబు ఆదేశించారు

КОМЕНТАРІ • 1

  • @swarnadas2763
    @swarnadas2763 9 днів тому

    Ede photoshoot ante.... Elantivi workout kaadippudu