ఉపాధ్యాయ సాధికారత || ఉపాధ్యాయులకు ప్రేరణ కల్గించే అంతర్గత , బహిర్గత కారకాలు || practice bits

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ఉపాధ్యాయ సాధికారత
    ( practice bits based on textbook content )
    86) answer : ( b ) వృత్తి లోని పదోన్నతులు
    🔹Explanation : ఉపాధ్యాయునికి ప్రేరణ కల్గించే అంశాలలో అంతర్గత , బహిర్గత కారకాలు ఉంటాయి.
    సరైన సమయంలో పదోన్నతి లభించటం వల్ల ఉపాధ్యాయులు ఉత్సాహం తో పనిచేస్తారు , వారిలోని నిరాసక్తత దూరం అగును. కనుక పదోన్నతి అనేది బహిర్గత కారకం గా పనిచేస్తుంది. Options a, c, d లు అంతర్గత కారకాలు.
    87) answer : ( d ) ఉపాధ్యాయుల పై చదువులకు వేతనం లేని సెలవులు మంజూరు చేయటం
    🔹 Explanation : ఉపాధ్యాయులకు తమ విద్యార్హతలను బట్టి పై చదువులు చదవటానికి వేతనం తో కూడిన సెలవులు మంజూరు చేయాలి. ఉపాధ్యాయులు తమ విద్యా, వృత్తిపర అర్హతలను అభివృద్ధి పరచుకోటానికి తగిన వసతులు కూడా కల్పించాలి. ఈ పై options అన్నీ కూడా ఉపాధ్యాయునికి ప్రేరణ కల్గించే బహిర్గత కారకాలు.
    88) answer : ( d ) ఒకే తరగతులకు చాలా సంవత్సరాల బోధన
    🔹 Explanation : ఉపాధ్యాయ వృత్తి లో ఒకే తరగతులకు, ఒకే పాఠశాల లో చాలా సంవత్సరాలు బోధించటం వలన వృత్తి లో నిరాసక్తత, విసుగు చోటుచేసుకుంటాయి. వీటిని దూరం చేయటానికే పదోన్నతులు , బదిలీలు ఉంటాయి.
    89) answer : ( c ) ఛటోపాధ్యాయ కమీషన్
    🔹 Explanation : కేంద్ర ప్రభుత్వానికి మొదలియార్, కొఠారి కమీషన్ లు ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత పై పలు సిఫారసులు చేసాయి.దీనిపై కేంద్రప్రభుత్వం పాఠశాల స్థాయి, ఉన్నత విద్యా స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయటానికి నియమించిన రెండు కమిషన్ లలో ఒకటి ఛటోపాధ్యాయ కమీషన్.ఇది 1985 లో తన నివేదిక ని సమర్పించింది.
    90) answer : ( b) ఛటోపాధ్యాయ కమీషన్
    🔹Explanation : ఛటోపాధ్యాయ కమీషన్ ఉపాధ్యాయ వృత్తి అర్హతలు పెంపొందించటానికి సెమినార్లు, కార్యశిబిరాలు ఏర్పాటు చేయాలనీ, ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ఉద్యోగుల కన్నా హెచ్చు గా ఉండాలని సిఫారసు చేసింది. అలాగే ఉపాధ్యాయులకు అనేక ప్రదేశాలు దర్శించి జ్ఞానాన్ని పొందే అవకాశం ఇవ్వాలని వారి పరిశోధనలను, రచనలను ప్రచురించాలని కోరింది.ఇలాంటి వాటి వల్ల వారు వృత్తి పట్ల నిబద్దత కల్గి ఉంటారని చెప్పింది ఈ కమిటీ....
    91) answer : ( a ) సర్వేపల్లి రాధాకృష్ణన్
    🔹 Explanation : ప్రతి సంవత్సరం September 5 వ తేదీన డా || సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులు చేసిన సేవలను గుర్తించి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అవార్డులు ప్రదానం చేస్తున్నారు.
    💦 💦 💦 💦 💦
    🔹B. Ed PIE Text book bit
    92) ఉపాధ్యాయులకు ప్రేరణ కల్గించే అంతర్గత కారకం.....
    a) బహుమతులు
    b) ఆరోగ్యం
    c) వృత్తి సంతృప్తి
    d) ఉన్నత విద్యార్హత
    92) Answer : ( b ) ఆరోగ్యం
    Explanation : actually ఈ బిట్ కి textbook లో ఇచ్చిన సమాధానం (c) వృత్తి సంతృప్తి. కానీ ఉపాధ్యాయునికి లభించే బహుమతులు అవార్డులు ప్రశంసా పత్రాలు మరియు ఉన్నత విద్యార్హత కోసం అనుమతించటం వృత్తి లోని సంతృప్తి ఇవ్వన్నీ బహిర్గత కారకాలుగా పనిచేస్తాయి.
    శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యం తో ఉండటం ఉపాధ్యాయునికి ప్రేరణ కల్గించే అంతర్గత కారకం. So correct answer option ( b ) అవుతుంది.
    🔹 B. Ed PIE Text book bit
    93) ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు
    a) ఉద్యోగ భద్రత b) వేతనం
    c) గుర్తింపు d) హోదా
    93) Correct answer ( c) గుర్తింపు
    Explanation : ఉపాధ్యాయునికి లభించే గౌరవ ప్రదమైన వేతనం , తన ఉద్యోగానికి భద్రత , ఉద్యోగం వల్ల లభించే హోదా ఇవ్వన్నీ కూడా ఒక టీచర్ కి గుర్తింపును తీసుకువస్తాయి. So కరెక్ట్ ఆన్సర్ ( c) గుర్తింపు . textbook answer కూడా ఇదేనండి.

КОМЕНТАРІ • 1