దాల్ ధోక్లి | Dal Dhokli Recipe | Gujarati Dal Dhokli | No Onion No Garlic | Healthy Recipes

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • దాల్ ధోక్లి | Dal Dhokli Recipe | Gujarati Dal Dhokli | No Onion No Garlic | Healthy Recipes ‪@HomeCookingTelugu‬
    #daldhoklirecipe #gujaratidaldhokli #noonionnogarlicrecipes #easydalrecipe #homecookingtelugu
    కావాల్సిన పదార్థాలు:
    పప్పు ఉడికించడానికి కావలసిన పదార్థాలు:
    కంది పప్పు - 1 / 2 కప్పు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    ఇంగువ
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    వేరుశనగలు - 1 టేబుల్ స్పూన్
    నీళ్ళు - 2 కప్పులు
    తాలింపు కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్ స్పూన్
    నెయ్యి
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    పచ్చిమిరపకాయలు - 2
    ఇంగువ
    కరివేపాకులు
    టొమాటో - 2
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    బెల్లం
    ఢోక్లీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 1 కప్పు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    వాము - 1 / 2 టీస్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    నీళ్ళు
    దాల్ తయారు చేసే విధానం
    కంది పప్పును కడిగి నీటిలో 1 గంట నానబెట్టండి.
    నానబెట్టిన కంది పప్పును నీళ్లతో ప్రెషర్ కుక్కర్‌లోకి వేయండి .
    ఉప్పు, పసుపు , ఇంగువ , వేరుశెనగలను చేర్చండి .
    ఇంకా కొంచం నీళ్లు పోసి బాగా కలిపి మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ ఉడికించాలి.
    మరికొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ ఉడికించాలి.
    ఉడికిన పప్పును పక్కన పెట్టుకోవాలి.
    కడాయిలో నెయ్యి , నూనె తీసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
    ఆవాలు చిట పట లాడిన తర్వాత, అందులో ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు ,ఇంగువ, కరివేపాకు ను చేర్చండి .
    తర్వాత టొమాటోలు వేసి బాగా కలపాలి.
    పసుపు పొడి, కారం పొడి , ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
    ఉప్పు వేసి, టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించాలి.
    తర్వాత మీడియం తక్కువ వేడి మీద ఉడికించిన పప్పును చేర్చి బాగా కలపండి.
    మూత పెట్టి మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
    5 నిమిషాల తర్వాత,రుచి కోసం కొంచం బెల్లం చేర్చండి . మిక్స్ చేసి పప్పును పక్కన పెట్టుకోవాలి.
    డోక్లి తయారీకి
    ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, పసుపు పొడి, ఎర్ర కారం, జీలకర్ర పొడి, ఉప్పు, వాము ను తీసుకోండి.
    బాగా కలిపి కొద్దిగా నూనె వేసి మళ్లీ కలపాలి.
    ఇప్పుడు నీళ్లు పోసి చక్కటి పిండిని సిద్ధం చేసుకోవాలి.
    ఒకటి లేదా రెండు నిమిషాలు పిండిని బాగా కలిపి మూతపెట్టి, 10 నిమిషాలు అలానే ఉంచండి.
    10 నిమిషాల తర్వాత, పిండిని చిన్న భాగాలుగావేరు చేసి, మీడియం రోల్ మందం రోటీ లుగా చేయాలి.
    రోల్ చేసిన పిండి ని పిజ్జా కట్టర్ తో లేదా కత్తితో డైమండ్ సైజ్ లో కట్ చేయాలి.
    వాటిని పక్కన పెట్టండి.
    దాల్ ధోక్లి తయారీకి
    ఇప్పుడు పప్పును మరోసారి వేడి చేసి, చిక్కగా ఉంటే మరింత నీరు కలపండి.
    తయారు చేసుకున్న ధోక్లీలను పప్పులో మెల్లగా వేయండి.
    మూత పెట్టి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి.
    15 నిమిషాల తర్వాత, ధోక్లిలు చక్కగా పైకి వస్తాయి .
    ఈ సమయంలో, కొన్ని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను చల్లి వేడిని ఆపివేయండి.
    రుచికరమైన దాల్ ధోక్లి వేడిగా మరియు చక్కగా వడ్డించడానికి సిద్ధంగా ఉంది.
    వడ్డించే ముందు రుచి కోసం కొంచెం నిమ్మరసం చల్లుకోండి.
    Dal Dhokli is a Gujarati dish which can be called an Indian version of pasta made mainly with lentils and wheat flour. A lentil base of soupy consistency is made and wheat flour pasta is cooked in it. This dish is native to Rajasthan and Gujarat in India. This is enjoyed for breakfast or lunch or even dinner. Dal dhokli is a flavorful dish and if you are first timer, follow the exact steps to get the right taste. Watch this video till the end to get a step by step process on how to make dal dhokli at home. Try the recipe and let me know how it turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 5