అక్షరమే ఆయుధం...... రచన డాక్టర్ వెలుదండ వెంకటేశ్వరరావు

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • 🌹అక్షరమే ఆయుధం...🌹
    --------------------------------------
    అక్షరాన్ని అణచు వాడు అవనిలోన లేడురా
    అక్షరమే ఆయుధంగా జగతినే జయించురా!!
    //అక్షరాన్ని అణచు..//
    పాల్కురికి చూపించే పరమశివుని శక్తిని
    కదనాన్ని దలపించె తిక్కన్న లేఖిని
    పోతన్న పొత్తమే పొందుపరిచె భక్తిని
    అన్నమయ్య కీర్తనలే అలరించెను అందరినీ !!
    //అక్షరాన్ని అణచు..//
    పాటలే రగిలించెను ప్రజలలోన చైతన్యం
    ఉద్యమాలె నడిపించెను ఉధృతంగా సాహిత్యం
    నియంతృత్వ పోకడలను నిరసించెను నినాదం
    ప్రజల కలలు పండించగ ప్రభుత్వాలె దిగివచ్చెను!!
    //అక్షరాన్ని అణచు..//
    వాదాలు వివాదాలు కలమే సృష్టించురా
    దేశమాత గౌరవాన్ని కలమే వెలిగించురా
    ప్రజాస్వామ్య పునాదులను కలమే కాపాడురా
    కలమొక్కటె నీ కీర్తిని కమనీయము జేయురా!!
    //అక్షరాన్ని అణచు..//
    చదువుతోనె జీవితము సార్థకమై నిలుచురా
    చదువు లేని లోకమంత చతికిలబడి పోవురా
    ఆవేశమె నీదైతే అక్షరమే ముంచునురా
    ఆలోచన నీదైతే అక్షరమే నిలుపునురా!!
    //అక్షరాన్ని అణచు..//
    ✍️ డాక్టర్ వెలుదండ వేంకటేశ్వర రావు.
    మహబూబ్ నగర్.
    Cell No : 8790421061

КОМЕНТАРІ • 7