శ్రీమద్భగవద్గీత | ఆత్మ సంయమ యోగము | Srimad Bhagavad Gita |Chapter 6 | Ātma samyama yōga | అధ్యాయం 6

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #Bhagavadgita, #Srimad bhagavad Gita, #Learn Bhagavad Gita, #geeta !!!
    Recitation according to Geeta Pariwar
    తదుపరి అధ్యాయాల కొరకు - • శ్రీమద్భగవద్గీత |అర్జు...
    శ్రీమద్భగవద్గీత - విశిష్టత
    --------------------------------------
    శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది.
    భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు
    భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు.
    వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 అధ్యాయాలను కలిపి వరకు"జ్ఞాన షట్కము" అని అంటారు.
    కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం.
    శ్రీమద్భగవద్గీత మహిమ
    -------------------------------------
    నిరాశ, సందేహములు చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు భగవద్గీత శ్లోకములను పఠించినచో ఓదార్పు కలుగును.
    ఆత్మ సంయమ యోగ ప్రాముఖ్యత
    -------------------------------------------------------
    ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఐదవ అధ్యాయం నుండీ ఉన్న వస్తున్న 'కర్మ యోగ' (ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం) మరియు 'కర్మ సన్యాస' (సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం) మార్గాలను పోల్చి, విశ్లేషణను కొనసాగిస్తూనే, మొదటి మార్గాన్నే సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానమే, మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది. ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ, సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు. తీవ్రమైన కఠిన నిష్ఠలు పాటించటం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించలేడని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు; కాబట్టి తినటంలో, పనిలో, వినోదంలో, మరియు నిద్రలో మిత సంయమనం పాటించాలని ఉపదేశించాడు. తదుపరి, మనస్సుని భగవంతునితో ఏకం (సంయోగం) చేయటానికి 'సాధన' ని వివరిస్తాడు. ఎలాగైతే గాలి వీచని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో, అదే విధంగా సాధకుడు మనస్సుని ధ్యానం యందు నిలకడతో ఉంచాలి. నియంత్రణ చేయటానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది, కానీ, అభ్యాసము, వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు. కాబట్టి, మనస్సు ఎక్కడికి పోయినా, దానిని తిరిగి తెచ్చి, భగవంతుని వైపే విడువకుండ కేంద్రీకరించాలి. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమవుతుందో, అది అలౌకిక స్థితిలో నిలుస్తుంది. ఈ యొక్క 'సమాధి' అన్న పరమానంద స్థితి లో వ్యక్తి అనంతమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు.
    అర్జునుడు తదుపరి శ్రీ కృష్ణుడిని, ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమై కూడా చంచలమైన మనస్సు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేని సాధకుడి గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయాస పడే వ్యక్తి ఎప్పుడూ చెడిపోడు అని శ్రీ కృష్ణుడు హామీ ఇస్తాడు. భగవంతుడు ఎల్లప్పుడూ మన అన్ని పూర్వ జన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్క చూసుకుని, దానిని మళ్ళీ తదుపరి జన్మలలో పునరుత్తేజింప చేస్తాడు; దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఎన్నో జన్మల నుండి పోగైన సాధన ఫలంగా యోగులు ఈ జన్మలోనే భగవంతుడిని చేరుకుంటారు. తపస్వులు (మునులు), జ్ఞానులు (చదువుకున్నవారు, వేద శాస్త్ర పండితులు), మరియు కర్మీల కంటే యోగులే (భగవంతునితో ఏక మవ్వటానికి పరిశ్రమించే వారు) శ్రేష్ఠమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇంకా, యోగులందరిలో కెల్లా, భగవంతుని పట్ల ప్రేమ యుక్త భక్తిలో నిమగ్నమయ్యే వారే అత్యున్నతమైన వారు.

КОМЕНТАРІ • 1

  • @vbsrilakshmiduvvuri8057
    @vbsrilakshmiduvvuri8057 14 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు🙏🙏🙏🙏🙏