Chaduvukunna Ammayilu Movie | Vinipichani Raagale Song | ANR | Savitri | Old Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Chaduvukunna Ammayilu Movie
    Watch Telugu Old Songs Vinipichani Raagale old hit song from "Chaduvukunna Ammayilu" Movie, Starring ANR, Savitri. Movie Directed by Adurthi Subba Rao and Produced by D. Madhusudhana Rao, Music composed by Saluri Rajeswara Rao.
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 757

  • @govindaraothamminaina5577
    @govindaraothamminaina5577 3 роки тому +82

    తెలుగులో తీయదనం, పదాల అల్లిక, మహాతల్లి సుశీలమ్మ గొంతు, వీటికి తగ్గ సంగీతం, సావిత్రమ్మ అభినయనం కలగలిపి వీనుల విందైన తెలుగు పాట... ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.
    ఇలాంటివి భవిష్యత్తు లో కూడా వస్తాయని ఆశిద్దాం.
    దేశభాషలందు తెలుగు లెస్స.

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +25

    ఇంత అద్భుతంగా ఎవరు నటించగలరు ఒక్క సావిత్రిగారు తప్ప .ఇంత చక్కగా ఎవరు పాడగలరూ సుశీలగారు తప్ప .ఇంత బాగా ఎవరు స్వరపరచగలరు రాజేశ్వరరావుగారు తప్ప .ఈపాట వింటుంటే మనసు ఎక్కడికో పోతోంది

  • @kottusekhar9237
    @kottusekhar9237 Рік тому +26

    యుగళ గీతాలు, విరహ గీతాలు, వీణ పాటలు - వీటిలో దేనిని ఆస్వాదించాలన్నా అన్నపూర్ణ వారి సినిమాలే చూడాలి. నేను రామా రావు గారి అభిమానినైనా , నాగేశ్వర రావు గారి 1960 వ దశకం సినిమాలలో పాటలను పిచ్చిగా ప్రేమిస్తాను. ఆ పాటలలో మాధుర్యం, మార్దవం, అర్ధం అద్భుతం. ఆత్రేయ, ఆరుద్ర, నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ, కొసరాజు, రాజేశ్వర రావు, పెండ్యాల - అన్నిటినీ మించి అమర గాయకుడు ఘంటసాల కోకిలమ్మ సుశీల - ఎవరని చెప్పం, ఏమని చెప్పం. ఇక సావిత్రి, నాగేశ్వర రావు ల అభినయం ఉండనే ఉంది.

  • @RAJENBULUSU
    @RAJENBULUSU 3 роки тому +98

    ఇలాంటి మధుర గీతాలు రాసిన , పాడిన మహానుభావులు తెలుగు ప్రజలు జన్మ జన్మలో గుర్తుండి పోతారు. అలాంటి పాటలు, కవిత్వం ఈనాడు వెతికినా దొరకదు. హాట్స్ అప్ టూ all.

  • @srmurthy51
    @srmurthy51 5 років тому +40

    మహామహుల కలయిక నిదర్శనం ఈ గీతం...సావిత్రమ్మ, సుశీలమ్మ, సాలూరువారు,ఆదుర్తి,దుక్కిపాటి వీరందరు కలిపి ఇచ్చిన తీపి గుర్తు

  • @chandamamakathalu_by_rk
    @chandamamakathalu_by_rk 2 роки тому +28

    సావిత్రి గారి అంతటి గొప్ప నటి మన భారత జాతికి గొప్ప కలికి తురాయి. ఆవిడ నటనా వైదుష్యం,అభినయం, భావ ప్రకటన నభూతో నభవిష్యతి. ఆవిడ నిజంగా కారణ జన్మురాలు. భారతరత్న ఇవ్వడానికి అన్ని విధాలా అర్హురాలు. ఇప్పటికైనా అది మన జాతి గుర్తించి ఆవిడకి భారతరత్న ఇస్తే ఎంతో బాగుంటుంది.

  • @bvrrao8876
    @bvrrao8876 4 роки тому +64

    Aఅక్కినేని, సావిత్రి లాంటి జంట, భారతీయ సినీ జగత్తులో లేరు, ఇకపై రారు...వారి అద్భుత నటనను చూసి తరించిన తెలుగు వారిదే గా, నిజమైన అదృష్టం. మరణమే లేని మహా నటుడు, నటీమణి...అద్భుతం .

  • @eastgodavari5333
    @eastgodavari5333 2 роки тому +22

    పాట మొదట్లో మాస్టారు గారు మరియు సుశీలమ్మగారి ఆలాపన అద్భుతము...బహుశా రాజేశ్వరరావు గారు రాగాలు అన్ని అక్కినేనివారి కోసము నేర్చుకుని ఏరి కూర్చారు ఆ రోజులలో అనిపిస్తుంది...మొత్తం తెనుగు భాషాభిమానూలు అందరి ఆస్తి ఆ తరం లో వచ్చిన ఈ పరిజాతాలు
    ..

  • @adimurthy7711
    @adimurthy7711 4 роки тому +10

    సావిత్రమ్మ ,సుశీలమ్మ గార్ల కాంబినేషన్లో మరచిపోలేని ఒక మధురమైన పాట.అలసటను మరపించే ఒక కమ్మని పాట, ఈ పాట.

  • @viswam446
    @viswam446 2 роки тому +25

    నేను 90s generation వాడ్ని కానీ ఈ సాంగ్స్ విన్నప్పుడు మనసుకు చాలా హాయి గా ఉంటుంది..

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 9 місяців тому +7

    ఏమి మధురమైన పాటలు చెవి లో అమృతం పోసినట్టుగా ఉంది ఈ పాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 5 років тому +171

    మిగిలిన విషయాల లో ఎలా వున్నా కానీ ఆంధ్రులు అందరూ కూడా మహా అదృష్టవంతులు, కుప్ప పోసినట్టు అత్యంత ప్రతిభావంతులు , మహా గొప్ప కళాకారులు అందరూ కూడా తెలుగు వారిగానే పుట్టడం అనేది ఆంధ్రులు చేసుకున్న గొప్ప అదృష్టం ,నా అభిప్రాయం లో తెలుగు లో వున్న కళాకారుల కి ఎవరూ కూడా సాటి రాలేరు , మిగిలిన భాషల లో కళాకారులకి వారు ధరించే పాత్రల కి పరిమితి వుంది, కానీ తెలుగు లో వున్న కళాకారులకి పరిమితి లేదు, ఎటువంటి పాత్రనైనా అవలీల గా చేయగలరు, అంత వరకూ ఎందుకు , పౌరాణిక చిత్రాల లో తెలుగు వారిని మించి ప్రతిభ చూపించగల వారు ఏ భాష లోనూ లేరు అని నా అభిప్రాయం

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 років тому +4

      Thanks for your comment !!!

    • @truevoice579
      @truevoice579 5 років тому +3

      eswar poosarapu correct

    • @krishnabala2852
      @krishnabala2852 4 роки тому +6

      Your views are cent percent correct

    • @medurihimabindu1319
      @medurihimabindu1319 Рік тому +5

      100% Correct

    • @prasadnus1784
      @prasadnus1784 Рік тому +9

      అద్భుతమైన కళాకారులు ఒకేసారి కట్టకట్టుకుని పుట్టేశారు.
      అదీ మనకోసం లేక వారిటైంలో పుట్టడం మన అదృష్టం.

  • @nandamam4u
    @nandamam4u 2 роки тому +35

    తెలుగు భాష మీద మమకారం ఇలాంటి మధురగీతాల మూలంగానే ఇనుమడిస్తుందన్నది ఎంతైనా వాస్తవం 🙏

  • @stalinmurre3126
    @stalinmurre3126 2 роки тому +32

    ఓ ఓ ఆ ఆ ఓ ఆ
    ఓ ఓ ఆ ఆ ఓ ఆ
    వినిపించని రాగాలే కనిపించని అందాలే
    అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
    వినిపించని రాగాలే ఏ ఏ
    తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
    తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
    చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
    వలచే మనసే మనసు
    వినిపించని రాగాలే ఏ ఏ
    వలపే వసంతముల పులకించి పూచినది
    వలపే వసంతముల పులకించి పూచినది
    చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
    విరిసే వయసే వయసు
    వినిపించని రాగాలే ఏ ఏ
    వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
    విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
    ఎదలో ఎవరో మెరిసే
    వినిపించని రాగాలే కనిపించని అందాలే
    అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
    వినిపించని రాగాలే ఏ ఏ

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 роки тому +17

    "ఏమని చెప్పాలి, ఒక మైమరుపు, ఒక మధుర స్మృతి"

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 5 років тому +13

    అక్కినేని సున్నితమైన హావభావాలతో నటించిన వేల సన్నివేశాలలో ఇదొకటి. అక్కినేని... జోహార్లు

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 5 років тому +27

    మహానటి సావిత్రి(3)//
    అచ్చ తెనుగింటి ఆడపడుచుగా బహు
    …………….ముచ్చటైన చిరునామా గాదె మహానటి సావిత్రి,
    మురిపంబుగ ముఖకవళికలు తోడనే
    ………...నవరసభావాలు నందించెగాదె సహజనటి సావిత్రి,
    నిండుదనానికీ నిలువెత్తు సాక్ష్యంబుగ
    …………...మంచితనానికి మారుపేరుగాదే మేటినటి సావిత్రి,
    జనసముద్రము జయ జయ ధ్యానాలు
    …………...పలుక నిలువలేక నింగికెగసిన తారామణి సావిత్రి!!

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 Рік тому

      తల్లి సావిత్రిగారిని గురించి మీరు పలికిన పలుకులు తెనియలోలుకు తియ్యని తెలుగు వెలుగు జిలుగులు మీకు నా హృదయపూర్వక అభినందనలు

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +1

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @pappalaarunakumaritelugu5156
      @pappalaarunakumaritelugu5156 Рік тому

      aaa అద్భుతం అముత్ a

  • @hanumanthrao505
    @hanumanthrao505 2 роки тому +10

    ఇలాంటి పాటలు రాసిన వారికి మరియు పాడిన వారికి చాలా చాలా ధన్యవాదాలు

  • @prasadrao1875
    @prasadrao1875 6 років тому +17

    ఓహో.... ఎంత అద్భుత గీతం... బహు చక్కని గానం..మైమరిపించే సంగీతం... అత్యద్భుత నటనం..సుందరమైన సన్నివేశం...ఈ పాటకు పంచ ప్రాణాలు.

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +12

    ఆ పాత. మధురం.ఇలాంటి పాటలు వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 роки тому +8

    సాహిత్యం,సంగీతం,భావం మరియు హృదయ రంజకమైన గానం మరో లోకంలో విహరింప జేసింది.

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +4

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరధి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో మహానటి సావిత్రి గారి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం అమేఘం.

  • @bvrrao8876
    @bvrrao8876 2 роки тому +4

    లవకుశ లాంటి ట్రెండ్ సెట్టర్ ని, నిలిచి గెలిచిన చిత్రం ఇది.......హైదరాబాద్ లో ఫస్ట్ డబుల్ థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా.

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 роки тому +32

    One of the sweetest songs ever sung by legendary Suseelamma garu. What a combination. Suseelamma garu, Savithri garu, ANR garu. Those are golden days. Will never come again.

  • @nbrk5581
    @nbrk5581 7 років тому +42

    Probably, Smt.P.Susila's best song overflowing with feminine beauty , grace and poise! Savitri's depiction of the deep feelings adds life to it. Overall, it is a real treat to both our ears and eyes.

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 6 років тому +2

    ప్రపంచం మొత్తం లో ఇలాంటి నటి ఇంకా పుట్టదు రాదు యాక్టింగ్ చేసేవాళ్ళు లేనే లేరు జైహింద్ సావిత్రి

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 2 роки тому +12

    Nobody in the earth can act like Savithri garu.

  • @SaiSai-ik6hl
    @SaiSai-ik6hl 4 роки тому +30

    2020లో ఈ సినిమా చూసిన వాళ్ళు మంచి మెసేజ్ పాటలు అద్భుతంగా ఇప్పుడు సినిమాల్లో ఇలాంటి క్లారిటీగా రావడం లేదు అని తప్పకుండా తెలుసుకుంటారు నేను తెలుసుకున్నాను చదువుకున్న అమ్మాయిలు సినిమా బాగుంది సినిమా మొత్తం ఒక ఎత్తు వినిపించని రాగాలే పాట ఒక ఎత్తు

    • @krishnakumariregulagedda7148
      @krishnakumariregulagedda7148 3 роки тому +3

      ఇలాంటి పాటల సాంకేతిక బృందం, నటినటులు "నభూతో నభవిష్యత్"

    • @bvrrao8876
      @bvrrao8876 2 роки тому +2

      Lavakusa prabhanjanam lo release ayyi koodaa Super hit ayina movie idhi.....aanaati natulu leru, ikapy raaru....4 songs, fights 1 item song, Ave cinemaa anukune e tharam ku, ituvanti movies chooste, movie ante yelaavundaalo ardham avutundhi....

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 років тому +34

    ఎంత తీయగా, మధురం ఉంది సుశీలమ్మ గొంతు.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ.. అలాగే, కళ్ళతో, అధ్బుతమైన నటనతో, ప్రేక్షకులను ఆకట్టుకునే సావిత్రి లాంటి నటి ఇకరారు...అంతే, గడచిన రోజులు రావుగా మరి..సూపర్ హిట్ పాట 0:03

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 роки тому +4

    వినిపించని రాగాలే.... ఎంత మధుర గాత్రం....!

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 роки тому +15

    ఘంటసాల గారి గానంతో పోటీ పడి సుశీల గారు పాడిన ఈ పాట అందమే అందం. వలపే వసంతంలా...

  • @yeshwanthnaiduarcot
    @yeshwanthnaiduarcot Рік тому +1

    నేను చాలా అదష్టవంతున్ని ఇటువంట్టి పాటలు వింటునునను yeshwanth naidu Bangalore 28/4/23

  • @Mrmaravego
    @Mrmaravego 12 років тому +43

    The inimitable shrillness in the voice of Sushila reflected in this song is impossible for any one to adopt/copy.Her voice has joined Savithri's action just as gold has assumed fragrance.Telugu audience & the music lovers are indeed blessed with this duo

  • @MuraliMadupu
    @MuraliMadupu 11 років тому +8

    S Rajesawra Rao Garu, you live in our hearts for ever.Even though you are not physically here, you live in our hearts for ever and ever. Savitri garu you are also a great boon to Millions of Andhras, Just we love you mam, What a time it was a golden era of Telugu film industry.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 місяці тому

    యే యెన్ ఆర్ ను చూడగానే సావిత్రికి.సిగ్గు వొచ్చేస్తుంది హి లవ్స్ సావిత్రి/

  • @baskara3850
    @baskara3850 6 років тому +6

    I,m from Tamilnadu and i have very little telugu knowledge. I never knew Telugu films old has so many immortal numbers . I stumbled upon a few old Telugu film geethamu and now I go after those treasures. If anyone can provide me with a list of such great songs I,ll be very grateful. Also please let me know where I can get the English translation for the old songs so that I can not only enjoy the music scenes but also the contents and contexts. Thank you Old Legends for your strife for excellence and your great capability to give us such songs which will live forever cutting across all linguistic barriers.

  • @baskara3850
    @baskara3850 6 років тому +24

    What a beautiful countenance of the Ever great Savithri. I think we may never come across such talented artists of class if ANR garu and Savithri.

  • @mohanite
    @mohanite 11 років тому +59

    Mahanati Savitri - She is a definition for acting. Versatility is her forte. She breathes life into every role she played. She is obsessed with films and she came into this world just to show, what acting is all about. She made even social films enjoyable with her histrionics. She has beauty, talent, sweet pronunciation, radiance in her face and eyes. Adorable lady who left early like Ghantasala and SV Ranga Rao, but lives in our hearts for ever. Gift to south Indian audience, made Telugus proud

    • @gstsayi4413
      @gstsayi4413 3 роки тому

      Nothing more vanne written than the above. Her talents may be studied by Research Scholars and make a subject in Fine Arts Colleges.Every movement of expression through her face, eyes and modulation are specialities. The critics and the biopic exposed unnecessary matters of her personal life which is unwarranted.The subject on histrionics should caution that the personal matters should not be touched. May she be in all our hearts forever.

    • @vasudevarao9548
      @vasudevarao9548 3 роки тому

      @@gstsayi4413 ppplpppppp

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 2 роки тому

      Manchi maduramina patalu vin dam manasuku mandu💕💕💕

  • @చౌదరిమలసాని
    @చౌదరిమలసాని 7 років тому +8

    One of the greatest & ever green songs of P Susheela which is elevated by sterling performance of Mahanati Savitri.

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 4 роки тому +10

    Beautiful song hundreds and hundreds of times I listened this song but never got bored and no one else could do justice to this Melody except savitrammagaru and susheelammagaru,hats off to both legends

  • @kathanzia
    @kathanzia 2 роки тому +1

    karna pEyam .Sweet memories. What a grace.

  • @mcramu6209
    @mcramu6209 2 роки тому +2

    Evergreen

  • @KrishnaPrasad-fx2iy
    @KrishnaPrasad-fx2iy 2 місяці тому

    తెలుగు వారికి దొరికిన అదృష్టం సుశీల గారు ఘంటసాల గారు..

  • @rramya8801
    @rramya8801 6 років тому +27

    Old is gold....savitri Amma meru super

  • @bhaskerreddykoppula5412
    @bhaskerreddykoppula5412 10 років тому +22

    Hats off to the singer Smt. P.Suseela, actress, music director, ans SMT.Savithri.
    wat a song is this. exquisit.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +2

    ఏ ఎన్ ఆర్ మరియు సావిత్రీ నటించిన
    చిత్రము.సూపర్ మూవీ.సూపర్ సాంగ్.

  • @geetavemuganti7345
    @geetavemuganti7345 8 років тому +31

    This is among the top 3 duets of the great Ghantasala garu & legendary Susheelamma. Must be shown regularly on electronic media.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 років тому +16

    ఓహో... ఆహా.. హా... అందమైన ఆలాపన..

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 місяці тому

    మా కోసం పుట్టి మాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చి నీ జీవితాన్ని కష్టాల మయం చూసుకున్నావా సావిత్రమ్మా

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 6 років тому +7

    Old is better than gold, hats off to Savitri , Ghantasala and suseelamma, we feel very great as all these artists belonging to our Telugu language

  • @shankarwankhare8402
    @shankarwankhare8402 5 років тому +6

    Acting of the Savitri Madam in The 2nd Stanza is too beautiful to describe and it will be remembered for the Generation to come

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 Місяць тому

    ఈ పాట మీరు చక్కటి గళంతో ఎంతో అధ్బుతముగా పాడారు.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +4

    Melody and actions of Savitrigaru ,really competing each other. Enchanting ambiance -soothing and delightfull.

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 роки тому +5

    తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే....!

  • @dsnr2116
    @dsnr2116 4 роки тому +3

    సుశీలమ్మ గారూ, అమృతాన్ని కురిపించారమ్మా. మీకిదే వందనం.

  • @tulasiammi6827
    @tulasiammi6827 3 роки тому +5

    No one can replace,savithri garu 👌😘👑

  • @ggreddy3568
    @ggreddy3568 3 роки тому +2

    Beautiful voice of p .susheela

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 6 місяців тому

    another duet song of anr garu and e.v.saroja garu .super songs.😊❤

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 роки тому +1

    బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం,
    లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం,
    నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం,
    నాగేశ్వరరావు,ఘంటసాల,
    రామారావు తెలుగు సినీ కళాత్రయం,
    సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!

  • @yashsneha6388
    @yashsneha6388 2 роки тому +2

    Great and talented actors anr and savitri and best pair in telugu cinema field. Many films they have acted and got best fame and name. ANR and Savitri best combination.

  • @srmurthy51
    @srmurthy51 6 років тому

    స్వచ్ఛ మయిన తెలుగు పదాలను ఉచ్చారణ దోషం లేకుండ పలికే తెలుగుతెలిసిన గాయకులు కావాలి.....భావవ్యక్తీకరణ స్పష్టంగా ర్రాసే రచయిత, శబ్దం పదం మాత్రమే వినపడే సంగీతం ఇవి అన్ని కలిసి చక్కగా వెండితెరమీద పండించే నటులు సాంకేతిక నిపుణులు ఉండాలి....అప్పుడు వస్తాయి ఇలాంటి పాటలు......

  • @gayatriangirekula6902
    @gayatriangirekula6902 7 років тому +5

    One of the most melodious songs ever. Thanks for sharing.

  • @mohanaraobvsr8021
    @mohanaraobvsr8021 9 років тому +6

    one of the melodious song of Savitri - Great actress

  • @eswarb6770
    @eswarb6770 5 років тому +1

    మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @vishnusarma829
    @vishnusarma829 4 роки тому +5

    What a song Suseelamma sang! Hats off to S. Rajeswara Rao garu.

  • @jakkulasrinivasarao8244
    @jakkulasrinivasarao8244 6 років тому +9

    Anr and Savithri gaarus haunting melodies

  • @carnaticclassicalmusicbyad1319

    Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏾🙏🏾🙏🏽🙏🏽 amma ku bharatha ratna ivvaali 🙏🏻🙏🏻😭😭😭😭😭😭

  • @vijayakumargovindaraj1817
    @vijayakumargovindaraj1817 3 роки тому +3

    Enchanting melody of susilamma .it is forunate one that we are living in her era .

  • @subrahmanyamdornadula3947
    @subrahmanyamdornadula3947 7 років тому +17

    What a great actress savithri garu. Marachipolenatuvanti chithralu aa rojullow

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 4 місяці тому

    Anr,savithri evergreen combination.

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 8 років тому +36

    Salutations to the legendary actress Savitri garu.... Uncrowned MIss Universe...No one else ever.....

    • @ajithasowjanya4789
      @ajithasowjanya4789 8 років тому

      good

    • @subbarayuduthota46
      @subbarayuduthota46 7 років тому

      Ajitha Sowjanya hu desesexso ngdsex

    • @jaykumarrao138
      @jaykumarrao138 3 роки тому +2

      I agree with u

    • @tirupativenkatalakshmanrao3020
      @tirupativenkatalakshmanrao3020 Рік тому

      ఇలాంటి పాటలు వినడం, సావిత్రి లాంటి మహానటి అభినయాన్ని తిలకించండం అదృష్టం.

  • @venkatanaiduchalla4789
    @venkatanaiduchalla4789 2 роки тому +2

    How those actors given happiness to us especially old generations with their wonderful performance. They are really AMARALU

  • @vegesnaprabhakararaju5422
    @vegesnaprabhakararaju5422 День тому

    Remembering ANR Sir, on the occasion of his Centenary Birth Anniversary, a tribute to him for his contribution to the Telugu Cinema for more than seven decades.

  • @NagiVY
    @NagiVY 9 років тому +3

    What an excellent humming by mana Ghantasala. I listen for this song many times to hear our Ghantasala humming.

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 Рік тому

    ఎంత మధురమైన పాట.అందుకే మన తెలుగు భాషను ఇటాలియన్ఆఫ్ ది ఈస్టు అన్నారు.

  • @HemaLatha-cj5rp
    @HemaLatha-cj5rp 4 роки тому +7

    Suseelaismy
    Favaratesinger

  • @ushaakula5877
    @ushaakula5877 8 років тому +58

    If one wants peace of mind and want to relax just listen these songs. No medicine is required dam sure. Hats off to all greats. We are very fortunate enough that we atleast hear and know about those legends.

    • @EntertainmentWorld-qg3gc
      @EntertainmentWorld-qg3gc 7 років тому +2

      usha akula u r Right madam

    • @babualluri2051
      @babualluri2051 7 років тому

      Murali (I have classmate and a best of friend of mine in Kadapa, who and his brother take care of old Kadapa Temple),
      Anyway, I used to practice Homeopathy for lorry workers, classmates, friends ... while recording Telugu and Hindi songs. Peace of mind is the remedy for all so called deceases (I shared couple of times on San Francisco Indian Radio channel with our local medicine practitioners); and the message 2000 years ago given by Jesus and many before and after. Music (my son name is Sangeeth) along with Nature as we part of (Sahaja, my daughter's name) is the THE natural Remedy. And is love. This song is a natural pill to our minds (soul). Sonthosham. Namshkaram! Babu Alluri!!

    • @EntertainmentWorld-qg3gc
      @EntertainmentWorld-qg3gc 7 років тому

      Babu Alluri Yes.....i totally agree......these type of songs gives u great relief at free of cost.....👍

    • @fazilbee8431
      @fazilbee8431 6 років тому

      usha akula

    • @harikrishnamaddala9082
      @harikrishnamaddala9082 6 років тому

  • @kaleshavalipathan0496
    @kaleshavalipathan0496 2 роки тому +3

    ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 3 роки тому +1

    Excellent, never hear in feature

  • @Rajatha831
    @Rajatha831 6 років тому +7

    Omg what a great song and great actress SAVITRI AMMA really awesome

  • @umarao6576
    @umarao6576 10 років тому +4

    Melodious song with beautiful lyrics and composition.

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 11 років тому +5

    One of best song from P Suseela. Best music, Best performance.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +1

    Toli chupulu Malone veliginche deepalu😍🔆🍀

  • @venkatakrishnaraoponna5852
    @venkatakrishnaraoponna5852 8 років тому +75

    It is our fortune that two legends SAVITRI and SUSEELA born as Telugus. How great they are -Just listen this song you will know

  • @sayadjelani8129
    @sayadjelani8129 Рік тому

    మదు రమైన, సంగీతం,చాలా బాగుంది

  • @geethajanardhanpoli3928
    @geethajanardhanpoli3928 10 років тому +39

    Savitri never die she is alive

  • @vishnuraff2581
    @vishnuraff2581 2 роки тому

    Enni sarlu vinna inka vinalanipistundhi.. 🙏🏼🙏🏼

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 12 років тому +6

    A classical definition of real purpose of music in cinema. Savitri the legennd.

  • @mpjkumari8611
    @mpjkumari8611 2 роки тому

    Super Sweet heart touching song.Hatsep to legends.Anr..Savithri.and.. Madhura Gaayakudu Ghantasala.. Susheela

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +2

    Nice n beautiful singing of p susheela beautiful young savitri evergreen anr beautiful songs beautiful music

    • @rajasekhar1094
      @rajasekhar1094 4 роки тому

      Excellent melodious song... to sleep one should listen before reaching bed... Rajasekhar Sambeta

  • @ajarajju5427
    @ajarajju5427 Рік тому +1

    Old days actresses were very lucky because they don't need to expose their body...but now days heroines are must be shown their something from their body for survive in industry

  • @murthyracherla8997
    @murthyracherla8997 9 років тому +21

    The magic of mohana raagam, it invokes love or makes a person love the song.

  • @BorugaddaSubbarao-x3t
    @BorugaddaSubbarao-x3t 5 місяців тому

    Mahanati Mom ,- Natural Wealth to the Telugu Cinema Field - - - She has an Angelic Beauty.

  • @drkavala
    @drkavala 5 років тому +5

    These songs make us take back to those days with sweat memories

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 років тому +8

    she is she great savitree

  • @VijayalakshmiGudari-kc6pu
    @VijayalakshmiGudari-kc6pu Рік тому +1

    Abdhutham I like thish song enni salru vinna vinalani anipishundi I miss you amma

  • @SriramasanjeevaraoBavisetti
    @SriramasanjeevaraoBavisetti Місяць тому

    అన్ని భాషలు కన్న దేశభాషలందు తెలుగు లెస్స

  • @satyanarayanamurthysrirama497
    @satyanarayanamurthysrirama497 9 років тому +2

    Very beautiful song in music and picturaisation.

  • @VenkateshVenkatesh-pw4se
    @VenkateshVenkatesh-pw4se 7 років тому +2

    supar Song Jai Akkineni Sir From Karnataka

  • @problemdog9723
    @problemdog9723 6 років тому +12

    Savitri garu🙏🙏🙏