చైతన్యమే ఊపిరిగా......

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • 🌹చైతన్యమె ఊపిరిగా...🌹
    -----------------------------------------
    చైతన్యమె ఊపిరిగా అడుగేసి కదలుదాం
    గమ్యాన్ని చేరుదాక ఆగకుండ పయనిద్దాం!!
    //చైతన్యమె...//
    కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవులే
    ధైర్యంతో ముందడుగే దారి చూపించులే
    బాధ్యతతో మెదిలితే భార మవదు జీవితం
    విజ్ఞతతో ముందుకేగ విజయమే సొంతమవద?!
    //చైతన్యమె...//
    దిగాలుగా నీవుంటే దీనమవును బతుకంతా
    సంకల్పమె ఆయుధంగా పోరాటం చేయాలి
    ఎగతాళిని సవాలుగా స్వీకరించి ఎదగాలి
    గెలుపుతోనె గతానికి జవాబిచ్చి తీరాలి!!
    //చైతన్యమె...//
    పొంగిపోకు కుంగిపోకు లక్ష్యాన్ని మరువబోకు
    విమర్శించె ప్రతివారికి సమాధాన మివ్వబోకు
    ఓపికతో సాగిపోతె ఓటమన్నదే లేదు
    విజేతకే గౌరవంబు వసుధలోన తెలుసుకో!!
    //చైతన్యమె...//
    అదృష్టం ప్రతిసారి అందల మెక్కించదు
    నిరాశతో నీవుంటే నిలువలేవు జగతిలో
    ఓర్వలేనితనం నిన్ను ఒంటరిగా మార్చివేయు
    అందరితో కలిసిపోతె ఆనందం పొందగలవు!!
    //చైతన్యమె...//
    ✍️ డాక్టర్ వెలుదండ వేంకటేశ్వర రావు.
    మహబూబ్ నగర్.
    8790421061.

КОМЕНТАРІ • 18