భాగవతం | పోతన | కమలాక్షు నర్చించు కరములు కరములు | Potana | Bhagavatam |

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2020
  • భాగవతం | పోతన | కమలాక్షు నర్చించు కరములు కరములు | Potana | Bhagavatam |
    "నన్నయ, తిక్కనలు నా పుణ్యంకొద్దీ భాగవతాన్ని తెలుగులో రాయలేదు. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను’"అని పొంగిపోయిన బమ్మెర పోతన.. మహాకవి. ప్రజాకవి. పండితులను, పామరులను మెప్పించిన గొప్ప కవి. భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసిన ప్రస్థానం. ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంథాన్ని.. సర్వజనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చిదిద్దిన మహానుభావుడు పోతన. బమ్మెర పోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యావివేక, వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీరామ పాద సేవార్చనా దురంధరుడు. శ్రీకృష్ణలీలామృత భాగవతాన్ని సంస్కృతం నుంచి దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభమైంది. పదిహేనవ శతాబ్దానికి (క్రీ.శ. 1450-1510) చెందిన పోతన.. భక్తకవి. ఈయనది విశిష్ట వ్యక్తిత్వం. మొదట శివారాధకుడైనా తర్వాత విష్ణుభక్తుడయ్యాడు. పోతనకు ‘సహజపాండిత్య’ అనే బిరుదు ఉంది. ఈయన సంస్కృత ‘శ్రీమద్భాగవము’ను తెలుగులో రాసి తన జన్మనీ, తెలుగు భాషని చరితార్థం చేశాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు.వచన రచనలో పోతనను మించిన వారు లేరు.. నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకాపురి వర్ణనం.. ఇలా ఆంధ్ర మహాభాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి ఉన్నది. ఇక పద్య రచనా విధానంలోనూ పోతనది గొప్పశైలి.

КОМЕНТАРІ •