వేమన పద్యాలు ఇంత విపులంగా గురువుల గురించిన వీడియో మీరు చూసి ఉండరు /vemana padyalu with bhavam

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 44

  • @prabhakarelasagar14
    @prabhakarelasagar14 Місяць тому +5

    ,"అల‌్ప జాతి" వాడు కాదు , "అల‌్ప బుద‌్ది" వాడు. తప్పుగా వక్రీకరించకండి,
    అల‌్పబుద‌్ది వానికధికారమిచ‌్చిన
    దొడ‌్డవారినెల‌్ల తొలుగగొట‌్టు
    చెప్పు తినెడి కుక‌్క చెరుకు తీపెరుగునా?
    విశ‌్వదాభిరామ వినురవేమ.
    వీరు ఎవరో సమాజానికి తప్పుడు సందేశం పంపుతున్నాడు, గమనించండి.
    కుట్ర జరుగుతుంది

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      ధన్యవాదములు 🙏🙏🙏
      నిజమే అల్పబుద్ది అని సవరణ ఇదివరకు మన సభ్యులు ఒకరు చెప్పారు అంగీకారం తెలిపాను.
      నేను రిఫరెన్స్ తీసుకున్న పుస్తకం లో అల్పజాతి అని వర్ణన ఉంది
      నేను వేరే ఇతరపుస్తకాలు చదివి ఉండాల్సింది
      ఆలా చేయకుండా తీసుకోవడం వలన జరిగిన పొరపాటు ఇది.
      కుట్రకాదు ఏం కాదు 🙏🙏🙏🙏

    • @prabhakarelasagar14
      @prabhakarelasagar14 Місяць тому +1

      మీరు ఏ బుక్ ప్రకారం రిఫరెన్స్ ద్వారా చదివారో ఆ బుక్కు పేరు తెలుపగలరు
      సమాజంలో తప్పుడు సమాచారం వెళ్ళిపోయింది
      మీరు వీడియోను సవరించు కుంటే మీరు చేసిన తప్పులను సరిదిద్దు కు
      బుద్ధికి జాతికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా మరి అల్ప జాతి వారు ఎవరో మీరే నిర్ణయించాలి

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      @prabhakarelasagar14 అయ్యా మీకు లింక్ ఇస్తున్నాను
      దయచేసి చదవండి 🙏
      Google Sites
      sites.google.com › site › ve...
      తెలుగు పద్యాలు - వేమన శతకం

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      g.co/kgs/Md6D41T

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ మహా యోగి వేమన గురవే నమః 🙏
    ఉత్తమోత్తముండు తత్త్వ జ్ఞు డిలమీద
    మహిమ జూపు వాడు మధ్యముండు
    వేషధారి యుదర పోషకు దధముండు
    విశ్వదాభిరామ! వినురవేమ!
    పద్యానికి చక్కని విశ్లేషణ అందించారు
    మీకు మాహృదయ పూర్వక ధన్యవాదములు సమర్పించు చన్నాము.🙏🤚🕉️🚩🔴

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      ధన్యోస్మి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 Місяць тому +2

    కులాలు కూలిపోవాలి!
    మతాలు మాసిపోవాలి!
    మానవత ఒక్కటే నిలిచి వెలిగిపోవాలి!
    విశ్వ నరులమౌదాం!

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      సూపర్ సార్ 🙏🙏🙏
      ధన్యవాదములు 🙏🙏👍👍👍

  • @SurekhaEsukapalli
    @SurekhaEsukapalli Місяць тому +1

    Thank you

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      🙏🙏🙏🙏🙏🙏
      స్వాగతం 🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Місяць тому +1

    నిగూఢ తత్వార్థ బోధిని
    వేమన పద్యములు
    నిగూఢ తత్వ వివరము
    ఇనుమున జేసిన మైనపు కడ్డి
    ముంటి మొనను నఱ్రావుల దొడ్డి
    కూర్చుండి మేపిన కుందనపు గడ్డి
    విప్పి చెప్పురా వేమారెడ్డి. 4
    భావము:- మన శరీరములోని మనస్సు అన్ని భాగములకంటే ముఖ్యమైనది. మనస్సు చలించక నిలిచిపోయిన వానికి ఆత్మదర్శనము సులభముగా అగును. వశమైన మనస్సు ఆత్మదర్శనమునకు కారణమగుచున్నది. కావున అది మిత్రునితో సమానముగా చెప్పబడుచున్నది. వశముకాక చలించుచు ప్రపంచవిషయములనే ప్రేరణ చేయుచు ఆత్మ దర్శనమునకు ఆటంకపరుచు మనస్సును శత్రువుగా చెప్పబడుచున్నది. ఒక మనస్సే చలించిన ఎడల శత్రువుగా, చలించక నిలిచిపోయిన ఎడల మిత్రునిగా ఉన్నది. కావున మనస్సును ఒకే కడ్డీగ పోల్చి ఆ కడ్డీ ఇనుముగా, మైనముగ రెండు విధములుగ ఉన్నదని వేమన తెల్పుచున్నాడు. చలించు మనస్సు మైనము కడ్డీతో సమానము, ఇష్టమొచ్చినట్లు వంగి పోవుచుండెను. చలించక ఏకాగ్రతగ నిలిచిన మనస్సు ఇనుపకడ్డీతో సమానము. అది ప్రక్కకు వంగక భద్రముగ నిలిచి ఉండును.
    బయటనున్న జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చు విషయములు అన్నియు మొదట మనస్సుకు చేరును. అట్లు చేరిన విషయములను మనస్సు గ్రహించి ఆ విషయములను లోపల ఉన్న బుద్ధి, చిత్తము, జీవునికి తెలియజేయును. బుద్ధి, చిత్తము చెప్పిన తిరుగు జవాబులను మనస్సు గ్రహించి బయటనున్న కర్మేంద్రియములకు తెలియజేయుచుండును. ఈ విధముగ అంతరేంద్రియములకు, బాహ్యేంద్రియములకు మనస్సు మధ్యవర్తిగ ఉన్నది. మనస్సు బ్రహ్మనాడి కుండలీశక్తి ప్రారంభమగు భూృమధ్య స్థానమునకు ప్రక్కనున్న సూర్య చంద్ర నాడుల మీద ఉన్నది. కావున ముంటిమొన అని అన్నారు. అన్ని విషయములు నరాల ద్వారా మనస్సుకు చేరుచున్నవి. అందువలన విషయములను ఆవులుగ పోల్చి అవి అన్నియు చేరు స్థలమైన మనస్సును దొడ్దిగ పోల్చినారు.
    మనస్సు బయటి విషయములను సేకరించి లోపలికి, లోపలి విషయములను సేకరించి బయటకు పంపడమేకాక అన్ని విషయములను జ్ఞాపకము పెట్టుకొను శక్తికల్గి ఉన్నది. అంతేకాక క్రొత్త విషయములను కూడా జ్ఞాపకము చేయు శక్తికలదిగా ఉన్నది. ముందు ఒక విషయమును జ్ఞాపకము తెచ్చును. వెంటనే దానిని వదలి ముందుదానికి అనుబంధమైన వేరొక విషయమును తెచ్చును. దానిని వదిలి దానికి అనుబంధమైన ఇంకొక విషయమును తెచ్చును. ఈ విధముగ అది ఒకదానికొకటి అనుబంధ విషయములనే జ్ఞాపకము చేయుచు చివరికి ఏ విషయమునో తెచ్చిపెట్టును. మొదటి విషయమునకు, చివరి విషయమునకు చూచిన సంబంధములేక ఉండును. మొదలైనది ఒక విషయము, చివరికి నిలిచినది ఒక విషయముండును. మనస్సు విషయ ప్రేరణ చేసిన ఎడల ఎడతెగని విషయములను తెచ్చి పెట్టుచుండును.
    కుందనపుగడ్డి పైకి గడ్డిగ కనిపించిన లోపల వేర్లు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. కుందనపుగడ్డి వేర్లుకూడ ఎడతెగనివై మనస్సు మాదిరే ఉన్నవి. కనుక కుందనపుగడ్డిగ పోల్చినారు. మనస్సును వదిలిపెట్టిన ఎడతెగని చింతనలు చేయుచుండును. కాబట్టి కూర్చుండి మేసిన కుందనపుగడ్డి అని అన్నారు.

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      ఎంతో వివరంతో కూడిన ఉపయోగకరంగా ఉన్న మీ కామెంట్ కి ధన్యవాదములు సార్

  • @sudhakaryadavilli8584
    @sudhakaryadavilli8584 Місяць тому +1

    "విద్యార్ధి"అని పలికినప్పుడు ఒత్తు*"ద్ధ"*
    పలక కూడదు స్వామి.

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      ధన్యవాదములు 🙏 సార్
      తప్పు సరిదిద్దుకుంటాను 🙏

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala Місяць тому +1

    🕉️india 🕉️

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐💐💐

  • @RamaMuroothy
    @RamaMuroothy 16 днів тому +1

    ఉన్న దర్మ మందు ఉన్నతిగానక
    వేరు దర్మ మందు చేరబోయి
    గతులు గాన లేక అతిదరీద్రుడగును
    రామ సుగుణ దీయ రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  16 днів тому

      ఈ పద్యం భలే గుచ్చుకుంటుంది సార్

  • @RamaMuroothy
    @RamaMuroothy 27 днів тому +1

    కుక్క గుణము కన్న కాకి గుణము మేలు
    కలిసి మెలిసి యుండు గణము చేరి
    కుక్క గుణము చూడు కూడుకుడియువేళ
    యల్పడెపుడుయటులె రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  27 днів тому

      ఈ పద్యం కొంచెం అసంబంద్ధంగా అనిపించింది సార్

    • @RamaMuroothy
      @RamaMuroothy 27 днів тому +1

      @thenagrajshow కాకి పంచి తినును కుక్క పంచి తినునె
      పెట్ట నేని కుక్క ప్రేమజూపు
      వీధి శునక ములకు విస్తరిఏలనొ
      అలగ బోకు నరయు రామమిత్రమ

    • @thenagrajshow
      @thenagrajshow  27 днів тому +1

      @RamaMuroothy 💐💐💐💐💐💐💐

  • @RamaMuroothy
    @RamaMuroothy 14 днів тому +1

    అన్య కులమ తంబు అన్యలుదర్మంబు
    నొకటి కాదు కాదు నూర్విలోన
    యంత నోకటి యనిన యాపదవచ్ఛయా
    రామ సుగుణ దీయ రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  14 днів тому

      బాగుంది సార్ 🙏🙏💐💐💐💐💐

  • @shaikismail7058
    @shaikismail7058 Місяць тому +1

    అల్పబుద్ధి కలవానికి.....

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      అవునండి 👍
      ఇదే విషయానికి ఇక్కడే మరో కామెంట్లో సంజాయిషీ ఇచ్చాను చదవండి 🙏🙏🙏
      ధన్యవాదములు 🙏

  • @RamaMuroothy
    @RamaMuroothy 27 днів тому +3

    ఆంగ్ల భాష చదువ అద్బుతమనిరెల్ల
    దాని యందు తత్వ ధనము లేదు
    తెలుగు చెదివి చూడు తెలివిమెరుగుబట్టు
    రమ్య మదియు తెలుగు రామమూర్తి

  • @manjaneyalu3280
    @manjaneyalu3280 Місяць тому +6

    అల్ప జాతి కాదు. అల్పబుద్ధి

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      మీరన్నది నిజమే
      వేమన గారి పద్యాలు ఒక్కో పుస్తకం లో ఒక్కో రకంగా రాసారు
      నేను రిఫరెన్స్ గా తీసుకున్న పుస్తకం లో ఉన్నట్లు గా వీడియో లో చదివాను.
      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

    • @manjaneyalu3280
      @manjaneyalu3280 Місяць тому +1

      ధన్యవాదాలు

    • @thenagrajshow
      @thenagrajshow  Місяць тому

      @manjaneyalu3280 💐🙏

  • @RamaMuroothy
    @RamaMuroothy 10 днів тому +1

    వద్దు వద్దు యున్న విద్యనేర్చినజాలు
    తాను వెదుకు గురుడు తన్నువెదుకు
    వేరు యోగా యాగ మేరుదానములేల
    రామ సుగుణ దీయ రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  10 днів тому

      💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍