ప్రంబనన్ రామాయణం - Part - 1

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - info.praveenmohan@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు, ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ ఆలయంలో, చెక్కబడిన పురాతన ఇతిహాస రామాయణం గురించి నేను మీకు చెప్పడం ప్రారంభించబోతున్నాను. ఈ ప్రంబనన్ ఆలయంలో, రామాయణ కథ గురించి వందకు పైగా different scenes ఉన్నాయి, నేను ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ప్రంబనన్ దగ్గర ఉన్న రామాయణ కథను డాక్యుమెంట్ చేయడమే. ఇదే ప్రంబనన్ రామాయణం యొక్క శిల్పం. ఇందులో రాముడు ఎక్కడ ఉన్నాడో మీరు చెప్పగలవా? interesting అయినా విషయమేంటంటే, రాముడును లేదా అతని బంధువులను ఎవర్ని కూడా, ఇక్కడ చెక్కలేదు and ఇది భూమి కూడా కాదు. ఇక్కడ రామాయణ కథకు బదులుగా, స్వర్గంలో ఒక పెద్ద పాముపై కూర్చున్న, విష్ణువును చూపిస్తూ ప్రారంభమవుతుంది. దురదృష్టవశాత్తు, ఇతని ముఖం ధ్వంసమైంది, కానీ మనం photoshopని ఉపయోగించి, దాన్ని మళ్లీ re-create చేద్దాం. అది విష్ణువు అని మనకు ఎలా తెలుసు? ఎలా అంటే, అతను ఒక చక్రం మరియు ఒక శంఖాన్ని పట్టుకుని ఉన్నందున, and ఎడమ వైపున చూడండి, అతని ఆజ్ఞ కోసం వేచి ఉన్న, విష్ణువు వాహనం అయినా డేగ లాంటి గరుడను మీరు చూడవచ్చు.
    And కుడి వైపున, అతని ముందు కూర్చుని, సహాయం కోసం అడుగుతున్న, 5 బొమ్మలను మీరు చూడవచ్చు. వారికి ఏం కావాలి? విష్ణువు స్వర్గం నుండి భూలోకానికి రావాలని మరియు రావణుడు అనే దుష్ట రాక్షసుడి నుండి తమను రక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రావణుడు రాజులను, సాధువులను మరియు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఈ ఐదుగురు విష్ణువును భూమిపైకి వచ్చి, రాక్షసుడిని నాశనం చేయమని ఒప్పించడానికి వచ్చారు. దీన్ని విష్ణు అంగీకరిస్తాడా? విష్ణువు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుని, భూమిపై మానవుడిగా జన్మించాడు, ఆ శిశువే ఈ రాముడు. ఇప్పుడు, భారతీయ రామాయణం ఇలా మొదలవదు, అలానే, ఇండోనేషియా రామాయణం కూడా ఇలా మొదలవదు. భారతీయ రామాయణాన్ని వాల్మీకి వ్రాసారు, and ఇండోనేషియా versionను కకావిన్ రామాయణం అని పిలుస్తారు.
    కానీ, ఇక్కడ మనకు కనిపించేది, ప్రంబనన్ రామాయణం, ఇది అన్ని రామాయణాల కంటే చాలా differentగా ఉంటుంది, ఇక్కడ ఈ opening scene లాగానే అన్నింటికీ deviate చేస్తుంది, కాబట్టే దీన్ని నేను ప్రంబనన్ రామాయణం అని పిలుస్తున్నాను. కానీ, దీన్ని రామాయణంలోని first sceneగా ఎందుకు చెక్కారు? భారతీయ రామాయణం మరియు ఇండోనేషియా రామాయణం ee రెండూ రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గురించి మాట్లాడటం ద్వారా వచనాన్ని ప్రారంభిస్తారు. So, శిల్పి రాజును ఎందుకు చెక్కలేదు, విష్ణువునే చెక్కాలని ఎందుకు decide అయ్యారు? ఎందుకంటే అప్పట్లో హిందువులు చాలా భక్తితో ఉండేవారు, నేటికీ కూడా చాలా మంది హిందువులు దేవుణ్ణి పూజించే, ప్రతి పనిని start చేస్తారు. కాబట్టి, శిల్పులు మానవుడిని చెక్కి, ద్వారా కథను start చేయాలనీ అనుకోలేదు, so వారు ప్రార్థన రూపంలో విష్ణువును చెక్కి, ఈ ప్రయత్నాన్ని start చేశారు.
    ఇప్పుడు, ఇండోనేషియా శిల్పులు స్వర్గాన్ని ఎలా ఊహించుకున్నారో చూడ్డానికి చాలా interestingగా ఉంది. ఇక్కడ వారు పాల సముద్రాన్ని చూపిస్తున్నారు. విష్ణువు, ఈ పెద్ద పాముపై కూర్చున్నాడు, ఇది దాని కోరలను చూపిస్తూ చాలా కోపంగా కనిపిస్తుంది, and దాని పడగ చూడండి ఎలా విశాలంగా తెరిచి ఉందొ. ఇక్కడ సముద్రంలో చేపలు, పుష్కలంగా ఎలా ఉన్నాయో చూడండి, ఇవి కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మీరు ఇక్కడ కొన్ని పీతలను చూడవచ్చు, అవన్నీ తమ పంజాలను ఎలా పైకి లేపుతున్నాయో గమనించవచ్చు, ఎందుకంటే అవి కూడా కోపంగా ఉన్నాయి కాబట్టి. And ఈ పీతను చూడండి, ఈ భాగం నాశనమైంది, కానీ అది ఈ వ్యక్తి కాలును కొరుకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ జంతువులన్నీ ఎందుకు సంతోషంగా లేవు? ఎందుకంటే, వారందరూ విష్ణువును ప్రేమిస్తున్నారు కాబట్టి, తమ ప్రియమైన యజమాని, ఈ స్వర్గపు ప్రదేశాన్ని విడిచిపెట్టి, భూలోకానికి వెళ్లి బాధపడటం వారికి ఇష్టం లేదు.
    ఇప్పుడు, ఇక్కడ మరొక మనోహరమైన detail ఉంది, ఈ శంఖాన్ని చూడండి. బాగా గమనించి, దీనికి రెక్కలు ఉన్నాయి, అది ఎగిరే శంఖం. కానీ మనం దీని గురించి తరువాత మాట్లాడుకుందాం. And, ఈ ఐదుగురు వ్యక్తులు ఎవరు? ఐదుగురే ఎందుకు ఉన్నారు? ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ఇవి పంచభూతాలు అని పిలువబడే ఐదు అంశాలు: భూమి, అగ్ని, నీరు, గాలి మరియు అంతరిక్షం, వారు గ్రహాన్ని నాశనం చేస్తున్నందున, రావణుడిని మరియు అతని దురాగతాలను పట్టుకోలేకపోయారు. So, దేవుడు వచ్చి భూగోళాన్ని రక్షించాల్సిన సమయం ఇదే. ఇప్పుడు, వెంటనే కుడి వైపున చూస్తే, మీరు ఈ భూమిపై ఏం జరుగుతుందో చూడవచ్చు. ఇక్కడ, ఈ రాజు మరియు అతని రాణి, వారి రాజభవనంలో వారు సరదాగా గడపడాన్ని మీరు చూడవచ్చు. ఎవరు వాళ్ళు? వీళ్ళే రాముడికి సంభావ్య తల్లి మరియు తండ్రి, వారే రాముడికి జన్మనివ్వబోతున్నారు. కానీ ఇక్కడ పెద్దగా ఊహించిన విధంగా ఏం లేదు, వారు కేవలం, రాజు మరియు రాణి ఏదో తింటున్నట్లు చూపిస్తున్నారు కదా.
    ఇక్కడ రాజు తన అరచేతిలో ఏదో పట్టుకుని ఉన్నట్లు, అందులో కొంత భాగాన్ని రాణికి ఇస్తున్నట్లు మీరు చూడవచ్చు. రాణి కూడా తన చేతిలో ఏదో పట్టుకుని ఉంది. మీరు ఇక్కడ చూస్తే, ఒక కుండ నిండా ఏవో ఉన్నాయి చూడండి, శిల్పి కూడా ఇందులో ఉన్నదీ ఏంటని, మనకు చూపిస్తున్నాడు, అది ఏంటంటే, ఖీర్ అని పిలువబడే ఒక semisolid rice dessert. ఒకవేళ మీరు రామాయణం చదివుండకపోతే, ఈ చెక్కడం మీకు అర్థం కాదు, అప్పుడు ఈ చెక్కడాన్ని చూసి, రాముడి యొక్క తల్లిదండ్రులు రాజభవనంలో కూర్చుని భోజనం చేస్తున్నారని మీరు చెప్తారు. కానీ కాదు. రామాయణం ప్రకారం చూసుకుంటే, రాణి, రాముడిని సహజంగా గర్భం దాల్చలేదు.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia #epic #ram

КОМЕНТАРІ • 43

  • @user-rf6wq4gk7w
    @user-rf6wq4gk7w 2 місяці тому +23

    నిజానికి రామాయణం కాలంలో తీసుకుని వెళ్లి నట్లుగా ఉంది ధన్యవాదాలు మోహన్ అన్నా😂🎉❤

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 місяці тому +22

    జయహో భరత్ రత్న శ్రీ ప్రవీన్ మోహన్ జీ 🙏👍👌

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  2 місяці тому +5

      ధన్యవాదాలు 🙏😊

    • @nageshramarama8845
      @nageshramarama8845 2 місяці тому

      🤝🤝🤝🙏​@@PraveenMohanTelugu

    • @The_Simhapurien
      @The_Simhapurien Місяць тому +1

      ​@@PraveenMohanTelugu .మీరు ప్రవీణ్ మోహన్ కాదు కదా?

  • @sbm9063
    @sbm9063 2 місяці тому +5

    భారత రత్న అవార్డు అందుకున్నారు మీకు శుభాకాంక్షలు 💐💐👏🏻👏🏻

  • @banothsurender3148
    @banothsurender3148 2 місяці тому +4

    😂 వేరే level, చాలా ఆనందంగా ఉంది. 👍👌👏🙏🕉️💪🇮🇳

  • @user-zt8gp8uv3z
    @user-zt8gp8uv3z 2 місяці тому +6

    🙏🙏

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya 2 місяці тому +5

    Jai sri ram 🙏🙏🙏

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 2 місяці тому +4

    Super analysis Praveen garu.👌👌👌

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 2 місяці тому +4

    మీ వివరణ కు చాలా ధన్యవాదములు 🙏

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  2 місяці тому +8

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1.100 కిలోల బంగారం, అయోధ్యలో నిషేధించిన భూగర్భ గది లోపల దాగి ఉందా? - ua-cam.com/video/69mRBQCXhn8/v-deo.html
    2.ఆలయ భూగర్భ గదిలో బయటపడిన అతి పురాతన వస్తువులు! - ua-cam.com/video/qY_7YGqBSwg/v-deo.html
    3.ఇందుకే ఈ గుడికి ఎవరు రాకూడదని అనుకుంటున్నారా! - ua-cam.com/video/Tck2XEaRW0o/v-deo.html

  • @-BOOS.B.R.7.S.
    @-BOOS.B.R.7.S. 2 місяці тому +4

    ❤❤❤❤❤

  • @svlteluguvlogs
    @svlteluguvlogs 2 місяці тому +4

    Great job, amazing

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 місяці тому +1

    మీ విశ్లేషణ చాలా గొప్ప గా వుంది.

  • @sunil9740
    @sunil9740 7 днів тому +1

    అద్భుతం

  • @srinivasarao2360
    @srinivasarao2360 Місяць тому

    Excellent sir... proud of you

  • @sadhanareddy8982
    @sadhanareddy8982 17 днів тому

    JAI SitaRam 🌷🌷🌷🙏🙏🙏🙏

  • @sadhanareddy8982
    @sadhanareddy8982 17 днів тому

    Jai SriRam 🌷🌷🌷🙏🙏🙏🙏

  • @sagarikauddanti4488
    @sagarikauddanti4488 2 місяці тому

    Super great sir meeru, entha baga explain chesro🙏🙏🙏

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 25 днів тому

    Good explanation..🙏❤

  • @madhavyarra1234
    @madhavyarra1234 2 місяці тому

    జై శ్రీ రామ్

  • @meenasana666
    @meenasana666 2 місяці тому

    Amazing explanation ..❤🙏

  • @manjula8251
    @manjula8251 2 місяці тому

    Super

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому

    Gad.giftu🎉🎉🎉.sir.meeru❤

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому

    Meeru.maru.janmalo.shelpe.🎉🎉🎉

  • @user-fq6nm4tv1j
    @user-fq6nm4tv1j 2 місяці тому

    hi Anna Garu

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому

    Wating.Your.videos.Bro 🎉🎉🎉. Good 👍

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Місяць тому

    🙏☺️👏❤️😍

  • @sridharenagandla7630
    @sridharenagandla7630 2 місяці тому

    🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @intisrinivasarao3884
    @intisrinivasarao3884 2 місяці тому

    Next part

  • @balakondaiah717
    @balakondaiah717 2 місяці тому

    🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️

  • @Hari-rz1sz
    @Hari-rz1sz 2 місяці тому

    🙏❤✌👌👍🚩🇮🇳🕉🙏

  • @Gudime
    @Gudime 2 місяці тому +3

    🙏🙏🙏

  • @masthanbabu9628
    @masthanbabu9628 2 місяці тому +4

    🙏🙏🙏

  • @kavitharangarao3
    @kavitharangarao3 2 місяці тому +3

    🙏🙏🙏