Vande SriMatharam

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 16

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  3 роки тому +1

    ua-cam.com/video/VCeyEyBZZ8c/v-deo.html
    Vande SriMatharam 🙏💐💐💐

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому +1

    #ShriRagam
    వందే శ్రీమాతరం మహాదేవ తరుణీం
    శ్రీచక్ర నివాసినీం శ్రీకరీం శివంకరీమ్
    #Madhyamavathi
    1.మధుకైటభ నిహన్త్రీం మహాకాళి కాం మహిషాంతకరీం శివాం మహాలక్ష్మీం భజే
    శుంభాది వినాశినీం మహాసరస్వతీం శంభుప్రాణనాయికాం శాంభవి మహంభజే
    #Arabhi Ragam
    2.సకల దేవతారూపాం సప్తమాతృకాముమాం
    నవ దుర్గా కోటి కోటి శివశక్త్యాకృతిధరాం భుక్తిముక్తికరాం అన్నపూర్ణాం శాకంభరీం సర్వమంత్ర రూపిణీం జననీం జగదంబికామ్
    #Bageshree Ragam
    3.పంచాశద్వర్ణాకృతి మంబాం శ్రీ శారదాం వాగ్బుద్ధి జ్ఞానాధిష్ఠాత్రీం సితగాత్రీమ్ శబ్దబ్రహ్మాత్మికాం సారస్వతదాయినీమ్
    సంగీతజనయిత్రీం సద్విద్యాం భజామ్యహమ్
    #Valaji Ragam
    4.పద్మాం పద్మస్థితాం పరమైశ్వర్య ప్రదాం శుద్ధసత్త్వ శుభాకృతిం సువర్ణ రజతస్రజాం నారాయణ హృన్నిలయాం నానాభూషోజ్జ్వలాం
    లక్ష్యాలక్ష్యసురూపాం లక్ష్మీం త్వాం భజామ్యహమ్
    #RanjaniRagam
    5.శశిశేఖరవల్లభాం సౌమ్యాం మాహేశ్వరీం గౌరీం గజముఖ జననీం కైలాసాచల వాసాం
    శివాం సర్వమంగళాం శ్రీ షణ్ముఖ వత్సలాం దుష్టదనుజసూదనీం దుర్గాం త్వాం భజామ్యహమ్
    #MohanaRagam
    6.రాస మండలాంతరాం రాధాం రాసేశ్వరీం గోలోక నివాసినీం గోపీం కృష్ణ ప్రియామ్ ప్రేమాత్మిక రూపిణీం బృందావనచారిణీమ్ హర్షానందాకృతీం అంబాం త్వాం భజామ్యహమ్
    #SaraswathiRagam
    7.సంధ్యోపాస్యాం దేవీం సరస్వతీం గాయత్రీం సావిత్రీం నిఖిలఛందసామ్మాతరమాద్యాం
    శృతి జననీం తత్త్వమయీం శుద్ధాం త్వాం సనాతనీం బ్రహ్మతేజోమయీం భజే మంత్ర మాతరమ్
    #Hamsadhwani Ragam
    8.అంశ కళామయరూపై రఖిలజగద్వ్యాపినీం మందాకిన్యాది దివ్య మహానదీ స్వరూపిణీం అభయకరాం విఘ్నహరాం హరార్ధాంగరూపాం సర్వ ప్రకాశకాం స్మరామి జ్యోతిర్మయీమ్
    #Hamsadhwani Ragam
    9.చిదగ్నికుండోద్భవాం శ్రితరక్షాదక్షాం అఖిలదేవ శక్త్యాకృతిమకలంకాం శశిముఖీం ఏకాం సర్వోన్నతాం ఈశ్వరీం మునిస్తుతాం శస్త్రాస్త్ర ప్రయోగ కుశలాం ఆర్తినాశినీం
    #SuratiRagam
    10.వాత్సల్య సుధావృష్టిం వర్షయ కరుణార్ద్రే సానుగ్రహ వీక్షణయా సంలాలయ జగదీశే
    అవనతోస్మి శాంకరీ భవభావిత పరతత్త్వే తవ సూనుం మాం పాలయ దయాలయే ! పరమే
    రచన: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు🙏💐
    #SivaPadam album
    #శివపదం ఆల్బమ్

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    శ్రీ గణపతయే నమః
    #నవరాత్రి
    1.Grey శైలపుత్రి-బాలాత్రిపుర సుందరి-కట్టుపొంగలి
    2.Orange బ్రహ్మచారిణి-అన్నపూర్ణా దేవి-పులిహోర నిమ్మకాయ
    3.Whiteచంద్రఘంట-గాయత్రి-కొబ్బరి అన్నం
    4.Redకూష్మాండ-శ్రీ మహాలక్ష్మీ-మినపగారెలు
    5.RoyalBlueస్కందమాత-సరస్వతీ-పెరుగన్నం
    6.Yellowకాత్యాయని-శ్రీ లలితా దేవి-కేసరి
    7.Greenకాళరాత్రి-దుర్గాదేవి-శాకంభరీ-అన్ని కూరలతో పులుసు అన్నం
    8.Peacock Greenభైరవి-మహాగౌరి-చక్కెర పొంగలి
    9.Purple సిద్ధిద్ధాత్రి-రాజ రాజేశ్వరి-అన్నం పాయసం
    ua-cam.com/video/Nr_1q2Tm9go/v-deo.html

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  11 місяців тому

    మాతామహ (తల్లి తండ్రి)
    మాతా పితామహ (తల్లి తాత)
    మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
    సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు
    తెలుసుకోవలసి బాంధవ్యాలు
    1. పితా (తండ్రి)
    2. పితామహా (తాత)
    3. ప్ర పితామహా (ముత్తాత)
    4. మాతా (తల్లి)
    5. పితామహి (బామ్మ)
    6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)
    7. సాపత్ని మాతా (సవతి తల్లి)
    8. మాతామహ (తల్లి తండ్రి)
    9. మాతా పితామహ (తల్లి తాత)
    10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
    11. మాతామహి (అమ్మమ్మ)
    12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)
    13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)
    14. ఆత్మపత్ని (తన భార్య)
    15. సుతః (కుమారుడు)
    16. భ్రాత (సోదరుడు)
    17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)
    18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)
    19. మాతులః (మేనమామలు)
    20. తత్పత్నిః (వారి భార్యలు)
    21. దుహిత (కుమార్తె)
    22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)
    23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)
    24. భాగినేయకః (మేనల్లుళ్లు)
    25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
    26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)
    27. జామాతా (అల్లుళ్లు)
    28. భావుకః (తోబుట్టువు భర్త)
    29. స్నుష (కోడలు)
    30. శ్వశురః (మామగారు)
    31. తత్పత్నీః (వారి భర్యలు)
    32. స్యాలకః (బావమరుదులు)
    33. గురుః (కుల గురువు)
    34. ఆర్ధినః (ఆశ్రితులు)

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому +1

    ua-cam.com/video/zyAADkmkK8U/v-deo.html
    అంతరంగ పీఠిక పై అమ్మ చరణ కమలములు
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    వ్యాఖ్య:Page no:-2
    "గౌరీ దేహ సముద్భవాం
    త్రిజగతామాధారభూతాం
    మహాపూర్వామత్ర సరస్వతీ
    మనుభజే శుంభాది దైత్యార్దినీమ్"
    పూర్ణ శక్తి యొక్క సాత్విక, రాజసిక, తామసిక దివ్య గుణాలకు ప్రతీకలే
    మహా సరస్వతి,
    మహాలక్ష్మి,
    మహాకాళి.
    విశ్వ కారణమైన దివ్య గుణాల రూపాలివి, ఆ గుణాలకు తగ్గ
    ధవళ,
    అరుణ,
    కాల (కృష్ణ) వర్ణాలతో
    ప్రకాశిస్తున్నారు ముగురమ్మలు.
    "సమస్త దేవతల శక్తి జగదాంబ"
    అమ్మను ఆరాధిస్తే దేవతలందరినీ ఆరాధించినట్లే. ఆ మహాశక్తి నుండి అంశమాత్ర శక్తుల్ని స్వీకరించి వాటితో తమ ఉనికిని కర్మల్నీ నిర్వహిస్తున్నారు దేవతలు.
    సప్తమాతృకలు - నామాలు.
    1.బ్రాహ్మీ,
    2.వైష్ణవీ,
    3.మాహేశ్వరీ,
    4.కౌమారీ,
    5.ఐంద్రీ,
    6.వారాహీ,
    7.నారసింహీ
    ఇవి సప్తమాతృకల నామాలు.
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    1.శైలపుత్రీ,
    2.బ్రహ్మచారిణీ
    3.చంద్రఘంటా
    4.కూష్మాండా
    5.స్కందమాతా
    6.కాత్యాయనీ
    7.కాళరాత్రీ
    8.మహాగౌరీ
    9.సిద్దద
    ఇవి నవదుర్గల పేర్లు
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    రాక్షస సంహార సమయంలో ఆదిశక్తి నుండి వచ్చిన శక్తీ మూర్తులివి.
    బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకలు, వరుసగా - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతా శక్తులే.
    "అమ్మవారి రూపాలు, లీలలు అసంఖ్యాకములు"
    మహాకాళీ,
    భద్రకాళీ,
    కాళీ,
    శ్యామాకాళీ
    ఇలా ఎన్నో కాళికా మూర్తులు వేద, పురాణ, తంత్ర శాస్త్రాలలో చెప్పబడ్డాయి.
    ఉపాసనా విధానంలో ప్రోక్తమైన మూర్తులివి.
    అలాగే అనేక లక్ష్మీ రూపాలు.
    బహూ సారస్వత మూర్తులు.
    "సర్వేశ్వరుడైన శివుని అనపాయినీశక్తి జగదంబ"
    ఆయన శక్తులు అనంతాలుగా ప్రకటితాలు.
    స్వామి వివిధాకృతులు ధరించినప్పుడు, వాటి కనుగుణమైన లక్షణాలున్న మూర్తుల్ని ధరిస్తుంది తల్లి.
    అలాగే తల్లికి అనుగుణ రూపధారణ చేస్తాడు జగత్పతి.
    "సర్వాసాం భగవాన్రుద్రః సర్వగత్వాత్పతిర్భవేత్
    యావన్త్యస్తా మహాశక్త్యస్తావద్రూపాణి శంకరః ||
    కృతవాంస్తాంశ్చ భజతే పతిరూపేణ సర్వదా (వరాహ పురాణం)

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  3 роки тому +1

    కీ.శే.దిట్టకవి శ్రీ నివాసరావు
    DOB:15-06-30
    DOD:కార్తిక బహుళ చవితి 02-12-2012
    కాశ్యపస గోత్రం ప్రవర
    (7గురు ఋషులు)
    చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు
    1.కాశ్యప
    2.ఆవత్సార
    3.నైధృవ
    4.రేభ
    5.రైభ
    6.శండిల
    7.శాండిల్య
    సప్తార్షేయ ప్రవరాన్వితా కాశ్యపస గోత్రః ఆపస్తంభ సూత్రః యజుశ్శాఖా అధ్యాయీ .....శర్మ అహంభో అభివాదయే🙏
    in the name of మనుమడు
    కూతురి కొడుకు దౌహిత్రుడు
    మాతామహ (తల్లి తండ్రి)
    మాతా పితామహ (తల్లి తాత)
    మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
    ఇది కొడుకు కర్తగా ఉన్నప్పుడు చదివేది.మనుమడు కర్తగా ఉన్నప్పుడు చదివేది కాదు👇
    1.అస్మత్ పితరం (తండ్రి) కాశ్యపస గోత్రం "దిట్టకవి శ్రీనివాసరావు" దేవ శర్మాణం (వసురూపం) స్వధా నమః తర్పయామి
    2.అస్మత్ పితామహం (తాత)కాశ్యపస గోత్రం "దిట్టకవి సుందర రామయ్య" దేవ శర్మాణం (రుద్రరూపం) స్వధా నమః తర్పయామి.(రాజమ్మ)
    3.అస్మత్ ప్రపితామహం
    (ముత్తాత)కాశ్యపస గోత్రం "శ్రీరాములు" దేవ శర్మాణం (ఆదిత్య రూపం) స్వధా నమః తర్పయామి.(వెంకాయమ్మ)
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    వ్యాఖ్య-Page no:-1
    దుర్గా సప్తశతి (మార్కండేయ పురాణం),
    దేవీ భాగవతం, లలితోపాఖ్యానం (బ్రహ్మాండ పురాణం) మొదలైన గ్రంథాలలో చెప్పబడ్డ దేవీ గాథలు శాక్తేయులకు నిత్య పారాయణ గ్రంథాలు.
    మొదటి చరణం (మధుకైటభ నిహన్త్రీం.... శాంభవీమహం భజే)|లో దుర్గ సప్తశతిలోని ముగ్గురమ్మల పరాక్రమగాథలు స్మరించబడ్డాయి.
    పద్మనాభుని నాభీపద్మసంభవుడైన విధాతను
    మధుకైటభాసురులు బాధించినప్పుడు
    యోగనిద్రా దేవిని స్తుతించాడు బ్రహ్మదేవుడు.
    "అదే రాత్రి సూక్తం"
    అప్పుడా యోగనిద్ర శ్రీమహావిష్ణువును వదలి రాక్షస సంహారానికై ప్రేరేపించింది ఆ తల్లే 'మహా కాళికాదేవి'
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహార కారిణీమ్......
    నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభుః
    నీలాశ్మద్యుతి మాస్యపాద దశకాం సేవే మహా కాళికాం
    యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభమ్.
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    అని ధ్యాన శ్లోకంలో చెప్పబడింది.
    అజాం ఏకాంలోహిత శుక్లకృష్ణాం - అని శ్రుతి వర్ణించిన పరాశక్తి ముగురమ్మల మూలశక్తి, వివిధాయుధాలు ధరించిన పది చేతులతో దశవదనాలతో, దశచరణాలతో ఉన్న 'నీలవర్ణ రూపిణి మహాకాళి' మధుకైటభ సంహారిణి.
    మహిషాసురుని సంహరించేందుకు సర్వదేవతాత్మక శక్తిగా ఆవిర్భవించిన తల్లి మహిషాసుర మర్దిని అయిన 'మహాలక్ష్మి,
    "ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం,సరోజస్థితామ్" .... అని ధ్యాన శ్లోక వాక్యం
    పద్దెనిమిది చేతులతో, పగడపు వన్నెరూపుతో ప్రకాశించే మహా లక్ష్మి, మహిషాసుర సంహారిణి.
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    శుంభనిశుంభులనే రాక్షసుల్ని సంహరించేందుకు గౌరీదేహం నుండి ఆవిర్భవించిన చంద్రిక సమానదేహ సరస్వతి. అష్టభుజాలతో సాక్షాత్కరించిన శక్తి.
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    ua-cam.com/video/ZuAeKiWXmMA/v-deo.html
    Radio Sai Global మారవైరి రమణి మంజుభాషిణి🙏🙏🌹🌹🌹

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  3 роки тому +1

    🙏Hide your legs when you eat🙏
    ua-cam.com/video/8sCWGA5J4sE/v-deo.html
    Sadhguru🙏

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    వ్యాఖ్య:page no:-4
    4.గో లోకంలో నిత్యం పరబ్రహ్మ రూపుడైన శ్రీకృష్ణునితో, తన అనంతలీలా శక్తులే గోపికలుగా, రాస మండలంలో కళావైభవాన్ని ఆవిష్కరించే శక్తి రాధ,
    "రాధ' అంటే - ఆరాధన, ప్రేమ, భక్తి"
    కేవలం ఆనంద స్వరూపాలైన భావనలివి.
    పరమాత్ముని 'హ్లాదాని' శక్తి రాధ.
    పరమేశ్వరుడు శ్రీకృష్ణునిగా
    గోలోక వాసియైనప్పుడు, పరమేశ్వరి రాధగా ఆయనను ఆరాధిస్తుంది.
    ఈ తల్లి కృప ఉంటేనే భక్తి వంటి మాధుర్య భావాలు కలిగి, మోక్షానికి హేతువౌతుంది.
    త్రికాలాలులోను నశించనిది గోలోకం.
    వ్యక్తావస్థలో 'హర్షం, అనుభవావస్థలో 'ఆనందం' - రాధ స్వరూపం
    5.త్రి సంధ్యలలో ఉపాసింపబడే వేదమాత గాయత్రి. సకల మంత్రాలకు, ఛందస్సులకి తల్లి. ఈ జనని
    1.ప్రాతసంధ్యలో -గాయత్రి' (బాహ్మీ) 2.మధ్యాహ్న సంధ్యలో సావిత్రీ (రౌద్రి) 3.సాయంసంధ్యలో సరస్వతీ' (వైష్ణవీ) నామాలతో ఉపాసింపబడుతోంది.
    ఇవి ప్రధాన శక్తులు కాగా
    వసుంధర,
    గంగాది నదీనదాలు
    తులసి, బిల్వాది వృక్షాలు,
    వివిధ దివ్య స్త్రీ మూర్తులు,
    అన్నీ అమ్మవారి అంశ, కళ, కళాంశ, కళాంశాంశ రూపాలే.
    అతిలేశమైనా అమ్మవారి విభూతిలేనిదే -ఉనికి లేదు, మనికీ లేదు, వెలుగూ లేదు
    ఉలుకూ లేదు, పలుకూ లేదు.
    ఏ విభూతి (ఐశ్వర్యం) పోషకమైన శక్తిగా ఉన్నదో అదంతా అమ్మ ప్రసాదమే.
    "సమస్త విశ్వమూ శక్తిమయం".
    ఎన్ని మూర్తులు ధరించినా అమ్మ' ఏకా'
    'ఏకం అద్వితీయం' అని చెప్పబడ్డ తత్వం
    ఈ దేవతా శక్తులన్నీ చిదగ్నికుండం (జానాగ్ని) లో హుతమవగా ఆవిర్భవించిన సమస్త దేవ శక్త్యాత్మక ఈశ్వరి, వివిధ శస్త్రాస్త్రాలు ప్రయోగించి,
    శత్రునాశనం చేసి, ఆర్తలను కాపాడే
    సర్వోన్నత.
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    m.facebook.com/groups/436422516371067?view=permalink&id=3699033036776649&ref=m_notif¬if_t=feedback_reaction_generic&mds=%2Fedit%2Fpost%2Fdialog%2F%3Fcid%3DS%253A_I100004002555506%253AVK%253A3699033036776649%26ct%3D2%26nodeID%3Dm_story_permalink_view%26redir%3D%252Fstory_chevron_menu%252F%253Fis_menu_registered%253Dfalse%26perm%26loc%3Dpermalink&mdf=1

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644  4 роки тому

    వ్యాఖ్య:page no:-3
    సర్వగతుడైన రుద్రుని కోటి కోటి శక్త్యాకృతులు అమ్మవే.
    సాధకుడు ఏ రూపాన్ని ఆశ్రయించి భజించినా, ఆదుకునే శక్తి ఆ తల్లి.
    సర్వమూర్తుల సమైక్య శక్తీతత్త్వాన్నే ఈ కీర్తన ఏకీకరిస్తోంది.
    అన్నపూర్ణ, శాకంభరీ మూర్తులుగా భుక్తినీ, ముక్తినీ, ఇహపరాలనూ ప్రసాదించే శక్తి జగదంబిక.
    ఒకప్పుడు మహాక్షామం ఏర్పడగా, ఋషుల తపస్సుకి ఫలితంగా మహాశక్తి ప్రత్యక్షమై, తననుండి వివిధ శాకాలను (కూరగాయలు, ఫలాలు మొదలైనవి) సృష్టించి, క్షామబాధను నివారించిందని పురాణ గారు. ఆ మూర్తి శాకంభరీదేవి. అన్నాన్ని ఇచ్చే అన్నపూర్ణమ్మే సర్వ జీవకోటికీ శాకాలను ఆహారంగా అందించిన శాకంభరి,
    'ఆహారమంతా అమ్మరూపమే. అమ్మ ప్రసాదమే'
    మూడవ చరణం (పంచాశద్వర్ణా కృతిం ..) నుండి ఏడవ చరణాంతం (భజే మంత్ర మాతరమ్) వరకు - దేవీ భాగవతోక్తమైన, ప్రధాన పంచశక్తులూ వర్ణితాలు,
    దుర్గా,
    రాధా,
    లక్ష్మీ
    సరస్వతీ
    సావిత్రీ,
    గాయత్రీ
    "గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ |
    సావిత్రీ చ సృష్టివిధౌ ప్రకృతి:
    పంచధా స్తుతా॥
    పరమేశ్వరుని వాక్కు బుద్ధి, జ్ఞాన శక్తుల సమాహారమే సరస్వతి.
    ఆ ఈశ్వరుని ఐశ్వర్య శక్తే లక్ష్మి,
    క్రియాత్మక మూలశక్తి దుర్గా
    ప్రేమాత్మిక శక్తి రాధ,
    వేదమంత్ర శక్తి గాయత్రి.
    ఇవన్నీ ఆదిశక్తి యొక్క విభిన్న అభివ్యక్తులు. ఈ అభివ్యక్తులకు తగ్గట్టు ఈశ్వరుడు కూడా విభిన్న రూపాలుగా వ్యక్తమవుతాడు.
    1. అకారాది క్షకారాంతం 50 అక్షరాల ఆకారం సరస్వతి. వాక్కుని,బుద్ధినీ, జ్ఞానాన్నీ అధిష్ఠించిన శబ్ద బ్రహ్మ స్వరూపిణి సద్విద్యా మూర్తి. సంగీత సాహిత్య ప్రదాయిని.
    2.లక్ష్యాలక్ష్య, జగత్కారక శక్తి లక్ష్మి. గోచరాగోచరాత్మక జగత్ కర్తృత్వ మహాశక్తి. పద్మాసనియైన ఈ తల్లి శుద్ధ సత్వ శుభాకృతి. పరమేశ్వర హృదయనివాసిని. సువర్ణ రజత మాలాది సర్వాలంకార శోభిత. సిరుల తల్లి.
    3.ప్రధాన శక్తులలో ప్రధాన పూర్ణశక్తిగా రాజిల్లే శక్తి దుర్గ.
    'గజానన,షడానన జనని'
    శివపత్ని,రాక్షస సంహారిణి.
    మొదటి చరణంలో చెప్పబడ్డ మహాలక్ష్మీ,మహాకాళీ,మహా సరస్వతీ
    మూర్తుల రూపం దుర్గ.

  • @padma2207
    @padma2207 4 роки тому

    #ShriRagam
    వందే శ్రీమాతరం మహాదేవ తరుణీం
    శ్రీచక్ర నివాసినీం శ్రీకరీం శివంకరీమ్
    #Madhyamavathi
    1.మధుకైటభ నిహన్త్రీం మహాకాళి కాం మహిషాంతకరీం శివాం మహాలక్ష్మీం భజే
    శుంభాది వినాశినీం మహాసరస్వతీం శంభుప్రాణనాయికాం శాంభవి మహంభజే
    #Arabhi Ragam
    2.సకల దేవతారూపాం సప్తమాతృకాముమాం
    నవ దుర్గా కోటి కోటి శివశక్త్యాకృతిధరాం భుక్తిముక్తికరాం అన్నపూర్ణాం శాకంభరీం సర్వమంత్ర రూపిణీం జననీం జగదంబికామ్
    #Bageshree Ragam
    3.పంచాశద్వర్ణాకృతి మంబాం శ్రీ శారదాం వాగ్బుద్ధి జ్ఞానాధిష్ఠాత్రీం సితగాత్రీమ్ శబ్దబ్రహ్మాత్మికాం సారస్వతదాయినీమ్
    సంగీతజనయిత్రీం సద్విద్యాం భజామ్యహమ్
    #Valaji Ragam
    4.పద్మాం పద్మస్థితాం పరమైశ్వర్య ప్రదాం శుద్ధసత్త్వ శుభాకృతిం సువర్ణ రజతస్రజాం నారాయణ హృన్నిలయాం నానాభూషోజ్జ్వలాం
    లక్ష్యాలక్ష్యసురూపాం లక్ష్మీం త్వాం భజామ్యహమ్
    #RanjaniRagam
    5.శశిశేఖరవల్లభాం సౌమ్యాం మాహేశ్వరీం గౌరీం గజముఖ జననీం కైలాసాచల వాసాం
    శివాం సర్వమంగళాం శ్రీ షణ్ముఖ వత్సలాం దుష్టదనుజసూదనీం దుర్గాం త్వాం భజామ్యహమ్
    #MohanaRagam
    6.రాస మండలాంతరాం రాధాం రాసేశ్వరీం గోలోక నివాసినీం గోపీం కృష్ణ ప్రియామ్ ప్రేమాత్మిక రూపిణీం బృందావనచారిణీమ్ హర్షానందాకృతీం అంబాం త్వాం భజామ్యహమ్
    #SaraswathiRagam
    7.సంధ్యోపాస్యాం దేవీం సరస్వతీం గాయత్రీం సావిత్రీం నిఖిలఛందసామ్మాతరమాద్యాం
    శృతి జననీం తత్త్వమయీం శుద్ధాం త్వాం సనాతనీం బ్రహ్మతేజోమయీం భజే మంత్ర మాతరమ్
    #Hamsadhwani Ragam
    8.అంశ కళామయరూపై రఖిలజగద్వ్యాపినీం మందాకిన్యాది దివ్య మహానదీ స్వరూపిణీం అభయకరాం విఘ్నహరాం హరార్ధాంగరూపాం సర్వ ప్రకాశకాం స్మరామి జ్యోతిర్మయీమ్
    #Hamsadhwani Ragam
    9.చిదగ్నికుండోద్భవాం శ్రితరక్షాదక్షాం అఖిలదేవ శక్త్యాకృతిమకలంకాం శశిముఖీం ఏకాం సర్వోన్నతాం ఈశ్వరీం మునిస్తుతాం శస్త్రాస్త్ర ప్రయోగ కుశలాం ఆర్తినాశినీం
    #SuratiRagam
    10.వాత్సల్య సుధావృష్టిం వర్షయ కరుణార్ద్రే సానుగ్రహ వీక్షణయా సంలాలయ జగదీశే
    అవనతోస్మి శాంకరీ భవభావిత పరతత్త్వే తవ సూనుం మాం పాలయ దయాలయే ! పరమే
    రచన: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు🙏💐
    #SivaPadam album
    #శివపదం ఆల్బమ్