ఉపాధ్యాయ సాధికారత || NCERT and NCTE || Perspective education || Teacher's Empowerment ||

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2023
  • ఉపాధ్యాయ సాధికారత
    ( practice bits based on textbooks )
    29) answer : (b) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి
    Explanation :
    🔹a) జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి - NCERT
    ( National Council Of Educational Research and Training )
    🔹b) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి - NCTE
    ( National Council Of Teacher Education )
    🔹 c) రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి - SCERT
    ( State Council Of Educational Research and Training )
    🔹 d) కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ - CIET
    ( Central Institute Of Educational and Technology )
    30) answer : b) NCTE
    Explanation :NCTE ( National Council Of Teacher Education ) అనేది మనదేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత సంస్థ. ఉపాధ్యాయుల సమర్ధతను, నిబద్దతను పెంపొందించటానికి కృషి చేయటంతో పాటు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను " కరదీపికలుగా " ఉపాధ్యాయ లోకానికి అందజేస్తోంది.
    31) answer : c) SRC
    Explanation : సాధారణంగా short form నే తెలుగులో సంక్షిప్త రూపం అంటారు. Expand form లేదా abbriviation ను విస్తరణ రూపం అంటారు
    🔹 a) ప్రాంతీయ విద్యాసంస్థలు ( Regional Institute Of Education ) యొక్క సంక్షిప్త రూపం - RIE
    🔹 b) మండల వనరుల కేంద్రం ( Mandal Resource Centre ) - MRC
    🔹 c) రాష్ట్ర వనరుల కేంద్రం ( State Resource Centre ) - SRC
    🔹 d) జిల్లా విద్యా శిక్షణా సంస్థలు ( District Institute Of Education and Training ) - DIET
    32) answer : d) 1995
    Explanation :
    NCTE 1973 లో విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటుచేయబడింది.భారత దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత సంస్థ ఇది.1993 పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్దమైన స్వయంప్రతిపత్తి కల్గిన సంస్థగా మారింది. ఇక 1995 మే 15 తర్వాత నుంచి భారత్ లో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసుకుంది.
    33) answer : ( c ) NCTE ( జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి)
    Explanation : మనదేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత సంస్థ......NCTE. అంతే కాకుండా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సర్వేలు, చర్చలు, సెమినార్లు, కార్యగోస్టులు మొదలైనవి జాతీయ, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న సంస్థ NCTE.
    34) answer : ( a ) భోపాల్
    Explanation : NCTE కేంద్రీయ కార్యాలయం న్యూడిల్లీలో ఉంది. అలాగే భారత్ లో ఇంకా నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొంది. అవి వరుసగా
    i) ఉత్తర ప్రాంతం - జైపూర్
    ii) దక్షిణ ప్రాంతం - బెంగుళూరు
    iii ) తూర్పున - భువనేశ్వర్
    iv) పశ్చిమ ప్రాంతం - భోపాల్
    35) answer : c) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి
    36) answer : ( c) NCERT ప్రధాన కార్యాలయం మైసూర్ లో ఉంది.
    Explanation : పై ఆప్షన్స్ లో ఆప్షన్ c తప్ప మిగిలిన a, b, d ఆప్షన్స్ NCERT కి సంబంధించినవి.NCERT ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. కాశ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్ లలో ప్రాంతీయ కార్యాలయాలు( RIE ) ఉన్నాయి.
    37) answer : c)NCERT
    Explanation : ఫస్ట్ మనం NTSE పరీక్ష గురించి తెలుసుకుందాం.
    NTSE - జాతీయ స్థాయి ప్రతిభా పాటవ పరీక్ష ( National Talent Search Examination ).basically it is a scholarship test. 9 వ తరగతి పూర్తి అయిన విద్యార్థులకు మాత్రమే నిర్వహించబడుతుంది.10 వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు (scholarships) అందించటమే NTSE యొక్క లక్ష్యం.
    జాతీయ స్థాయిలో శాస్త్రవిజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్ష ( NTSE ) ను నిర్వహిస్తూ ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చే జాతీయ స్థాయి సంస్థ NCERT.
    38) answer : ( a) 1961
    Explanation :
    NCERT న్యూఢిల్లీ కేంద్రంగా 1961 సెప్టెంబర్ 1 వ తేదీన కేంద్రప్రభుత్వం చే ఏర్పాటు చేయబడింది. అంతర్జాతీయ సంస్థల సహకారం తో విద్యా నాణ్యతను పెంపొందించుటకు వ్యూహరచన చేయటం NCERT కర్తవ్యం.
    39) answer :( a ) జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి ( NCERT )
    Explanation : just observe (33) bit and (39 )bit
    మనదేశంలో
    🔹ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత స్థాయి సంస్థ.......NCTE
    🔹and పాఠశాల విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత స్థాయి సంస్థ......NCERT.
    ఈ రెండింటి difference గుర్తుపెట్టుకోండి.
    40) answer : (b) NCERT
    Explanation : UNICEF సహాయంతో పాఠశాల విద్యార్థుల కోసం బోధనాభ్యసన సామాగ్రి తయారీ,పరికరాలు, నమూనాలు సిద్ధం చేయటం NCERT కార్యకలాపాలలో ఒకటి. ఇంగ్లీష్ and హిందీ భాషలలో పాఠశాల స్థాయి పాఠ్య గ్రంధాలను, పఠనీయ గ్రంధాలను కూడా NCERT తయారుచేస్తోంది.

КОМЕНТАРІ • 5

  • @vasantha50000
    @vasantha50000 Рік тому

    🙏

  • @narsimulumale5220
    @narsimulumale5220 Рік тому +1

    Tq sir Or madam

  • @kiranraj7056
    @kiranraj7056 Рік тому

    Mi voice tho explain chesina videos chala baga vunayi. Please voice tho cheyandi.work chesthu vindanaki bavuntundi.

  • @neelimanamoju5496
    @neelimanamoju5496 Рік тому

    Madam garu total units ilage complete cheyandi.naa lanti house wife s ki chala usefull ga vuntundhi

  • @rathodrahul9695
    @rathodrahul9695 10 місяців тому

    Qn 32 NCTE was established in 1993