Annamacharya Sankeerthana / విశ్వరూపం / Sai Charan / Sai Madhukar

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • అన్నమాచార్య సంకీర్తనలు
    Song - విశ్వరూపం
    Produced by
    M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
    S V Temple - Edina
    Minneapolis Minnesota, USA
    Music Composer - Sai Madhukar
    Singer - Sai Charan
    Keyboard - Chinna S K
    Flute - Dr Ramachandra Murthy
    Veena - Anjani Srinivasan
    Violin - Thyagaraju Peri
    Nadaswaram - Bala
    Indian Rhythms - Anil Robin
    Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
    Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
    Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
    Mixed & Mastered by Raju @ Moksha Studio
    విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
    శాశ్వతులమైతిమిరక జయము మా జన్మము
    కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
    పండిన వృక్షములే కల్పతరువులు
    నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
    మెండుగా ప్రత్యక్షమాయ మేలువో నా జన్మమూ
    మేడవంటి హరిరూపు మించైన పైడి గోపురము
    ఆడానే వాలినా పక్షులు అమరులు
    వాడల కోనేటిచుట్ల వైకుంఠనగరము
    ఈడ మాకు పొడచూపే ఇహమేపో పరము
    కోటి మదనులవంటి గుడిలో చక్కనిమూర్తి
    ఈటులేని శ్రీ వెంకటేశుడితడు
    వాటపు సొమ్ములుముద్ర వక్షపుటలమేల్మంగా
    కూటువై నన్నేలితే యెక్కువవో నా తపము

КОМЕНТАРІ • 53

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 10 днів тому

    అమూల్యమైన గీతం , అద్భుతమైన గానం . విన్నవారి జన్మ ధన్యం . 🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 2 роки тому +15

    అద్భుతమైన సంకీర్తనను అందించిన శ్రీ సాయి మధుకర్ గారికి , అద్భుతముగా ఆలపించిన శ్రీ సాయిచరణ్ గారికి బృందసభ్యులందరికీ బహు అభినందనలు !
    ఔత్సాహికులకు భావార్థము తెలియ జేయాలని ఆకాంక్షతో పోస్ట్ చేస్తునా క్రింద కీర్తన భావామృతమును !!
    ప్రార్ధన ః-- 🌹🌹
    గిరులను, కోనేరుల ,వన-
    చరాదులను నైన పొగడ శక్యము గాదే !
    అరయుచు నిన్నెటు బొగడుదు ?
    కరములు జోడింతు నంతె గాదనకయ్యా !
    🌹 (1)🙏
    తిరుమల రాయడ నిన్నున్ ,
    సరిపొగడుట కొంతయైన సాధ్యము గాదే ,
    దరిజేరి జూతునంతే ,
    వరదా ! నను దప్పు పట్ట వలదిక నయ్యా !
    🌹 (2)🙏
    స్వీయ పద్యము ( కందము )
    ✍ వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
    భావము ః-- 🌹👇
    స్వామీ !! మీరు వెలసిన చోట నున్న గిరులను , కోనేరులను , వనచరాదులను అవి చేసుకున్న పుణ్య ఫలమునే నేను కొంచెమైనా పొగడలేను !🙏
    ఇక మిమ్ము ఎలా పొగడగలను తండ్రి ??!🙏
    నాకు సాధ్యము కాదు !
    ఓ తిరుమల గిరి ప్రభువా !! 🙏
    ఊరకే చేతులు జోడించి ,మిమ్మల్ని చూస్తూ ఆనందిస్తాను !🙏
    నా చేష్టను తప్పు పట్టకు తండ్రి , నిన్ను పొగడలేదని అలుగకు !🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    అన్నమాచార్యుల వారు తిరుమల క్షేత్ర సందర్శనమును కన్నులకు కట్టినట్లు అనేక సంకీర్తనలలో వర్ణించారు .🙏
    అన్నమయ్య దృష్తిలో , స్వామీ మరియూ తిరుమల కొండ వేరుకాదు . 🙏
    తిరుమల గిరి అణువణువూ స్వామి రూపులే అని భావించి తరించారు .🙏
    అందుకే కొండంత దేవుడు అన్నారు, అలాగే కొండయే దేవుడని భావించారు .🙏
    అటువంటి చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము ! 🙏
    🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
    🌹🌹
    అదిగో చూడండి ఆ విశ్వరూపమును . మనకు ఇలలో విష్ణురూపముగా అందరికీ కనిపించుచున్నది .🙏
    అదిగో ఆ సప్తగిరులే మనకు విశ్వరూపముగా దర్శనమిస్తున్నాయి. 🙏
    ఇక మనకు కావలసినదేముంది . శాశ్వతమైన ఆనందమును ఇక్కడే పొంది ధన్యులమవవచ్చును .
    మన జన్మలిక సఫలమాయెను .🙏
    🌹🙏🌹
    🌹🌹
    ఈ తిరుమల గిరులన్నియూ కలిపి , కొండంత రూపమై విశ్వరూపుడైన ఆ విష్ణువుకు గుర్తుగా వెలసియున్నాయి .🙏
    అనాదినుండి పెరిగి చేవ మీరిన వృక్షరాజములన్నియూ కల్పతరువుల వలే శోభిస్తున్నాయి ఈ కొండ మీద .🙏
    ఇక ఈ కొండ మీద కోటానుకోట్ల జన్మల పుణ్య ఫలముచేత
    ఇక్కడ జన్మించిన , పశు, పక్ష్యాది ,వనచరములన్నియూ
    తమ జన్మలను సార్ధకము చేసుకున్న జీవన్ముక్తులు .🙏
    వీటినన్నింటినీ చూసే భాగ్యము నాకు కలిగినది.🙏
    ఆ భగవత్స్వరూపమేమిటో సాక్షాత్కరింపబడినది ఇప్పుడు నాకు .🙏
    ఇక నా జన్మము ధన్యము , శుభప్రదము అయిపోయినది .🙏
    🌹🙏🌹
    🌹🌹
    ఇవన్నీ చూసుకుంటూ స్వామి ఆలయమునకు చేరువ అయినంతనే , నాకు స్వామి వారి మేడ వైభోవోపేతముగా కనిపించినది. 🙏
    ఆ బంగారు గోపురమే , స్వామి రూపు ఎంత అందముగా ఉంటుందో తెలియపరుస్తోంది .🙏
    అహా ఆ గోపురమునకు చేరిన పక్షులు ఏమి అదృష్టము చేసుకున్నాయి , వాటికి ఇక అమరత్వపు భోగమే కదా .🙏
    ( ఇక్కడ పక్షులను అశేష జన వాహిని గా స్వామి గుడికి తరలి వచ్చిన భక్తులుగా భావించవచ్చు )
    గుడి చుట్టూ విశాలమైన మాడ వీధులతో , కోనేటి అందములతో ఈ ప్రాంగణము అల వైకుంఠపురమునే తలపించుచున్నది . 🙏
    ఇక మాకు ఇదియే వైకుంఠము .
    ఇదియే మాకు ఇహమున పరమున ఆనందమును ఒసగే ప్రదేశము.🙏
    🌹🙏🌹
    🌹🌹
    గోపురమే ఇంత అందముగా ఉన్నది, ఇక ఆ స్వామి ఇంకెంత అందముగా ఉండునో కదా . 🙏
    ఆ స్వామి అందములు , కోటి మన్మధుల రూపమును కలగలిపిననూ సరిపోనంత మించిన అందముతో ఉన్నాడు .🙏
    గుడిలో నిలుచుని ఉన్న ఆ చక్కటి మూర్తిని వర్ణించుట అలవి గాని పని .🙏
    నిలువెల్లా ధగ ధగా వజ్ర వైఢూర్య మణి మాణిక్య ఆభరణములతో ప్రకాశించుచున్నాడు స్వామి !🙏
    శంఖు చక్ర ముద్రలను చేతపట్టి , అభయ వరద హస్తములను చూపుతూ , వక్షస్థలమున సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి యైన అలమేలుమంగను ,పెట్టుకిని ,
    అధికమైన ప్రేమతో , మమ్మేలుచూ దర్శన భాగ్యము కల్పించాడు ఆ శ్రీ వేంకటేశ్వరుడు . 🙏
    నేను చేసిన తపములకు , మితిమీరిన ఫలమును అత్యంత దయతో అనుగ్రహించాడు ఆ స్వామి , తన దర్శన భాగ్యమును అందించి .🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏
    తాత్పర్యము అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ✍ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺

    • @bnagalaxmi9464
      @bnagalaxmi9464 2 роки тому +1

      Intha vedhaanthani andhinchina mi opikaku guruvu gariki 🙏🙏.

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942 2 роки тому

      @@bnagalaxmi9464 gaaru ధన్యవాదములు అండి

    • @RaviShankar-ss3ii
      @RaviShankar-ss3ii Рік тому

      అద్భుతమైన విశ్లేషణ..! అభినందనలు🙏

    • @kamalakarpadam107
      @kamalakarpadam107 Рік тому

      🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏

  • @pattipatimadhusudhannaidu7229
    @pattipatimadhusudhannaidu7229 Рік тому +5

    Anantha కోటి బ్రహ్మాండ nayaka గోవిందా గోవిందా గోవిందా

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Рік тому +3

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సామాన్యమైనది కాదు హిందూ ధర్మానికి ఆనాడు అన్నమయ్య ఎంత సేవ చేసారో మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేప్పటి అంత ప్రయత్నం చేస్తున్నారు మీ భగవంతుడు తోడుగా ఉంటాడు

  • @PeddiSambasivarao
    @PeddiSambasivarao 2 роки тому +9

    వైవిధ్యముతో చేసిన స్వరము, గానము వీనులకు విందుగా, ఆలోచనా స్ఫోరకంగా ఉన్నది. అభినందనలు.

  • @sabithatekula4884
    @sabithatekula4884 2 місяці тому

    Govindha govindha govindha

  • @jagadeeshgp8069
    @jagadeeshgp8069 Рік тому +2

    Super గా పాడారు
    ఓం నమో నారాయణ నమః

  • @satishreddyguda2723
    @satishreddyguda2723 4 місяці тому +1

    Om namoo narayanayaa🙏🙏

  • @VipanchiCreations.
    @VipanchiCreations. Рік тому +2

    అద్భుతం మీ గానం....🙏🙏🙏

  • @thagiliyadagiri
    @thagiliyadagiri 7 місяців тому +1

    Govinda Sri Govinda

  • @prasadbisai
    @prasadbisai 9 місяців тому +1

    ఇది ఏ రాగంలో ఉందో చెప్పగలరా.. సంగీతం పట్ల నాకు జ్ఞానం శూన్యం. నేర్చుకోవాలని ఉంది

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056 3 місяці тому

    Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda

  • @rravi9735
    @rravi9735 Рік тому +1

    govinda govinda govinda govinda govinda govinda గ్

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 7 місяців тому +1

    ఓం 🕉 శ్రీ మహా విష్ణు దశావతార శ్రీ వేంకటేశ్వరాయ నమో నమః! 🙏 🙏 🙏 🙏

  • @Guha472
    @Guha472 Рік тому

    🙏🙏🙏గోవిందా గోవిదా సాయి చరణ్ సాయి మధుకర్ చాలా అందంగా పాడారు.వావ్

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Рік тому +2

    Very melodious voice and great lyrics.. ఓం నమో వేకటేశాయ

  • @lathav8716
    @lathav8716 4 місяці тому

    Sri Lakshmi Narayana 🙏 pallandu pallandu pallandu meku

  • @sriramojusharada2926
    @sriramojusharada2926 2 роки тому +1

    superb ga undandi

  • @padmaa9943
    @padmaa9943 Рік тому

    నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 🙏👣🙏నమో నారాయణాయ నమః

  • @999AKSHAYA
    @999AKSHAYA Рік тому +2

    Excellent performance 🙏

  • @rajasekharnalla2834
    @rajasekharnalla2834 Рік тому

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @mnnirmala5238
    @mnnirmala5238 3 місяці тому

    Om namoo narayanaaya

  • @jalajasankari6937
    @jalajasankari6937 2 роки тому +1

    Chala chala baavundi composition and Singing

  • @ChitragaarAshokaraju
    @ChitragaarAshokaraju 2 роки тому +1

    Singing is superb i really liked om namo venkateshaya 🙏😊🙏🙏🥰

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому

    Namo Viswaroopayana Maha..❤❤❤❤❤❤

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968 2 місяці тому

    రాగం కూడా తెలియచేస్తే నేర్చుకోవడానికి బాగుంటుంది

  • @satyabhaskaruni5991
    @satyabhaskaruni5991 2 роки тому +1

    Composition and singing super

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому

    Nsmasthe Sir..❤❤❤

  • @vithaldurgaprasad2760
    @vithaldurgaprasad2760 Рік тому

    Music అద్భుతం
    గానం అత్యద్భుతం

  • @siddusiddu2437
    @siddusiddu2437 Рік тому

    🙏🏻ఓం నమో వేంకటేశాయ🙏🏻

  • @kvsubbareddy4972
    @kvsubbareddy4972 Рік тому

    No words to explain the ecstasy and eternal bliss.Very much helpful in achieving spiritual progress

  • @sindhuvijaykumar910
    @sindhuvijaykumar910 5 місяців тому

    🤲🤲🤲🤲🤲🙏

  • @varanasividyavathi1163
    @varanasividyavathi1163 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Acharyakripa
    @Acharyakripa 2 роки тому

    jai govinda

  • @amithkumar662
    @amithkumar662 Рік тому

    Excellent💯👍👏

  • @yadagirisrinivasrao5992
    @yadagirisrinivasrao5992 2 роки тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @mohannreddy1226
    @mohannreddy1226 Рік тому

    🙏🕉

  • @varanasividyavathi1163
    @varanasividyavathi1163 Рік тому

    👌👌👌👌👌

  • @subhashinikunagu8417
    @subhashinikunagu8417 Рік тому

    లిరిక్స్ please🙏

    • @m.smelodies336
      @m.smelodies336 9 місяців тому +2

      విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
      శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ||
      కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
      పండిన వృక్షములే కల్పతరువులు |
      నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
      మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ||
      మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
      మాడనే వాలిన పక్షుల మరులు |
      వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
      యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ||

    • @naveenaditya2850
      @naveenaditya2850 Місяць тому

      @@m.smelodies336 tq

  • @srinivas9391
    @srinivas9391 Рік тому

    🕉️🧖🚩🙏

  • @sabithatekula4884
    @sabithatekula4884 2 місяці тому

    Govindha govindha govindha

  • @raghavareddy7700
    @raghavareddy7700 7 місяців тому

    Om namo venkateshaya

  • @muraliv4224
    @muraliv4224 2 роки тому

    🙏🙏🙏

  • @sabithatekula4884
    @sabithatekula4884 2 місяці тому

    Govindha govindha govindha