గుంటూరు భోజనం | Guntur Ananda Bhavan | 80years Old Famous Hotel | Traditional Meals | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • సాంప్రదాయ పద్ధతిలో వండి సహజ రుచులతో కమ్మటి భోజనం వడ్డిస్తూ.. ప్రామాణికమైన ఆహారశాలగా కీర్తింపబడుతుంది రామస్వామి గారు 80 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆనంద భవన్.అప్పట్లో చదువు మరియు ఉద్యోగ నిమిత్తం గుంటూరులో ఉన్న వారికి ఈ ఊరి ఊసుల్లో కచ్చితంగా ఉంటుంది ఆనంద భవన్. భోజనానికి ఆదరువైన ఈ భోజనశాలతో వారికి ఉన్న అనుబంధం అపురూపమైనది.8 దశాబ్దాల నిర్వహణ అనుభవాలను రామస్వామి గారి కుమారుడు పురుషోత్తమన్ గారు మనతో పంచుకుంటారు.ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో వంట చేస్తున్నారు ఇక్కడ. కనుమరుగైన ఊక అంతికపై కాగుల్లో తయారు కాబడుతుంది ఆహారం.ఈ విధానంలో వంట చేస్తుండటంతో నిప్పుల కొలిమిని తలపించాల్సిన వంటశాలలో సాధారణ వాతావరణం నెలకొని ఉంది. ఇబ్బంది,అసౌకర్యం లేకపోవడంతో శుచిగా ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు వంటవారు.ఆహారం శ్రేష్టంగా సహాజ రుచులతో సజావుగా జీర్ణమయ్యేలా తయారీలో అలనాడు రామస్వామిగారు తెలిపిన సూత్రీకరణనే అవలంభిస్తున్నారు నేటికి..తమ తండ్రి వద్ద వంట చేయుటలో శ్రేష్ఠత పొందిన పురుషోత్తమన్ గారు తమ కుమారుడుని సైతం వండుటలో సుశిక్షితులన చేశారు.ప్రముఖ నటులు నందమూరి తారకరామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు గుంటూరుకు వచ్చినప్పుడు పలుమార్లు ఆనంద్ భవన్ లో భోజనం చేశారట.శోభన్ బాబు గారు పురుషోత్తమన్ గారు మిత్రులు కావడంతో వారు తరుచుగా భోజనశాలకు వచ్చే వారు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 301