ఇంట్లోనే ఉంటూ సులభంగా హార్మోనియం నేర్చుకుందాం l వారం వారం సంగీతపాఠం 8639005975 ll
Вставка
- Опубліковано 5 лют 2025
- music cover by
YALAMARTHI MADHUSUDANA..
#వారంవారంసంగీతపాఠం
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
🙏
నమస్కారాలతో
Yama music world...
emailid: yamamusicworld123@gmail.com
ph:8639005975
please do like, share,comment ,and subscribe , thanks for watching...
Eala mimmalni kalavali sir
🌹🙏🙏🙏🙏🙏💐
గురువు గారికి వందనాలు 🙏🏿
Guruvu gariki vandhanulu
చాల రోజులు గా హార్మోనియం నేర్చుకోవాలని వుంది మీ కార్యక్రమం వల్ల ఆ కోరిక నెరవేరుతుంది.
🙏🙏 Tq sir
గురువుగారు చక్కగా వివరించారు
గురువు గారు మాకు కీబోర్డు వుంది కాని నేర్పించే వాల్లు లేక నేర్చొకొలేకపోతున్నాను దయచేసి మాకు నేర్పించండి గురువుగారు
Thank sir🙏
గురువు గారు నాకు హార్మోనియం నేర్చుకోవాలని చాలా కోరిక ఆందుకు నేను 18000 పెట్టీ హార్మోనియం కొన్నాను కానీ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు నేను యూట్యూబ్ లో చూసి ఏదో అలా వాయిస్తున్న నాకు నేర్పెంచ గలరు అండి
గురువుగారు వారం వారం క్లాస్ పెడతానని చెప్పారు కదా మాకు రెండవ వీడియో కనిపించడం లేదు ఎందుకని
శ్రావణనందముగా నున్నది
👌👌👌
Thanks and PLZZ forward ... Music learners and subscribe.. 🙏🙏
Super
చాలా బాగా చెప్తున్నారు సార్
మాస్టర్ గారు మీరుచాలాసూపర్ గాచెప్పుతున్నారు
హర్మనియం నేర్చుకుందాం అన్నారు
కీబోర్డు చూపిస్తున్నారు
వాళ్ళు యూట్యూబర్స్ దానిలో
హార్మొనియం బటన్ పెడతారూ
వాది స్వరంఅంటేఏంటీ అనువాద
స్వరంఅంటేఏంటీ అనిఅడగండి
అసలువిషయం తెలుస్తుంది బ్రదర్
సార్ హార్మోనియం లో అవేస్వరాలు కీబోర్డు లో కూడా అవేస్వరాలు నేర్చుకొనేవారికి ఏదైన ఒకటే శ్రద్ధ పట్టుదల ఉండాలిగురువుగారు చాలా చక్కగా చెబుతున్నారు సాధనచేయండి హార్మోనియం చక్కగా నేర్చుకోండి గురుభ్యోనమః గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ 👍👍🤝🤝
రుసుము ఎంత చెల్లించాలి గురూజీ
గురువుగారు నాకు హార్మోనియం నేర్చుకోవాలని చాలా ఆశ కానీ మాఊళ్ళో నేర్పేవారు లేరు దయచేసి హార్మోనియం ఎలా నేచుకోవాలో మొదటినుండి చెప్పండి ❤ధన్యవాదములు