ఉపాధ్యాయ సాధికారత || ఉపాధ్యాయ విద్యా రంగాలు ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తనా నియమావళి|| PIE practice bits

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2023
  • ఉపాధ్యాయ సాధికారత part - 8
    ( practice bits based on textbooks )
    75) answer - ( c) NPE - 1986
    🔹Reference : B. Ed PIE telugu academy book 130 page
    🔹Explanation : 1986 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు అందుతున్న విద్య యొక్క స్వరూపం ను విశ్లేషించి NCTE ఉపాధ్యాయ విద్యలో మార్పులు చేయాలనీ నిర్ణయించింది.....దీనికోసం దేశవ్యాప్త చర్చలను కూడా ఆహ్వానించింది..
    76) answer - ( c ) National Council for Teacher Education
    🔹Explanation : మనదేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత సంస్థ నే ఈ NCTE
    NCTE abbriviation - జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (National Council for Teacher Education)
    77) answer - ( a ) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( NCTE )
    🔹Explanation :
    NPE 1986 కు అనుగుణంగా NCTE ఉపాధ్యాయ విద్యలో మార్పులు చేయాలనీ నిర్ణయించిందని, దీనికోసం దేశవ్యాప్త చర్చలను కూడా ఆహ్వానించిందనీ లాస్ట్ bit లో చెప్పుకున్నాం కదండీ.... ఇందులో భాగంగానే సమర్ధత, నిబద్దత, ఆచరణ శీలతల ను ఉపాధ్యాయ విద్యలో భాగం చేయగలిగితే 1986 గమ్యాలను సాధించవచ్చని NCTE ( జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ) అభిప్రాయపడింది.
    78) answer : ( d ) సామాజిక బాధ్యత
    🔹 Explanation : సమర్ధత, నిబద్దత, ఆచరణ శీలత అనేవి ఉపాధ్యాయ విద్యా రంగాలు. వీటిని విద్యా ప్రణాళికలో భాగం చేయాలనీ NCTE భావించింది. option ( d ) సామాజిక బాధ్యత అనేది ఉపాధ్యాయ విద్యా రంగం కాదు.
    79) answer : ( a ) i, ii, iii , iv
    🔹 Explanation : ఉపాధ్యాయులు అత్యంత సమర్థులయితేనే విద్యలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ సమర్ధత రంగాలు 4. అవి వరుసగా
    i) విషయ సంబంధ సామర్థ్యం
    ii) సందర్భ సంబంధ సామర్థ్యం
    iii) భావనా సంబంధ సామర్థ్యం
    iv) నిష్పాదనా సంబంధ సామర్థ్యం
    80) answer : ( b) నిబద్దతా రంగం
    🔹Explanation :
    ప్రాధమికంగా ఉపాధ్యాయ విద్యా రంగాలు - 3
    1) సమర్ధతా రంగం :
    i) విషయ సంబంధ సామర్థ్యం
    ii) సందర్భ సంబంధ సామర్థ్యం
    iii) భావనా సంబంధ సామర్థ్యం
    iv) నిష్పాదనా సంబంధ సామర్థ్యం
    2) నిబద్దతా రంగం :
    i) అభ్యాసకుడి పట్ల నిబద్దత
    ii) సమాజం పట్ల నిబద్దత
    iii) వృత్తి పట్ల నిబద్దత
    iv) ఉన్నత ప్రమాణాల సాధన పట్ల నిబద్దత
    v) మౌళిక విలువల పట్ల నిబద్దత
    3) ఆచరణ రంగం :
    i) తరగతి స్థాయిలో ఆచరణ
    ii) పాఠశాల స్థాయిలో ఆచరణ
    iii) పాఠశాల వెలుపల ఆచరణ
    iv) తల్లితండ్రులతో ఆచరణ
    v) సమాజం తో ఆచరణ
    81) answer : ( c) మానవుని సహజ బలహీనతలు
    🔹 Explanation : మనిషిలో సహజంగా ఉండే బలహీనత లు ( ఆరోగ్యం, కుటుంబం, అంతస్తు లు ) తను నిర్వహించే వృత్తి బాధ్యతల ఉల్లంఘనకు కారణం అవుతాయి.. So ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల నిబద్దుడైతేనే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది.
    82) answer : (b) ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు.
    🔹 Explanation : NCERT 1997లో ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళిని ప్రకటించింది.ఈ నియమావళి లో 30 అంశాలను 6 రంగాలలో విభజించారు. ఈ నియమావళికి ఒక పీఠిక కూడా ఉంది. అందులోని ఒక విషయమే "" ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు "".
    83) answer : d) డిసెకో
    🔹Explanation : ఉపాధ్యాయ వృత్తి పై ప్రేరణ యొక్క ప్రభావాన్ని చెప్తూ డిసెకో ఇచ్చిన నిర్వచనం ఇది.....
    " ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహం పెంపొందించుకోటానికి కానీ తగ్గించటానికి కాని దోహదం చేసే కారకం ప్రేరణ....."
    84) answer : ( a ) అనులోమానుపాతం
    Explanation : ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తి అవసరాలు బలహీనంగా ఉంటే ప్రేరణ స్థాయి కూడా తక్కువగా ఉంటుంది.suppose కడుపు నిండిన వ్యక్తి కి ఆకలి అనే అవసరం తక్కువగా ఉంటుంది.... so సంపాదించాలి అనే ప్రేరణ కూడా తక్కువే. i hope you understand this one.
    85) answer : (d ) ఉపాధ్యాయులకు స్థానచలనం ( ట్రాన్స్ఫర్లు ) లేకుండుట..
    🔹Explanation : ఉపాధ్యాయులు ఒకే తరగతి, ఒకే పాఠశాల లో చాలా సంవత్సరాలు ట్రాన్ఫర్స్ లేకుండా ఉండటం వల్ల వారిలో వృత్తి పట్ల ఒక విధమైన స్థబ్దత, అనాసక్తి, విముఖత ఏర్పడతాయి. ఇవి ఉపాధ్యాయుని ప్రేరణ స్థాయి ని పెంచవు సరికదా వృత్తి ప్రవర్తనా నియమావళికి భంగం కలిగిస్తాయి.
    ఐతే ఉపాధ్యాయునికి ఇచ్చే బహుమతులు శిక్షణ, పొగడ్తలు, ప్రోత్సాహకాలు వృత్తి లో స్థబ్దత ను దూరం చేసి వృత్తి పట్ల ప్రేరణ ను కలిగిస్తాయి.

КОМЕНТАРІ • 3

  • @rajarambokka
    @rajarambokka 3 місяці тому

    Ans pettandi

    • @thejus6085
      @thejus6085  3 місяці тому

      Answer are in discription box sir..... Thnks for watching my channel

    • @thejus6085
      @thejus6085  3 місяці тому

      Answers are in discription box sir.... Thnks for watching my channel.