Nuvvu Vasthavani Songs | Komma Komma Songs | Komma Komma | Nagarjuna | Simran | Teluguone

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Komma Komma Song from Movie "Nuvvu Vastavani" Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
    #Teluguone #NuvvuVasthavaniSongs #NuvvuVastavani #NuvvuVastavaniMovie #Nagarjuna #simran #nagarjunaMovies
    Movie : Nuvvu Vastavani
    Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali
    Director : Vankineni Ratna Pratap
    Music : S.A. Rajkumar
    Release date(s) : 05th April 2000
    Producer : R.B. Choudary

КОМЕНТАРІ • 1,6 тис.

  • @SAIKRISHNA-xw7zf
    @SAIKRISHNA-xw7zf Рік тому +818

    1985 - 95 ఈ మధ్యలో పుట్టిన వారు అన్నీ రకాలుగా జీవితాన్ని ఆస్వాదించారు.. అటు ఫోన్ లు టెక్నాలజీ లేనప్పుడు ఉన్న బాల్యం.. ఇటు అన్ని వచ్చాక అనుభవించే యవ్వనం..🎉🎉🎉 కానీ బాల్యం లో ఇలాంటి సినిమాలు.. పాటలు.. ఆరుబయట ఆటలు.. ఆ జీవితమే వేరు.. ఈనాటి పిల్లలకి అలాంటి లైఫ్ ఎప్పటికి రాదు

  • @sureshchalla3739
    @sureshchalla3739 10 місяців тому +76

    నేను జన్మించినది 1987.నాకు 80,90 లలో వచ్చిన సినిమాలు కానీ,ఆనాటి పాటలు అంటే చాలా ఇష్టం.ఆనాటి సాహిత్యం,ఇప్పుడు లేదు.ఆనాటి పాటలు విన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఇప్పటి పాటలు వింటే భాధగా అనిపిస్తుంది.నాకు చిన్నపటినుంచి పాటలు పాడటం అలవాటు.చాలా పాటలు స్టేజ్ ల మీద పాడాను.ఇప్పుడు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.మా పిల్లల కోసం చాలా సార్లు,చాలా పాటలు పాడాను.ప్రత్యేకించి ఈ పాట చాలాసార్లు పాడాను. ధన్యవాదాలు.

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd 5 місяців тому +89

    2024 లో ఈ సాంగ్ నీ చుస్తున్నవరు నాగార్జున ఫ్యాన్స్ ఒక like వేసుకోండి

  • @chandubanoth6598
    @chandubanoth6598 2 роки тому +176

    నేనైతే 2 రూపాయల పాటల బుక్ థిస్కొని నోట్ బుక్స్ లో రాశి పాడెవాన్ని sooo స్వీట్ మెమరీ

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Рік тому +163

    ఈ పాట విన్న ప్రతిసారీ మనసుకూ ఎదో తెలియని హాయి, సంతోషం కలుగుతుంది......💓💓💓

  • @sucharithathiru233
    @sucharithathiru233 3 роки тому +261

    10సవ్వసరాల క్రితం ఏ ఫంక్షన్ లో అయిన ఈ సాంగ్ ఫంక్షన్ కి వేలే అప్పుడు కూడా జీపు ఆటో లో కూడా ఇదే సాంగ్స్ అ రోజులే వేరు ఉండే

  • @luckyram2190
    @luckyram2190 2 роки тому +50

    ఆ రోజులో పాడిన పాటలకు అర్థం ఉండేది ఇప్పుడు అర్థమే లేకుండా పోయింది ఆ రోజులు చాలా బాగుండేది 🙏

  • @SravaniAratikatla-r6l
    @SravaniAratikatla-r6l 6 місяців тому +51

    2024 lo vintuna vallu oka like

  • @dsnayak4258
    @dsnayak4258 4 роки тому +164

    ఎంత మందికి ఈ పాట అంటే ఇష్టం

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 роки тому +64

    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
    వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తోంది
    ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
    చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
    పూల పొదరిల్లే రా ..రామ్మన్నది
    విన్నానమ్మా తీయని వేణువు రమ్మను
    పిలుపుల్నీ
    చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులనీ
    చరణం 1:
    పగలూ రాత్రి అంటూ తేడా లేనేలేని పసిపాప
    నవ్వుల్ని చూడనీ
    తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి
    ఋణముందో అడగనీ
    చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవనీ
    కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని
    ప్రతిజన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా
    దేవుళ్లని !
    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
    విన్నానమ్మా తీయని వేణువు రమ్మను
    పిలుపుల్నీ
    చరణం 2:
    ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ
    పూలు తేవాలి పూజకి
    నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి
    ఈ జన్మకి
    మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా
    వరసకాని బంధువుని చొరవచేసి అంటున్నా
    ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదని... నీకు
    సొంతం అంటే నేనే అనీ.. !!
    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తోంది
    వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు
    తెస్తోంది
    ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
    చిలకమ్మా ఎదురేగీ స్వాగతాలు చెబుతావా
    పూల పొదరిల్లే రా ..రామ్మన్నది
    విన్నానమ్మా తీయని వేణువు రమ్మను
    పిలుపుల్నీ
    చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన
    తలుపులనీ...
    చిత్రం: నువ్వువస్తావని (2000)
    సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
    గీతరచయిత: ఇ.ఎస్. మూర్తి
    నేపధ్య గానం: హరిహరన్, చిత్ర

  • @meesalaparamesh9812
    @meesalaparamesh9812 Місяць тому +5

    2000 సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ పాట గురించి 20 సార్లు చూశాను అది ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవీలో హీరో సామ్రాట్ నాగార్జున సిమ్రాన్

  • @umasankarch5781
    @umasankarch5781 6 років тому +610

    అబ్బా......
    ఇలాంటి పాటలు వింటే ఆకలివేయదు...
    ప్రేమికులకు

  • @ramg1021
    @ramg1021 3 роки тому +126

    మా టేపు రికార్డ్ లో వినేవాళ్ళం
    మంచి మాట..👌👌

  • @jayasankar9453
    @jayasankar9453 3 роки тому +26

    మనసుకి ప్రశాంతత ను ఇచ్చే ఇలాంటి పాటలు రాసిన వారికి ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే

  • @శివయూట్యూబ్
    @శివయూట్యూబ్ 3 роки тому +433

    2021 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @swathiramarapu2549
      @swathiramarapu2549 2 роки тому +2

      not only 2021 but also in 2022 😛

    • @KIRANZORO
      @KIRANZORO 2 роки тому +2

      July2022

    • @Nanda-xs7cd
      @Nanda-xs7cd 2 роки тому +2

      Yea,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😄😄🌟🌟👋👋💅💅💅👋👋👋👋👋👋👋👋💐💐💯💯

    • @chadaanandmudiraj8811
      @chadaanandmudiraj8811 2 роки тому

      ​@@Nanda-xs7cd s

    • @akashuppula8260
      @akashuppula8260 8 місяців тому +1

      2024

  • @mrajeshm.sc.b.ed.
    @mrajeshm.sc.b.ed. 2 роки тому +110

    "Ever green melody song"
    చాలా లక్షణము గా పాట చిత్రీకరణ చేసిన డైరెక్టర్ గారికి, గొప్ప నటుడు అక్కినేని నాగార్జున గారికి, సిమ్రాన్ గారికి, పాటపాడిన గాయకులకు, మ్యూజిక్ డైరెక్టర్ మరియు అందరూ టెక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు.

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 роки тому +127

    ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍👍

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +202

    ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా వంకినేని ప్రతాప్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఇ.యస్.ఆర్.మూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరి హరన్ గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ నాగార్జున గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @SuneethaParvathala
    @SuneethaParvathala 5 місяців тому +5

    1978 లో పుట్టిన వారు kuda బాగా ఆస్వాదించారు జీవితాన్ని, so many sweet memories🎉🎉

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 6 місяців тому +5

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది
    వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
    ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
    చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
    పూల పొదరిల్లే రా రమ్మందని
    విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
    చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    పగలు రాత్రి అంటూ తేడా లేనే లేదు
    పసిపాప నవ్వుల్ని చూడని
    తోడూ నీడా నువ్వై నాతో నడిచే నీతో
    ఏనాటి ఋణముందో అడగని
    చేదు చేదు కలలన్నీ కరిగితేనె వరదవని
    కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని
    ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని
    కోరుకుంటానమ్మా దేవుళ్లని
    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది
    విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
    (పని పని పని పని
    పమా మరి గస సాని
    పని పని పని పని
    పమా మగ గస సాని
    సాగ గరినిస
    పని సాగ గరినిస)
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే
    ఏ పూలు తేవాలి పూజకి
    నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే
    ఇంకేమి కావాలి జన్మకి
    మచ్చలేని చంద్రుడిని మాటరాక చుస్తున్న
    వరుస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
    ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని
    నీకు సొంతం అంటే నేనేనని
    కొమ్మా కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది
    వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
    ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
    చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
    పూల పొదరిల్లే రా రమ్మందని
    విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
    చుశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలపులని
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @shafi07mms
    @shafi07mms 4 роки тому +225

    *Maa 90's kids ku eppatiki gurthundi poye song idi*

  • @ChandraShekar-jr4vc
    @ChandraShekar-jr4vc 6 років тому +203

    మంచి సాహిత్యం, రాగంతో మనసుకు హాయినిచ్చే ప్రేమ పాట. మళ్ళి మల్లి వినాలనిపిస్తుంది...

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 3 роки тому +163

    హరిహరన్ సార్ మీకు శతకోటి వందనాలు, మీ వాయిస్ తేనె లా మధురం గా ఉంటుంది 👏👏👏

  • @santhoshp6144
    @santhoshp6144 Рік тому +11

    నా జీవితములో సినిమా థియేటర్ లో చూసిన మొదటి సినిమా ,అప్పట్లో టికెట్ మూడు రూపాయలు, మా పలాస వెంకటేశ్వర థియేటర్ లో❤

  • @sanandkumar4288
    @sanandkumar4288 4 роки тому +451

    2020 lo e song ni chuse valu oka like me

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 4 місяці тому +4

    ఈపాట వింటునపు మనసులో బాధ గా ఉంతుది అదే ప్రేమ ❤❤❤❤❤❤❤❤❤

  • @sasibhushanaraobura6927
    @sasibhushanaraobura6927 5 років тому +43

    మల్లి మల్లి ఇలాంటి మనసుకి ఎంతో హాయినిచ్చే పాటలు వినగలమా

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 роки тому +28

    నా చిన్నప్పుడు విన్న నాకు నచ్చిన మొదటి song నేను ఎప్పటికీ మర్చిపోలేను ❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏾

  • @gRavigRavi-jb5ru
    @gRavigRavi-jb5ru 6 років тому +432

    ఈపాట రాసినవారికి పాడీనావారికి నా పాదబివందనం👌👌👌👌👌👌

  • @urstrulyKanchi
    @urstrulyKanchi 6 років тому +127

    Appati actors and actress very lucky
    Gurthu undipoye mves and songs.....

  • @vinodkumarbaikadi4128
    @vinodkumarbaikadi4128 6 років тому +244

    ప్రేమకు అర్థం చూపిన ప్రేమికుడు

  • @eswarommi1177
    @eswarommi1177 5 місяців тому +2

    ఈ సినిమా టైం లో ఒక అమ్మాయి నీ చూస్తే ఈ పాట గుర్తుకు వచ్చేది కానీ ఆ అమ్మాయి ఎలా ఉందో కానీ ఆప్పుడూ ప్రేమో ఎమూ తెలీదు కానీ ఎక్కడ ఉన్న ఆ అమ్మాయి హ్యాపీ గా ఉన్నడలి

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 роки тому +4

    నాకు తెలిసి 2020 లో ఇలాంటి అర్థవంతమైన పాటలు వినలేము అనుకుంట...

    • @aparnamydarling8855
      @aparnamydarling8855 4 роки тому

      నీలి నీలి ఆకాశం సాంగ్ వుంది గా

    • @ashusenbasha9226
      @ashusenbasha9226 4 роки тому

      @@aparnamydarling8855 correct

  • @pothangalsathish4060
    @pothangalsathish4060 5 років тому +8

    ఎంతైనా కింగ్ నాగార్జున కింగె...!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +160

    వరస కాని బంధువుని చొరవ చేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని నీకు స్వంతం అంటే నేనేనని

  • @balajikashwini8458
    @balajikashwini8458 5 років тому +20

    👌ఈ పాట వింటుంటే మనసు ఎంతో హయిగా ఉంటుంది👌

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 роки тому +27

    నా చిన్నప్పుడు నాకు మొదటిగా నచ్చిన హీరో మన్మధ నాగార్జున sir గారు ఆయనన్ని ఏపటికి మరవలేను ❤️😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏾

  • @venugopal-rr9pk
    @venugopal-rr9pk 2 роки тому +26

    Im from karnataka but i love these songs for over 20years... Heart tocuhing lyrics.... Music unites all of us.. 👍..

  • @spac139
    @spac139 2 роки тому +4

    Nice 5th April 2000 Ugadi roju release...nice super hit cinema

  • @LorigemiMasters
    @LorigemiMasters 13 років тому +103

    yes yes ... great melody from SA Rajkumar at 90's songs

  • @nithinbhogaraju4244
    @nithinbhogaraju4244 5 років тому +27

    My childhood song
    E song vinnappudala
    Na chinnatanam gurthuvastadi

  • @nageshmarripally9174
    @nageshmarripally9174 2 роки тому +26

    ఇది పాటంటే నాకు జ్వరం వస్తే మా అమ్మ కోదాడ హాస్పటల్ కి తీసుకు వెళుతుంటే నాగార్జున సినిమా చూపిస్తేనే హాస్పిటల్ కి వస్తాను అంటూ ఏడ్చాను అప్పుడు సినిమా చూపించి మరి హాస్పిటల్ కి తీసుకువెళ్లింది

  • @sujathak7227
    @sujathak7227 4 роки тому +38

    TO SINGER HARIHARAN SIR, THANK U SO MUCH FOR SINGING THIS SONG WITH PERFECT PURE PRONOUNCIATION..VERY NICE..THANK U SO MUCH ANNAYYA..

  • @mohanreddy3540
    @mohanreddy3540 5 років тому +70

    I was studying 4th standard I used listening this song Daily very badly 😘 in my grandmaa home 🙌😍I remembering those days when I listen this beautiful song 😘 there is no words to describe 👏🙏😍😍😍

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 4 роки тому +9

    2020 వరుకు కాదు ఎప్పటికి ఇదే నాకు ఇష్టమైన సాంగ్

  • @mujibkhan-st8sg
    @mujibkhan-st8sg 6 років тому +224

    పెండ్లి లలో మంచి పాటలు మంచి ఇలాంటి పాటలు

  • @gsentertainments6288
    @gsentertainments6288 3 роки тому +6

    Elanti music inchinanduku sa rajkumaar ki thank you very much my favorite music director rajkumaar garu

  • @sowjanyamaddipati616
    @sowjanyamaddipati616 6 років тому +66

    Simran is super heroin and a perfect match for any hero in Tolly wood.
    l never saw this kind of heroin in Telugu.

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 9 днів тому

    ప్రతి జన్మ కీ ఈ నేస్తమే కావాలని కోరుకుంటనమ్మా దేవుళ్ల నీ❤❤❤lyrics ❤🎉🎉

  • @pavithranaidu481
    @pavithranaidu481 6 років тому +12

    Inkeppudu ontarinani anradani .Niku swantham ante Nene kada .superrrrrr line .fantastic song meaning full lines ..

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      పవిత్ర నాయుడు గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా ఈ పాటపై మీరు తెలుగులో వ్యాఖ్యలు వ్రాసి ఉంటే చాల బాగుండేదని మీకు సవినయంగా మనవిచేసుకుంటు మరొకసారి ఈ పాట వీక్షించే భాగ్యం నాకు కలిపించిన మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

  • @nagasekhar8054
    @nagasekhar8054 3 роки тому +9

    2050లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @VeeranjaneyuluC
    @VeeranjaneyuluC 7 місяців тому +10

    2024 లో వినేవారు ఉన్నారా. 👍

  • @ramaraju3206
    @ramaraju3206 3 роки тому +2

    పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసి పాప నవ్వులని చూడని

  • @sukumar3694
    @sukumar3694 5 років тому +7

    Prathi janmaki nee nesthanme kavalani korukuntanamma devullani super lyrics
    Love you Chinni
    I'm waiting for My Chinni
    Remembering my childhood day's

  • @narayanaraoredla6530
    @narayanaraoredla6530 6 років тому +24

    Super songs vinte chalu bojanam vadhu money vadhu bangaram vadhu tenction chitikalo mayam avuthai

  • @surenderraju
    @surenderraju 7 років тому +80

    singers .ks chitra amma.hari haran garu super song

  • @sirishhyd
    @sirishhyd 3 роки тому +20

    As usual, 1999 to 2002 songs anni, they will make me remember you..my first crush, my love, my life. 19 years flied in a swing...i love you forever..wherever you are..tc

    • @naidub4455
      @naidub4455 2 роки тому +1

      Very nice song ❤️❤️

  • @mohamedkaleemulla382
    @mohamedkaleemulla382 7 років тому +54

    i want my childhood back, i miss those days and these are the songs are most listened...

  • @RajRaj-bw3xh
    @RajRaj-bw3xh Рік тому +4

    2023లో విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @lovelysardaar5971
    @lovelysardaar5971 5 років тому +42

    Old is gold... Super song 😍

  • @mr_pandu2286
    @mr_pandu2286 2 роки тому +5

    Lejendary singer chitra garu 💓entha theeyaga undo vioce 🙏🙏

  • @hanamanthahanamantha9983
    @hanamanthahanamantha9983 4 роки тому +12

    ,, ಕನ್ನಡಿಗರ ಲೈಕ್ ಮಾಡಿ

  • @Laxman126
    @Laxman126 10 місяців тому +1

    Ee song naku chala estam ❤❤Elanti song Inka eppudu radhu old is gold 😊

    • @Mahesh-n1m
      @Mahesh-n1m 6 місяців тому

      సూపర్ songs edi

  • @kranthiarur8240
    @kranthiarur8240 8 років тому +43

    heart touching song very nice

  • @kurumojunaresh8765
    @kurumojunaresh8765 2 роки тому +1

    సుస్వరాల సంగీతం...అద్భుతమైన పాట.
    2022 లో ఎంత మంది విన్నారు.

  • @daramesha1062
    @daramesha1062 2 роки тому +3

    Pure pronounciation every green hit song ❤️♥️ all time favourite this song 🥀 singers Hariharan and k,s chithra gariki koti namaskaralu 👍🥀🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaysekhar6663
    @vijaysekhar6663 4 роки тому +29

    Nagarjun career one of the best album nuvastavani

  • @bhanumathicheela2432
    @bhanumathicheela2432 3 роки тому +17

    Missing those old days .
    Early 2000s

  • @barrechinna1096
    @barrechinna1096 Рік тому

    మా టేపు రికార్డు లో ఈ సినిమా పాటలు వినేవాడిని 2023 లో వినేవారే ఒక లైక్ చెయ్యండి

  • @govardhanreddy2283
    @govardhanreddy2283 6 років тому +46

    Simran expression at 3:14 is awesome

  • @bandipraveen2055
    @bandipraveen2055 2 роки тому +1

    చిన్నపుడు థియేటర్ లో చుసిన సినిమా ఇది... పాటలు విన్న ప్రతిసారి చిన్నతనం గుర్తొస్తా ఉంటది.... అపుడు నేను నా డ్రెస్సింగ్ నా తెలిసి తెలియని గోప్పతనం ధైర్యమ్ భయం అన్ని గుర్తొస్తాయి

  • @praphulkumargardeningpassi5476
    @praphulkumargardeningpassi5476 5 років тому +6

    కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
    వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
    ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
    చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా
    పూల పొదరిల్లె రా రామ్మనది
    విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
    చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని
    పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసి పాప నవ్వుల్ని చూడనీ
    తోడు నీడ నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి ఋణముందో అదగనీ
    చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదలని
    కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని
    ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని
    కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
    విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
    ఇదుగో నువ్వే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
    నీతో జతగా ఉండే వారమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
    మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్న
    వరస కానీ…

  • @ramaraju3206
    @ramaraju3206 3 роки тому +1

    ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి

  • @rousbasha2348
    @rousbasha2348 6 років тому +46

    Eee paata ki disc like chysi nollu manushuly kaaaaru

  • @dimplebubliee3416
    @dimplebubliee3416 Рік тому +1

    2023 lo ee song chuse vallu ekkada like veskondi....vallantha mana batche😂😂😂😂❤

  • @yadaiahbadhugani9534
    @yadaiahbadhugani9534 6 років тому +21

    Memorable,,, love song,,,💗💗💗💗

  • @Sandeep.P.ku3xi
    @Sandeep.P.ku3xi 11 місяців тому +1

    All❤ my favourite song. .. సాంగ్ ఉంటే పాతజ్ఞాపకాలు గుర్తువస్తుంది 😢😢 my Daddy and mummy లేరు కదా 😢😢 song వింట్టు పడుకుంటాను simran garu my mummy la ఉంటది love my simran garu nv unantha roju lo my mummy ga ne undu 💕❤️

  • @mujibkhan-st8sg
    @mujibkhan-st8sg 6 років тому +435

    ఇలాంటి పాటలు ఇప్పట్లో వస్థలేవు ఆ పాటలు వేరు ఆ రోజులు వేరు నేను ఐస్క్రీం వేస్తుండే పెండ్లి లలో కరీంనగర్

  • @prabha_s3846
    @prabha_s3846 5 років тому +1

    Ilanti patalu vintunte manasuku entho prashanthanga untundi singers chala baga padaru

  • @phanishankar8595
    @phanishankar8595 5 років тому +24

    This Movie one of the best Movie in Nagarjuna Carrier

  • @pogirigowrinaidu3663
    @pogirigowrinaidu3663 8 місяців тому +1

    2023 లో ఈ పాట ఎంత మంది చూస్తున్నారు. ఒక లెక్ కొట్టండి

  • @satishkb7647
    @satishkb7647 6 років тому +74

    All time listenable songs , very meaningful lyrics .....

  • @pinapallisubhalaxmi1366
    @pinapallisubhalaxmi1366 4 роки тому +30

    Evergreen song ....❤
    Pure love 💟

  • @sravanthik8330
    @sravanthik8330 6 років тому +106

    prathi ammayie ki elanti PRIYANESTHAM kavali👌💏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kranthikumar7326
    @kranthikumar7326 4 роки тому +2

    Elanti songs malli ravu , ralevu kuda , evergreen hit songs

  • @sureshbabunandika
    @sureshbabunandika 4 роки тому +16

    ఆ రోజుల్లో 9వ తరగతి మారి
    మెలోడీ ధీయేటర్ విశాఖపట్నం
    😍😍😍

  • @ManojKumar-us4rz
    @ManojKumar-us4rz 4 роки тому +1

    2020 king Nagarjuna nag Chaitanya akhil akkineninageswar rao garu fans ki naa wishes jai yuvasamrat king Nagarjuna your songs are evergreen hit

  • @shreedevinaidu4717
    @shreedevinaidu4717 6 років тому +5

    lovely song....chala bagaundi

  • @lavudyasaiman8468
    @lavudyasaiman8468 6 років тому +24

    I adore this song forever

  • @srimanbuchiraju9282
    @srimanbuchiraju9282 6 років тому +15

    heart touching songs 1990..s aftet

  • @ramalakshmipavanumamahesh9836
    @ramalakshmipavanumamahesh9836 Рік тому +1

    నాకు esong ki nenu 2000 6thclass chaduvu తున్నప్పుdu school second vachindi super song swet memories old is gold

  • @rachanagudla8339
    @rachanagudla8339 5 років тому +5

    I dont know how many times watch and listen of this song and movie we have get raise some feelings while listing at time

  • @yadavparthu309
    @yadavparthu309 5 років тому +9

    Awesome what a expression and joyful song to hear a melody....Thanks for giving this song to us.......

  • @vennanani5074
    @vennanani5074 6 років тому +10

    Very NYC song,every time I will not get bore by watching it

  • @schennayya4517
    @schennayya4517 3 місяці тому

    నాగార్జున గారు ఎక్కడున్నారు మీ ఫ్రెండ్స్ మీ అభిమానులు ఇలాంటి సినిమా కొరకు వేచి ఉన్నారు❤ మీరు సినిమాలు తీయకపోతే మీ ఫ్రాన్స్ అభిమానులు ❤ అమ్మాయిలు మిమ్మల్ని మర్చిపోతారు నాగార్జున గారు

  • @bharathgoud853
    @bharathgoud853 5 років тому +4

    నేను చేడిలు వేసుకునేపుడు వయస్సు నుంచి వింటున ఈ సాంగ్ అప్పట్లొ పేమస్ సాంగ్ ఇది

  • @venkateshkamre4651
    @venkateshkamre4651 3 роки тому +1

    Enta stress unna potundi...hari hari and Chitra sprb.nagarjuna also sprb

  • @gangasun6312
    @gangasun6312 5 років тому +13

    Salute for music Director

  • @RkRk-nv4ye
    @RkRk-nv4ye Місяць тому

    Chala emotional movie . Appatlo e movie ante pichi .❤❤

  • @prasadarul845
    @prasadarul845 4 роки тому +4

    చాలా బాగ పాడారు హరిహారన్ గారు...