లవకుశులు రామాయణాన్ని గానం చేయుట సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 4 |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను గదా! ఈ రామాయణాన్ని పాడగలిగిన వారెవరూ? మీరు బాగా గుర్తు పెట్టుకోండి! శ్రీ రామాయణం ప్రారంభం దగ్గర్నుంచి కూడా మొదటి శ్లోకం నుంచీ కూడా వీణా నాదానికీ, తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అని 24 వేల శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంధాన్ని దగ్గర పెట్టుకునీ. మహర్షి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూంటే తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మనః ! అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ !! కుశీలవౌ, మనం లవకుశులంటుంటాం. కుశీలవౌ ఎందుకంటే? ఒక గమ్మత్తుంది ఉత్తర కాండలో ఒక విషయాన్ని చెపుతారు, సీతమ్మ తల్లికీ అర్దరాత్రి వేళ ఇద్దరు మగపిల్లలు పుట్టారన్నారు ఇద్దరు మగ పిల్లలు పుడితే. భూత ప్రేత పిశాచాదులు పసి పిల్లలకు ఆపద కల్పిస్తాయి అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళీ దర్బల్ని చేత్తో పట్టుకునీ దర్భల యొక్క పై భాగాన్ని కౌశలముతో తెంపారు పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూత గ్రహాలు రాకుండా అక్కడ పురటాల పసి పిల్లలుతో ఉండగా ఎంత మహర్షి అయిన దగ్గరికి వెళ్ళరు గనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పై భాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పై భాగంతో రక్ష పెట్టాలి. అందుకని పైన ఉన్న ముక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చీ రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పై భాగంతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు గనుక కుశుడు అని పిలిచారాయన్ను, కుశీలవా - దర్భల యొక్క క్రింది భాగాన్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటి వాడి తర్వాత పుట్టినవాడికి రక్ష పెట్టారు. అందుకు దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండో వాడు, వాడు లవముల చేత రక్ష పెట్టారు కాబట్టి లవుడయ్యాడు. కశీలవౌ ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారో? అని మహర్షి ఆలోచిస్తూంటే. ఆసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింపజేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది. మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చీ కళ్ళు మూసుకొని రామాయణాన్ని ఎవరు ప్రచారం చేస్తారు అనీ ఆలోచిస్తున్న మహర్షినీ తన చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలను రెండూ పట్టుకుని నమస్కారం చేశారు కళ్ళు విప్పి చూశారు మహర్షి ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు ఓ...! నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇదీ! ఆయన మనసులోని ఆనందం అందుకని ఆయన అన్నారు కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! పౌలస్త్యవదమిత్యేవ చకార చరితవ్రతః !! శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు నాయనా రామాయణ రచన చేశానురా! ఇది ఆదికావ్యం ఈ రామాయణాన్ని మీరు గానం చేయ్యాలి ప్రతీచోటా ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లేమిటో తెలుసా! కావ్యం రామాయణం కృత్స్నం ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షీ కర్మ నిష్టుడైన వాల్మీకి మహర్షీ పరమ జ్ఞానియైన వాల్మీకి మహర్షీ గొప్ప తపస్వీయైన వాల్మీకి మహర్షీ వాక్యవిశారదుడైన వాల్మీకి మహర్షీ... నారదుడు, బ్రహ యొక్క అనుగ్రహము పొందినటువంటి వాల్మీకి మహర్షి అద్భుతమైన వర ప్రసాదితమైన వాల్మీకి మహర్షి రచన చేసినటువటి శ్రీ రామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవీ అని చెప్పుకుంటుంన్నారు సంతోషంతో... వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆదికావ్యం యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్దరించగలిగిన ఆదికావ్యం అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! దీనికి 'రామాయణం' అని పేరు పెట్టానురా... అంటారు మొదట. రామాయణం అంటే... రామస్య ఆయనం రామాయః ఆయనం అందులోనే ఇద్దరున్నారు రామస్య ఆయనం రాముని యొక్క నడక ఆయనం అంటే కదలికలు ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయే అది రామాయణం. రామాయణం ఎవరిమీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతానూ ఒక్కొక్క చోట రాముడు కనపడడు కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తూంటూంది సుందర కాండలో రాముడు కనబడడు. కాని రామ నామం, రామ కథ ఒకటికి పదిమార్లు వినపడుతూంటూంది రామ కథా మృత సంజీవనీ, చచ్చిపోయేవాన్ని బతికిస్తుంది రామ కథా అటువంటి రామ కథతో నిండిపోయింది కాబట్టి రామాయణం కాదు కాదు ఆయనం అంటే కదలిక.
    కదలికా అంటే. బాహ్యంలో ఉన్న కాళ్ళు కావు ఒకటి సత్యము ఒకటి ధర్మము ఒక కాలు తీసివేస్తే ధర్మము రెండో కాలు సత్యము ధర్మం మీద నిలబడితే సత్యం మీద నిలబడుతాడు సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడుతాడు. సత్యధర్మములను అనుష్టించి నడిచి ధర్మానికి మారు రూపియై రామో విగ్రహవాన్ ధర్మః అనిపించుకుని ఈ లోకానికి ధర్మ స్వరూపాన్ని తన ప్రవర్తనలచేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ! ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పానూ అన్నారు.
    #ramayanam #jaishreeram #motivation #motivational #ayodhya #chagantikoteswararao #motivationalquotes #telugu #telugupravachanaalu

КОМЕНТАРІ •