బీరకాయ, బీరకాయ పొట్టుతో ఒక రుచికరమైన రోటి పచ్చడి | Beerakaya Roti Pachadi

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2023
  • బీరకాయ, బీరకాయ పొట్టుతో ఒక రుచికరమైన రోటి పచ్చడి | Beerakaya Roti Pachadi @HomeCookingTelugu
    #beerakayapachadi #rotipachadi #ridgegourdchutney
    Our Other Roti Pachadis:
    Kandi / Kandipappu Pachadi: • నోరూరించే కందిపచ్చడి వ...
    Tomato Coriander Pachadi: • ఇడ్లీ దోశల్లోకి అద్భుత...
    Kobbari Mamidikaya Pachadi: • చిటికెలో తయారయ్యే కమ్మ...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 25 నిమిషాలు
    సెర్వింగులు: 6
    పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు:
    బీరకాయలు
    బీరకాయ పొట్టు
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ధనియాలు - 1 టీస్పూన్
    టొమాటో - 1
    పచ్చిమిరపకాయలు - 4
    వెల్లుల్లి రెబ్బలు - 5
    కల్లుప్పు - 1 1 / 2 టీస్పూన్లు
    చింతపండు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 4 టీస్పూన్లు
    మినప్పప్పు
    ఆవాలు
    జీలకర్ర
    ఎండుమిరపకాయలు
    వెల్లుల్లి రెబ్బలు
    ఇంగువ
    కరివేపాకులు
    తయారుచేసే విధానం:
    ముందుగా బీరకాయను శుభ్రంగా కడిగి, పొట్టు తీసేసి, పొట్టును విడిగా పెట్టి, కాయను చిన్న ముక్కలుగా తరిగి, పక్కన పెట్టుకోవాలి
    ఒక వెడల్పాటి బాండీలో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి బాగా దోరగా వేయించాలి
    ఆ మూడూ వేగిన తరువాత బీరకాయ ముక్కలు, బీరకాయ పొట్టు వేసి, మరొక ఐదు నిమిషాలు వేయించాలి
    ఐదు నిమిషాల తరువాత బాండీలో టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు, చింతపండు వేయాలి
    బాండీకి ఒక మూత పెట్టి, పదార్థాలన్నింటినీ కనీసం పావు గంట సేపు మీడియం-లో ఫ్లేములో మగ్గించాలి
    పావు గంట తరువాత పొయ్యి కట్టేసి, వేయించిన పదార్థాలు అన్నిటినీ పూర్తిగా చల్లార్చి, ఒక మిక్సీలో వేసి కచ్చా-పచ్చాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి
    ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసిన తరువాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి
    ఆయావాలు చిటపటలాడిన తరువాత పొయ్యి కట్టేసి, కరివేపాకులు కూడా వేసి వేయించి, పొయ్యి కట్టేయాలి
    తయారైన తాలింపును పచ్చడిలో వేసి కలపాలి
    అంతే, బీరకాయ రోటి పచ్చడి తయారైనట్టే, దీన్ని వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది
    Ridge Gourd is a vegetable that's available through out the year. It's very common in telugu households for making curries or dal. In this video, you can see the preparation of a nice roti pachadi with ridge gourd. The specialty is that we have used the outer skin of ridge gourd too in this pachadi. Ridge gourd skin is a wonderful source of dietary fibre and it is wise to use it in the cooking instead of doing away with it. This roti pachadi is the best way to incorporate that beerakaya thokku because not only it makes this dish healthier, but also very very tasty! You would only know it once you try it yourself. So watch the video till the end to get a step-by-step method on how to make this roti pachadi quickly and easily. Try the recipe and let me know how it turned out for you guys, in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 45