Tiger in Konaseema District | కోనసీమ జిల్లాలో చిరుతపులి కలకలం | ABP Desam
Вставка
- Опубліковано 29 вер 2024
- #tiger #konaseema #ravulapalem #leopard
కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో చిరుతపులి కలకలం రేపుతోంది. అక్కడి గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో లంకల్లో చిరుతపులిని చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో లంకల్లో పాదముద్రలు గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ జిల్లా అధికారి ఎం.వి. ప్రసాదరావు ఆధ్వర్యంలో పాద ముద్రల కోసం అన్వేషించారు. ఈ క్రమంలో అధికారులు స్థానికులతో మాట్లాడగా.. తాను గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో లంకల్లో పులిని ప్రత్యక్ష్యంగా చూసినట్లుగా మత్స్యకారుడు గంగరాజు వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో కోనసీమ జిల్లాలో చిరుతపులి ఫోబియా పట్టుకుంది. చిరుతపులి పాద ముద్రలు కనిపించాయంటూ సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన పడుతున్నారు.
Tiger in Konaseema District | కోనసీమ జిల్లాలో చిరుతపులి కలకలం | ABP Desam
Subscribe to the ABP Desam UA-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam