నిషిగంధ గారికి అభినందనలు.. మనసులను కదిలించిన లేఖలను నవలగా మలచిన తీరు అధ్భుతం. మీపేరు లో వుంది గంధం. సాహిత్య పరిమళ గంధం.. నిజమైన కథని మరిచిపోలేకపోతున్నాం. కిరణ్ ప్రభ గారి గురించి ఏమి చెప్పగలం. వారు 60 దాటిన మాకు ఎంతో విలువైన విషయాలు తెలియజేస్తున్నారు. సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన మాకు వారు ఎంతో ఆనందం కలిగిస్తున్నారు. కిరణ్ ప్రభ గారికి వందనాలు. ఈ ఎపిసోడ్ విన్న తరువాత వారి కవితలు చదవాలి అనిపించింది. అవి ఎలా లభిస్తాయో తెలియదు.
భరించలేని కేన్సర్ నొప్పి తో , కార్తీక (సుజాత) దిగులుతో ఉరి వేసుకున్న సంఘటన, నవలిక లో తుది మలుపు. ఈ విషయం పై సమాజంలో అవగాహన రాహిత్యం చాలా ప్రబలమైన ది గా ఉన్నది. నొప్పి నివారణ , నొప్పిని తగ్గించే ప్రక్థియలు , డిప్రెషన్ లేకుండా చూసుకోవడం కేన్సర్ వ్యాధిలో అతి ముఖ్యనది. దీని పై ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ మెడిసిన్ , పాలియేటివ్ మెడిసిన్ బాగా వృద్ధి చెందాయి. ప్రస్తుతము నేను ఈ ప్రత్యేకమైన కేన్సర్ విభాగాల పై 2006 నుండి కేంద్రీక రిస్తున్నాను. పారా వర్టిబ్రల్ న్యూరోలైటిక్ బ్లాక్ అనే ప్రక్రియ , నొప్పిని మూడు నుండి నాలుగు నెలల వరకు తగ్గిస్తుంది, మరొక సారి మరొక ఇంజక్షన్ తీసుకోవలసి వస్తుందన్న మాట. ...Veteran Brigadier (Dr) CVR Mohan.
పెళ్లయిన అబ్బాయి మరియు అమ్మాయి మధ్య ఇది స్వచ్ఛమైన స్నేహం. ముగింపు విచారకరం కానీ ఆమె జీవించి ఉన్నప్పుడు మీరు మీ రచనలతో ఆమెకు అందమైన జ్ఞాపకాలను మిగిల్చారు. తన కొడుకు బాగానే ఉన్నాడని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. నిషిగంధ రచన అసాధారణమైనది. కుముదిలో ఆమె రచనలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఇది మీ కథ అని మీరు చెప్పినప్పుడు, got goosebumps. వీలైతే కిషోర్‌ని ఇంటర్వ్యూ చేయండి. మేము సుజాత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాము.
అయ్యా కిరణ్ ప్రభ గారు అద్భుతమైన మననం. మీ టాక్ షోలు పరిచయం అవడం నా పూర్వజన్మ సుకృతం (ఉసులాడే ఒక జాబిలటా విన్న తర్వాత నా అభిప్రాయం) మీ మనాన్ని ఆసాంతం ప్రత్యక్షంగా ఆపాత్రల దగ్గరే వుండి నేను ఆ దృశ్యాలను చూస్తున్న అనుభూతి అనుభవించాను.మీ narration నభూతో నభవిష్యత్. మొదట్లోనే మీరు బందరు దగ్గర మాజేరు అని చెప్తుంటే ఎందుకో నాకు మీ స్వానుభవం ఏమో అనిపించింది, అదీ కాక మీరు కొద్దిగా hint ఇచ్చారు చివరలో చెప్తాను అని. ఏది యేమైనా అద్భుతమైన మీ అనుభవాన్ని నవలగా మీదైన ముద్రతో వివరించి మా కంటతడి పెట్టించారు ధన్యవాదములు (అదేంటి కంటతడి పెట్టిస్తే ధన్యవాదములు అంటారు, అవును మీ narration విని బరువెక్కిన గుండెల్ని చివరలో కంటతడి తేలికపరచింది) 🙏🙏🙏
ఈ narration నా హృదయాన్ని కదిలించింది ఆ పాత్రల పరిపక్వత, నిజ జీవితములో ఆ హుందాతనం కొందరికే సాధ్యము. మా నెల్లూరు వ్యక్తుల తో బాంధవ్యము మరింత గా కళ్లుచెమర్చేలా చేసాయి నాకు. మీరు ఎన్నో విషాదాంత టాక్ షోలను నిర్వహించారు . కానీ ఎందుకో ఈ talkshow లో మీ గొంతుక ఓ దగ్గర కాస్థంత చెమర్చింది బహుశా నా మనసు ఆలా బావించిందా నిజామా తెలియదు. thank you sir once again for u r great effort 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹
నమస్తే కిరణ్ ప్రభ గారూ.నవల పేరే ఎంతో అందంగా అది మీనోట మరింత అందంగా అందులో మీనిజజీవిత సంఘటన అని విన్నాక మరీఅందంగా వుంది సార్.హృదయానికి హత్తుకుపోయే మంచి కధ వినిపించారు.
ఇంత అందమైన పేరు పెట్టినవారెవరో .. వారికి అభినందనలు. అదనపు సమాచారం అంటే ఆయా ఊర్లలో మీరు ఉండి ఉంటారు అని ఊహించాను. పరిణతి చెందిన మనుషుల మధ్య ఇంత చక్కని స్నేహ భావన సంభవం అని నిరూపణ అయింది. ఈ విడియో పెట్టిన 6నిమిషాల తర్వాత చూసి, ఏక బిగిన వినేసా. మనసు లోనించి ఆ పాత్రలు చెదరటం లేదు.
Wow superb what a beautiful narration Sir ending lo me nijajeevithaniki sambandhinchindi ani oohinchaledu sir very heart touching novel merku Nishi gandha gariki thank you so much 👌👍💐💐
నమస్కారం కిరణ్ ప్రభ గారు, "ఊసులాడే ఒక జాబిలట" ను అద్భుత నవలా రూపమిచ్చిన నిషిగంధ గారికి ముందుగా ధన్య వాదాలు.... ఇకపోతే మీకు సమకాలికుడు ఉండ టం నా అదృష్టం....నాకెంతో ఇష్టమైన మీ గొంతుకతో మీరు narrate చేసిన తీరు మహాద్భుతం. మీ విధానం, టైమింగ్,ఫ్లాష్ బ్యాక్ ....ప్రతి మాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మీరు చెప్పిన విధానం తో ఒక్క గంట సమయం లో 1985 నుంచి సంవత్సరాలు గిర గిర ఉత్కంఠ తో నవరసాను భూతులతో ఉక్కిిబిక్కిరి చేశాయి. స్వచ్ఛమైన స్నేహానికి మచ్చు తునక ఈ ధారావాహిక...నా భావాలను అక్షర రూపం లో వ్యక్త పరిచే అంతటి పొందిక నా తెలుగుకు లేదు... డస్సి ఉన్న నాకు మనోల్లాసం కలిగించిన మీకు అనేక ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు!
మీరు ఈ కథ చెప్పటం మొదలు పెట్టగానే నాకు అంజలి గారి ఇంటర్యూలో మీరు చెప్పిన ఈ సుజాత గారి విషయం గుర్తుకొచ్చింది. అయితే ఎట్టకేలకు కిషోర్ గారు కలిసారన్నమాట సుజిత్ మంచి స్తాయి లో ఉన్నందుకు సుజాత గారు ఉండి ఉంటే ఎంత బాగుండేది.హృదయాన్ని కదిలించిన కథ....కాదు కాదు నిజం.ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.
నమస్కారం..'ప్రభ'గారు.. సారీ కిరణ్ ప్రభగారు ఆద్యంతం ఆసక్తికరంగా విన్న తర్వాత.. ఇది మీ జీవితంలో జరిగిన విషాదాంతం అయిన'కథ' అని తెలుస్తోంది..మీరే మళ్లీ ఆ కథ ఆధారంగా వ్రాసిన నవల గురించి పరిచయం చేయడం ముదావహం.
thank you for bringing another beautiful story sir, nijam ga last lo meeru idi mee story ani cheptunnappudu oka rakamain high vachindi sir, next week me videos kosam wait chestu appudu varaku me sahithi smruthalatho gaduputho eduruchustu untam sir🙏 .
నిజంగా ఒక మనిషి జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా,ఇది ఎంత గొప్ప విషయం.సుజాత గారు,అశ్వారావుపేట లెక్చరర్ గారు,మీ లండన్ ఫ్రెండ్, ముగ్గురు మిమ్మల్ని కలిసుకోకుండానే చనిపోవడం ..ఇది గొప్ప విషాదం కూడా.
It’s very difficult to express our feelings after hearing the story till the end -with your concluding words! It was an unexpected shock or blow for me to know that the novel was based on a real life story ! It was very unfortunate that kartika(Sujatha) died by committing suicide ! It’s a tragedy that she got convinced to get married and then got this terrible disease!It is a very heavy loss for Sujatha’s family and more to you Prabhakar garu and Kiran garu ! Smt Nishigandha gave a personification to True friendship in this novel!She is commendable for her great work! Sir, Prabhakargaru ! We can only sympathise you for losing a real friend whom you could not see at all! Very heart touching real life story! Sujatha will remain always in our memories! 🙏🙏🙏
I am so touched , as I have ( during my childhood) witnessed those last days of my వదిన Ms . Sujata during her last days at Ruiya Hospital @ Tirupati. Recently , Purchased 5 Novels and gifted to few of my known persons . Regards to Sri Kiran Prabha Garu and Ms. Nishi Gandha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Just now I heard your narration on Novel Oosulade Jabilata written by Nishiganda. Ofcourse, asusal it is worth lisetening and your endeavour is praiseworthy. In the beginning of narration, you said some forty years back Malladi wrote a Novel completely with letters. It is not correct. If I am correct Muppala Ranganayakamma wrote this type of Nove basing completely with letters. This Novel is also worth reading and we cannot leave the Novel in the middle. This came as serial in a weekly. My age was below 20. I wondered that love letters can be written so elegantly.. This was her maiden attempt. Later she wrote novels about women who were being ill-treated. Slowly she changed after Marxist influence. I don't how you overcome this novel
A real Story of the life described in the most touchy way. Your association , sentiment & emotional attachment with the story has added a great value. A Wonderful Presentation and an Excellent Narration.
Thank you sir kiran orabha garu. Vusulade ఒక jabilataa. Mee talk showlu సుమారు 700 లు వినివుంటాను sir.ఏది విన్నా బాధగా ఉంటుంది kallaventa నీళ్లు వస్తాయి. కానీ బుధవారం కోసం ఎదురు చూస్తుంటాను. నవలలు అంటే తల నెప్పి 1965 to 1972. కానీ ఇప్పుడు vusulade ఒక jabilataa పుస్తకం ఎక్కడ దొరుకుతుందో etukkovalasi వస్తుంది. రచయిత్రి నిశిగంధ గారికి మొదట నా ఆశీసులు తరువాత నా కృతఙ్ఞతలు sir. Mee నిజజీవితాన్ని చక్కగా ఉత్తరల రూపంలో తెలియచేసారు. అంజలి గారితో mee ఇంటర్వ్యూ విన్నాను. గుర్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వినాలి. From guntur
ఉసులాడే... విన్నాను 1984-1988 నాటి జ్ఞాపకాల దొంతరలను కదిలించింది మీ టాక్ షో. సుజాత...నావిద్యార్ధినిగా తొలి పరిచయం. తర్వాత భావ సారూప్యం వల్ల మరింత దగ్గర యి కొ ద్దికాలం పాటు సామాజి కాంశాలలోపా లు పంచుకుని, స్వల్ప కాలం లోనే ఆమె జీవితం అత్యంత విషాదంగా ముగిసిపోవడం 8,9 నెలల బిడ్డను వదిలి..ఆసుపత్రిలో ప్ర త్యక్షంగా చూసిన జ్ఞాపకం కళ్లముందు కదిలి మనసు దిగులుతో బరువెక్కింది. నిషిగంధ గారు యదార్ధ సంఘటనల ఆధారంగా కలం స్నేహం లోని ఔ న్నత్యాన్ని నవల గా మలచిన తీరు హృదయంగమం. కొద్దికాలంగా మీ టాక్ షోస్ వింటున్నాను. తామరాకు మీద నీటి బొట్టు చందంగా మీ స్వంత అభిప్రాయాల ప్రభావం మాట్లాడు తున్న జీవిత/సాహిత్యా ల మీద ఏ మాత్రం ప్రసరింపనివ్వక balenced గా మీరు చేసే narration అబ్బురపరు స్తుంది . దాని వెనుక కృషి, commitment అర్థంేసుకోవ చ్చు టాక్ షో స్ విన్నాక మాట్లాడా లనిపించింది మొన్నటివరకు సుజాత జాబు రాసిన వ్యక్తి మీరని తెలియదు. తీ రా తెలిశాక కోరిక బలపడింది దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వండి కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు
కిరణ్ ప్రభ గారు మీ మీద కోపమొచ్చిందంది. కథ వింటున్నంతసేపు కార్తీక గారి నిరీక్షణ ఫలించాలని అనుకున్నాను. అందుకే వంశీ గారి మీద కోపం. అంటే మీ మీదే అని చివరకు తెలిసింది. ఇంతటి ఆర్ధ్రమైన మీ అనుభవాన్ని అందరికీ అనుభవైక రీతిలో అందించిన రచయిత్రి గారికి అభినందనలు. మీకు నమస్సులు.
Abhyudaya vadi kanukane vikas garu tana bharya snehanni aamodincharu, ada maga snehanni adi enta pavitramainadaina harshinche vallu nutiko kotiko okaruntaremo, pai pai natanalato lopala kullipotu tappanisariga bharistu eershapadevalle ekkuvuntaru, papam oka manchi manasunna ammayi manasaina vadito jeevitanni chivaridaka anubhavinchalekapoyindi, ippati rojullo aite liver transplant latidi sadhyapadedemo, vikas ameni batikinchukoleka enta madana padi untado kada 😪😪😪😪😪
ఇది కథ కాదు అన్న విషయం మీరు చెప్పిన ఆఖరి మాటలు హృదయం బాధ తో పాటు గుండె బరువు ఎక్కింది.....ఈ మధ్య నా తో నే పని చేసిన అమ్మాయి గుర్తు వచ్చింది. ప్రస్తుతం 4 7ఏళ్ళ వయసు లో ఇదే విధంగా పోరాడుతుంది....ఆ అమ్మాయి కి భగవంతుడు ధైర్యం ఇవ్వాలి అని అడుగు తూ ఉంట.....
మీ కథ విన్నాక కళ్లు చెమర్చాయి. అయితే యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల నవల మీ కథకి శ్వేచ్ఛానువాదం అనిపించింది. ఎవరిది ముందో గుర్తు రావటం లేదు. వొక సందేహం ఏంటంటే మొదటిసారి హైదరాబాద్ వచ్చిన సుజాతగారు మీ ఆఫీస్ కి ఫోన్ చేసి మాట్లాడి వుండే సదుపాయం ఎందుకు ఉపయోగించుకోలేదు? సహజమైన ఉత్సుకతతో ముందు జరిగే ప్రక్రియ అదేకదా. అలాగే కష్టపడి రాసిన నిషిగంధ గారి పరిచయం చెయ్యక పోవడం లోపం గా అనిపించింది. నిషిగంధ గారి ఫోటో కవితల తో నాకు పరిచయం వుంది. వారు అమెరికాలోనే ఉంటారని విన్నాను. కానీ మీ ద్వారా రచయిత్రి పరిచయం కుడా జరిగి వుంటే నిండుతనం వచ్చేది. ఎన్ని నిద్రలేని నిశీరాత్రులు రచయిత్రి మేధోమథనం చేసి పురిటి నెప్పులు భరించి నవలా పుత్రికని అందించారో. వారి గురించి పరిచయం చెయ్యక పోవడం తీగకు పందిరి కావలె గానీ తెలుసా నీవే పందిరని భావం గుర్తుకు తెచ్చింది. వీలయితే యీ కామెంట్ కింద సమాధానం లో తెలియబరచ గలరు🙏
నిషిగంధ గారికి అభినందనలు..
మనసులను కదిలించిన లేఖలను
నవలగా మలచిన తీరు అధ్భుతం.
మీపేరు లో వుంది గంధం.
సాహిత్య పరిమళ గంధం..
నిజమైన కథని మరిచిపోలేకపోతున్నాం.
కిరణ్ ప్రభ గారి గురించి ఏమి చెప్పగలం.
వారు 60 దాటిన మాకు ఎంతో విలువైన
విషయాలు తెలియజేస్తున్నారు.
సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన మాకు
వారు ఎంతో ఆనందం కలిగిస్తున్నారు.
కిరణ్ ప్రభ గారికి వందనాలు.
ఈ ఎపిసోడ్ విన్న తరువాత వారి కవితలు
చదవాలి అనిపించింది.
అవి ఎలా లభిస్తాయో తెలియదు.
భరించలేని కేన్సర్ నొప్పి తో , కార్తీక (సుజాత) దిగులుతో ఉరి వేసుకున్న సంఘటన, నవలిక లో తుది మలుపు. ఈ విషయం పై సమాజంలో అవగాహన రాహిత్యం చాలా ప్రబలమైన ది గా ఉన్నది. నొప్పి నివారణ , నొప్పిని తగ్గించే ప్రక్థియలు , డిప్రెషన్ లేకుండా చూసుకోవడం
కేన్సర్ వ్యాధిలో అతి ముఖ్యనది. దీని పై ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ మెడిసిన్ , పాలియేటివ్ మెడిసిన్ బాగా వృద్ధి చెందాయి.
ప్రస్తుతము నేను ఈ ప్రత్యేకమైన కేన్సర్ విభాగాల పై 2006 నుండి కేంద్రీక రిస్తున్నాను. పారా వర్టిబ్రల్ న్యూరోలైటిక్ బ్లాక్ అనే ప్రక్రియ , నొప్పిని మూడు నుండి నాలుగు నెలల వరకు తగ్గిస్తుంది, మరొక సారి మరొక ఇంజక్షన్ తీసుకోవలసి వస్తుందన్న మాట. ...Veteran Brigadier (Dr) CVR Mohan.
🙏
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది
ధన్యవాదములు
Methoo mataladaliii
పెళ్లయిన అబ్బాయి మరియు అమ్మాయి మధ్య ఇది స్వచ్ఛమైన స్నేహం. ముగింపు విచారకరం కానీ ఆమె జీవించి ఉన్నప్పుడు మీరు మీ రచనలతో ఆమెకు అందమైన జ్ఞాపకాలను మిగిల్చారు. తన కొడుకు బాగానే ఉన్నాడని తెలుసుకోవడం ఆనందంగా ఉంది.
నిషిగంధ రచన అసాధారణమైనది. కుముదిలో ఆమె రచనలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా?
ఇది మీ కథ అని మీరు చెప్పినప్పుడు, got goosebumps.
వీలైతే కిషోర్‌ని ఇంటర్వ్యూ చేయండి. మేము సుజాత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాము.
ఎంత స్వచ్ఛమైన స్నేహాన్ని పరిచయం చేసారండి నిజంగా మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏
మీరే కథలో ఒక ముఖ్య పాత్ర కావడం అద్భుతమైన కొసమెరుపు. వంశీ పాత్ర లోని ఉదాత్తత మీకే సొంతం
అయ్యా కిరణ్ ప్రభ గారు అద్భుతమైన మననం. మీ టాక్ షోలు పరిచయం అవడం నా పూర్వజన్మ సుకృతం (ఉసులాడే ఒక జాబిలటా విన్న తర్వాత నా అభిప్రాయం) మీ మనాన్ని ఆసాంతం ప్రత్యక్షంగా ఆపాత్రల దగ్గరే వుండి నేను ఆ దృశ్యాలను చూస్తున్న అనుభూతి అనుభవించాను.మీ narration నభూతో నభవిష్యత్. మొదట్లోనే మీరు బందరు దగ్గర మాజేరు అని చెప్తుంటే ఎందుకో నాకు మీ స్వానుభవం ఏమో అనిపించింది, అదీ కాక మీరు కొద్దిగా hint ఇచ్చారు చివరలో చెప్తాను అని. ఏది యేమైనా అద్భుతమైన మీ అనుభవాన్ని నవలగా మీదైన ముద్రతో వివరించి మా కంటతడి పెట్టించారు ధన్యవాదములు (అదేంటి కంటతడి పెట్టిస్తే ధన్యవాదములు అంటారు, అవును మీ narration విని బరువెక్కిన గుండెల్ని చివరలో కంటతడి తేలికపరచింది) 🙏🙏🙏
🙏💐
Inta vishadanni Maa gundelanida nimpinanduku Kalam Snehala sourabhani gurtuchesinadulaku meeku kruutagjatalu sir. Gurudatt episodes tarvata Ala vichalitundi chesinadi ee narration .
నిజంగా.. జాబిలి లాంటి సుజాత గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.... బరువెక్కిన హృదయంతో 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
So moving sir. Heart touching indeed.
ఈ narration నా హృదయాన్ని కదిలించింది ఆ పాత్రల పరిపక్వత, నిజ జీవితములో ఆ హుందాతనం కొందరికే సాధ్యము. మా నెల్లూరు వ్యక్తుల తో బాంధవ్యము మరింత గా కళ్లుచెమర్చేలా చేసాయి నాకు. మీరు ఎన్నో విషాదాంత టాక్ షోలను నిర్వహించారు . కానీ ఎందుకో ఈ talkshow లో మీ గొంతుక ఓ దగ్గర కాస్థంత చెమర్చింది బహుశా నా మనసు ఆలా బావించిందా నిజామా తెలియదు. thank you sir once again for u r great effort 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹
నమస్తే కిరణ్ ప్రభ గారూ.నవల పేరే ఎంతో అందంగా అది మీనోట మరింత అందంగా అందులో మీనిజజీవిత సంఘటన అని విన్నాక మరీఅందంగా వుంది సార్.హృదయానికి హత్తుకుపోయే మంచి కధ వినిపించారు.
ఇంత అందమైన పేరు పెట్టినవారెవరో .. వారికి అభినందనలు.
అదనపు సమాచారం అంటే ఆయా ఊర్లలో మీరు ఉండి ఉంటారు అని ఊహించాను. పరిణతి చెందిన మనుషుల మధ్య ఇంత చక్కని స్నేహ భావన సంభవం అని నిరూపణ అయింది.
ఈ విడియో పెట్టిన 6నిమిషాల తర్వాత చూసి, ఏక బిగిన వినేసా.
మనసు లోనించి ఆ పాత్రలు చెదరటం లేదు.
Wow superb what a beautiful narration Sir ending lo me nijajeevithaniki sambandhinchindi ani oohinchaledu sir very heart touching novel merku Nishi gandha gariki thank you so much 👌👍💐💐
Good story. Nice story telling by kirangaru.
Thanks.
స్వచ్చమైన స్నేహానికి, స్నేహితులకు స్వచ్ఛమైన హృదయమే ఆలవాలము..ఇది తెలుసుకొని నేటి తరానికి కనువిప్పు కలగాలి.
మీ విశ్లేషణ విన్నాక ఆనవల చదవాలని ఉంది ఆ నవల దొరికే పబ్లిషర్స్ చిరునామా తెలియపరచండి
కత బావుందో, మీరు చెప్పేరీతో,ఏమో!
అయోమయం.రెండూ అద్భుతః 😊
కత, గుండెతడిని ,కంట్లోకి జారింది.పంచినందుకు, ధన్యవాదాలు
Seriously sir. I dont have words after listening this.
నమస్కారం కిరణ్ ప్రభ గారు,
"ఊసులాడే ఒక జాబిలట" ను అద్భుత నవలా రూపమిచ్చిన నిషిగంధ గారికి ముందుగా ధన్య వాదాలు.... ఇకపోతే మీకు సమకాలికుడు ఉండ టం నా అదృష్టం....నాకెంతో ఇష్టమైన మీ గొంతుకతో మీరు narrate చేసిన తీరు మహాద్భుతం. మీ విధానం, టైమింగ్,ఫ్లాష్ బ్యాక్ ....ప్రతి మాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మీరు చెప్పిన విధానం తో ఒక్క గంట సమయం లో 1985 నుంచి సంవత్సరాలు గిర గిర ఉత్కంఠ తో నవరసాను భూతులతో ఉక్కిిబిక్కిరి చేశాయి. స్వచ్ఛమైన స్నేహానికి మచ్చు తునక ఈ ధారావాహిక...నా భావాలను అక్షర రూపం లో వ్యక్త పరిచే అంతటి పొందిక నా తెలుగుకు లేదు... డస్సి ఉన్న నాకు మనోల్లాసం కలిగించిన మీకు అనేక ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు!
మీరు ఈ కథ చెప్పటం మొదలు పెట్టగానే నాకు అంజలి గారి ఇంటర్యూలో మీరు చెప్పిన ఈ సుజాత గారి విషయం గుర్తుకొచ్చింది. అయితే ఎట్టకేలకు కిషోర్ గారు కలిసారన్నమాట సుజిత్ మంచి స్తాయి లో ఉన్నందుకు సుజాత గారు ఉండి ఉంటే ఎంత బాగుండేది.హృదయాన్ని కదిలించిన కథ....కాదు కాదు నిజం.ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.
Greatest talk show ❤
అద్భుతం గా వుంది.. ఒకసారి సుజిత్ ని కలిసి ఆ ఇంటర్వ్యూ పెట్టండి సార్
Super narration mind blowing ....
నమస్కారం..'ప్రభ'గారు.. సారీ కిరణ్ ప్రభగారు ఆద్యంతం ఆసక్తికరంగా విన్న తర్వాత.. ఇది మీ జీవితంలో జరిగిన విషాదాంతం అయిన'కథ' అని తెలుస్తోంది..మీరే మళ్లీ ఆ కథ ఆధారంగా వ్రాసిన నవల గురించి పరిచయం చేయడం ముదావహం.
నమస్తే, కిరణ్ ప్రభగారు.ఊసులాడే ఒక జాబిలట నవలను మీ కంఠస్వరం లో విన్నంతసేపూ హృదయం చాలా బరువెక్కిపోయింది.నిషిగంధ గారి రచనాపటిమ అద్భుతం.ధన్యవాదాలండి.
🙏
thank you for bringing another beautiful story sir, nijam ga last lo meeru idi mee story ani cheptunnappudu oka rakamain high vachindi sir, next week me videos kosam wait chestu appudu varaku me sahithi smruthalatho gaduputho eduruchustu untam sir🙏 .
Sir heart touch chesaru
Sir
మనసంతా ఏదో అయిపోయింది.
నిజానికి నేను ఎప్పటి లాగే వింటున్న కానీ అది మీ జీవితంలో జరిగిన సంఘటనలు అన్న తరువాత మైండ్ స్తంభించింది. 🙏🙏🙏
Good novel. No words. May God bless you Sir to bring more and more such novels.
KiranPrabha garu
Mee talkshow loni Nishighanda rachana! Meeru cheppe ”heart touching” story! SharadChandra chatopadya gari ”Srikanta” gurtu chechundi, alanti ”reallife ” gurichi gurtu chestunna meeku yento ”Vandanamulu”
Heart melting andi
నిజంగా ఒక మనిషి జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా,ఇది ఎంత గొప్ప విషయం.సుజాత గారు,అశ్వారావుపేట లెక్చరర్ గారు,మీ లండన్ ఫ్రెండ్, ముగ్గురు మిమ్మల్ని కలిసుకోకుండానే చనిపోవడం
..ఇది గొప్ప విషాదం కూడా.
It’s very difficult to express our feelings after hearing the story till the end -with your concluding words! It was an unexpected shock or blow for me to know that the novel was based on a real life story ! It was very unfortunate that kartika(Sujatha) died by committing suicide ! It’s a tragedy that she got convinced to get married and then got this terrible disease!It is a very heavy loss for Sujatha’s family and more to you Prabhakar garu and Kiran garu ! Smt Nishigandha gave a personification to True friendship in this novel!She is commendable for her great work! Sir, Prabhakargaru ! We can only sympathise you for losing a real friend whom you could not see at all! Very heart touching real life story! Sujatha will remain always in our memories! 🙏🙏🙏
మాటలు లేవు 😔🙏
Mee voice vine koddi vinali anipisthundi super
ఎంత అందమయిన అర్‌దవంతమయన పేరు పెట్టారు నవలకు రచఇత్రి తన ఊసులు ఊహలతో హృదయాన్ని కదిలించి
కరిగించి హఠాత్తుగా అదృశ్‌మఇ
మిమ్మలనే కాదు మాఅందరికీ తీరని వేదనను మిగిలించారు ఉత్తరాలు
రాయటం తిరిగి జవాబులు అందుకోవటంలోని ఒకనాటి ఆనందాన్ని గురుతుకు తెచ్చింది
ఈనవల పరిణితి చెందిన ఆడ-మగ చెలిమి ఎంత ఆదర్‌శంగా వుంటుందో
వుండవచ్చో ఆచరణలో చూపించారు
ఈవిషాదం మీతోబాటు మమ్మలినీ
వెన్నాడుతూనే వుంటుంది
అంతగా కదిలించ గలిగారు తన రచనతో రచఇత్రి ఆర్‌ద్రత నిండిన
గొంతుతో మీరు 🙏🙏🙏
Thank you very much sir. We are grateful to you. Lucky to have such a great narrator and writer in Telugu. ❤ namaste meeku and madamgariki.
Namasthe Kiran prabha garu, Very tragedy. Hridayaanni kadilinche katha.( Usulaade okajabilata Naa yadalo Sadi chesenata my favourite song)
Kudos🎉🎉🎉
చాలా హృదయ విదారకమైన నవల మీరూ చదివిన విధానము కళ్లకు కట్టినట్లు వుంది కిరణ్ ప్రభ గారు. ధన్యవాదాలు అండీ
నిజంగా ఊసులాడే ఒక జాబిలే, కార్తీక 🧡, వంశీ మోహన్, కారిక్తలా స్నేహం ఒక మధుర స్మృతి
Kiran prabha garu mee narration toh yedupu vachesindi andi katha akhari 5 nimishalu assalu yedupu apukoleka poyyanu, ilanti kadhalanu maaku parichayam chesinanduku miku sada krutagnatalu
I am so touched , as I have ( during my childhood) witnessed those last days of my వదిన Ms . Sujata during her last days at Ruiya Hospital @ Tirupati. Recently , Purchased 5 Novels and gifted to few of my known persons . Regards to Sri Kiran Prabha Garu and Ms. Nishi Gandha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram sir, mee vyakhyanalu vintuntanu, chala baga untayi, mee valana chala mandi goppavalla jeevita visheshalu telsukogalugutunnamu sir, thanks sir.
Good morning kiran prabha gaaru..
Just now I heard your narration on Novel Oosulade Jabilata written by Nishiganda. Ofcourse, asusal it is worth lisetening and your endeavour is praiseworthy. In the beginning of narration, you said some forty years back Malladi wrote a Novel completely with letters. It is not correct. If I am correct Muppala Ranganayakamma wrote this type of Nove basing completely with letters. This Novel is also worth reading and we cannot leave the Novel in the middle. This came as serial in a weekly. My age was below 20. I wondered that love letters can be written so elegantly.. This was her maiden attempt. Later she wrote novels about women who were being ill-treated. Slowly she changed after Marxist influence. I don't how you overcome this novel
Very touching episode!
Kiranprabhagaru, me life lo jarugina story , twist icharu
Mind blowing. No words
Your voice very nice sir🎉
Great description and real witness of kind and soft poet Kiran Prabha garu .
A real Story of the life described in the most touchy way. Your association , sentiment & emotional attachment with the story has added a great value. A Wonderful Presentation and an Excellent Narration.
పర్సనాలిటీ డెవలప్మెంట్ రచనల పై కిరణ్ ప్రభ గారు టాక్ షో చేయండి. ఉదాహరణకు. రిచ్ డాడ్ పూర్ డాడ్,etc❤🎉🎉
Very nice andi
Very very nice Kiran Prabha Garu
Title is awesome. I will read this book. Thanks 🙏
Thank you sir kiran orabha garu. Vusulade ఒక jabilataa. Mee talk showlu సుమారు 700 లు వినివుంటాను sir.ఏది విన్నా బాధగా ఉంటుంది kallaventa నీళ్లు వస్తాయి. కానీ బుధవారం కోసం ఎదురు చూస్తుంటాను. నవలలు అంటే తల నెప్పి 1965 to 1972. కానీ ఇప్పుడు vusulade ఒక jabilataa పుస్తకం ఎక్కడ దొరుకుతుందో etukkovalasi వస్తుంది. రచయిత్రి నిశిగంధ గారికి మొదట నా ఆశీసులు తరువాత నా కృతఙ్ఞతలు sir. Mee నిజజీవితాన్ని చక్కగా ఉత్తరల రూపంలో తెలియచేసారు. అంజలి గారితో mee ఇంటర్వ్యూ విన్నాను. గుర్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వినాలి. From guntur
🙏🙏🙏
Entho entho bavundi..hrudayam bharantho nidipoyindi..aneka dhanyavaadalu..
Wonderful truth story sir 👏👏👏 ఇది విన్న తరువాత మనసులో కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను thank you so much sir ❤️ from Vizag
Thank you sir kiran prabha garu. Usulade oka jabilataa vintunnanu sir.from guntur
చివరి ఉత్తరం, చివరి రచయిత్రి రాసిన పేర గుండె గొంతులోకి వఛ్చినట్టుంది.నిజంగా అలాంటి స్నేహం చాలా గొప్పది
No words to express, ❤ God bless
Just saw video sir KIRAN PRABHA GARU. YOUR VOICE PUTS ME SLEEP 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐🪴🪴
Simply superb and heart touching. 🙏
Tq bro .. for the real life story
మనసంతా ఒకరకమైన బాధతో నిండిపోయింది
Sujatha.kishore sujith photos petti unte bagundethi kiran garu
ఉసులాడే... విన్నాను 1984-1988 నాటి జ్ఞాపకాల దొంతరలను కదిలించింది మీ టాక్ షో.
సుజాత...నావిద్యార్ధినిగా తొలి పరిచయం. తర్వాత భావ సారూప్యం వల్ల మరింత దగ్గర యి కొ ద్దికాలం పాటు సామాజి కాంశాలలోపా లు పంచుకుని, స్వల్ప కాలం లోనే ఆమె జీవితం అత్యంత విషాదంగా ముగిసిపోవడం
8,9 నెలల బిడ్డను వదిలి..ఆసుపత్రిలో ప్ర త్యక్షంగా చూసిన జ్ఞాపకం కళ్లముందు కదిలి మనసు దిగులుతో బరువెక్కింది.
నిషిగంధ గారు యదార్ధ సంఘటనల ఆధారంగా కలం స్నేహం లోని ఔ న్నత్యాన్ని
నవల గా మలచిన తీరు హృదయంగమం.
కొద్దికాలంగా మీ టాక్ షోస్ వింటున్నాను.
తామరాకు మీద నీటి బొట్టు చందంగా మీ స్వంత అభిప్రాయాల ప్రభావం మాట్లాడు తున్న జీవిత/సాహిత్యా ల మీద ఏ మాత్రం ప్రసరింపనివ్వక balenced గా మీరు చేసే narration అబ్బురపరు స్తుంది . దాని వెనుక
కృషి, commitment అర్థంేసుకోవ చ్చు
టాక్ షో స్ విన్నాక మాట్లాడా లనిపించింది
మొన్నటివరకు సుజాత జాబు రాసిన వ్యక్తి మీరని తెలియదు. తీ రా తెలిశాక కోరిక బలపడింది
దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వండి కిరణ్ ప్రభ గారు
ధన్యవాదాలు
Sobha Garu..
Please send your contact details to kiranprabha@gmail.com
I will contact you
🙏❤
Really heart rending! Kiranprabha gaaru!
Wonderful sir
Superb sir
మనం నవ్వుతూ ఉందాం.. నవ్వును పంచుతూ ఉందాం
నవలీకరించిన నిషిగంధ గారికి నా అభినందనలు 🙏
🙏
@@nishigandha ayyo nen mi kosame vethukuthunnanu Andi insta lo UA-cam lo
మీరు చెప్తుంటే ,మీగొంతులో చిన్న ఒణుకు
గమనించాను.మనసు మూగబోయింది.
ఎలా తట్టుకుంది మీ మనస్సు?ఏమో!
I have seen I dream s interview and identified all characters
కిరణ్ ప్రభ గారు మీ మీద కోపమొచ్చిందంది. కథ వింటున్నంతసేపు కార్తీక గారి నిరీక్షణ ఫలించాలని అనుకున్నాను. అందుకే వంశీ గారి మీద కోపం. అంటే మీ మీదే అని చివరకు తెలిసింది. ఇంతటి ఆర్ధ్రమైన మీ అనుభవాన్ని అందరికీ అనుభవైక రీతిలో అందించిన రచయిత్రి గారికి అభినందనలు. మీకు నమస్సులు.
Aa. Photo. Sjatha. Gariphotona. Leka. Nisigandha. Gariphotona. Kiranprabhagaru.
Nishigandha.. andi
Thank you sir
Thankyou sir
Itivalane 50 years poorthi chesukunna oka manchi chitramu "JEEVANA TARANGALU" Cinima gurunchi oka karyakramamu cheyyandi sir
❤❤❤
Nellore lo which village
Abhyudaya vadi kanukane vikas garu tana bharya snehanni aamodincharu, ada maga snehanni adi enta pavitramainadaina harshinche vallu nutiko kotiko okaruntaremo, pai pai natanalato lopala kullipotu tappanisariga bharistu eershapadevalle ekkuvuntaru, papam oka manchi manasunna ammayi manasaina vadito jeevitanni chivaridaka anubhavinchalekapoyindi, ippati rojullo aite liver transplant latidi sadhyapadedemo, vikas ameni batikinchukoleka enta madana padi untado kada 😪😪😪😪😪
Cell phones kalam lo ituvanti stories ravu.
Ippude order chesa
ఇది కథ కాదు అన్న విషయం మీరు చెప్పిన ఆఖరి మాటలు హృదయం బాధ తో పాటు గుండె బరువు ఎక్కింది.....ఈ మధ్య నా తో నే పని చేసిన అమ్మాయి గుర్తు వచ్చింది. ప్రస్తుతం 4 7ఏళ్ళ వయసు లో ఇదే విధంగా పోరాడుతుంది....ఆ అమ్మాయి కి భగవంతుడు ధైర్యం ఇవ్వాలి అని అడుగు తూ ఉంట.....
నా వయస్సు 56 ఈ కధ కాని కధ వింటూ కంట నీరు ఓలికినిది గుండె బరువైంది
Only a very thin line separates the Vaasthavam from Kalpana it pains us lot when a novel is based on real stories and has a tragic end
సర్ మీ కథ సినిమా గా మార్చండి
😢