ఉపాధ్యాయ సాధికారత || సాధికారత స్థాయిలు || CCRT || Perspective education || practice bits ||

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • 🔷 12) answer : (b) మూల్యాంకనా పద్ధతులు
    Reference : B. Ed PIE book page no : 119
    Explanation : ఉపాధ్యాయుడు విద్యార్ధి యొక్క సాధనని మదింపు చేయటానికి మూల్యాంకనా పద్ధతులు సహాయపడతాయి. విద్యార్ధి సాధనని పరిశీలించి లోపాలు తెలుసుకొని వాటిని తొలగించటానికి తగిన వ్యూహాలను రూపొందించుటకు మూల్యాంకనా పద్ధతులు help అవుతాయి.
    🔷 13) answer : (c)ఉపాధ్యాయుని స్థాయి, పాఠశాల స్థాయి
    Explanation : ఉపాధ్యాయ సాధికారత రెండు స్థాయి లను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం. అవి ఉపాధ్యాయుని స్థాయి మరియు పాఠశాల స్థాయి.
    🔷 14)answer : (d )ఉపాధ్యాయ స్థాయి సాధికారత
    Explanation : " ఉపాధ్యాయ సాధికారత " అనేది - విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారు( counsellor ) గా వ్యవహరిస్తూ ఉపాధ్యాయునికి విద్యాప్రక్రియలో అనుకొన్న లక్ష్యాలు సాధించటానికి ఉపయోగ పడుతుంది.
    🔷 15) answer : (a)పాఠశాల స్థాయి సాధికారత
    Explanation : సహ ఉపాధ్యాయులు ( colleagues) ప్రధానోపాధ్యాయులు ( H. M) మరియు వారి నాయకత్వ లక్షణాలు ప్రధానంగా గలది పాఠశాల స్థాయి సాధికారత. సెమినార్స్, సింపోజియంలు, కార్యశిబిరాలు (workshops), వృత్యంతర శిక్షణ ఇవన్నీ కూడా పాఠశాల స్థాయి సాధికారత లో ప్రముఖమైనవి.
    🔷 16) answer : (d) పైవన్నీ
    Explanation : సింపోజియం అనగా కొన్ని అంశాలను చర్చించటానికి నిర్వహించే ఒక సమావేశం.విభిన్న ఆలోచనలను ప్రతిబింబించే వ్యాసాల సమహారంగా కూడా చెప్పవచ్చు.
    🔷 17) answer : (b) పాఠశాల స్థాయి సాధికారత
    Explanation : ఉపాధ్యాయుడు తన సహఉపాధ్యాయుల బోధనా విధానాల పరిశీలించటం వలన, బోధనా వ్యూహలపై ఒకరికొకరు చర్చించటం వలన ఉపాధ్యాయుని బోధనను మెరుగుపెట్టుకోవచ్చు. ఇది పాఠశాల స్థాయి సాధికారతకు సంబంధించినది.
    🔷 18) answer : (a)
    Explanation : CCRT means " Centre for Cultural Resourses and Training".సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం.
    🔹ఇది 1979 సంవత్సరం లో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.ఒక జాతీయ స్వయంప్రతిపత్త సంస్థ ఇది.
    🔹కేంద్రీయ కార్యాలయం ఢిల్లీలో కలదు.
    🔹 నాలుగు ప్రాంతీయ కేంద్రాలు పశ్చిమాన ఉదయపూర్, దక్షిణాన హైదరాబాద్, ఈశాన్యంలో గౌహతి మరియు మధ్య భారతదేశంలోని దామో ( Damoh ) లో ఉన్నాయి.
    🔷 19) answer : a) CCRT
    Explanation : సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ( CCRT ) దేశ వ్యాప్తంగా మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తోంది.
    🔷 20) answer : b) CCRT
    Explanation : మన దేశ సంస్కృతి వారసత్వాన్ని పరిచయం చేయటానికి CCRT ఉపాధ్యాయులకు ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది. డ్రాయింగ్, సంగీతం, శిల్పం, నృత్యం.... etc లలితకళలు వివిధ మౌలిక భావనలను
    వివరిస్తూ వాటిని తరగతి గదిలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ శిక్షణలలో నేర్పిస్తారు.
    🔷 21) answer : d) సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం
    Explanation : CCRT వారు ఉపాధ్యాయులకు తోలుబొమ్మల తయారీ ( masks ), వెలలేని వస్తువులచే TLM తయారీలలో శిక్షణ ఇస్తున్నారు.శిక్షణ పొందిన వారికి పాఠశాలలో ఉపయోగించటానికి ఒక కిట్ ని కూడా CCRT వారు అందజేస్తున్నారు.

КОМЕНТАРІ • 4