ఉపాధ్యాయ సాధికారత || ఉపాధ్యాయ వృత్యంతర విద్య topic || Perspective education || practice bits ||

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2023
  • 🔷 22) answer : (c) NPE - 1986
    Explanation : 1986 - జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ అని వృత్తి పూర్వ, వృత్యంతర విద్యలు రెండూ కూడా విడదీయరానివని నొక్కి చెప్పింది.ఉపాధ్యాయ సాధికారత అనేది వృత్తి పూర్వ శిక్షణ తో ఆరంభమై వృత్యంతర శిక్షణ తో పరిపృష్టం అవుతుంది అని NPE - 1986 అభివర్ణించింది.
    🔷 23) answer : ( b ) వృత్యంతర శిక్షణ
    Explanation : ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఆధునిక కాలానికి సమయత్తమైనపుడే విద్యావ్యవస్థ ఆశించిన ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి వృత్యంతర శిక్షణ ఉపయోగపడుతుందని విద్యావేత్తల అభిప్రాయం
    🔷 24) answer : ( d )ఉపాధ్యాయ కేంద్రిత బోధన
    Explanation : వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధిలోని అంశాలను పరిశీలిస్తే
    🔹బోధనాంశాలలో నూతనత్వం, ఆధునిక బోధన, అభ్యసన వ్యూహాలు, శిశుకేంద్రిత బోధనా పద్ధతులు, TLM ల వినియోగం, ICT పరిచయం, మూల్యాంకనా విధానాలు (CCE), విద్యార్థుల సహజ అభ్యసన అనుభవాలు, విద్యార్థుల స్థాయి గుర్తింపు ఇవన్నీ కూడా వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధి కిందికి వస్తాయి.
    వీటికి related కానిది ఉపాధ్యాయ కేంద్రిత బోధన so correct answer option (d)
    🔷 25) answer : ( c ) వృత్యంతర విద్య
    Explanation : కొత్తగా ఉపాధ్యాయ వృత్తి లో చేరినపుడు నూతనోత్సహంతో తరగతులు చెప్పటానికి ఉపాద్యాయుడు సిద్దపడతాడు. ఐతే రాను రాను అతనిలో కొంత అలసత్వం, జడత్వం చోటుచేసుకుంటాయి. వీటిని దూరం చేసి ఉపాధ్యాయునికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించేదే వృత్యంతర విద్య.
    🔷 26) Answer : ( c ) SCERT, SIET
    Explanation : ఉపాధ్యాయునికి వృత్యంతర విద్యను అందించే కొన్ని సంస్థలు....
    🔹 జాతీయ స్థాయిలో NCERT, CCRT, NCTE
    🔹రాష్ట్ర స్థాయిలో SCERT, SIET
    🔹 జిల్లా స్థాయిలో DIET
    🔹 మండల స్థాయిలో MRC
    పైవన్నీ కూడా వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే సంస్థలు.ఈ శిక్షణల ద్వారా ఉపాధ్యాయులు విద్యా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది
    🔷 27) Answer : ( a ) జాతీయ విద్యా విధానం
    Explanation : ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని పెంచుకోటానికి తప్పనిసరిగా వృత్యంతర శిక్షణా కార్యక్రమాలకు హాజరవ్వాలని పేర్కొన్నది జాతీయ విద్యా విధానం.కనీసం రెండేళ్లకు ఒకసారైనా ఒకటి లేదా రెండు వారాల పునఃశ్చరణ తరగతులకు ఉపాధ్యాయులు హాజరవటం వలన తమ బోధనను మెరుగుపెట్టుకోవచ్చని జాతీయ విద్యా విధానం యొక్క అభిప్రాయం.
    🔷28) Answer : b) శిక్షణ తర్వాత వచ్చే సందేహాలకు నిపుణులను సంప్రదించాలి.
    Explanation :
    ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణా ఫలితాలను తప్పనిసరిగా బోధనలో ఉపయోగించాలి. అలాగే తమకు వచ్చే సందేహాలకు నిపుణులైన విద్యావేత్తలను సంప్రదించవచ్చు.
    శిక్షణా అనుభవాలను సహఉపాధ్యాయులతో చర్చించవచ్చు. H. M, higher officials సలహా దారులుగా, మార్గదర్శకులుగా ఉంటూ విద్యా లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి.

КОМЕНТАРІ • 2

  • @Dsc555
    @Dsc555 Рік тому

    thank you madam ur explaination really good

  • @aakuladivya109
    @aakuladivya109 10 місяців тому

    Supr ilane 8th cls social new cheyara